Collector Suryapet District (@CollectorSRPT) header
Collector Suryapet District (@CollectorSRPT) profile picture

Collector and District Magistrate, Suryapet District-Telangana Present: Tejas Nandlal Pawar, IAS

Suryapet, India
Joined October 2016
Photo by Collector Suryapet District (@CollectorSRPT)Photo by Collector Suryapet District (@CollectorSRPT)Photo by Collector Suryapet District (@CollectorSRPT)Photo by Collector Suryapet District (@CollectorSRPT)Photo by Collector Suryapet District (@CollectorSRPT)Photo by Collector Suryapet District (@CollectorSRPT)Photo by Collector Suryapet District (@CollectorSRPT)Photo by Collector Suryapet District (@CollectorSRPT)Photo by Collector Suryapet District (@CollectorSRPT)Photo by Collector Suryapet District (@CollectorSRPT)
📢 ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 🔹 జిల్లాలోని ప్రతి కుటుంబం ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ పిలుపు. 🔹 కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల జీవిత బీమా ఆర్థిక భరోసా. 🔹 ఎలాంటి దరఖాస్తు ఫీజు, ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. సూర్యాపేట జిల్లా, నవంబర్ 20: కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం నూతనకల్ మండలం దర్శనపల్లి గ్రామంలో ఈ పథకాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, స్వయంగా కంప్యూటర్‌లో వివరాలను నమోదు చేశారు. ఈ పథకం కింద 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగి కుటుంబాన్ని పోషించే వ్యక్తులు అర్హులని, కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల జీవిత బీమా అందుతుందని కలెక్టర్ వివరించారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకోవచ్చని, బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, ప్రజలు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 19 నుంచి డిసెంబర్ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకోసం గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డు కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారితో పాటు రేషన్ కార్డు లేని వారికి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉన్నందున రైతులు యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని, VB-G RAM G ఉపాధి హామీ పథకం ద్వారా కల్పిస్తున్న 125 రోజుల పనిదినాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని, గ్రామాల్లో తాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో డీపీఓ యాదగిరి, మండల ప్రత్యేక అధికారి భారతి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సునీత, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జయసుధ, పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి, సర్పంచ్ లింగయ్య, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా – ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం! #IndirammaFamilyLifeInsurance #IndirammaBheema #SuryapetDistrict #TelanganaGovernment #DistrictCollector
2
13
510
తెలంగాణ ప్రభుత్వం జిల్లా యంత్రాంగం – సూర్యాపేట 🛡️ పిల్లల రక్షణకు సూర్యాపేట జిల్లాలో సమగ్ర ప్రణాళిక మిషన్ వాత్సల్య కింద, యునిసెఫ్ సహకారంతో ‘బాలల రక్షణ వ్యవస్థ బలోపేతం’ (CPSS) అమలు. సూర్యాపేట, నవంబర్ 20: పిల్లల హక్కులు, భద్రత, సంక్షేమం, ఎదుగుదల కోసం జిల్లా యంత్రాంగం ‘బాలల రక్షణ వ్యవస్థ బలోపేతం’ (CPSS) ప్రణాళికను రూపొందించింది. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నంద్ లాల్ పవార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దీనిని ప్రకటించారు. ఇది కొత్త పథకం కాదు. శాఖలు ఇప్పటికే చేస్తున్న పనులను ఒకే ప్రణాళిక కిందకు తెచ్చి, అందరూ కలిసి పనిచేసేలా చేయడమే దీని ఉద్దేశం. 🔹 ఇప్పటికే అమలవుతున్న కార్యక్రమాలు జిల్లాలో బాలికా చైతన్యం, PCPNDT చట్టం అమలు, భరోసా కేంద్రాలు, ఆపరేషన్ ముస్కాన్, సైబర్ భద్రతపై అవగాహన, బాల సదన్, CARA ద్వారా దత్తత, బాలల భద్రతా వారోత్సవాలు, బడులు, హాస్టళ్లలో వసతుల మెరుగుదల వంటి కార్యక్రమాలు ఇప్పటికే అమలవుతున్నాయి. అయితే బాల కార్మికుడిగా ఉన్న బిడ్డను కాపాడిన తర్వాత ఆ బిడ్డకు చదువు, వైద్యం, కౌన్సెలింగ్, కుటుంబ సహాయం అన్నీ అందాలంటే శాఖలన్నీ కలిసి పనిచేయాలి. అందుకే ఈ ప్రణాళిక. 🔹 అధ్యయనం సెప్టెంబర్‌లో యునిసెఫ్ సహకారంతో 970 ప్రశ్నలతో జిల్లాలోని బాలల రక్షణ వ్యవస్థను అధ్యయనం చేశారు. కేసుల నమోదు, బాధిత పిల్లలకు సహాయం, పునరావాసం, శాఖల సమన్వయంలో మెరుగుదల అవసరమని గుర్తించారు. 🔹 పిల్లల గళం నవంబర్ 6న జిల్లాలోని 99 చోట్ల 10–18 ఏళ్ల పిల్లలతో “పిల్లల గళం” కార్యక్రమం నిర్వహించి 9,558 అభిప్రాయాలు సేకరించారు. సంతోషం గురించి వచ్చిన జవాబుల్లో 29.1% కుటుంబం గురించి, 20.5% బడి, ఉపాధ్యాయుల గురించి ఉన్నాయి. బడిలో దండన, ప్రమాదకర ప్రదేశాలు, చెరువులు, వేధింపులు, మత్తు పదార్థాలు, పరీక్షల ఒత్తిడి వంటి సమస్యలను పిల్లలు ప్రస్తావించారు. 🔹 ప్రణాళికలో ఐదు ప్రధాన అంశాలు 1. నివారణ, గ్రామ స్థాయి రక్షణ 2. సమస్యను ముందే గుర్తించి సహాయం 3. కేసుల నిర్వహణ, సేవలకు అనుసంధానం 4. కుటుంబంలో పెంపకం, దత్తత, పునరావాసం 5. వ్యవస్థ బలోపేతం వీటికి తోడు చట్టాలు, సమన్వయం, నిరంతర సేవలు, సిబ్బంది శిక్షణ, నిధులు, సమాచార వ్యవస్థ, పిల్లల భాగస్వామ్యం, జవాబుదారీతనం అనే ఎనిమిది అంశాల్లో సంస్థలను బలోపేతం చేస్తారు. చిన్నారుల పోషకాహారం నుంచి కిశోరుల ఉద్యోగ మార్గదర్శనం వరకు ప్రతి దశలో పిల్లలకు అండగా ఉంటారు. 🔹 అమలు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా బాలల సంక్షేమ, రక్షణ కమిటీ, ఐదు వర్కింగ్ గ్రూపులు పనిచేస్తాయి. జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా బాలల రక్షణ విభాగం (DCPU) సమన్వయం చేస్తాయి. మండల, గ్రామ, వార్డు స్థాయిల్లోనూ రక్షణ ఏర్పాట్లను బలోపేతం చేస్తారు. పిల్లల రక్షణ శాఖలు, కుటుంబాలు, సమాజం అందరి ఉమ్మడి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదని, శాఖలన్నీ ఈ ప్రణాళికను తమదిగా భావించి క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని సూచించారు. 🔹 కార్యక్రమంలో పాల్గొన్నవారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, DCPO రవి కుమార్, బీసీ, మైనారిటీ, గిరిజన, సాంఘిక సంక్షేమ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి, చైల్డ్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్, DCPO బి. రవికుమార్, DCPU, సఖి సెంటర్, హబ్ సిబ్బంది, హెల్త్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, షీ టీమ్స్, భరోసా టీమ్స్, అన్ని ప్రాజెక్టుల CDPOలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 🌱 “సూర్యాపేట – ప్రతి బిడ్డకు సురక్షితమైన, స్నేహపూర్వక జిల్లా”
1
9
289
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్లు అందజేస్తాం – మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుల సాగునీటి హక్కులు, ప్రజల తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ప్రతి అర్హ కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్లు అందజేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం హుజూర్‌నగర్‌లోని కౌండిన్య ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్లు, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF), కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 🔹 పెన్షన్లు: హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 43,113 మంది లబ్ధిదారులకు నెలకు రూ.11.13 కోట్ల పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 1,59,829 మంది లబ్ధిదారులకు నెలకు రూ.40.23 కోట్ల పెన్షన్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. 🔹 ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా: రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు మధ్య జీవిత బీమా కల్పిస్తున్నామని, లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే భరిస్తుందని, బీమా పొందిన వ్యక్తి మరణిస్తే రూ.5 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. 🔹 ఇందిరమ్మ ఇళ్లు: అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, హుజూర్‌నగర్ రామస్వామి గుట్ట వద్ద 2,160 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, అర్హులైన లబ్ధిదారులకు డిసెంబర్ రెండో వారంలో పట్టాలు అందజేస్తామని తెలిపారు. 🔹 సంక్షేమ పథకాలు: తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబ సభ్యునికి 6 కిలోల సన్నబియ్యం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు. 🔹 నీటి సంరక్షణ: రాబోయే వేసవిలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సమస్యలను సరిదిద్ది సాగునీటి వనరులను సమర్థంగా వినియోగిస్తామని పేర్కొన్నారు. అర్హత ఉండి పెన్షన్లు పొందని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహ, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
1
6
396
🏠 రామస్వామి గుట్ట వద్ద ఇందిరమ్మ మోడల్ హౌసింగ్ కాలనీని త్వరలో ప్రారంభిస్తాం హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌసింగ్ కాలనీని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో విద్యుత్, వీధి దీపాలు, తాగునీరు, గ్రీనరీ, పైలాన్ స్తూపం, సభాస్థలి తదితర సదుపాయాలను పరిశీలించి, మిగిలిన పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాటిన మొక్కలు ఎండిపోకుండా నిరంతరం నీరు అందించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, అత్యంత అర్హులైన వారికి ప్రాధాన్యతనిస్తూ ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే. నరసింహ, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాసులు, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గుత్తేదారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు – పేదల సొంతింటి కల సాకారం!
2
8
378
🏆 హెచ్.ఐ.వి / ఎయిడ్స్ నియంత్రణలో 'సురక్షిత్' హోదా.. సూర్యాపేట జిల్లాకు అరుదైన గౌరవం! జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌కు ఘన సన్మానం జాతీయ హెచ్.ఐ.వి నియంత్రణ సంస్థ (NACO) నిర్దేశించిన 95-95-95 లక్ష్యాల సాధనలో విశేష ప్రతిభ కనబరిచి, తెలంగాణ రాష్ట్రంలో 'సురక్షిత్' (Surakshit) హోదా సాధించిన 20 జిల్లాల్లో సూర్యాపేట జిల్లా ఒకటిగా నిలిచింది. ఈ ఘనతను గుర్తిస్తూ జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నంద్ లాల్ పవార్ గారిని కలెక్టరేట్‌లో TGSACS రాష్ట్ర స్థాయి బృందం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టి కృషి, కలెక్టర్ గారి మార్గదర్శకత్వంతో ఈ విజయం సాధ్యమైంది. NACO తాజా జాతీయ స్కోర్‌కార్డులో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానం సాధించడంలో సూర్యాపేట జిల్లా కీలక పాత్ర పోషించింది. 95-95-95 లక్ష్యాలు: 🔹 95% మందికి హెచ్.ఐ.వి స్థితిపై అవగాహన కల్పించడం. 🔹 వ్యాధి నిర్ధారణ అయిన వారిలో 95% మందికి ART చికిత్స అందించడం. 🔹 చికిత్స పొందుతున్న వారిలో 95% మందికి వైరల్ అణచివేత సాధించడం. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ హెచ్.ఐ.వి నియంత్రణ, నివారణ సేవలను మరింత బలోపేతం చేసి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో TGSACS జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి, DM&HO డాక్టర్ కోటిరత్న, సంబంధిత వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కీర్తి కిరీటంలో మరో మైలురాయి! 🌟
1
10
438
ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించడమే లక్ష్యం – సీఎస్ సంజయ్ జాజు రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఐడీఓసీ నుంచి పాల్గొన్నారు. 🔹 నవంబర్ 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా పథకం ప్రారంభం. 🔹 గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో రెండు వారాల పాటు ప్రత్యేక దరఖాస్తుల స్వీకరణ శిబిరాలు. 🔹 ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు సేకరణకు చర్యలు. 🔹 బీమా పొందే వ్యక్తి, నామినీ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి. 🔹 సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం. 🔹 ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో ప్రారంభోత్సవాలు నిర్వహించాలి. అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా భరోసా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ బి హరిసింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, డిఆర్డిఓ సన్యాసయ, జడ్పీ సీఈవో శిరీష, ముఖ్య ప్రణాళిక అధికారి కిషన్, డీఎస్ఓ మోహన్ బాబు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
1
12
364
🏥 ఆరోగ్యశాఖలో ఇక నిర్లక్ష్యానికి తావులేదు.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం! పీహెచ్‌సీల పనితీరుపై ప్రతిరోజూ సమీక్ష – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రభుత్వ వైద్య సేవలను మరింత మెరుగుపరిచి, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు సమష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. నవంబర్ 30 వరకు ప్రతిరోజూ పీహెచ్‌సీల పనితీరుపై 10 నిమిషాల పాటు సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 🔹 ప్రతి అధికారి తమ పరిధిలోని ఐదు కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. 🔹 పెండింగ్ పనులు, పూర్తయిన కార్యక్రమాలు, పురోగతి వివరాలను నమోదు చేయాలి. 🔹 ఫైళ్ల నిర్వహణ, కార్యాలయ విధానాల్లో నిర్లక్ష్యం ఉండకూడదు. 🔹 ఇమ్యూనైజేషన్, లేబర్ రూముల ఆధునీకరణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంపునకు చర్యలు తీసుకోవాలి. 🔹 వెక్టర్ బార్న్ వ్యాధుల నియంత్రణకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలి. బాధ్యతాయుతమైన పనితీరు, సమర్థవంతమైన పర్యవేక్షణతో ఆరోగ్యశాఖలో వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కోటిరత్నం, డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
1
9
348
📢 ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 🔹 ప్రజావాణికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి 🔹 పెండింగ్ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి 🔹 సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 152 దరఖాస్తులు ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా, మండల స్థాయిలో అందిన ప్రజావాణి దరఖాస్తులన్నింటినీ తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని, పెండింగ్‌లో ఉన్న అర్జీలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, మండల స్థాయిలో ప్రారంభమైన ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. అధికారుల లాగిన్‌లలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజావాణికి 152 దరఖాస్తులు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 152 దరఖాస్తులు అందాయి. శాఖల వారీగా: ▪️ భూ, రెవెన్యూ సమస్యలు – 52 ▪️ మహిళా, శిశు సంక్షేమ శాఖ (DWO) – 32 ▪️ గ్రామీణాభివృద్ధి శాఖ (DRDO) – 16 ▪️ జిల్లా పంచాయతీ అధికారి (DPO) – 7 ▪️ మున్సిపాలిటీ – 7 ▪️ ఇతర శాఖలు – 38 అందిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్ఓ ప్రేమ్ రాజ్, జడ్పీ సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రతి అర్జీకి సత్వర పరిష్కారమే ధ్యేయం.
2
7
302
🧒 బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి.. 22 వినతుల స్వీకరణ బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బాలల హక్కులను పరిరక్షించడంతో పాటు, వారి అభివృద్ధికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన బాలల ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో బాలల నుంచి 22 వినతులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలలు తమ సమస్యలను ఎలాంటి భయం, సంకోచం లేకుండా స్వేచ్ఛగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి ప్రాంగణంలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్య, వైద్యం, పోషకాహారం, బాలల రక్షణ, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై బాలలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేశారు. అందిన వినతుల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్వో ప్రేమ్ రాజు, జెడ్పీ సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీడబ్ల్యూఓ నరసింహారావు, బాలల సంరక్షణ అధికారి రవికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. బాలల హక్కుల పరిరక్షణే.. వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది!
2
14
314
🏆 ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను విజయవంతం చేయాలి రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సందడి నింపేలా విస్తృత ప్రచారం చేపట్టాలి – మంత్రి వాకిటి శ్రీహరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను విజయవంతం చేసేందుకు అన్ని జిల్లాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లకు సూచించారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 20 వేదికలపై నిర్వహించనున్న ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీలపై ప్రజలు, విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, పార్కుల్లో క్రీడల అధికారిక లోగో, మస్కట్‌తో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, కలెక్టరేట్లలో కౌంట్‌డౌన్ బోర్డులు, ప్రధాన కూడళ్లలో మస్కట్ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 విజయవంతానికి సూర్యాపేట జిల్లా యంత్రాంగం కృషి చేయనుంది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
1
10
227
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రతే లక్ష్యం – ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నవంబర్ 19న రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి అర్హులైన ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులు సేకరించాలని సూచించారు. 🔹 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల కుటుంబ సంపాదన సభ్యుడికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ. 🔹 కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి బీమా భద్రత. 🔹 నవంబర్ 18న ప్రతి గ్రామంలో టాంటాం ద్వారా విస్తృత ప్రచారం. 🔹 నవంబర్ 19న ప్రతి గ్రామం, పట్టణ వార్డులో ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ. 🔹 నామినీ వివరాల నమోదు, దరఖాస్తుల డిజిటలైజేషన్ పక్కాగా చేపట్టాలి. ఈ పథకం అమలుపై హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఐడీఓసీ నుంచి పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే ఈ ప్రతిష్టాత్మక పథకం విజయవంతం కావడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి కుటుంబానికి భరోసా.. ప్రతి ఇంటికి జీవిత బీమా రక్షణ.. ఇదే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యం.
1
11
550
🌾 తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం! జాన్‌పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను జనవరి నాటికి పూర్తి చేయాలి – మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాలకవీడు ప్రాంత రైతుల సాగునీటి కష్టాలకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలతో శాశ్వత పరిష్కారం లభించనుందని రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం కృష్ణా నదిపై రూ.400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జవహర్ జాన్‌పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనులను పరిశీలించి, పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా, మూసీ నదుల ఆధారంగా చేపడుతున్న ఎత్తిపోతల పథకాల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ పథకాలతో మూడు పంటలకు నీరందించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. జాన్‌పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుతో పాలకవీడు ప్రాంత రైతుల చిరకాల సాగునీటి కల నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యం.. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ధ్యేయం! 🌱
2
11
465
🚜 రైతులకు సాగునీటి భరోసా.. 4,460 ఎకరాలకు నీరందించడమే లక్ష్యం! రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ మండలం రెడ్లకుంట వద్ద పాలేరు వాగుపై నిర్మిస్తున్న రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువ నిర్మాణ పనులు, అండర్‌గ్రౌండ్ మోటార్లు, సబ్‌స్టేషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రూ. 47.64 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ 4,460 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా ద్వారకుంట, నల్లబండగూడెం, కాపుగల్లు, కూచిపూడి, రెడ్లకుంట, చిమిరాల గ్రామాలకు చెందిన మొత్తం 1,486 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను డిసెంబర్ చివరి నాటికి ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, ఇరిగేషన్ సీఈ నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు. రైతులకు సాగునీటి భరోసా.. వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం!
2
8
380
🏫 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత నవంబర్ 20లోపు పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ZPHS (Girls) ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం సందర్శించి, Next Generation సూర్యాపేట కార్యక్రమంలో భాగంగా రూ.30 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సివిల్ వర్క్స్, మేజర్, మైనర్ రిపేర్ల పనుల పురోగతిని సమీక్షించారు. పాఠశాల క్రీడా మైదానాన్ని చదును చేసి బేస్‌బాల్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మిగిలిన అన్ని అభివృద్ధి పనులను నవంబర్ 20వ తేదీలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించి, పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల ప్రతిభ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాడి నర్సిరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్, డీఈ రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యం – Next Generation సూర్యాపేట.
1
14
491
🏥 సూర్యాపేటలో రూ.190 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన భవన పనుల పరిశీలన నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేసి, రెండు మూడు నెలల్లో ప్రారంభానికి సిద్ధం చేయాలి: మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో వైద్య, విద్యా రంగాల్లో మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో రూ.190 కోట్ల అంచనా వ్యయంతో ఐదు అంతస్తుల్లో 1,000 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం రూ.1.17 కోట్లతో ఎస్‌బీఐ, ఐఓసీ, కోటక్ మహీంద్రా, అక్షర ఫౌండేషన్ సహకారంతో సమకూర్చిన ఆధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు. అలాగే కాంపెన్సేటరీ అపాయింట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా అర్హులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ: - ఆసుపత్రి నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలి. - హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు కృషి చేస్తాం. - దేవాదుల ఆరో ప్యాకేజీ ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి రూ.1,000 కోట్లతో సాగునీరు అందిస్తాం. - పాత లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పునరుద్ధరణతో పాటు కొత్త లిఫ్ట్‌ల ఏర్పాటుకు కృషి చేస్తాం. - అర్హులైన ప్రతి ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డులు అందించడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేపడుతున్నాం. రాబోయే రోజుల్లో సూర్యాపేట జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందువరుసలో నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొర్రిశెట్టి నివేదిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రవణ్, మాజీ పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వైద్య అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
3
12
442
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపడాలి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వేసవి ముగిసే వరకు తాగునీటి సరఫరాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి మార్చి నెలాఖరులోగా VBGRAMG ద్వారా 12 కోట్ల పనిదినాల కల్పన లక్ష్యం సాధించాలి రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, నిర్దేశిత లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష, పీఎం శ్రీ నిధుల వినియోగం, VBGRAMG, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లా సమీకృత కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ ముఖ్యంగా సూచించిన అంశాలు: 🔹 విద్యాశాఖ: సమగ్ర శిక్ష, పీఎం శ్రీ నిధుల వినియోగాన్ని జనవరి మొదటి వారంలోగా గరిష్ట స్థాయికి చేర్చాలి. పాఠశాలల్లో మౌలిక వసతులు, మరమ్మతులు, మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాల అమలును పర్యవేక్షించాలి. 🔹 తాగునీటి సరఫరా: వేసవి ముగిసే వరకు ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. జిల్లా, మండల స్థాయి కమిటీల ద్వారా ప్రతి వారం పరిస్థితిని సమీక్షించాలి. 🔹 VBGRAMG: మార్చి నెలాఖరులోగా 12 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని సాధించాలి. చేపట్టే పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. 🔹 ఇందిరమ్మ ఇళ్లు: రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలి. లబ్ధిదారులకు సబ్సిడీపై సిమెంట్ బస్తాలను అందించి, ఇసుక, సిమెంట్ రాయితీల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలి. 🔹 ప్రభుత్వ పథకాల ప్రచారం: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విస్తృతంగా చేరవేయాలి. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్ఓ ప్రేమ్ రాజు, సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ యాదగిరి, డీఐఈఓ సులోచన రాణి, డీఏఓ శ్రీధర్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్ రెడ్డి, ఇంట్రా ఈఈ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.
8
300
🏠 హుజూర్‌నగర్‌లో 2,160 ఇందిరమ్మ ఇళ్లతో మోడల్ హౌసింగ్ కాలనీ.. త్వరలో ప్రారంభం! హుజూర్‌నగర్ మండల కేంద్రంలోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. కాలనీలో విద్యుత్ సౌకర్యం, వీధి దీపాలు, గ్రీనరీ, తాగునీటి వసతి, పైలాన్ స్తూపం, సభాస్థలి తదితర అభివృద్ధి పనులను పరిశీలించి, మిగిలిన పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాటిన మొక్కలు ఎండిపోకుండా నిరంతరం నీరు అందించాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, అత్యంత అర్హులైన వారికి ప్రాధాన్యత కల్పిస్తూ ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఆర్డీవో శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ జబ్బార్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గుత్తేదారులు పాల్గొన్నారు.
6
281
💧 జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు! వాటర్ స్ట్రెస్ గ్రామాలను నవంబర్‌లోనే గుర్తించి సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 🔹 గ్రామాల వారీగా తాగునీటి పరిస్థితిపై వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. 🔹 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు 15 రోజుల్లో మిషన్ భగీరథ కనెక్షన్లు అందించాలి. 🔹 తాగునీటి వృథా, పైపులైన్ లీకేజీలను అరికట్టాలి. 🔹 ప్రతి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్, ట్యాంకర్ అందుబాటులో ఉంచాలి. 🔹 భూగర్భ జలాల పరిస్థితిపై ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలి. 🔹 ప్రభుత్వ భవనాలు, పాఠశాలల్లో వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలి. జిల్లాలో వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని, నీటి వనరుల సంరక్షణతో పాటు ప్రతి గ్రామానికి నిరంతర తాగునీటి సరఫరా ఉండేలా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి హరి సింగ్, డిఆర్డిఓ పిడి సన్యాసయ, జడ్పీ సీఈవో శిరీష, డిపిఓ యాదగిరి, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్ రెడ్డి, డిడబ్ల్యూఓ నరసింహారావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
10
331
🏦 జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ (DCC/DLRC) సమావేశం ఆరు నెలల్లోనే జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో రూ.8,209.78 కోట్ల రుణాల లక్ష్య సాధన సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ (DCC/DLRC) సమావేశం నిర్వహించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటనాగప్రసాద్ కన్వీనర్‌గా వ్యవహరించారు. 📊 సమావేశంలో సమీక్షించిన రుణాల వివరాలు: 🔹 వ్యవసాయ రుణాలు: వార్షిక లక్ష్యం రూ.7,978.20 కోట్లు కాగా, ఆరు నెలల్లో రూ.5,197.05 కోట్ల రుణాల పంపిణీ జరిగింది. 🔹 ప్రాధాన్యత రంగాలు: వార్షిక లక్ష్యం రూ.10,832.53 కోట్లు కాగా, రూ.6,204.35 కోట్ల రుణాల పంపిణీ జరిగింది. 🔹 జిల్లా వార్షిక రుణ ప్రణాళిక: రూ.13,336.67 కోట్ల లక్ష్యానికి గాను ఆరు నెలల్లో రూ.8,209.78 కోట్ల రుణాల పంపిణీ జరిగింది. 🌾 ఎల్‌నినో ప్రభావం – కరువు పరిస్థితులపై ప్రత్యేక సమీక్ష జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర, మధ్యస్థ అనావృష్టి మండలాల పరిస్థితులపై కలెక్టర్ ప్రత్యేక DCC సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనావృష్టి, కరువు ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలని, అర్హులైన రైతుల పంట రుణాలను నిబంధనల ప్రకారం రీషెడ్యూల్ చేయాలని సూచించారు. రైతులకు రుణ సదుపాయాలు అందించడంతో పాటు కరువు పరిస్థితుల్లో వారికి బ్యాంకులు అండగా నిలవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో DRDO PD సన్యాసయ్య, జనరల్ మేనేజర్ భారతి, బీసీ సంక్షేమ అధికారి విశాల్ ధార, ఎస్సీ సంక్షేమ అధికారి లత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఉపేందర్ రావు, నాబార్డ్ DDM రవీంద్ర నాయక్, RBI ADM చిరంజీవి, వివిధ బ్యాంకుల జిల్లా కోఆర్డినేటర్లు, శాఖల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
2
9
426