వెలుగుమట్ల కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు కాలనీలో చేపడుతున్న అన్ని మౌళిక వసతుల పనులను నవంబర్ నెలాఖరు లోగా యుద్దపతిపాదన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం వెలుగుమట్ల కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్‌తో కలిసి మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు.
వెలుగుమట్ల కాలనీలో నిర్మాణాలు మౌళిక వసతులతో సహా పూర్తి కావాలన్నారు. ప్రతి ఇంటి నిర్మాణ స్థితిగతులు, ప్రస్తుతం జరుగుతున్న పనులు, పూర్తికావాల్సిన పనులు, పనుల పురోగతి వివరాలను అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
అధికారులు ప్రతి రోజూ పనులను, ఇళ్ల నిర్మాణాల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. నిర్మాణాల్లో ఎటువంటి సమస్య వచ్చిన అధికారులు సమన్వయంతో పరిష్కరించాలన్నారు.
ఇళ్ల నిర్మాణంతోపాటు బస్తీ దవాఖానా, పాఠశాలల నిర్మాణాలు, రహదారులు, డ్రైనేజీలు తదితర మౌళిక వసతుల పనులను పూర్తి చేయాలని మంత్రి అన్నారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సత్వర వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా అమలు చేస్తున్న పీఎం రాహత్ పథకం క్రింద జిల్లాలోని ఆరోగ్యశ్రీ జాబితాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు తప్పని సరిగా నమోదు కావాలని #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం #ఖమ్మంకలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్‌తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం రాహత్ పథకం నోడల్ అధికారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పథకం లక్ష్యాలు, అమలు విధానం, ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వివరించారు.
జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం క్రింద ఎంప్యానెల్ అయిన 60 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను పీఎం రాహత్ పథకంలో నమోదు చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కలెక్టరేట్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ప్రతి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాల వివరాలను ఆసుపత్రులకు ముందుగానే తెలియజేయాలని సూచించారు.
వచ్చే శనివారం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు) అవసరమైన పత్రాలతో ఖమ్మం కలెక్టరేట్‌కు హాజరై పీఎం రాహత్ పథకంలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు కలెక్టరేట్లో 10 కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆదివారం అవసరమైన పరీక్షలు నిర్వహించి, వచ్చే సోమవారం నాటికి ప్రతి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆరోగ్యశ్రీ పథకం క్రింద ఎంప్యానెల్ అయిన అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు సమాచారం అందించి, పీఎం రాహత్ పథకంలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 112 అత్యవసర సేవలకు ఫోన్ చేయాలనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. పీఎం రాహత్ పథకం ప్రయోజనాలు, ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రమాద ప్రాంతాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులను జియో ట్యాగింగ్ చేసి మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఆసుపత్రి వివరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని 108 అంబులెన్సులకు ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అంబులెన్సుల కదలికలు, బాధితులను ఆసుపత్రులకు తరలించే విధానాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని తగిన వైద్య సదుపాయాలున్న ఆసుపత్రికి బాధితులను త్వరగా తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
పీఎం రాహత్ పథకం ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాద బాధితులకు డబ్బు లేక చికిత్స ఆలస్యం కాకుండా, 7 రోజుల వరకు 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడటమేనని, ఈ లక్ష్యం నెరవేరేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారిపై అధిక వేగం కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ రహదారిపై ప్రమాదాల సంఖ్య అధికంగా ఉండటానికి గల కారణాలను సమగ్రంగా విశ్లేషించి, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు.
అధిక వేగాన్ని నియంత్రించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని,ప్రమాదాల నివారణకు అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పీఎం రాహత్ పథకం పోస్టర్‌ను ఆవిష్కరించారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
నియోజకవర్గం లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి పెండింగ్ లేకుండా సత్వరమే పూర్తి చేయాలని #జిల్లాకలెక్టర్ అధికారులను ఆదేశించారు.
#ఖమ్మంజిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ మద్దుపల్లి లో చేపట్టిన జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులను గురువారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాలు, ప్రధాన భవనం, అకాడమిక్ బ్లాక్ నిర్మాణాల పనుల నాణ్యతను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్ణీత సమయానికి, క్వాలిటీ తో వేగంగా నిర్మాణాలు జరగాలని, కార్మికులను పెంచి అనుసంధానంగా పనులు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
విద్య అభివృద్ధికి కీలకమైన కళాశాల భవనాల నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ సూచించారు. నిర్మాణ పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతలో రాజీ పడకుండా, ఇంజినీరింగ్ ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, పనుల సందర్భంగా అవసరమైన నిర్మాణ సామగ్రి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని, ప్రతి దశను ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో చేపట్టాలని ఆదేశించారు.
అభివృద్ధి పనుల అమలులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఆనతరం వెంకటగిరి లో అసంపూర్తిగా ఉన్న జి పస్ల్ 2 భవనాలను కలెక్టర్ పరిశీలించారు. వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
ఎల్‌నినో ప్రభావం వలన వర్షభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని #ఖమ్మంజిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ పిలుపునిచ్చారు. ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
భూగర్భ జలాలు తగ్గడం, వచ్చే ఏడాది ఆగస్టు వరకు వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున కూరగాయలు, చిరుధాన్యాలు వంటి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకుని తేమతో పండే పంటలను ఎంచుకోవాలని అన్నారు. పశువుల దాణా సమస్య తలెత్తకుండా ఉచిత పశుగ్రాస విత్తనాల కిట్లను అందిస్తున్నామని అన్నారు.
వర్షభావం దృష్ట్యా ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు రూ. 308 ల కూలీతో ఎక్కువ పనిదినాలు కల్పిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను, రైతులను వేధిస్తున్న కోతుల బెడదపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, తగిన నివారణ చర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు. ప్రాంతీయంగా వలస వస్తున్న నైజీరియా కొంగలు సంరక్షణ కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను చేస్తామన్నారు.
అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికీ మొదటి, రెండో విడతలు మంజూరయ్యాయని, మూడో, నాలుగో, ఐదో విడతలు మంజూరు అవుతాయని, ప్రతి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
రాబోయే గ్రాడ్యుయేట్ ఎంబిసి ఎన్నికల దృష్ట్యా, అక్టోబర్ 31, 2023 నాటికి డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఫారమ్-18 ద్వారా వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఓటరుగా నమోదు కు నవంబర్ 6 వరకు మాత్రమే గడువు ఉందని తెలిపారు. ఓటరు లిస్టులో నమోదు చేసుకున్న, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు దరఖాస్తు తప్పనిసరి అని తెలిపారు. సంబంధిత తహసీల్దార్ కార్యాలయం, బూత్ స్థాయి అధికారిని సంప్రదించాలని, ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ అన్నారు.
కార్యక్రమంలో రైతులడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు. వ్యవసాయ, ఉద్యానవన, ఇర్రిగేషన్ శాఖల అధికారులు రైతులకు ఎల్‌నినో ప్రభావం గురించి అవగాహన కల్పించారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
ప్రతి అర్హత కలిగిన పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎ. శ్రీ దేవసేన తెలిపారు.
బుధవారం కూసుమంచి ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎ. శ్రీ దేవసేన, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి ఈఆర్ఓ లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా *జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎ. శ్రీ దేవసేన మాట్లాడుతూ* ఎలక్టోరల్ తయారు ఎన్నికల ముఖ్య ఘట్టమని అన్నారు. ఎలక్టోరల్ ప్రక్రియలో స్వీకరించిన ఫారం 6, 6 ఏ, 7, 8 ల పరిష్కార ప్రక్రియలో జిల్లా ఎన్నికల అధికారి, ఈఆర్ఓ ల తనిఖీలు చేయాలన్నారు. ఎన్ఆర్ఐ ల నుండి వచ్చిన దరఖాస్తులు నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. బూత్ స్థాయి అధికారులతో డోర్ టు డోర్ సర్వే ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్ర పరిశీలనలో గుర్తించిన సవరణలు ఎలక్టోరల్ రోల్ చేయాలన్నారు.
రోల్ డాటా బేస్ లో మార్క్డ్ ఓటర్ల గుర్తింపు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అత్యధిక చేర్పులు, అత్యధిక తొలగింపులు చేసిన 20 పోలింగ్ కేంద్రాలను ప్రతి నియోజకవర్గంలో పునః పరిశీలన చేయాలన్నారు.
నోటీసుల జారీ ప్రక్రియ సక్రమంగా చేయాలన్నారు. హియరింగ్ ప్రక్రియకు తగిన సమయం ఇవ్వాలన్నారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించి రికార్డు భద్రపరచాలన్నారు. సరిహద్దు జిల్లాల వద్ద ద్వంద నమోదులు తనిఖీ చేయాలన్నారు.
ఎపిక్ కార్డుల పంపిణీపై దృష్టి పెట్టాలన్నారు. ప్రింట్ అయి వచ్చిన కార్డులను సంబంధిత ఓటర్లకు చేరేలా చూడాలన్నారు. యువ ఓటర్ల నమోదు పట్ల దృష్టి సారించాలన్నారు. ఓటర్ల ఫిర్యాదుల పరిష్కారంపై పర్యవేక్షణ చేయాలన్నారు. ఖచ్చితమైన ఎలక్టోరల్ రోల్ రూపకల్పనకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ తెలిపారు.
సమీక్షలో *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ*, జిల్లాలో మొత్తం 5 శాసనసభ నియోజకవర్గాలు ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయని, దీనికి సంబంధించి 29 మంది ఏఈఆర్ఓలు, 88 మంది అదనపు ఏఈఆర్ఓలు, 148 మంది సూపర్వైజర్లు, 1,479 మంది బీఎల్ఓలు బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 10,85,927 ఉండగా, జెండర్ రేషియో 1069గా, ఈపీ రేషియో 688గా నమోదైందని, అలాగే ఎపిక్ కవరేజ్ 99.99% పూర్తయిందని వివరించారు. జిల్లాలో 18-19 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్లు 11,596 మంది, 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 9,111 మంది, 23,588 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ద్వారా అదనంగా 19 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,479కు చేరిందని తెలిపారు.
ఎలక్టోరల్ రివిజన్ లో 53 దరఖాస్తులు ఎన్ఆర్ఐ ల నుండి అందాయన్నారు. ఫారం 6 లు 2042, ఫారం 6 ఏ లు 41, ఫారం 7 లు 153, ఫారం 8 లు 1936 మొత్తంగా 4172 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, పరిష్కారానికి చర్యలు వేగవంతం చేశామన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ ప్రకటనలో తెలిపారు.
స్థానిక వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు, సంబంధిత శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులు (సీడీపీఓలు) అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు.
తుఫాను నేపథ్యంలో జిల్లా అధికారులు, ఇతర సిబ్బందికి మంజూరు చేసిన సెలవులను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ విధులకు హాజరై, తమ హెడ్‌క్వార్టర్లలోనే అందుబాటులో ఉండాలని, అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్‌ను విడిచి వెళ్లరాదని ఆదేశించారు.
తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా తక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగే అవకాశం ఉందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ, అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించి, సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలు విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో భారీ వృక్షాలు, చెట్లుకూలిపోయే ప్రమాదం ఉందని, ప్రజలు చెట్ల కింద నిలబడరాదని కలెక్టర్ సూచించారు.
పాతబడిన గోడలు, శిథిలావస్థలో ఉన్న భవనాల సమీపంలో ఉండకూడదని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సూచించిన జాగ్రత్తలను పాటించాలని తెలిపారు.
తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
#ఖమ్మంజిల్లా ఆర్థిక వ్యవస్థను వచ్చే ఏడాది నాటికి 59 వేల కోట్లకు చేర్చే లక్ష్యంతో అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఎఫ్ఎస్టీ వైస్ చైర్మన్ ఎస్పీ టక్కర్ అధికారులకు సూచించారు.
జిల్లా అభివృద్ధి ప్రణాళిక తయారీపై సంబంధిత అధికారులతో జీఎఫ్ఎస్టీ వైస్ చైర్మన్ ఎస్పీ టక్కర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, ఖమ్మం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ జిల్లా అభివృద్ధి ప్రణాళిక తయారీ కోసం ఏర్పాటు చేసిన 11 గ్రూపులకు సంబంధించిన నోడల్ అధికారులను ప్రత్యేక అధికారికి పరిచయం చేశారు.
జిల్లా అభివృద్ధి ప్రణాళికను స్థానిక పరిస్థితులు, ప్రజల అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులు, ఆర్థిక అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించాలని సూచించారు.
ఖమ్మం జిల్లా స్థూల జిల్లా దేశీయోత్పత్తి గత ఏడాది సుమారు 46 వేల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం 52 వేల కోట్లకు చేరిందని, వచ్చే ఏడాది 57 వేల కోట్లకు చేరుతుందని అంచనా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జిల్లా ఆర్థిక వ్యవస్థను 59 వేల కోట్లకు చేర్చే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఇందుకోసం ఆదాయ వృద్ధిని వేగవంతం చేసి, అన్ని రంగాల్లో సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ప్రస్తుతం జిల్లాలో తలసరి ఆదాయం సుమారు రూ. 3.30 లక్షలుగా ఉందని, రాష్ట్ర తలసరి ఆదాయంతో పోలిస్తే జిల్లాలో ఇంకా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లా ఆదాయ వృద్ధి సుమారు 15 శాతం స్థాయిలో ఉండేలా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించాలని సూచించారు.
జిల్లాలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా తక్కువగా ఉందని ఎస్పీ టక్కర్ పేర్కొన్నారు. ప్రాథమిక రంగంపై సుమారు 64 శాతం మంది కార్మికులు ఆధారపడు తుండగా, జిల్లా స్థూల విలువ జోడింపులో ఈ రంగం వాటా సుమారు 24.2 శాతంగా ఉందని వివరించారు. ద్వితీయ రంగం వాటా సుమారు 12.9 శాతం కాగా, సేవా రంగం వాటా సుమారు 63 శాతంగా ఉందన్నారు.
ఎక్కువ మంది ఆధారపడుతున్న వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు తయారీ, పారిశ్రామిక, సేవా రంగాలను విస్తరించాలని సూచించారు. హోటళ్లు, రవాణా, ఇతర సేవలకు సంబంధించిన రంగాల్లో ఉన్న అవకాశాలను వినియోగించు కోవాలని, తద్వారా ఉపాధి అవకాశాలు, ప్రజల ఆదాయం పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.
జిల్లాలో పారిశ్రామిక రంగం వృద్ధికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. పరిశ్రమ లకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అర్హులకు అందుతున్నాయా లేదా పరిశీలించాలని, కొత్త పరిశ్రమల స్థాపన పురోగతిని నిరంతరం పర్యవేక్షించా లని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు అందించే రాయితీలు, ప్రోత్సాహకాలను అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఖమ్మం జిల్లాలో పెట్టుబడులను వీలైనంత త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలని సూచించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు, మౌళిక సదుపాయాలు, ఇతర అంశాల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేలా జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించాలన్నారు.
జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత ఉత్పాదకంగా తీర్చిదిద్దాలని టక్కర్ సూచించారు. మహిళా సంఘాల ద్వారా చేపట్టే వ్యాపారాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ అవకాశాలను విస్తరించాలని తెలిపారు. మహిళా సంఘాల ఆదాయం పెరిగేలా వారికి అవసరమైన శిక్షణ, రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలను అనుసంధానం చేయాలన్నారు.
ఖమ్మం ఐటీ టవర్‌లో ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారు, ఇంకా ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అనే వివరాలను సేకరించాలని సూచించారు. ఐటీ టవర్-2 నిర్మాణానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని, భవిష్యత్తులో ఐటీ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
#జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. తమ శాఖలకు సంబంధించిన వివరాలు, అభివృద్ధి అవకాశాలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలతో సమగ్ర ప్రణాళిక తయారీకి సహకరించాలని సూచించారు. జిల్లా ఆర్థికాభివృద్ధి, ప్రజల ఆదాయ పెంపు, ఉపాధి కల్పన, మౌళిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
ఖమ్మం నగరంలోని ధంసలాపురం చెరువులో విస్తరించిన గుర్రపుడెక్క మొక్కలను ప్రత్యేక యంత్రం ద్వారా తొలగింపును జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. చెరువులో నీటి ఉపరితలంపై పెద్దఎత్తున విస్తరించిన గుర్రపుడెక్క, ఇతర జలకలుపు మొక్కలను తొలగించేందుకు అక్వాటిక్ వీడ్ హార్వెస్టర్ అనే ప్రత్యేక యంత్రాన్ని వినియోగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ యంత్రం ద్వారా గుర్రపుడెక్క తొలగింపు ప్రక్రియ వేగవంతంగా సాగడంతో పాటు, మానవ శ్రమ కూడా తగ్గుతుందని తెలిపారు.
చెరువుల్లో గుర్రపుడెక్క అధికంగా విస్తరించడం వల్ల నీటి ఉపరితలంపై సూర్యరశ్మి ప్రసరణ తగ్గుతుందని, నీటిలో ఆక్సిజన్ స్థాయులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. చెరువుల్లో గుర్రపుడెక్కను తొలగించడం ద్వారా నీటి పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు, జలవనరులను పరిశుభ్రంగా ఉంచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అధికారులు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, గుర్రపుడెక్క తొలగింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వానాకాలం పంటను అన్ని విధాలా కాపాడాలని, రాబోయే యాసంగి సీజన్లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులను ఆదేశించారు.
#ఖమ్మంకలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఖమ్మం #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌లతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులతో ఎల్‌నినో పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా నీటి పారుదల, మిషన్ భగీరథ, వ్యవసాయం, భూగర్భ జలాలు, మార్కెటింగ్, విద్యుత్, వైద్యారోగ్య శాఖల అధికారులు తమ శాఖల ప్రస్తుత పరిస్థితులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
కరువు పరిస్థితులు, మండలాల వారీగా భూగర్భ జలాలు తగ్గుతున్న తీరుపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని మంత్రి అన్నారు. ఈ నెలాఖరు నాటికి, వచ్చే నెలలో భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంచనాలను ప్రజలకు వివరించాలని, అధికారులు ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
ప్రస్తుతం రైతులు ఎంతో కష్టపడి సాగు చేస్తున్న వానాకాలం పంటను కాపాడేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రెండవ పంట సాగు చేస్తే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఈ విషయాన్ని రైతులకు స్పష్టంగా వివరించాలని సూచించారు.
రాబోయే యాసంగి సీజన్లో సాగునీటి లభ్యత ఉండే అవకాశం లేదని మంత్రి తెలిపారు. రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు దూరంగా ఉండాలని, పప్పుధాన్యాలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, ఇతర తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు.
ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచాలని, రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఉద్యాన పంటలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బిందు సేద్యం ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు.
రెండవ పంటకు సంబంధించి స్థానిక పరిస్థితులను బట్టి తక్కువ నీటితో పండే పంటలకు తడులు అందించే అవకాశాలను పరిశీలించాలని అన్నారు. ఎక్కడా పంట వ్యర్థాలను తగులబెట్టకుండా చూడాలని, పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు చోటుచేసుకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. కిన్నెరసాని నీటిని యాసంగి పంటలకు విడుదల చేయవద్దని, అవసరమైతే మిషన్ భగీరథ త్రాగునీటి అవసరాలకు వినియోగించాలని ఆదేశించారు.
నాగార్జునసాగర్ పరిధిలోని రెగ్యులేటర్లు, షట్టర్లు, పంపిణీ వ్యవస్థలను మూసివేసి, పాలేరు వరకు ప్రధాన కాలువల్లో నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువలో మూడు పంప్‌హౌస్‌లను వినియోగించి సాధ్యమైనంత ఎక్కువ నీటిని నిల్వ చేయాలని తెలిపారు.
పాలేరు రిజర్వాయర్ మూడు జిల్లాల త్రాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా నీటి నిల్వలను సమర్థంగా నిర్వహించాలని అన్నారు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ సమీపంలో ఇసుక బస్తాలతో అడ్డుకట్టను పెంచి సుమారు 1 టీఎంసీ నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ ఏడాది నీటి ఆవిరి నష్టాలు, ఇంకుడు నష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సమయాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియంత్రించాలని, పైపులైన్ల లో లీకేజీలను అరికట్టి నీరు వృథా కాకుండా చూడాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూలై వరకు త్రాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
త్రాగునీటిని వాహనాల శుభ్రత, తోటల పెంపకం వంటి అవసరాలకు వినియోగించకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. నీటి వినియోగాన్ని క్రమంగా తగ్గించుకునే అలవాటును ప్రజల్లో పెంపొందించాలని సూచించారు.
మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడేలా గ్రామాల్లో పాత త్రాగునీటి సరఫరా పథకాలను పునరుద్ధరించాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన చోట వ్యక్తిగత బోర్లు, ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్లను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో త్రాగునీటి పథకాల పునరుద్ధరణకు అవసరమైన నిధులు, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు. ప్రతి గ్రామంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సోమవారం రాత్రి జూమ్ మీటింగ్ నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయక చర్యలపై పలు సూచనలు చేశారు.
#ఖమ్మంజిల్లా లో రానున్న మూడు రోజుల పాటు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
జిల్లాలో వర్షాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు 24/7 ప్రాతిపదికన కంట్రోల్ రూమ్‌ను మూడు షిఫ్టులలో నిర్వహించాలని అన్నారు. విపత్తు నిర్వహణలో క్షేత్రస్థాయిలో తహసీల్దార్ నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. విద్యుత్, తాగునీరు, మత్స్య, సాగునీరు, అగ్నిమాపక, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులతో తహసీల్దార్లు సమన్వయం చేసుకుంటూ తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
పాలేరు, వైరా రిజర్వాయర్ల వద్ద నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని, నీరు ఓవర్‌ఫ్లో అయ్యే ముందు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చు నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ నింపాల్సిన చెరువులను ముందే నింపుకోవాలని సూచించారు.
ఖమ్మం, ఎదులాపురం మున్సిపల్ కమిషనర్లు మున్నేరు వాగు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. లైఫ్ జాకెట్లు, లైఫ్ బోయ్స్, జేసీబీలు, ట్రాక్టర్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
భారీ ఈదురుగాలులు గంటకు 60-70 కి.మీ. వీచే అవకాశం ఉన్నందున రహదారులపై చెట్లు కూలిపోతే వెంటనే తొలగించడానికి వుడ్ కటింగ్ మెషిన్లతో సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న వాగులు, కాజ్‌వేలు, రహదారుల వద్ద కాపలా ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.
గ్రామాలు, పట్టణాల్లో ప్రమాదకరంగా ఉన్న పాత/శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి, అందులో నివసించే వారిని, ఒంటరిగా ఉన్న వృద్ధులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. వర్ష తీవ్రతను బట్టి పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించే అధికారాన్ని స్థానిక సీడీపీఓలు, ఎంఈఓలకు ఇస్తూ, ముందస్తుగా రాత్రి లేదా ఉదయాన్నే నిర్ణయం తీసుకుని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
అధికారులందరూ తమ హెడ్‌క్వార్టర్స్ అందుబాటులో ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు సహాయం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
పాలేరు నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం స్థానిక శ్రీ శ్రీ సర్కిల్ లోని క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ పీ. శ్రీనివాస రెడ్డి లతో కలిసి ఇంజనీరింగ్, ఇరిగేషన్, వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ తదితర శాఖల అధికారులతో మంత్రి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, నిధుల మంజూరుపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడూతూ, అభివృద్ధి పనులన్నింటినీ నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు ఉండకూడదని తెలిపారు. భూసేకరణ, ఇతర సాంకేతిక సమస్యలు ఉంటే సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిన విద్యుత్ స్తంభాలను త్వరితగతిన షిఫ్ట్ చేసేలా విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు.
అభివృద్ధి పనుల్లో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం జరిగేలా, భూమికి బదులు భూమి, ఇంటికి బదులు ఇల్లు ఇచ్చే దిశగా వేగవంతమైన చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో పనుల బిల్లుల చెల్లింపుకు ఎలాంటి కొరత లేకుండా చూసేందుకు ప్రతి నెల 20 కోట్ల నుండి 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు.
దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున నీరు, విద్యుత్‌లను అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్ సరఫరా క్రమబద్ధీకరించడానికి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రైతులు రెండో పంట వేయకూడదని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి, స్పష్టమైన సమాచారం అందించాలని మంత్రి సూచించారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
పేదల స్వంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. సోమవారం నేలకొండపల్లి రైతు వేదికలో నేలకొండపల్లి మండల లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి పంపిణీ చేశారు.
ప్రజా ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల సాకారం చేస్తున్నదని మంత్రి తెలిపారు. గతంలో పేదలు ఏ ప్రభుత్వ హయాంలోనైనా ఇల్లు కట్టుకోగలమా అని సందేహించేవారని, కానీ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల కలలు నిజమవుతున్నాయని అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి కులం, మతం, పార్టీ చూడకుండా ఇందిరమ్మ ఇళ్లు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లు ఇవ్వగా, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లు ఇస్తున్నామని, అలాగే హైదరాబాద్ పట్టణానికి అదనంగా ఒక లక్ష ఇళ్లను మంజూరు చేసి, మొత్తం 8 లక్షల ఇళ్లను పేదలకు అందిస్తున్నామని అన్నారు.
నేలకొండపల్లి మండలంలో మొదటి విడత కింద మంజూరైన 648 ఇళ్లలో సుమారు 620 ఇళ్లు పూర్తయ్యాయని, వివిధ కారణాల వల్ల మిగిలిన ఇళ్లను కూడా త్వరలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫైనల్ బిల్లులన్నింటినీ రాబోయే 10 రోజుల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లో ఎలాంటి లంచాలకు తావు లేకుండా జమ చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి తెలిపారు.
పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా, అభివృద్ధిని కూడా జోడెడ్ల వలె సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. రైతాంగానికి పూర్తి భద్రత కల్పిస్తూ, మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 72 వేల కోట్ల రూపాయల సున్నా వడ్డీ రుణాలు డ్వాక్రా మహిళలకు అందించామని, నిరుద్యోగ యువతకు 75 వేల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు మరో 14,000 పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, కరెంటు, నీటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో రైతన్నలు నష్టపోకూడదనే ఉద్దేశంతో రెండో పంట వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి అన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను పారదర్శకంగా మంజూరు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిజంగా ఇల్లు అవసరమైన నిరుపేదలకు ప్రాధాన్యతనిస్తూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నిబంధనల ప్రకారం లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోసుకుంటూమని అన్నారు.
నేలకొండపల్లి మండలంలో మొదటి విడుతలో మొత్తం 688 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, వాటిలో 620 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మరో 60 ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయని, వివిధ కారణాలతో 13 ఇళ్ల నిర్మాణాల్లో లబ్ధిదారుల వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కూడా ప్రారంభమైన నేపథ్యంలో, నిజంగా ఇల్లు అవసరమైన అర్హులైన పేదలను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, నాణ్యతతో కూడిన శాశ్వత గృహాలను నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లిలో ఉన్న 3వ శతాబ్దానికి చెందిన చారిత్రక బౌద్ధ స్తూపాన్ని, పరిసర ప్రాంతాలను అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం నేలకొండపల్లిలో పర్యాటక సదుపాయాల కల్పన, బౌద్ధ స్థల సంరక్షణ/పునరుద్ధరణ పనులకు మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
3 వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్థూపాన్ని సుమారు 50-55 సంవత్సరాల క్రితం నేలకొండపల్లి గ్రామంలో గుర్తించారని, దేశంలోనే అత్యంత పెద్ద బౌద్ధ స్తూపాల్లో ఒకటిగా నిలిచిందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధిని ప్రారంభించినప్పటికీ పనులు పూర్తి చేయలేకపోయాయని అన్నారు. స్తూపం చుట్టూ ఉన్న ఒకటిన్నర కిలోమీటరు పరిధిలో పురావస్తు శాఖ అధికారులు గతంలో జరిపిన తవ్వకాల్లో ఎన్నో పురాతన వస్తువులు లభ్యమయ్యాయని, వాటిని భద్రపరిచేందుకు స్థానికంగా వసతులు లేకపోవడంతో హైదరాబాద్ మ్యూజియంలో ఉంచారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా వచ్చిన బౌద్ధ మతస్థులు, స్థానికుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని, రాబోయే రోజుల్లో బౌద్ధ కట్టడాలపై అవగాహన ఉన్న ప్రముఖ నిపుణులను, అధికారులను ఇక్కడికి ఆహ్వానించి విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని అన్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి ఎంత ఖర్చయినా వెనుకాడబోమని, బౌద్ధులకు ప్రత్యేకాకర్షణగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో ఇట్టి ప్రదేశాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti
ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
ఆదివారం పాలేరు నియోజకవర్గం లోని #ఖమ్మంరూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనితతో కలిసి పర్యటించిన మంత్రి, రూ.38 కోట్లతో మద్దులపల్లి నుంచి గొల్లగూడెం రోడ్డు వరకు చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్, డివైడర్, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులతో పాటు రూ.కోటి వ్యయంతో చేపట్టిన జంక్షన్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
మద్దులపల్లి నుంచి గొల్లగూడెం రూ.38 కోట్లతో చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారితో పాటు సెంట్రల్ లైటింగ్, డివైడర్, సీసీ డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నామని, పనులను త్వరితగతిన పూర్తి చేయాడం ద్వారా ఏదులాపురం ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుగా అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు.
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే ప్రభుత్వం రూ.75.50 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కేటాయింపులు జరిగాయని వివరించారు. రహదారులు, డ్రైనేజీలు, జంక్షన్ల అభివృద్ధి తదితర మౌళిక సదుపాయాలను మెరుగుపరిచి పట్టణ ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమాంతరంగా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకున్నప్పటికీ పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు.
గత పాలకులు సృష్టించిన ఆర్థిక అవరోధాలను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ఇందిరమ్మ ప్రభుత్వం పేద ప్రజలకు ప్రతి దశలో అండగా నిలుస్తుందని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదని, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో నీటి లభ్యతపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
వానాకాలంలో రైతులు సాగు చేసిన తొలి పంటను కాపాడేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడదని స్పష్టం చేశారు. పంటలకు అవసరమైన నీరు, విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. అయితే, రానున్న కాలంలో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు రెండో పంట వేయవద్దని విజ్ఞప్తి చేశారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. సంక్షోభ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరమని మంత్రి పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా తెలంగాణకు ఎలాంటి వివక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణకు అవసరమైన సహాయం అందేలా బీజేపీ ఎంపీలందరూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రానికి తగిన మద్దతు లభించేలా కృషి చేయాలని కోరారు. కరువు పరిస్థితులను గతంలో ఎదుర్కొన్న అనుభవం రైతులకు ఉందని, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
#జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ... ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించినట్లు తెలిపారు. గిరిజన భవన్, వసతి గృహం, వివిధ రహదారుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. రూ.38 కోట్లతో చేపట్టనున్న రహదారి నిర్మాణం ఎంతో ప్రాధాన్యత కలిగిన పనిగా పేర్కొంటూ, మంజూరైన నిధులను సమర్థవంతంగా వినియోగించి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రజలకు దీర్ఘ కాలికంగా ఉపయోగపడేలా పనులు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.
@TelanganaCMO
@TelanganaCS
@revanth_anumula
@Bhatti_Mallu
@TummalaOfficial
@INC_Ponguleti















































































