Collector Jogulamba | Rizwan Basha Shaik IAS (@Collector_JGL) header
Collector Jogulamba | Rizwan Basha Shaik IAS (@Collector_JGL) profile picture
Gadwal
Joined December 2016
Photo by Collector Jogulamba | Rizwan Basha Shaik IAS (@Collector_JGL)Photo by Collector Jogulamba | Rizwan Basha Shaik IAS (@Collector_JGL)Photo by Collector Jogulamba | Rizwan Basha Shaik IAS (@Collector_JGL)Photo by Collector Jogulamba | Rizwan Basha Shaik IAS (@Collector_JGL)Photo by Collector Jogulamba | Rizwan Basha Shaik IAS (@Collector_JGL)Photo by Collector Jogulamba | Rizwan Basha Shaik IAS (@Collector_JGL)Photo by Collector Jogulamba | Rizwan Basha Shaik IAS (@Collector_JGL)Photo by Collector Jogulamba | Rizwan Basha Shaik IAS (@Collector_JGL)Photo by Collector Jogulamba | Rizwan Basha Shaik IAS (@Collector_JGL)Photo by Collector Jogulamba | Rizwan Basha Shaik IAS (@Collector_JGL)
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి. లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా పకడ్బందీ తనిఖీలు చేయాలి. సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటుకు ధీటుగా మెరుగైన వైద్య సేవలు అందించి సర్కారు దవాఖానాలపై ప్రజలకు నమ్మకం పెంచాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వైద్య అధికారులకు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ అక్కడి సిబ్బంది అంకిత భావంతో పనిచేయకుంటే ప్రయోజనం లేదన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్సలు చేయకుండా ఇతర ఆసుపత్రులకు ఎక్కువగా రెఫరల్ చేస్తుండడాన్ని గుర్తించినట్లు తెలుపుతూ సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్సీల పరిధిలో ఉండే సబ్ సెంటర్స్ సిబ్బంది కూడా అంకిత భావంతో విధులు నిర్వహించాలని, ఆలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. *హై రిస్క్ కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.* ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే హై రిస్క్ కేసులను ప్రైవేటుకు రెఫర్ చేయకుండా సాధ్యమైనంత వరకు అక్కడే వైద్య సేవలు అందించడం లేదా సమీపంలోని జిల్లా ఆసుపత్రులకు పంపించవచ్చన్నారు. 24 గంటల పాటు వైద్య సేవలు అందించాల్సిన పీహెచ్సీల సిబ్బంది నిర్లిప్తంగా ఉండడం సరికాదని తమ విధులకు న్యాయం చేయాలని ఆదేశించారు. గట్టు లాంటి మారుమూల ప్రాంతాల గర్భిణీలు డెలివరీ కోసం గద్వాల వరకు వచ్చే పరిస్థితులు ఉండరాదు అంటే అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే ప్రసవాలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. వైద్యాధికారులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని, త్వరలోనే గట్టులో ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేస్తామన్నారు. *అనీమియా సమస్యలను గుర్తించి చికిత్స అందించాలి* అనీమియా సమస్యలతో బాధపడే వారినీ గుర్తించి తగు చికిత్స అందజేయాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలలో ఎక్కువగా శస్త్ర చికిత్సలు చేస్తున్నారని, సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలలోని వైద్యులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసినందున రైతులు ఇబ్బందులు పడ్డారని ఈ ప్రభావం సామాన్య ప్రజలపై కూడా పడుతుందని ఇలాంటి పరిస్థితుల్లో వారు వైద్య సేవలను ప్రభుత్వాసుపత్రుల్లోనే పొందేలా పనిచేయాలని సూచించారు. ఆర్థిక సమస్యలతో బాధపడే జనం ప్రైవేట్ ఆసుపత్రిలలో చికిత్స పొందడం తలకు మించిన భారము అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. *ఇమ్యునైజేషన్ సేవలు క్రమం తప్పకుండా నిర్వహించాలి.* ఇమ్యునైజేషన్ సేవలు, ఇతర వైద్య సంబంధ కార్యక్రమాలను సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆరోగ్య మహిళ కేసుల రెఫరల్ విషయంలో తగువిధంగా స్పందించాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా తనిఖీలను పెంచాలని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య పాఠశాల పేరుతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా కార్డులను అందజేస్తున్నందున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఇప్పటివరకు 7388 మంది విద్యార్థులకు ఈ కార్డులను అందజేసి పలు పరీక్షలు చేయడం జరిగిందన్నారు. అడోలెస్ ఫ్రెండ్లీ హెల్త్ సెంటర్స్ సేవలను విస్తృతపరచాలని, కౌమారదశ పిల్లలకు సంబంధిత అంశాలపై తరచూ కౌన్సిలింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డిఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయి, ఇతర వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ................................................... @IPRTelangana @TelanganaCS @TelanganaCMO @ddyadagirinews @airnewsalerts
8
543
*విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి.* *బాలల జీవితాన్ని తీర్చిదిద్దేది విద్యాలయాలు.* *బాల్య దశ అందమైన జ్ఞాపకం.* *సెల్ ఫోన్ లను అనవసరంగా వినియోగించవద్దు*. *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్*. *ఘనంగా బాలల వారోత్సవాల ముగింపు వేడుకలు*. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ దిశగా చదువుకోవాలని, బాలల జీవితాన్ని తీర్చిదిద్దేది విద్యాలయాలేనని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిర్వహించిన వారోత్సవాల ముగింపు వేడుకలను శుక్రవారం ఐడిఓసి సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. మై డే, మై రైట్స్, మై ఫ్యూచర్ థీమ్ తో నిర్వహించిన వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ కు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతర్జాతీయ బాలల హక్కుల సంరక్షణ దినోత్సవం కూడా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరి జీవితంలో బాల్య దశ అందమైన జ్ఞాపకంగా మిగిలాలని ఆకాంక్షించారు. *బాల్య వివాహాల నిర్మూలనకు కృషి* జిల్లాలో గట్టు, కేటీ దొడ్డి, మల్దకల్ ప్రాంతాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని వీటి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా తోడ్పడాలని కోరారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడంతో శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. విద్యాసంస్థల్లో చైల్డ్ సేఫ్టీ అధికారులను నియమించడమే కాక దిశ, సఖి కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్, ఉమెన్ సేఫ్టీ విభాగాలు బాలల, మహిళల సంరక్షణకు కృషి చేస్తున్నాయన్నారు. బాలల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వంతోపాటు అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా కృషి చేస్తున్నాయన్నారు. బాలలు ఏమైనా సమస్యలు వస్తే చైల్డ్ హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ 1098 కు ఫోన్ చేసి తెలుపవచ్చన్నారు. ఇటీవలే బాలల కోసం ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా నిర్వహించినట్లు కలెక్టర్ గుర్తు చేశారు. *సెల్ ఫోన్స్ వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది.* విద్యార్థులు చదువుకు సంబంధించి ఇతర సాంకేతిక అభివృద్ధిని పెంపొందించుకునేందుకు సెల్ ఫోన్స్ వాడాలి తప్ప గేమ్స్ ఆడటానికి, అనవసరమైన వీడియోలు, రీల్స్ చూడడానికి వద్దని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఫోన్స్ ఎక్కువగా వినియోగించడం వలన కంటి చూపు మందగించడం, మానసిక, నిద్రలేమి, తదితర సమస్యలు వస్తాయన్నారు. చంటి పిల్లలకు కూడా అన్నం తినడం లేదని, ఇతరత్రా కారణాలతో ఇటీవలి కాలంలో కొంతమంది తల్లిదండ్రులు సెల్ ఫోన్స్ చేతికి ఇవ్వడంతో చిన్నతనంలోనే ఫోన్లకు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. బాల్య దశలో చక్కగా చదువుకుంటూ ఖాళీ సమయంలో ఆడుకుంటూ సంతోషంగా గడపాలని సూచించారు. *గుడ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన అవసరం* ఇటీవల కాలంలో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా గుడ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతపై క్షుణ్ణంగా వివరించాలని తెలిపారు. అక్కడక్కడ బాలికలపైనే కాకుండా బాలురపైన కూడా వేధింపుల ఘటనలు జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లైంగిక వేధింపుల ఘటనల్లో ఫోక్సో కేసులు బుక్ చేసి రిమాండ్ కు పంపడం జరుగుతుందని కఠిన చట్టాలు ఉన్నట్లు తెలిపారు. *బాలలందరూ పాఠశాలల్లో చదువుకోవాలి* విద్యాహక్కు చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చదువుకోవాలని కలెక్టర్ సూచించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా బడికి పంపాలని కోరారు. *జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటే ఆరోగ్యం* ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లతో లభించే జంక్‌ఫుడ్‌, ప్రాసెస్‌ చేసిన ఆహారానికి దూరంగా ఉండి, ఇంటి ఆహారం, పౌష్టికాహారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పిల్లల ఆరోగ్యం, శారీరక ఎదుగుదలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సెలవుల అనంతరం విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరవుతూ, క్రమశిక్షణతో చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు కలెక్టర్, అతిథులు బహుమతులు అందజేశారు. అంతకుముందు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, అదనపు ఎస్పీ శంకర్, డిడబ్ల్యుఓ సునంద, డిఇఓ విజయలక్ష్మి, డిఐఈఓ హృదయ రాజ్, డిసిపిఓ నరసింహ, సిడబ్ల్యూసి సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. @IPRTelangana @TelanganaCS @TelanganaCMO @ddyadagirinews @airnewsalerts
1
5
293
*ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భరోసా* *ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం* *రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులు,బీమా పొందే వ్యక్తి, నామినీ వివరాల నమోదు* *ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణను పకడ్బందీగా చేపట్టాలి* *ఇతర ప్రభుత్వ బీమా పథకాలు ఉన్నా ఇందిరమ్మ కుటుంబ బీమాకు అర్హత* *అర్హులైన కుటుంబాలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి:జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్* రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి కల్పిస్తున్న రూ.5 లక్షల జీవిత బీమా ఆర్థిక భరోసాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం గద్వాల మున్సిపాలిటీలోని జమ్మిచేడు 4,5వ వార్డుల వార్డు కార్యాలయంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ శిబిరంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.కుటుంబానికి ఆర్థిక ఆధారంగా ఉన్న సంపాదించే వ్యక్తి అనుకోని కారణాలతో మరణించినప్పుడు,ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా ఆదుకునేందుకు ఈ పథకాన్ని రూపొందించినట్లు వివరించారు.ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నట్లు,ఇందుకు సంబంధించిన బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. *రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు తొలుత నమోదు అవకాశం* నమోదు ప్రక్రియలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు తొలుత రేషన్ కార్డు కలిగిన కుటుంబాల వివరాలను నమోదు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా నమోదు ప్రక్రియ చేపడతారని వివరించారు. తదుపరి దశల్లో రేషన్ కార్డులు లేని అర్హులైన కుటుంబాలకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. కాబట్టి ప్రస్తుతం రేషన్ కార్డు లేని కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.నమోదు కేంద్రానికి వెళ్లేటప్పుడు రేషన్ కార్డు నంబరు తెలియజేస్తే సరిపోతుందని, జిరాక్స్ పత్రాలు అవసరం లేదని తెలిపారు. *నెల రోజుల పాటు నమోదు ప్రక్రియ* ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో గ్రామపంచాయతీ కార్యాలయాలు, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డు కార్యాలయాలు,ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నమోదు శిబిరాల ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని వివరించారు.ప్రజలు తమకు కేటాయించిన నమోదు కేంద్రానికి వెళ్లి అధికారుల సహకారంతో సులభంగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. *ఇప్పటికే అమల్లో ఉన్న బీమా పథకాలు కొనసాగుతాయి* రైతులకు రైతు బీమా,చేనేత కార్మికులకు నేతన్న చేయూత, గీత కార్మికులకు, మత్స్యకారులకు అమల్లో ఉన్న సంబంధిత బీమా,సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.ఇప్పటికే ఆయా వర్గాలకు అందుతున్న పథకాల ప్రయోజనాలకు అదనంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. *ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల నమోదులో పూర్తి జాగ్రత్తలు పాటించాలి* బీమా దరఖాస్తులను పూర్తి వివరాలతో, అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కుటుంబ సభ్యుల పేర్లు,నామినీ వివరాలు,నామినీ వాటా,ఆధార్, రేషన్ కార్డు వివరాలు తదితర సమాచారాన్ని స్పష్టంగా,తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు.దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహించరాదని, ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ధ్రువీకరించుకోవాలని స్పష్టం చేశారు. *ప్రతి కుటుంబానికి పథకంపై అవగాహన కల్పించాలి* జిల్లాలోని వార్డు అధికారులు, మహిళా సంఘాలు,కౌన్సిలర్లు ప్రజలకు ఈ పథకం ప్రయోజనాలను వివరించాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రతి కుటుంబానికి పథకం సమాచారం చేరేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నమోదు విధానంపై ప్రజలకు స్పష్టంగా వివరించి దరఖాస్తు చేసుకునేందుకు సహకరించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న రూ.5 లక్షల జీవిత బీమా ఆర్థిక రక్షణను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జయ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జానకి రామ్,అధికారులు, ప్రజా ప్రతినిధులు,వార్డ్ ఆఫీసర్స్,ప్రజలు తదితరులు పాల్గొన్నారు. @IPRTelangana @TelanganaCS @TelanganaCMO @ddyadagirinews @airnewsalerts @PIBHyderabad
9
625
*పదవ తరగతి ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలి.* *వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత శాతం పెంచాలి.* *విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలి.* *ప్రతి విద్యార్థి పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి.* *పాఠశాలల వారీగా లక్ష్యాలు నిర్దేశించి, నెలవారీగా పనితీరును సమీక్షిస్తాం.* *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.* పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో జోగులాంబ గద్వాల జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచేలా విద్యాశాఖ అధికారులు,ఉపాధ్యాయులు సమిష్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్పష్టం చేశారు. కేవలం పరీక్షల సమయంలోనే కాకుండా ఇప్పటి నుంచే ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఎస్ఏ-1 పరీక్షల ఫలితాలు, 'స్ఫూర్తి' పేరుతో రూపొందించిన ఎస్ఎస్‌సీ యాక్షన్ ప్లాన్ అమలుపై విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పాఠశాలల వారీగా, సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ఫలితాలు, హాజరు శాతం, అభ్యసన సామర్థ్యాలు, వెనుకబడిన విద్యార్థుల వివరాలను క్షుణ్ణంగా సమీక్షించారు. వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థుల సామర్థ్యాలను విశ్లేషించి ఏ, బి, సి, డి కేటగిరీలుగా విభజించాలని, ప్రతి విద్యార్థి ప్రస్తుత అభ్యసన స్థాయిని గుర్తించి వారి సామర్థ్యాలకు అనుగుణంగా ప్రత్యేక బోధన అందించాలని ఆదేశించారు. ఏ ఒక్క విద్యార్థి కూడా ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా వెనుకబడకూడదని స్పష్టం చేశారు. డిసెంబర్ 20 తేదీ వరకు సిలబస్ పూర్తి చేయాలని ఆదేశించారు.పదవ తరగతి విద్యార్థుల ఫలితాలు, అభ్యసన స్థాయులు, సబ్జెక్టుల వారీగా పనితీరు తదితర కీలక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కొందరు ప్రధానోపాధ్యాయులు సక్రమంగా రూపొందించకపోవడంపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాల్లోనే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఉపాధ్యాయులుగా తమ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, విధుల నిర్వహణలో నిర్లిప్తత, నిర్లక్ష్యం, సాకులు చెప్పే ధోరణిని ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాల ఫలితాలకు బాధ్యత వహించాలని, ఉపాధ్యాయుల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు పాఠశాలలకు సెలవు పెడితే పై అధికారుల అనుమతి తీసుకోవాలని, పలు పాఠశాలలకు విద్యా వలంటీర్లను కూడా నియమించామన్నారు. పదవ తరగతి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ప్రతిభావంతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు. పాత ప్రశ్నపత్రాలతో సాధన, స్లిప్ టెస్టులు, విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి విద్యార్థి ప్రగతిని పర్యవేక్షించాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ప్రతి పాఠశాల యాక్షన్ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల పురోగతి, హాజరు, ప్రత్యేక తరగతుల నిర్వహణపై నెలవారీ సమీక్ష చేపట్టి, ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈఓ విజయలక్ష్మి, మండల విద్యాధికారులు, సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. @IPRTelangana @TelanganaCS @TelanganaCMO #SSCExams2027 #QualityEducation #GadwalDistrict #GovernmentSchools #AcademicExcellence
8
368
*దశలవారీగా ఇందిరమ్మ బీమా నమోదు* *మూడు విడతల్లో లబ్ధిదారుల నమోదు* *గ్రామాలు, వార్డుల వారీగా శిబిరాల ఏర్పాటు* *లబ్ధిదారుల సంతకాలు రిజిస్టర్ లో నమోదు* *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్* ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను నూతన విధివిధానాల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో పథకం అమలుపై సమీక్షించారు. ప్రభుత్వ నూతన నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నమోదు ప్రక్రియను మూడు విడతల్లో చేపట్టడం జరుగుతుందన్నారు. శుక్రవారం నుంచి జిల్లాలో తొలి విడత నమోదు ప్రక్రియ ప్రారంభించాలని, మూడు విడతల్లో గ్రామాలు, మున్సిపల్ వార్డులలో ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. మొదటి విడతలో ఇంటర్నెట్ సదుపాయం, కంప్యూటర్లు అందుబాటులో ఉండి, చురుకైన సిబ్బంది ఉన్న గ్రామాలు, వార్డులను ఎంపిక చేయాలన్నారు. తొలి విడత గ్రామాలు, వార్డుల జాబితాను త్వరగా పూర్తి చేయాలని, మిగిలిన విడతల వివరాలను కూడా అందించాలని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. *నమోదు ప్రక్రియ సరళీకృతం* ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాల ప్రకారం నమోదు ప్రక్రియను సరళీకృతం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇకపై ప్రీ-ఫిల్డ్ దరఖాస్తులు, మాన్యువల్ ఫారాలు, ప్రింటింగ్, స్కానింగ్, పత్రాల అప్‌లోడ్ అవసరం లేదన్నారు. రేషన్ కార్డు చివరి ఆరు అంకెలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు ప్రత్యక్షమవుతాయని, అందులో బీమా పొందే వ్యక్తి, నామినీలను ఎంపిక చేసి వాటా శాతాన్ని నమోదు చేయాలని వివరించారు. ఇతర బీమా పథకాలలో సభ్యత్వం ఉన్న వివరాలను కూడా నమోదు చేయాలన్నారు. దరఖాస్తు సమర్పించిన వెంటనే ట్రాన్సాక్షన్ ఐడీ వస్తుందని, లబ్ధిదారుడి మొబైల్‌కు సందేశం అందుతుందని పేర్కొన్నారు. *రిజిస్టర్ నిర్వహణ తప్పనిసరి* ఆన్‌లైన్ నమోదు పూర్తయిన ప్రతి దరఖాస్తుదారుడి వివరాలను, సంతకాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రేషన్ కార్డు నంబర్, బీమా పొందే వ్యక్తి పేరు, నామినీ పేరు, వాటా శాతం, ట్రాన్సాక్షన్ ఐడీ నమోదు చేయడంతో పాటు క్యాంప్ ఇన్‌చార్జి, పర్యవేక్షణ అధికారి సంతకాలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు క్యాంప్ ఇన్‌చార్జిలుగా వ్యవహరించాలని, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. లాగిన్ ఐడీలు, మొబైల్ నంబర్ల నమోదులో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. తప్పు మొబైల్ నంబర్లు నమోదు చేయడం వల్ల ఓటీపీ, ఇతర సమాచార భద్రతకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రతి శిబిరానికి బాధ్యులైన సిబ్బంది వివరాలను ముందుగానే నిర్ధారించుకోవాలని సూచించారు. నూతన విధివిధానాలపై సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. *శిబిరాల నిర్వహణపై ప్రచారం అవసరం* గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశాల్లో నమోదు శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కంప్యూటర్, ఇంటర్నెట్, టెంట్, కుర్చీలు, ఫ్లెక్సీలు, తదితర ఏర్పాటు చేయాలన్నారు. కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. గ్రామాల్లోనూ శిబిరాల నిర్వహణపై టామ్ టామ్ చేయించాలని, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలందరికీ సమాచారం చేరవేయాలన్నారు. రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు, చేర్పులు అవసరమైతే పౌరసరఫరాల శాఖ ద్వారా సరిచేసుకోవాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, అర్హులైన కుటుంబాల నమోదు ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. @IPRTelangana @TelanganaCS @TelanganaCMO @ddyadagirinews
1
15
1,249
*జిల్లాలో డ్రగ్ కేసులు నమోదు కాకుండా పటిష్ట చర్యలు*. *డ్రగ్స్, గంజాయి అక్రమ సాగు, కల్తీ కల్లు విక్రయాలపై ఉక్కుపాదం* *జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగం, విక్రయాలకు చెక్ పెట్టాలి*. *నార్కోటిక్ డ్రగ్స్‌పై విశ్వసనీయ సమాచారం అందించిన వారికి రూ.10 వేల నగదు బహుమతి*. *పోలీస్, ఎక్సైజ్, వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలి.* *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.* జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా,గంజాయి సాగు,కల్తీ కల్లు తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఒక్క డ్రగ్ కేసు కూడా నమోదు కాకుండా పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా గంజాయి లేదా ఇతర నిషేధిత మాదకద్రవ్యాల సాగు, నిల్వ, విక్రయాలు, రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాయచూరు సరిహద్దు ప్రాంతంలోని మండలాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గట్టు, కేటీ దొడ్డి, గద్వాల, ఐజ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలతో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో గంజాయి, ఇతర నిషేధిత మాదకద్రవ్యాల సాగును గుర్తించి, భూముల వివరాలు సేకరించి పోలీసుల ద్వారా కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అక్రమ సాగుదారుల రైతుబంధు, రైతుబీమా, పెన్షన్ తదితర ప్రభుత్వ పథకాల ప్రయోజనాల నిలిపివేతకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద సాగును గుర్తించిన వెంటనే పోలీస్, రెవెన్యూ శాఖలకు సమాచారం అందించాలని వ్యవసాయ విస్తరణ, మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు.కల్తీ కల్లు తయారీలో ప్రమాదకరమైన రసాయనాలు వినియోగిస్తున్నట్లు వచ్చే ఫిర్యాదులపై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. అనుమతులు కలిగిన కల్లు విక్రయ కేంద్రాల్లో కూడా నిబంధనల ఉల్లంఘనలు జరగకుండా తనిఖీలు చేయాలని, కల్తీ కల్లు తయారీ, విక్రయాలు ఎక్కడ జరిగినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, గంజాయి సాగు వంటి కార్యకలాపాలపై విశ్వసనీయమైన, నిర్ధారించగల సమాచారం అందించే వారికి రూ.10,000 నగదు బహుమతి అందజేస్తామని కలెక్టర్ ప్రకటించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.16–18 ఏళ్ల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, యాంటీ నార్కోటిక్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని, ప్రతి శుక్రవారం స్కూల్ బ్యాగుల తనిఖీలతో పాటు బాలుర వసతి గృహాలు,రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని సూచించారు. జాతీయ రహదారుల వెంట ఉన్న దాబాలు, రెస్టారెంట్లు, టోల్ గేట్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర అనుమానిత ప్రాంతాల్లో పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో రాత్రి వేళల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అనధికారికంగా మద్యం విక్రయాలు, సేవనానికి అవకాశం కల్పించే కేంద్రాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను విస్తృతం చేసి, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో బ్రీత్ అనలైజర్లతో నిరంతర తనిఖీలు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.మాదకద్రవ్యాల నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్‌అవుట్స్ తగ్గింపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఫిర్యాదులు అధికంగా వస్తున్న నాలుగు మండలాల్లో సఖీ కేంద్రాల సేవలను విస్తరించి, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వాటి వివరాలతో నివేదికలు సమర్పించాలని తెలిపారు. మాదకద్రవ్యాలు, మద్యం వ్యసనాలకు గురైన వారికి వైద్య చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందించి, అనంతరం వారి పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.జాతీయ రహదారుల వెంట ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యత, భద్రతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు.మిషన్ పరివర్తనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీఎస్పీ మొగిలయ్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. @TelanganaCS @TelanganaCMO @GadwalSp @IPRTelangana #MissionParivarthana #DrugFreeTelangana #SayNoToDrugs #RoadSafety
4
344
*ఎయిడ్స్ నియంత్రణలో జోగులాంబ గద్వాల జిల్లా సాధించిన ప్రగతి అభినందనీయం* *హెచ్‌ఐవీ నియంత్రణలో 95-95-95 లక్ష్యాల సాధన దిశగా మెరుగైన పనితీరు* *సురక్షిత్ కేటగిరీలో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో గద్వాలకు స్థానం* *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్* జోగులాంబ గద్వాల జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ, నివారణ కార్యక్రమాల అమలులో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది కనబరిచిన పనితీరు అభినందనీయమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రశంసించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) నిర్దేశించిన 95-95-95 లక్ష్యాల సాధనలో గణనీయమైన ప్రగతి కనబరిచి, జోగులాంబ గద్వాల జిల్లా సురక్షిత్ కేటగిరీలో గుర్తింపు పొందిన నేపథ్యంలో, నాకో డిప్యూటీ డైరెక్టర్ మేఖల, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం ఐడీఓసీలో జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాకో ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మాన్ సమరోహ్ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సురక్షిత్ కేటగిరీకి ఎంపికైన 20 జిల్లాల్లో జోగులాంబ గద్వాల జిల్లా చోటు సంపాదించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ గుర్తింపు జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నియంత్రణ విభాగం అధికారులు, ఐసీటీసీ, ఏఆర్టీ, సీఎస్‌సీ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, సంబంధిత సిబ్బంది సమష్టి కృషి, సమన్వయంతో సాధ్యమైందని తెలిపారు. సాధించిన విజయంతో సంతృప్తి చెందకుండా ఇదే స్ఫూర్తితో హెచ్‌ఐవీ వ్యాప్తి నివారణ, విస్తృత స్థాయిలో పరీక్షలు, సకాలంలో చికిత్స అందించడం, హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారికి నిరంతర వైద్య సేవలు కల్పించడం వంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ఎయిడ్స్ నియంత్రణ లక్ష్యాల సాధనకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాకో డిప్యూటీ డైరెక్టర్ మేఖల, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సంధ్య కిరణ్మయి, ప్రోగ్రాం అధికారి రాజు, ఇతర అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. @IPRTelangana @TelanganaCS @TelanganaCMO @ddyadagirinews @airnewsalerts
9
413
**ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను విజయవంతం చేయాలి.* *నవంబర్ 19న సిద్దిపేట నుంచి పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి* *అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో పండుగ వాతావరణంలో ప్రారంభోత్సవాలు నిర్వహించాలి* *రెండు వారాల పాటు గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి దరఖాస్తులు సేకరించాలి* *ప్రతి కుటుంబం నుంచి బీమా పొందే వ్యక్తి, నామినీ వివరాలతో దరఖాస్తులు సేకరించాలి* *సోషల్ మీడియాతో పాటు అన్ని ప్రచార మాధ్యమాల ద్వారా పథకంపై విస్తృత అవగాహన కల్పించాలి* ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, దరఖాస్తుల సేకరణ, ప్రజలకు అవగాహన కల్పించడం తదితర అంశాలపై బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గద్వాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుంచి పలువురు జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 19న సిద్దిపేట జిల్లా నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రారంభించే సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో కూడా పథకాన్ని ఒకేసారి ప్రారంభించాలని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. **రెండు వారాల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలి** ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించనున్న నేపథ్యంలో ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులు సేకరించాలని సీఎస్ సూచించారు. రాబోయే రెండు వారాల పాటు గ్రామాల వారీగా, మున్సిపల్ వార్డుల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి దరఖాస్తుల సేకరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని సేకరించాలని, అందులో బీమా పొందే వ్యక్తి వివరాలు, నామినీ వివరాలు తదితర అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా నమోదు చేయించాలని తెలిపారు. దరఖాస్తుల సేకరణ సమయంలో బీమా పొందే వ్యక్తి, నామినీ వివరాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు అందేలా గ్రామ, వార్డు స్థాయిలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, దరఖాస్తుల సేకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఏ కుటుంబం కూడా ఈ పథకం ప్రయోజనాలకు దూరం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. **పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలి** ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఉద్దేశం, ప్రయోజనాలు, దరఖాస్తు విధానం తదితర అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సీఎస్ సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. గ్రామాల్లో మైక్ ప్రచారం, పోస్టర్లు, కరపత్రాలు, ప్రజా సమావేశాల ద్వారా పథకం వివరాలను ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల స్థాయిలో నిర్వహించే ప్రత్యేక శిబిరాల వివరాలను ముందుగానే ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ప్రత్యేక శిబిరాల నిర్వహణ, దరఖాస్తుల సేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ నర్సింగరావు, సిపిఓ పాపయ్య ,ఈడియం శివ, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. @IPRTelangana @TelanganaCS @TelanganaCMO
7
463
*ఎస్సీ, ఎస్టీలు సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి.* *జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి కంపెనీలు సహకరించాలి.* *విజయవంతమైన వ్యాపారస్తుల స్ఫూర్తి పొందాలి.* *వ్యవసాయ రంగంలోనూ ఆర్థిక ప్రగతి సాధించాలి.* *ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు.* *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.* ఎస్సీ, ఎస్టీలు వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఆర్థిక ప్రగతి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో యునైటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో బుధవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి సమావేశపు మందిరంలో నేషనల్ ఎస్సీ, ఎస్టీ హబ్ పేరుతో స్పెషల్ వెండర్ ఎంప్లాయ్మెంట్, వ్యాపార నిర్వహణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు బ్యాంకుల నుంచి సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రుణాలను సద్వినియోగం చేసుకొని వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో చెప్పుకోదగ్గ ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. *అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ* ఎస్సీ, ఎస్టీలు వివిధ రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వంతోపాటు వివిధ సంస్థలు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను తరచూ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలన్నారు. వివిధ పథకాల గురించి సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయడం వలన ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇటీవలే ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పలువురు రైతులను మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో అక్కడి విజయవంతమైన రైతులు సాగుచేసిన పంటల పరిశీలనకు పంపించినట్లు గుర్తు చేశారు. *జిల్లా అధికార యంత్రాంగం తరపున సహకారం* షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధికి జిల్లా అధికార యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు అందుబాటులో ఉన్న సబ్సిడీ రుణాలను పెద్ద ఎత్తున మంజూరు చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో కూడా మంచి ఆదాయాన్ని పొందేందుకు అవకాశం ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు కూడా బ్యాంకు రుణాలతో వ్యాపారాలు చేసుకుని ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించారు. బెస్ట్ ప్రాక్టీసెస్ తో విజయవంతమైన వారి వ్యాపారాలను గమనించేందుకు ఆయా ప్రాంతాలకు ప్రభుత్వ ఖర్చుతో వెళ్లేందుకు ఎస్సీ, ఎస్టీలకు తోడ్పాటు అందిస్తామన్నారు. *మార్కెటింగ్ అవకాశాలను పెంపొందించుకోవాలి* వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ప్రవేశించే ముందు ఆయా వస్తువుల ఉత్పత్తిపై అవసరమైన శిక్షణ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో మౌలిక వసతులపై పూర్తి అవగాహన కూడా అవసరమన్నారు. తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకోవడంపై కూడా అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువులను ఉత్పత్తి చేసి అవసరమైతే విదేశాలకు సైతం ఎగుమతి చేసేలా ముందుకెళ్లాలన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం నిర్వాహకులు జిల్లా కలెక్టర్ కు జ్ఞాపిక అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రాష్ట్ర చైర్మన్ సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి పుట్టపాగ శ్రీనివాస్, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రఘువర్ధన్, పరిశ్రమల శాఖ మేనేజర్ రామలింగేశ్వర గౌడ్, ఎల్డిఎం శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. ................................................... @IPRTelangana @TelanganaCS @TelanganaCMO
2
316
*రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదు* *పెండింగ్ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి.* *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్* *భూదాన్ భూములు, రీ-సర్వే, భూభారతి, కోర్టు కేసులు, భూసేకరణ అంశాలపై సమగ్ర సమీక్ష* జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన పెండింగ్ సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భూదాన్ భూములు, రీ-సర్వే, భూభారతి దరఖాస్తులు, కోర్టు కేసులు, భూసేకరణ, వివిధ రెవెన్యూ సేవలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. జిల్లాలో భూదాన్ భూములకు సంబంధించిన కేసులు ఆన్‌లైన్‌లో నమోదు కావాల్సి ఉందని పేర్కొంటూ, సంబంధిత అధికారులు వెంటనే వాటి వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. భూదాన్ భూములకు సంబంధించిన వివరాలను ఇతర భూముల నుంచి వేరు చేసి స్పష్టమైన జాబితా సిద్ధం చేయాలని, ధ్రువీకరించిన భూములు, తప్పులున్న వివరాలు, సంబంధిత పత్రాలు, అండర్‌టేకింగ్‌లను ప్రత్యేకంగా సమర్పించాలని సూచించారు. *రీ-సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి* రీ-సర్వే చేపట్టిన గ్రామాల్లో సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇప్పటికే సర్వే పూర్తయిన ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్‌లు, రికార్డులు, సంబంధిత వ్యక్తుల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న నోటీసులు, సర్వే నివేదికలు, భూముల సరిహద్దుల నిర్ధారణ వంటి అంశాలను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో భూభారతి కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తుల్లో అవసరమైన పత్రాలు లేని పక్షంలో వాటిని పెండింగ్‌లో ఉంచకుండా, నిబంధనల ప్రకారం లోపాలను తెలియజేస్తూ తిరిగి పంపించడం లేదా తిరస్కరించడం వంటి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పాత మాడ్యూల్‌లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలించి, అవసరమైన చోట కొత్త మాడ్యూల్‌లోకి మార్చి పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల వివరాలను సిసిఎంఎస్ పోర్టల్‌లో పూర్తిస్థాయిలో నమోదు చేయాలని, కేసు నంబర్, సంబంధిత మండలం, శాఖ, ప్రస్తుత స్థితి, కౌంటర్ అఫిడవిట్ల దాఖలు తదితర వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు తమ పరిధిలోని కేసులపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. భూసేకరణకు సంబంధించి ఇప్పటికే జారీ చేసిన అవార్డుల వివరాలను ఆన్‌లైన్ రికార్డుల్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఖాతా నంబర్లు, సర్వే నంబర్లు, సేకరించిన భూమి విస్తీర్ణం, జారీ చేసిన అవార్డుల వివరాలు పరస్పరం సరిపోలేలా చూడాలని స్పష్టం చేశారు. భూసేకరణకు సంబంధించిన పెండింగ్ సమస్యలను గుర్తించి, అవసరమైన చోట సుమోటో దరఖాస్తులు నమోదు చేసి, నోటీసులు జారీ చేస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. *ధ్రువీకరణ పత్రాలను సకాలంలో మంజూరు చేయాలి* జనన ధ్రువీకరణ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ వివరాల ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలో మంజూరు చేయాలన్నారు. విద్యాసంస్థలకు సంబంధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. లాజిస్టిక్స్, పంపిణీకి సంబంధించిన పెండింగ్ వివరాలను వెంటనే సమర్పించాలన్నారు. భూసేకరణ పరిహారానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై భూయజమానులతో సమావేశాలు నిర్వహించి, చర్చల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. అన్ని మండలాల అధికారులు తమ పరిధిలోని పెండింగ్ దరఖాస్తులు, వాటి ప్రస్తుత స్థితి, పరిష్కరించిన అంశాలు, పరిష్కారానికి ఎదురవుతున్న సమస్యలతో కూడిన స్పష్టమైన నివేదికలను వచ్చే మంగళవారం నాటికి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సమాచారం అందుబాటులో లేని పక్షంలో అందుకు సంబంధించిన కారణాలను స్పష్టంగా నివేదికలో పేర్కొనాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డిఓ శ్రీనివాసరావు, సర్వే ఏడి నూకరాజు, కలెక్టరేట్ ఏవో మంజుల, వివిధ మండలాల తహసిల్దారులు, తదితరులు పాల్గొన్నారు. @IPRTelangana @TelanganaCS @TelanganaCMO @INC_Ponguleti
1
271
*జిల్లాలో ఇసుక నిర్వహణ పారదర్శకంగా చేపట్టాలి* *నదుల్లో నీటి మట్టం తక్కువగా ఉన్నందున ఇసుక తవ్వకాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి* *అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు* *తుమ్మిళ్ల ఇసుక రీచ్ నిర్వహణ పక్కాగా ఉండాలి* *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్* జిల్లాలో ఇసుక నిర్వహణను పారదర్శకంగా చేపట్టడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా స్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,జిల్లాలో ఇసుక నిర్వహణను పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తూ,ప్రజలకు అవసరమైన ఇసుకను సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.తుంగభద్ర,కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రస్తుతం నదుల్లో నీటి మట్టం తక్కువగా ఉన్నందున నదీ గర్భంలో అనధికారికంగా ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల పర్యావరణానికి, భూగర్భ జలాలకు నష్టం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.నదుల పరివాహక గ్రామాల్లో సంబంధిత సర్పంచులు,గ్రామ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు,ఇతర శాఖల అధికారులతో గ్రామ సభలు నిర్వహించి అక్రమ ఇసుక తవ్వకాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎక్కడైనా అక్రమ తవ్వకాలు లేదా రవాణా జరిగినట్లయితే వెంటనే అధికారులకు సమాచారం అందించేలా ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు,రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జూరాల రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా మోటార్ పంపులు ఏర్పాటు చేయడం,నీటిని తోడటం వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని కలెక్టర్ సూచించారు.ఈ ప్రాంతాల్లో అనధికార మోటార్ పంపుల కనెక్షన్లను గుర్తించి,సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.ఇందుకోసం పోలీస్,ఇరిగేషన్,రెవెన్యూ శాఖల అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతులు లేకుండా ఇసుక జిల్లాలోకి ప్రవేశించకుండా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని తెలిపారు. ఇసుక రవాణాకు ఉపయోగించే ప్రధాన మార్గాలను గుర్తించి, అవసరమైన ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు.అక్రమ రవాణాకు ఉపయోగించే ప్రధాన మార్గాల్లో అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలోని తుమ్మిళ్ల ప్రభుత్వ ఇసుక రీచ్ నిర్వహణను పక్కాగా చేపట్టాలన్నారు.ప్రభుత్వ నిబంధనలు,అనుమతుల మేరకే ఇసుక తవ్వకాలు జరగాలని,ఇసుక నిల్వలు,తవ్వకాలు,విక్రయాలు,రవాణా వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు.రీచ్ నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ అక్రమాలకు తావులేకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.అదేవిధంగా జిల్లాలో గృహ నిర్మాణాలు చేపడుతున్న ప్రజలు,ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు అవసరమైన ఇసుకను నిబంధనల ప్రకారం త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇసుక సరఫరాలో అనవసర జాప్యం జరగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని,ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు.అక్రమ ఇసుక తవ్వకాలు,రవాణా, అధిక ధరలకు విక్రయాలు, అనధికార నిల్వలపై వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ప్రజలకు అవసరమైన ఇసుకను పారదర్శకంగా అందించడంతో పాటు నదులు,సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఇసుక నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అక్రమ కార్యకలాపాలకు సహకరించినా సంబంధిత వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏ.డి.మైన్స్ ఆనంద్ కుమార్ స్టీఫెన్,ఇరిగేషన్ ఈ.ఈ శ్రీనివాసులు,తహసీల్దార్ విజయ్ కుమార్,టిఎస్ఏంఐడిసి ప్రాజెక్ట్ ఆఫీసర్ కిరణ్,గ్రౌండ్ వాటర్ ఎజిపి ప్రశాంత్, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. @IPRTelangana @TelanganaCS @TelanganaCMO @ddyadagirinews
2
243
*ఓటరు జాబితా రూపకల్పనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి.* *పట్టభద్రుల ఓటరు జాబితా రూపకల్పనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి,* *పాల్గొన్న కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అధికారులు.* పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఓటరు జాబితా డి-నోవో (కొత్తగా) రూపకల్పన ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లా అధికారులకు సూచించారు. పట్టభద్రుల ఓటరు జాబితా డి-నోవో రూపకల్పనలో ఇప్పటివరకు సాధించిన పురోగతిపై బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు,ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులు, ఓటరు జాబితా పరిశీలకులు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు,దరఖాస్తుల పరిశీలన, ఓటరు జాబితా రూపకల్పనకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన చర్యలు,సాధించిన పురోగతిని వివరించారు.ఇప్పటివరకు జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 22,987 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించి అందిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించినట్లు వెల్లడించారు. ఇంకా 40 దరఖాస్తులు పరిశీలనకు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిశీలించి పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 14,172 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్నారు.ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం నిర్ణీత విధి విధానాల ప్రకారం తదుపరి ప్రక్రియను పూర్తి చేసి, డిసెంబర్ 30వ తేదీన తుది పట్టభద్రుల ఓటరు జాబితాను ప్రకటించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు అనర్హుల పేర్లు ఓటరు జాబితాలో చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నామనీ తెలిపారు.ఓటరు నమోదు ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు బహిరంగ ప్రకటనలు, వార్తాపత్రికల ద్వారా ప్రచారం నిర్వహించామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు,ఉపాధ్యాయులు, అల్యూమిన్, తదితర అసోసియేషన్ల సహకారంతో ముందుకెళ్లడం జరిగిందన్నారు. సామూహికంగా సమర్పించే దరఖాస్తులను కూడా నిబంధనల ప్రకారం పరిశీలించి, ప్రతి దరఖాస్తు అర్హతను స్వతంత్రంగా ధ్రువీకరించిన తర్వాతే ఆమోదిస్తున్నామని తెలిపారు. అంతకుముందు ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి చేపట్టిన డీ-నోవో ఓటరు జాబితా తయారీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని, అర్హత లేని వ్యక్తులకు ఓటరు జాబితాలో చోటు కల్పించరాదని ఆదేశించారు. ప్రస్తుత ఓటరు జాబితా తయారీ పూర్తిగా కొత్తగా చేపడుతున్న డీ-నోవో ప్రక్రియ అని,గతంలో ఉన్న ఓటరు జాబితాలో పేర్లు ఉన్నంత మాత్రాన ప్రస్తుతం కూడా అవి ఆటోమేటిక్‌గా కొనసాగవని స్పష్టం చేశారు.గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి విద్యార్హతలను సంబంధిత ధ్రువీకరణ పత్రాల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. తగిన విద్యార్హతలు లేని వ్యక్తులను ఓటరు జాబితాలో చేర్చరాదని, అనర్హుల నమోదు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ఒకే వ్యక్తి పేరు వేర్వేరు ప్రాంతాల్లో నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సరైన ఆధారాలతో నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు.ఓటరు నమోదు ప్రక్రియకు వినియోగించే సాఫ్ట్‌వేర్, ఆన్‌లైన్ వ్యవస్థలను ముందుగానే పూర్తిస్థాయిలో పరీక్షించాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలు, అనువాద లోపాలు, అప్లికేషన్ సెంటర్లలో ఎదురయ్యే ఇబ్బందులను వెంటనే గుర్తించి పరిష్కరించాలని సూచించారు. సరైన పరీక్షలు, ధ్రువీకరణ లేకుండా కొత్త సాఫ్ట్‌వేర్ లేదా ఫీచర్లను అమలు చేయరాదని స్పష్టం చేశారు. ఓటరు జాబితా తయారీ ప్రతి దశలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని, వారి అభ్యంతరాలు,సూచనలను నమోదు చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సమావేశాల వివరాలు,తీసుకున్న నిర్ణయాలను రికార్డుల్లో భద్రపరచాలని సూచించారు.రోల్ అబ్జర్వర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుల పరిశీలన, అర్హతల నిర్ధారణ,పత్రాల ధ్రువీకరణ ప్రక్రియను పర్యవేక్షించాలని తెలిపారు.గత సమావేశంలో సూచించిన ప్రత్యేక డ్రైవ్ నిర్వహణపై కూడా వివరాలు సమర్పించాలన్నారు.ఈ కాన్ఫరెన్స్ లో ఆర్డిఓ శ్రీనివాసరావు,కలెక్టరేట్ ఏవో మంజుల, వివిధ మండలాల తహసిల్దార్లు,తదితరులు పాల్గొన్నారు. @ECISVEEP @CEO_Telangana @TelanganaCS @TelanganaCMO @IPRTelangana
4
459
*ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.* *రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి.* *విధుల్లో అలసత్వం చూపే ఉద్యోగులను తొలగించాలి*. *హాజరు నమోదు చేయని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు.* *వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు*. *ఆసుపత్రి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి*. *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.* విధుల్లో అలసత్వం చూపే ఉద్యోగులను తొలగించాలని, హాజరు సక్రమంగా నమోదు చేయని ముగ్గురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంగళవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా సందర్శించి వివిధ విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ప్రసూతి, శిశు సంరక్షణ విభాగాలు, ఇన్‌పేషెంట్ వార్డులు, మందుల లభ్యత, పారిశుద్ధ్యం, వైద్య సిబ్బంది హాజరు, తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రసూతి, డెలివరీ విభాగాల్లో అనవసరమైన రద్దీ లేకుండా చూడాలని, ప్రసవం అనంతరం తల్లులు, శిశువులను నిర్దేశించిన వార్డులకు తరలించాలని సూచించారు. నవజాత శిశువుల గుర్తింపు కోసం తల్లి, తండ్రి వివరాలు, ప్రత్యేక ఐడీతో కూడిన ట్యాగింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నియోనాటల్ స్పెషలిస్ట్ సేవల అవసరాన్ని పరిశీలించాలని సూచించారు. మాతా సంరక్షణ విభాగంలో బెడ్ షీట్ల కొరతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రిలో వివిధ మరమ్మత్తులు, అభివృద్ధి పనులకు రూ.50 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగిందని, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అన్ని వార్డుల్లో ఫ్యాన్లు, ఏసీలు, లైట్లు, తదితర సక్రమంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు.ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు ఆసుపత్రిలోనే అందుబాటులో ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాలని రోగులను సూచించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం, అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రులకు పంపించడం లేదా బయట మందులు కొనుగోలు చేయాలని సూచించడం, ప్రభుత్వ వైద్య సామాగ్రిని బయట అమ్ముకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.వైద్యులు, ప్రొఫెసర్లు, నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరుకావాలని, బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు.ఆసుపత్రిలో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాల్లో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలని, భద్రతా సిబ్బంది విధులను పటిష్టంగా పర్యవేక్షించాలని, వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేద రోగికి మెరుగైన వైద్యం, నాణ్యమైన సౌకర్యాలు అందించడం అధికారుల ప్రధాన బాధ్యత అని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ పర్యటనలో ఆసుపత్రి పర్యవేక్షకురాలు ఝాన్సీ లక్ష్మి, ఇతర వైద్యాధికారులు, తదితరులున్నారు. @IPRTelangana @TelanganaCS @TelanganaCMO @DamodarCilarapu
8
508
*జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు*. *పథకంపై పెద్ద ఎత్తున ప్రచారం అవసరం*. *19వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు*. *రేషన్ షాపుల వారీగా లబ్ధిదారుల గుర్తింపు.* *సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలి.* *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.* ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రత్యేక శిబిరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత ఇతర అధికారులతో పథకం అమలు సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ వెబ్ ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నందున జిల్లావ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు ప్రారంభం కానున్నందున అధికారులు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు.రేషన్ కార్డుదారుల డేటాను ప్రతి మండలానికి పంపించడం జరుగుతుందని దీని ఆధారంగా ఆయా రేషన్ దుకాణాల పరిధిలోని లబ్ధిదారులందరి చేత బీమా పథకానికి దరఖాస్తు చేయించేలా ప్రణాళికతో అధికారులు ముందుకెళ్లాలన్నారు. పథకం పకడ్బందీ అమలుకు ఈనెల 18న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, రేషన్ డీలర్లు, తదితరులతో ఆయా మండలాల ఉన్నతాధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించి తగు సూచనలు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయాలని, ఇందుకోసం అనువైన ప్రదేశాన్ని గుర్తించి అవసరమైన టెంట్లు, టేబుళ్లు, కుర్చీలు, ఫ్లెక్సీలు తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని మూడు, నాలుగు వార్డులు కలిపి ఒకచోట శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రేషన్ కార్డ్ దారుల దరఖాస్తులను పూరించడం, ఇతర విధుల్లో మహిళా స్వయం సహాయక సంఘాల సిబ్బంది సేవలను కూడా వినియోగించుకోవచ్చని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, వార్డు అధికారులు, రేషన్ షాపు డీలర్లు సమన్వయంతో పనిచేస్తూ అవసరాన్ని బట్టి ఒకటి కంటే ఎక్కువ రేషన్ షాపులకు కలిపి ఒకే చోట శిబిరం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పథకం గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగేలా అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని ఆదేశించారు. కుటుంబాన్ని పోషించే యజమాని పేరిట బీమా దరఖాస్తు చేసుకునేందుకు 18-59 ఏళ్లలోపు వారందరూ ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. ఫలితంగా సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందిన సందర్భంలో ఆయా కుటుంబాలు ఇబ్బంది పడకుండా భీమా కంపెనీల సహకారంతో ప్రభుత్వం రూ.5 లక్షలను ఇస్తుండడంతో ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. దరఖాస్తుదారుడు తమ నామినీలుగా కుటుంబ సభ్యుల్లోని ఒకరి కంటే ఎక్కువ మందిని కూడా సూచించేందుకు అవకాశం కల్పించినందున అందుకు అనుగుణంగా ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డుల ఆధారంగా లబ్ధిదారుల వివరాలతో ముందస్తుగా నింపిన దరఖాస్తులను రేషన్ షాపుల వారీగా సిద్ధం చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. రేషన్ కార్డులు లేని కుటుంబాలకు ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని, అటువంటి వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని తెలిపారు. లబ్ధిదారుల పూర్తి వివరాలతో, సంతకంతో పూరించిన దరఖాస్తులను పోగొట్టడం, ఎక్కడపడితే అక్కడ పడేయడం వంటి దుర్వినియోగానికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పూరించిన దరఖాస్తులను రోజువారీగా జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు. దరఖాస్తుల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రత్యేక యాప్, ఆన్‌లైన్ నమోదు సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల్లోని ఆపరేటర్లకు ఆన్‌లైన్ నమోదు విధానంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. కంప్యూటర్, ప్రింటర్ సదుపాయాలు అందుబాటులో ఉన్న శిబిరాల్లో దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదు, ప్రింటింగ్, లబ్ధిదారుల సంతకాల ప్రక్రియను అక్కడికక్కడే ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి మండలం, మున్సిపాలిటీలో రేషన్ కార్డుల దరఖాస్తుల పురోగతిని రోజువారీగా ఎక్సెల్ ట్రాకింగ్ షీట్ ద్వారా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 19వ తేదీ నాటికి అన్ని శిబిరాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. @IPRTelangana @TelanganaCS @TelanganaCMO
1
9
971
*విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు ప్రత్యేక చర్యలు.* *ఎస్‌ఎల్‌ఓ ట్రాకర్ ద్వారా ప్రతి విద్యార్థి అభ్యసన ప్రగతి పర్యవేక్షణ.* *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.* *విద్యార్థుల ప్రగతి ప్రోగ్రెస్ నమోదు బుక్లెట్స్ విడుదల*. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచి, పునాది అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానాన్ని బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకమైన కాంపిటేంట్ పాఠశాలల విద్యార్థుల ప్రగతి ప్రోగ్రెస్ నమోదు చేసేందుకు రూపొందించబడిన ప్రత్యేక బుక్లెట్స్ ను జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు జిల్లాలోని 87 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలలో హెల్పింగ్ హాండ్స్ పేరుతో ప్రత్యేకంగా విద్యా బోధకులను నియమించడం జరిగిందన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలను చదవడమే కాకుండా, వాటిని అర్థం చేసుకొని స్వయంగా చదవడం, రాయడం, గణిత సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలను పెంపొందించుకునేలా ఆయా పాఠశాలల్లో బోధన చేయాలన్నారు. ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని గుర్తించేందుకు స్టూడెంట్ లెర్నింగ్ అవుట్‌కమ్ ట్రాకర్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. తెలుగు, ఇంగ్లీష్, గణితం వంటి సబ్జెక్టులలో విద్యార్థులు ఏయే అంశాలను అర్థం చేసుకున్నారు, ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారు, ఇంకా ఏ నైపుణ్యాలను సాధించాల్సి ఉందనే వివరాలను ట్రాకర్‌లో స్పష్టంగా నమోదు చేయాలన్నారు. విద్యార్థులందరినీ ఒకే స్థాయిలో అంచనా వేయకుండా, ఒక్కొక్కరి అభ్యసన సామర్థ్యాన్ని బట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. చదవడం, రాయడం, అక్షరాలను గుర్తించడం, పదాలను చదవడం, సంఖ్యలను అర్థం చేసుకోవడం, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక నైపుణ్యాల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అదనపు బోధన అందించాలన్నారు. ప్రతి వారం విద్యార్థుల అభ్యసన పురోగతిని సమీక్షించాలని, ఒకసారి నమోదు చేసిన వివరాలకే పరిమితం కాకుండా విద్యార్థి సాధించిన అభివృద్ధిని నిరంతరం పరిశీలించాలని సూచించారు. అవసరమైన విద్యార్థులకు రెమెడియల్ బోధన అందిస్తూ, వారు కూడా నిర్దేశించిన అభ్యసన లక్ష్యాలను చేరుకునేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. గణిత బోధనలో కాంక్రీట్, పిక్టోరియల్, అబ్స్ట్రాక్ట్ విధానాన్ని అనుసరిస్తూ వస్తువులు, చిత్రాలు, సంఖ్యల సహాయంతో విద్యార్థులకు గణిత భావనలు సులభంగా అర్థమయ్యేలా బోధించాలని తెలిపారు. అదేవిధంగా పఠన సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రతిరోజూ చదివే అలవాటును ప్రోత్సహించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యసన స్థాయిలపై నిరంతరం దృష్టి సారిస్తూ, ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాల సాధనకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి విద్యార్థి కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించేలా బాధ్యతతో పనిచేయాలని, పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఇఓ విజయలక్ష్మి, ఏఎంఓ వినోద్ కుమార్, ఎఫ్ఎల్ఎన్ సెల్ బృందం మురళీధర్ రెడ్డి, రాఘవేంద్ర, రామన్ గౌడ్, షేక్షావలి ,తదితరులు పాల్గొన్నారు. ................................................. @IPRTelangana @TelanganaCMO @TelanganaCS @ddyadagirinews @airnewsalerts
2
323
*ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి.* *ప్రజావాణికి మొత్తం 40 ఫిర్యాదులు.* *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.* సోమవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణికి సంబంధించి వివిధ శాఖల్లో ఇంకా 73 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని అధికారులు ఏమాత్రం జాప్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ, ఈనెల 19న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని, అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా చేయూత పెన్షన్లకు అర్హులైన వారందరికీ మంజూరు పత్రాలను సంబంధిత ప్రజాప్రతినిధుల చేతులమీదుగా అందజేసే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. @IPRTelangana @TelanganaCMO @TelanganaCS
1
435
*బాలల సమస్యలు తెలుసుకునేందుకు పిల్లల ప్రజావాణి*. *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.* బాలల సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా నిర్వహించిన పిల్లల ప్రజావాణి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో సాధారణ ప్రజావాణితో పాటు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని పిల్లల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లల ప్రజావాణికి ప్రభుత్వ పాఠశాలలలో అదనపు తరగతి గదులు, ప్లే గ్రౌండ్లు, మరుగుదొడ్ల, ఉపాధ్యాయుల కొరత తదితర సమస్యలను పరిష్కరించాలని ఫిర్యాదులు అందాయన్నారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. @IPRTelangana @TelanganaCMO @TelanganaCS @ddyadagirinews @airnewsalerts
10
389
*బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.* *జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.* చిన్న వయసులోనే వివాహాలు చేయడం వలన మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని, బాల్యవివాహాల రహిత జిల్లాగా జోగులాంబ గద్వాలను ప్రకటించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఐడిఓసి సమావేశపు మందిరంలో సోమవారం బాల్య వివాహ ముక్తభారత్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్య, వైద్య, సంక్షేమ శాఖలు సమన్వయంతో బాల్యవివాహాలను నిర్మూలించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గట్టు, కేటీ దొడ్డి, మల్దకల్, ధరూర్ మండలాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నందున అక్కడ ప్రతి గ్రామంలో సర్పంచ్, ఇతర అధికారులను ఆహ్వానించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు గట్టు మండలంలో ప్రత్యేకంగా ఒక సమన్వయకర్తను కూడా నియమించామన్నారు. అన్ని విద్యాసంస్థల్లో, గ్రామాల్లో బాల్యవివాహాల నిర్మూలనపై వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈనెల 30న బాల్యవివాహాల నిర్మూలనకు జిల్లా వ్యాప్తంగా రథయాత్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. *కిశోర బాలికలు బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి.* స్నేహ కమిటీల ద్వారా కిశోర బాలికలు బాల్య వివాహాల నిర్మూలనకు తమవంతుగా కృషి చేయాలన్నారు. ఎక్కడైనా సరే బాల్యవివాహాలు జరుగుతున్నట్లు ముందుగా సమాచారం ఆయా గ్రామస్తులకే తెలుస్తుందని, సామాజిక బాధ్యతగా ఆయా గ్రామాల ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే చిన్నపిల్లల జీవితాలను కాపాడవచ్చన్నారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా తమ వద్ద చదువుతున్న పిల్లలకు బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిసిన వెంటనే అప్రమత్తమై నిర్మూలనకు సహకరించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల నిర్వహకులు బాల్యవివాహాల నిర్మూలనలో ప్రధాన పాత్ర పోషించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డిడబ్ల్యూఓ సునంద, డీసీపీవో నరసింహ, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధి చిన్నమ్మ థామస్, తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @airnewsalerts @ddyadagirinews
3
264
*ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలి* *రబీ ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణకు ప్రత్యేక కార్యాచరణ.. రైతుల వివరాల నమోదు కోసం ప్రత్యేక ఆన్‌లైన్ యాప్* *రైతులు తమకు ఆసక్తి ఉన్న ప్రత్యామ్నాయ పంటలు, సాగు విస్తీర్ణం, వ్యవసాయ అవసరాలను ఏఈఓల ద్వారా నమోదు చేసుకోవాలి* *యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి* *ఆరుతడి పంటలు సాగుచేసే రైతుల వివరాలు సేకరించాలి* *రైతులకు అండగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం* *గ్రామాల్లో పర్యటించి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి* *యాసంగి పంటల ప్రణాళికలో పంటల మార్పిడికి ప్రాధాన్యం* *రెండు రోజుల్లో ఆరుతడి పంటల సాగు వివరాలతో నివేదిక సమర్పించాలి.* *జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్*. ======================= ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను రైతులు సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాసంగి సీజన్‌లో ఎట్టి పరిస్థితుల్లో రైతులు వరి సాగుచేసి నష్టపోకుండా చూడాలని ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏఈవోలు అన్ని గ్రామాల్లో పర్యటించి, రైతులు ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారో వివరాలు సేకరించి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ఏఈవోలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారన్నారు. రెండు రోజుల పాటు పర్యటించి ఆరుతడి పంటలు ఏ రైతు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో అందుకు సంబంధించిన వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించాల్సి ఉందన్నారు.నీటి లభ్యత, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని రైతులకు అధికారులు సూచించాలన్నారు. చలి కాలంలోనూ ఎండ తీవ్రత కనిపిస్తుండటంతో రానున్న రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందన్నారు. దీంతో తక్కువ నీటితో పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఎవరైనా రైతులు వరిని సాగుచేసే ప్రయత్నాలు చేస్తే వారికి అవగాహన కల్పించి విరమింపజేయలన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని యాసంగి పంటల సాగులో పంటల వైవిధ్యీకరణ, పంటల మార్పిడికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రబీ సీజన్‌లో వరికి ప్రత్యామ్నాయంగా కుసుమ, మిరప, కూరగాయలు, పప్పుధాన్యాలు, పెసర, మినుము, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు తదితర పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.రైతుల పంటల వివరాలు, సాగు విస్తీర్ణం, నీటి వనరులు, డ్రిప్, స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్, ప్రెజర్ గన్స్, సోలార్ ఫెన్సింగ్, పశుగ్రాస విత్తనాలు, మినీ ట్రాక్టర్ల అవసరాలను ప్రత్యేక ఆన్‌లైన్ యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు. రైతులు తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి ఆసక్తి ఉన్న పంటలు, ఇతర అవసరాలను నమోదు చేసుకోవాలన్నారు. కోతుల బెడద నివారణకు 25 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులు సమూహంగా ముందుకు వస్తే సోలార్ ఫెన్సింగ్ క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పత్తి సాగు చేస్తున్న రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లిస్తూ డ్రిప్ ఆధారిత సాగును ప్రోత్సహించాలని తెలిపారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని, సాగు ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. @IPRTelangana @TelanganaCMO @TelanganaCS @airnewsalerts @ddyadagirinews
3
554