Heartfelt birthday wishes to Telangana CM Shri @revanth_anumula Garu! Wishing you good health, happiness, and success. Have a wonderful year ahead!
Wishing Bharat Ratna Shri L.K. Advani Ji a very happy 99th birthday. His invaluable contributions to nation-building and decades of dedicated public service continue to inspire generations. As one of the early leaders of independent India, he has played a significant role in shaping the country's growth and progress. I feel privileged to have worked with him during our time in the NDA. May he be blessed with good health, happiness and longevity in the years ahead.
ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. నరకాసురుని చెర నుంచి లోకానికి విముక్తితో…. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అంతా దీపావళి పండుగ జరుపుకుంటాం. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలి. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు చిగురించాలని ఆకాంక్షిస్తున్నాను. మనం వెలిగించే ప్రతి దీపం మన ఇంటికే కాకుండా సమాజానికీ వెలుగునివ్వాలి. సాటివారి జీవితాల్లో సంతోషాన్ని నింపడం కూడా పండుగలో భాగం కావాలి. మన పండుగలు ఇచ్చే సందేశాన్ని అర్థం చేసుకుని పరస్పర సహకారంతో, ఐకమత్యంతో మనమంతా ముందుకు సాగాలి అని కోరుకుంటూ అందరికీ దీపాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు
#Diwali2026
Happy Birthday to the powerhouse of Indian cinema, @ikamalhaasan Garu! Decades of pushing boundaries, redefining craft, and inspiring generations of filmmakers and actors. Wishing you good health, happiness, and endless creative genius!
బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించి మురసు తుఫాను నష్టాన్ని పరిశీలించాను. రైతులతో, స్థానికులతో మాట్లాడి వారి కష్టాలు, పంటలకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నాను. నీట మునిగిన పంట చేలను, దెబ్బతిన్న రోడ్లను చూశాను. ఎల్నినో సమయంలోనూ పట్టిసీమ నీటితో సాగు చేసుకున్న పంటలు తుఫాను పాలవటం కలచివేసింది. ప్రతి రైతుకూ సాయం అందేలా ప్రతి బాధితుడికీ న్యాయం చేస్తామని వారికి భరోసా ఇచ్చాను.
#TogetherAgainstCycloneMurasu
Warm birthday greetings to Hon'ble Union Minister, Dr. @DrJitendraSingh Ji. I pray for his good health and long life in continued service to our nation and its people.
Today, I had a productive interaction with Shri Nandan Nilekani, Chairman of the High-Powered Task Force on Examination Reforms, and its members.
I emphasised the need to build a national consensus by incorporating the perspectives of all states. Our examination system must go beyond marks and rankings to nurture creativity, critical thinking, skills and employability, while reducing unnecessary stress on students. In Andhra Pradesh, we are working to strengthen the integrity of examinations through technology-driven reforms, robust cybersecurity, greater transparency and data-driven governance.
The future of our students must never be compromised. Our collective goal should be to build an examination system that students can trust, parents can believe in, and the nation can be proud of. Every reform must ultimately serve one purpose: protecting the aspirations of our youth and securing their future.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్, ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఎ.చక్రపాణి గారి మరణం విచారకరం. శాసనమండలి చైర్మన్గా ఆయన అందించిన సేవలు, శాసన వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడంలో ఆయన చూపిన నిబద్ధత చిరస్మరణీయం. మండలి చైర్మన్ గా ఆయన శాసన వ్యవస్థపై ప్రత్యేక ముద్ర వేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
మురసు తుఫాన్ ప్రభావిత జిల్లాలైన గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలలోని పలు వరద ప్రాంతాల పరిస్థితిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించాను. చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు దెబ్బతిన్నాయి. గ్రామాలు, రహదారుల పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఆయా ప్రాంతాల్లో అందుతున్న తుఫాను సహాయక చర్యలపై సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్ లో అధికారులతో సమీక్ష నిర్వహించాను.
#TogetherAgainstCycloneMurasu
Thank you, dear @anandmahindra. Your post is a powerful reminder of why we embarked on this journey 28 years ago.
When late Dr. K. Anji Reddy and I envisioned the Naandi Foundation, our core belief was simple: true development cannot rely solely on government action. It demands a collective commitment - what I call the P4 model (Public-Private-People Partnership) - where visionary leaders, institutions, and citizens come together to create sustainable impact.
Seeing how Dr. Anji Reddy’s legacy was carried forward by you, @manoj_naandi, and the dedicated Naandi team fills me with immense pride. Projects like Araku Coffee and Nanhi Kali have shown the world that when you empower grassroots communities - our farmers, our daughters, our youth - prosperity naturally follows. Regenerative farming restoring both livelihoods and birdsong to Araku is the ultimate proof of sustainable progress.
You rightly pointed out that poverty is not merely a stat - it is the absence of opportunity and dignity. As we work toward the vision of a zero-poverty nation, statistics like the World Bank's give us encouragement, but stories like Naandi’s give us our direction.
Let us continue to collaborate, innovate, and empower every citizen so that the freedom to dream is accessible to all.
The World Bank’s latest report on India’s dramatic decline in poverty has, predictably, attracted both bouquets from optimists & brickbats from skeptics.
Interestingly, even Kalshi, the US prediction market exchange, seems to have found the news worth covering!
For me, the numbers offer enormous hope.
But 2.6% of 1.4 billion people still means roughly 36 million people living in extreme poverty. More than the entire population of Australia.
Clearly, miles to go before we sleep.
But let me turn from the cold statistics to the flesh & blood reality of fighting poverty.
Yesterday, the Naandi Foundation celebrated its 28th anniversary.
Naandi was the brainchild of Shri Chandrababu Naidu, @ncbn, who persuaded the late Dr. K. Anji Reddy of @drreddys to become its founding Chairman.
Dr. Reddy brought me on board & before his passing, entrusted me with carrying his work forward.
Throughout this journey, @manoj_naandi has provided irrepressibly energetic & imaginative leadership, backed by an extraordinary team.
It has been a privilege to work alongside them. I owe them an enormous debt of gratitude for giving me such a meaningful way to give back to our country.
Our work through @NanhiKali @arakucoffeein @arakucoffee @UFCo_India & @NaandiWater has brought me a degree of fulfilment that is difficult to put into words.
But enough from me.
Please watch this short video.
Listen to farmers describing how regenerative farming has brought them not just prosperity, but birdsong back to their villages!
Listen to young women who now dream not merely of earning a livelihood, but of seeing one of their own playing for India’s national women’s football team.
Because poverty is not just about the absence of income. It is also about the absence of opportunity. Of confidence. Of the freedom to dream.
And that is what we are determined to change.
So while the debate over the World Bank’s statistics continues, my #MondayMotivation comes from something far more tangible.
Half a million people lifted out of poverty. The lives of 10 million people touched & improved.
And Naandi is just one among many organisations that have been quietly transforming lives across India.
The World Bank report is data.
The change is real.
And that is why my faith in India’s future has never been stronger.
Dear Shri @AmitShah Ji, my heartfelt thanks for the Centre’s prompt support and solidarity during #CycloneMurasu. Our state machinery is working in complete coordination with central teams to execute rescue, relief, and road clearing without delay. Together, we will ensure absolute safety and swift recovery across AP!
#TogetherAgainstCycloneMurasu
Spoke with the CM of Andhra Pradesh Shri @ncbn Ji about the impact of Cyclone Murasu. Assured him of every possible assistance from the Centre. NDRF and SDRF teams are already on the ground, helping those affected.
Govt of India stands with people with an unwavering resolve.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో మాట్లాడి, మురసు తుఫాను ప్రభావంపై వివరాలు తెలుసుకున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చాను. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టి, తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అండగా నిలుస్తున్నాయి.
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే దృఢ సంకల్పంతో భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలుస్తుంది.
Saluting our frontline heroes!
Hand-in-hand with emergency crews, our army of government officials is facing the full brunt of #CycloneMurasu to keep Andhra Pradesh safe. From clearing roads to rescuing families, your bravery on the ground is saving lives. AP is deeply grateful for your service!
#TogetherAgainstCycloneMurasu
Immensely relieved and delighted to share that the boat from Vodarevu (Bapatla) carrying our 7 brave fishermen has safely reached the P. Kadpalem shore!
Our government remains steadfastly committed to ensuring the safety and security of every fisherman venturing into the sea.
Heartfelt gratitude to Hon'ble Chief Minister of Karnataka, Sri @DKShivakumar Garu, and the people of Karnataka for standing with Andhra Pradesh during #CycloneMurasu. Your timely support in our hour of need will never be forgotten.
నాకు అత్యంత ఆప్తుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా, తెలుగుదేశం పార్టీలో బీసీ నేతగా, మచ్చలేని నాయకుడిగా రాజకీయాలలో తన ప్రత్యేకతను చాటుకున్న ఎర్రన్నాయుడుగారి ప్రజాసేవను స్మరించుకుందాం.
My heartfelt gratitude to the State Bank of India for its generous contribution of ₹5 crore to the Chief Minister’s Relief Fund to support our people affected by Cyclone Arnab.
I also deeply appreciate all SBI employees across Andhra Pradesh for their commitment to contribute one day’s salary towards the relief efforts.
This gesture of solidarity will strengthen our efforts to provide relief and restore normalcy in the lives of affected families. Together, we will rebuild a stronger Andhra Pradesh.
#TogetherAgainstCycloneArnab
నాడు 53 రోజుల అక్రమ నిర్బంధంలో కోట్లాది హృదయాల స్పందన నా జీవితాంతం మర్చిపోలేను. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు...53 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాను. నాడు విధ్వంస పాలనను ప్రశ్నిస్తుంటే సహించలేని పాలకులు ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో నన్ను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారు. అది అక్రమ నిర్బంధమని, కుట్రపూరిత అరెస్టు అని అందరికీ తెలిసింది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ 53 రోజులూ నా జీవితంలో అత్యంత కఠినమైనవి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఇదే రోజున మళ్లీ ప్రజల్లోకి వచ్చాను. నేను జైల్లో ఉన్న సమయంలో నాకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల మద్దతును నా జీవితంలో మర్చిపోలేను. నిర్బంధంతో నన్ను ఒంటరిని చేయాలనుకున్న కుట్రలు...యావత్ తెలుగుజాతి తిరుగుబాటుతో బద్దలయ్యాయి. గ్రాటిట్యూడ్ పేరుతో మద్దతుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నియంతల అణిచివేతను ధిక్కరించి తెలుగు జాతి చూపిన చొరవ నన్ను నిలబెట్టింది. మంచి పాలనా విధానాలతో ప్రజలకు మంచి చేస్తే ఎలా గుర్తు పెట్టుకుంటారో, ఎలా మద్దతుగా నిలుస్తారో ప్రజాస్పందన నిరూపించింది. ముఖ్యంగా ఎంత నిర్భందం ఉన్నా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ నా కోసం నినదించిన ఘటన నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. నేను తెచ్చిన సంస్కరణలు, కల్పించిన అవకాశాలతో మంచి ఉద్యోగాలు పొందిన వారు గ్రాటిట్యూడ్ పేరుతో స్వచ్ఛందంగా రోడ్డెక్కడం ఎంతో గొప్ప విషయం. రాష్ట్రంలో, దేశంలో....ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో తెలుగువారు, ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు. రోడ్డెక్కి నాటి పాలకుల కుట్రలపై నిరసనలు తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యను ఖండించారు. పల్లెల్లో సామాన్య మహిళల నుంచి ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీల సీఈవోల వరకు... రైతుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు...విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు...సమాజంలోని ప్రతి వర్గం నుంచి వెల్లువెత్తిన మద్దతు అపూర్వం. రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే నా సతీమణి, నా కుటుంబ సభ్యులు సైతం 'నిజం గెలవాలి' అని మీ వద్దకు వస్తే....వారితో కలిసి అడుగేసి నిజాన్ని గెలిపించారు. ధర్మాన్ని నిలబెట్టారు.
నాకు మద్దతు పలికిన ప్రతి పౌరుడికి, కార్యకర్తకు, అభిమానికి , ప్రజాస్వామ్యవాదికి, ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాడు నా కష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించిన, మంచికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ ప్రేమను, అభిమానాన్ని, నమ్మకాన్ని నా జీవితాంతం నిలబెట్టుకుంటాను. నా కోసం నిలిచిన మీకోసం చివరి వరకు నిలబడతాను. మీ నమ్మకం, అభిమానం నా బలం. మీ భవిష్యత్తు నా సంకల్పం. మీ అందరి మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని నెంబర్ 1 చేస్తానని పునరుద్ఘాటిస్తున్నాను.
I am deeply shaken and enraged by the barbaric attack on a Class 10 student inside her classroom at Raptadu ZP High School. Attackers who target our young girls inside schools have no place in our society.
I am personally tracking her recovery and have directed the medical team to give her the highest priority care. I have ordered the police to hunt down the monster responsible and deliver the harshest legal punishment swiftly.


































