Director of Agriculture (@DirectorAgriTS) header
Director of Agriculture (@DirectorAgriTS) profile picture

This is official Twitter Handle of the Director of Agriculture Telanagana State.

Hyderabad
Joined December 2023
Photo by Director of Agriculture (@DirectorAgriTS)Photo by Director of Agriculture (@DirectorAgriTS)Photo by Director of Agriculture (@DirectorAgriTS)Photo by Director of Agriculture (@DirectorAgriTS)Photo by Director of Agriculture (@DirectorAgriTS)Photo by Director of Agriculture (@DirectorAgriTS)Photo by Director of Agriculture (@DirectorAgriTS)Photo by Director of Agriculture (@DirectorAgriTS)Photo by Director of Agriculture (@DirectorAgriTS)Photo by Director of Agriculture (@DirectorAgriTS)
Director of Agriculture retweeted
🌽 Telangana Seeks Scientific Research to Unlock the Potential of High-Oil Maize. India meets nearly 55–57% of its edible oil requirement through imports, leaving the country exposed to international price fluctuations and supply disruptions. To address this dependence, Hon'ble Agriculture Minister Sri Tummala Nageswara Rao Garu has written to the Union Agriculture Minister, Sri Shivraj Singh Chouhan Garu, proposing a dedicated National Research & Development Mission on High-Oil Maize. The proposal seeks to develop high-oil single-cross maize hybrids, increasing kernel oil content from the existing 3.5–5% to 12–14%, while maintaining grain yield and adequate starch content for ethanol production. Key proposals include: • A seven-year research programme with an indicative investment of ₹100–150 crore. • Constitution of an expert committee comprising ICAR, PJTSAU and industry representatives to examine the proposal and prepare a Detailed Project Report (DPR) with defined milestones and phased funding. • Collaboration with ICAR–Indian Institute of Maize Research, Ludhiana, PJTSAU and other scientific and industrial institutions. • Implementation as a dedicated National R&D Mission, with Telangana as the lead State and technical support from ICAR. The proposed research will also explore efficient oil extraction from the maize germ, with the residual protein-rich material offering potential for livestock and poultry feed. Maintaining adequate starch will enable the grain to retain its importance for ethanol production. India recorded a record maize production of 550.93 lakh tonnes in 2025–26. Harnessing this production base for multiple value-added uses could open new avenues for edible oil security, industrial applications and better returns to farmers, without requiring additional cultivated land. An important policy initiative to bring agricultural research, industrial utilisation and national edible oil security together, while creating new value for India's maize farmers. @AgriGoI @ChouhanShivraj @TelanganaCMO @icarindia @PjtsauIndia #TelanganaAgriculture #ICAR #PJTSAU #MaizeResearch #AgriInnovation #EdibleOil #ValueAddition #FarmerWelfare
2
5
11
334
📅 *తేది: 12-11-2026 | హైదరాబాద్* 📌 *విషయం: తెలంగాణ రైతులకు తెలుగులో AI వ్యవసాయ సలహాలు – ‘భారత్ విస్తార్’ అనుసంధానానికి వ్యవసాయ శాఖ–NISG మధ్య MoU.* 🌾 గౌరవ వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి *శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు*, రవాణా శాఖ మంత్రి *శ్రీ పొన్నం ప్రభాకర్ గారి* సమక్షంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ (NISG) మధ్య ఒప్పందం కుదిరింది. 🌱 *AIతో సాగు ఖర్చులు తగ్గి, రైతుల ఆదాయం పెరగాలి – మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు.* పంట సమస్యలను ముందుగానే గుర్తించి, తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా సత్వర సలహాలు అందించాలని సూచించారు. 🤖 *భారత్ విస్తార్ (Bharat VISTAAR):* రైతులు తెలుగులో మాట్లాడి లేదా టైప్ చేసి వ్యవసాయ సలహాలు పొందే జాతీయ AI వేదిక. 📲 *ప్రధాన సేవలు:* 🎙️ ‘భారతి’ AI వాయిస్ అసిస్టెంట్. 🌾 ICAR పంటలు, చీడపీడలు, పశుపోషణ సలహాలు. 🌦️ IMD వాతావరణం, 💰 AGMARKNET మార్కెట్ ధరలు. 🏛️ PM-KISAN, PMFBY, సాయిల్ హెల్త్ కార్డులు, పథకాల సమాచారం. 📸 పంట ఫోటోతో తెగుళ్ల నిర్ధారణ (అనుమతులకు లోబడి). 📞 *సేవలు అందే మార్గాలు:* ✅ *155261:* తెలుగు వాయిస్ బాట్ అందుబాటులో ఉంది. 🌐 *వెబ్ పోర్టల్, యాప్:* 15–21 రోజుల్లో లక్ష్యం. 💬 *వాట్సాప్ చాట్‌బాట్:* 45–60 రోజుల్లో. ☎️ *ప్రత్యేక టోల్‌ఫ్రీ:* కేంద్ర అనుమతి తర్వాత. 🔗 అన్ని సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి రానున్నాయి. 💰 *2026–27 RKVY–DPR కింద కేంద్రం రూ.3.23 కోట్లు మంజూరు చేసింది.* 🚀 *నాలుగు దశల్లో అమలు:* తెలుగు AI సేవలు, రాష్ట్ర పథకాలు–సలహాలు, దరఖాస్తులు–లబ్ధి–ఫిర్యాదుల స్థితి, రైతుల సమ్మతి–డేటా భద్రతతో అనుసంధానం. ⏳ *6–12 నెలల్లో* కేంద్ర–రాష్ట్ర వ్యవసాయ సేవల సమీకరణ. సమాచార నియంత్రణ వ్యవసాయ శాఖదే. NISG సాంకేతిక సహకారం అందిస్తుంది. శాఖ నోడల్ అధికారి నియామకం, రాష్ట్ర సమాచార ఆమోదం అవసరం. 💻 *NISG:* MeitY ప్రోత్సాహంతో 2002లో ఏర్పాటైన హైదరాబాద్ కేంద్ర సంస్థ. 200+ ఈ–గవర్నెన్స్ ప్రాజెక్టులు, 30,000+ అధికారులకు శిక్షణ. 👥 *ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:* గౌరవ మంత్రులు *శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు*, వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ మరియు వ్యవసాయ శాఖ కార్యదర్శి *శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, IAS*, వ్యవసాయ శాఖ సంచాలకులు *డా. బి. గోపి గారు, IAS*, NISG సీనియర్ జనరల్ మేనేజర్ *శ్రీ షేక్ రషీద్ భాష గారు*, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 🌾 *తెలుగులో AI సలహాలు – రైతులకు చేరువలో డిజిటల్ వ్యవసాయం!* 🌿 *వ్యవసాయ శాఖ, తెలంగాణ* #BharatVISTAAR #TelanganaAgriculture @GopiB_IAS
1
4
10
446
📅 తేది: 09.11.2026 🌾 విషయం: మెగా రైతు మేళా & ఇండస్ట్రియల్ ఎక్స్‌పో–2026 – గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి ప్రసంగం 📍 వేదిక: హకీంపేట్ గ్రామం, దుద్యాల మండలం, వికారాబాద్ జిల్లా. 🌾 వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట్ గ్రామంలో నవంబర్ 7 నుండి 9 వరకు మూడు రోజులపాటు నిర్వహించిన మెగా రైతు మేళా & ఇండస్ట్రియల్ ఎక్స్‌పో–2026 ముగింపు కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. 🌱 ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో పామాయిల్ సాగును ప్రోత్సహించడంతో పాటు పామాయిల్ సంబంధిత పరిశ్రమలను కూడా తీసుకువస్తామని, వేలాది ఎకరాల్లో సాగు విస్తరణకు, వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులకు కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. 🌾 ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో ఆహార ధాన్యాలకు ఎలాంటి కొరత లేదని, రాబోయే 12 నెలలకు సరిపడా బియ్యం నిల్వలు ప్రభుత్వ గోదాముల్లో ఉన్నాయని తెలిపారు. రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆరుతడి పంటలు పండిద్దాం – కరువును ఎదుర్కొందాం అని పిలుపునిచ్చారు. 📺 ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1,600కు పైగా రైతు వేదికల ద్వారా లక్షలాది మంది రైతులు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. 🏛️ ఈ కార్యక్రమంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ మరియు వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, ఐఏఎస్, వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి. గోపి గారు, ఐఏఎస్ తదితరులు పాల్గొన్నారు. 🌾 వ్యవసాయ శాఖ, తెలంగాణ 🌾 @GopiB_IAS
1
448
🌾 విషయం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడమే మెగా రైతు మేళా లక్ష్యం 📅 తేది: 09.11.2026 📍 హకీంపేట్ (దుద్యాల మండలం), వికారాబాద్ జిల్లా, 9 నవంబర్ 2026 🌾 వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట్ గ్రామంలో నిర్వహించిన మెగా రైతు మేళా మూడవ రోజైన సోమవారం (9 నవంబర్ 2026) ముగింపు రోజున వేలాది మంది రైతులు హాజరయ్యారు. 🚜 మేళా ప్రాంగణంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ సంచాలకులు శ్రీ బి. గోపి, ఐఏఎస్ గారు పలు స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన పద్ధతులను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 🏛️ మేళాలో వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, పౌరసరఫరాలు, మత్స్య, పశుసంవర్ధక శాఖల స్టాళ్లతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం, పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయాల స్టాళ్లు ఏర్పాటయ్యాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) పరిధిలోని వివిధ పరిశోధన సంస్థలు, అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఇక్రిశాట్ కూడా తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. 🌱 రైతులను ఎంతగానో ఆకట్టుకున్న వ్యవసాయ యంత్రపరికరాల ప్రదర్శనతో పాటు, గ్రామీణాభివృద్ధికి చెందిన వివిధ మహిళా సంఘాల స్టాళ్లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వ్యవసాయ ఉత్పత్తులకు, ఉప ఉత్పత్తులకు విలువ జోడింపు చేసి తయారుచేసిన వివిధ ఉత్పత్తులను ప్రదర్శించాయి. అంతేకాకుండా, పురుగు మందులు, ఎరువుల తయారీ సంస్థల స్టాళ్లు, నాటు విత్తనాల స్టాళ్లు, సౌర విద్యుత్ స్టాళ్లు కూడా ఏర్పాటయ్యాయి. 🌾 వ్యవసాయ శాఖ, తెలంగాణ 🌾 @GopiB_IAS
1
2
5
294
🌾 *హకీంపేటలో మెగా రైతు మేళా ప్రారంభం* *విషయం: ఎల్‌నినో నేపథ్యంలో వ్యవసాయ శాఖ చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు* 📅 *తేదీ: 07-11-2026* 📍 *వేదిక: హకీంపేట గ్రామం, దుద్యాల మండలం, వికారాబాద్ జిల్లా.* వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ మరియు వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ కె. సురేంద్ర మోహన్, ఐఏఎస్ గారు స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ గారితో కలిసి మేళాను ప్రారంభించారు. అనంతరం సభా ప్రాంగణంలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు చెందిన స్టాళ్లను గౌరవ ముఖ్యమంత్రి గారు సందర్శించారు. వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, ఎల్‌నినో నేపథ్యంలో శాఖ చేపడుతున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మట్టి నమూనా పరీక్ష కిట్ గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి. గోపి, ఐఏఎస్ గారు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. 🌾 *వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం* @GopiB_IAS #MegaRythuMela2026 #TelanganaAgriculture #ElNinoAwareness #FarmersWelfare
3
10
401
🌾 *మెగా రైతు మేళా & ఇండస్ట్రియల్ ఎక్స్‌పో–2026* 📅 తేదీ: 07-11-2026 📌 *విషయం: మెగా రైతు మేళా & ఇండస్ట్రియల్ ఎక్స్‌పో–2026లో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు* 📍 వేదిక: హకీంపేట గ్రామం, దుద్యాల మండలం, కొడంగల్ నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా. 🌱 నవంబర్ 7 నుండి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్న మెగా రైతు మేళా & ఇండస్ట్రియల్ ఎక్స్‌పో–2026లో భాగంగా నేడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి వ్యవసాయ మరియు అనుబంద స్టాళ్లను సందర్శించి, అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. 🎙️ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో ప్రాజెక్టుల్లో తగినంత నీరు అందుబాటులో లేనందున రైతులు రాబోయే యాసంగిలో వరికి బదులుగా తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, కూరగాయలు తదితర ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకొని, అనవసర పెట్టుబడులతో నష్టపోకుండా జాగ్రత్తపడాలని తెలిపారు. 🌾 ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న వడ్లను సాగు చేసిన రైతులకు ప్రస్తుత వానాకాలంలో క్వింటాలుకు ₹4500 వరకు మార్కెట్ ధర లభిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతలు, విప్లవాత్మక మార్పులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ మేళాను నిర్వహిస్తున్నామని, ఇందులో రైతుల సమ్మేళనం, పారిశ్రామికవేత్తల సమ్మేళనం జరుగుతున్నాయని తెలిపారు. 👥 ఈ కార్యక్రమంలో ఇతర మంత్రివర్గ సహచరులు, వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ మరియు ప్రభుత్వ వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ కె. సురేంద్రమోహన్, ఐ.ఏ.ఎస్. గారు, వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి. గోపి, ఐ.ఏ.ఎస్. గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 🌿 వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం @GopiB_IAS #MegaRythuMela2026 #IndustrialExpo2026 #TelanganaAgriculture #CropDiversification
2
6
388
📅 తేదీ: 03.11.2026 📌 విషయం: నవంబర్ 30న హైదరాబాద్‌లో IVPA గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశం – ముఖ్య అతిథిగా పాల్గొనాలని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఆహ్వానం – తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట. 🌴 నవంబర్ 30న ఇండియన్ వెజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశం 🤝 ముఖ్య అతిథిగా పాల్గొనాలని మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని ఆహ్వానించిన అసోసియేషన్ ప్రతినిధులు 🌱 తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత – మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు 🏛️ సచివాలయంలో మంత్రిని కలిసిన IVPA ప్రతినిధులు ఈ రోజు హైదరాబాద్‌లోని సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని ఇండియన్ వెజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) ప్రతినిధులు కలిశారు. 📅 ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న IVPA గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనాలని మంత్రిని ఆహ్వానించారు. 🌾 ఈ సమావేశంలో తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు భవిష్యత్తు, రైతుల అభ్యున్నతి, పంట ఉత్పాదకత పెంపు, పరిశ్రమల భాగస్వామ్యం తదితర అంశాలపై ప్రసంగించాలని కోరారు. 🌴 ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వ సహకారం ఈ సందర్భంగా మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ.. ✅ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ✅ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును చేపడుతున్న అన్ని కంపెనీలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని స్పష్టం చేశారు. 🏭 ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం 🌿 గోద్రెజ్, పతంజలి, హిందుస్థాన్ యునిలీవర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. 🏗️ ఆయా కంపెనీల కార్యకలాపాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. 🌱 ఆరవ తరం హైబ్రిడ్ ఆయిల్ పామ్ విత్తనాల అభివృద్ధి 🔬 ఇటీవల గోద్రెజ్ కంపెనీ దేశంలోనే తొలిసారిగా ఆరవ తరం హైబ్రిడ్ ఆయిల్ పామ్ విత్తనాల అభివృద్ధి కోసం సీడ్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని మంత్రి వివరించారు. 🤝 ఇందుకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. 📈 తెలంగాణలో ఆయిల్ పామ్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న ప్రోత్సాహకాలతో ఇతర ప్రముఖ కంపెనీలు సైతం తెలంగాణలో ఆయిల్ పామ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. 🌦️ ఎల్‌నినో నేపథ్యంలో నూనెగింజల సాగుకు ప్రాధాన్యత 💧 ప్రస్తుతం ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యత, పంటల సాగు ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని నూనెగింజల పంటల సాగు ఎంతో శ్రేయస్కరమని మంత్రి అభిప్రాయపడ్డారు. 🇮🇳 వంట నూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలి 🛢️ దేశీయంగా వంట నూనెల అవసరాలను తీర్చుకోవడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఆయిల్ పామ్ సహా నూనెగింజల సాగు విస్తరణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. 👨‍🌾 రైతులకు మెరుగైన ఆదాయం – వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి 💰 రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు. 👥 సమావేశంలో పాల్గొన్నవారు ఈ సమావేశంలో వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ (APC) మరియు వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, IAS, ఇండియన్ వెజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) ప్రతినిధులు పాల్గొన్నారు. 🌾 వ్యవసాయ శాఖ, తెలంగాణ @GopiB_IAS #OilPalmCultivation #TelanganaAgriculture #IVPAGlobalRoundTable #EdibleOilProduction #OilseedsDevelopment
5
1
4
299
📅 తేదీ: 03.11.2026 📌 విషయం: రైతు నేస్తం 113వ ఎపిసోడ్‌లో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి సూచనలు – ఎల్‌నినో, యాసంగి సాగు, మురసు తుఫాను జాగ్రత్తలు, సమీకృత వ్యవసాయం, పురుగుమందుల భద్రత. 🌾 సమగ్ర సేద్యంతో నిత్యాదాయం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన మాజీ సైనిక మేజర్ శ్రీ సి.హెచ్. నవీన్ కుమార్ (తండ్రి: మల్లేశం) రైతు నేస్తం 113వ ఎపిసోడ్‌లో తన విజయగాథను వివరించారు. 🌿 కుటుంబ సభ్యులతో కలిసి 15 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వరి, కూరగాయలు, మునగ, నేపియర్ గడ్డి, బంతిపూల సాగుతో పాటు పాడి పశువులు, నాటు కోళ్లు, చేపల పెంపకం చేపడుతున్నారు. వర్మీ కంపోస్టు, వర్మీవాష్, ప్రకృతి వ్యవసాయ కషాయాల విక్రయంతో ఆదాయం పొందుతున్నారు. జీవ వనరుల కేంద్రం ద్వారా ఇతర రైతులకు సామగ్రి అందిస్తున్నారు. 👏 వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు నవీన్ కుమార్‌ను అభినందించారు. పంటల వైవిధ్యం, డ్రిప్, స్ప్రింక్లర్లతో నీటి పొదుపు, వాతావరణానికి అనుగుణంగా పంటల ఎంపికను ప్రోత్సహించారు. 🌧️ మురసు తుఫాను నేపథ్యంలో పంట కోతలు తాత్కాలికంగా వాయిదా వేసుకునేలా రైతులను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. 🌾 ఎల్‌నినో ప్రభావం – యాసంగి సాగు వ్యవసాయ శాఖ సంచాలకులు డా. బి. గోపి, ఐఏఎస్ గారు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 🔹 హైదరాబాద్ భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త డా. రఘు – ఎల్‌నినో, వర్షపాతం. 🔹 భూగర్భ జల శాఖ సంయుక్త సంచాలకులు – భూగర్భ జలమట్టాలు. 🔹 నీటిపారుదల శాఖ (కాడా) పర్యవేక్షక ఇంజినీర్ శ్రీ రమేశ్ – సాగునీటి ప్రాజెక్టులు. 🔹 పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. శశిభూషణ్ – చిరుధాన్యాల సాగు. 🔹 రాజేంద్రనగర్ పశుగ్రాస పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. పద్మజ – పశుగ్రాస పంటలు. 🔹 శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. ఎ. భగవాన్ – మామిడి పూత, పిందె యాజమాన్యం. 💳 హైదరాబాద్ ఎన్‌పీసీఐ సమన్వయ బృందం ఇన్‌చార్జి శ్రీ ఫణీంద్ర కుమార్ యూపీఐ చెల్లింపులపై అవగాహన కల్పించారు. 🛡️ పురుగుమందుల తయారీదారుల సంఘం అధ్యక్షులు శ్రీ వి.కె. గార్గ్, ప్రతినిధులు శ్రీ గోపీచంద్, శ్రీ సంతోష్ రావు పిచికారీ భద్రతను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రక్షణ కిట్లు పంపిణీ చేశారు. ✅ అధీకృత డీలర్ల వద్ద బిల్లుతో కొనుగోలు, రక్షణ పరికరాల వినియోగం, సురక్షిత నిల్వ, పిచికారీ అనంతరం పరిశుభ్రత పాటించాలి. ❌ ఆహారం, పశుగ్రాసంతో పురుగుమందులు నిల్వ చేయరాదు. ఖాళీ డబ్బాలు తిరిగి వాడరాదు. నాజిల్‌ను నోటితో శుభ్రం చేయరాదు. పిల్లలతో పిచికారీ చేయించరాదు. 🏥 విష ప్రభావం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ పురుగుమందుల తయారీదారుల సంఘం సంయుక్తంగా తెలుగులో "ఇది చేయి / ఇది చేయవద్దు" భద్రతా చార్ట్ రూపొందించాయి. 👨‍🌾 మహబూబాబాద్ జిల్లా రైతులు శ్రీ కొండలరావు, శ్రీ మస్తాన్‌రావులతో మంత్రి మాట్లాడి రైతు నేస్తం ఉపయోగాలను తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సందేహాలను నివృత్తి చేశారు. 🌱 సహజ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సిఫార్సుల మేరకు పురుగుమందులు వాడాలని, యాసంగి సాగును ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. 👥 కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ మరియు వ్యవసాయ కార్యదర్శి శ్రీ కే. సురేంద్రమోహన్, ఐఏఎస్ గారు, వ్యవసాయ సంచాలకులు శ్రీ బి. గోపి, ఐఏఎస్ గారు, శ్రీ నాగిరెడ్డి, ఐఏఎస్ గారు పాల్గొన్నారు. 🌿 వ్యవసాయ శాఖ, తెలంగాణ @GopiB_IAS #RythuNestham #TelanganaAgriculture #IntegratedFarming #FarmerAwareness
4
7
475
📅 తేది: 02.11.2026 🌾 విషయం: వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, IAS ఆధ్వర్యంలో అగ్రి ఇండస్ట్రియల్ ఎక్స్‌పో (మెగా రైతు మేళా) ఏర్పాట్లపై సమీక్ష 🌿 వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో నవంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న అగ్రి ఇండస్ట్రియల్ ఎక్స్‌పో (రైతు మేళా) నిర్వహణ ఏర్పాట్లపై అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. 🏕️ మేళా నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష: • స్టాళ్ల ఏర్పాటు • సభా ప్రాంగణం • పార్కింగ్ సౌకర్యాలు • తాగునీటి వసతి • రవాణా ఏర్పాట్లు • భద్రతా చర్యలు 🌾 రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు: రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ⏳ మేళాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. 👨‍💼 సమావేశంలో పాల్గొన్న అధికారులు: • వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ (APC) మరియు వ్యవసాయ కార్యదర్శి శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, IAS • వ్యవసాయ సంచాలకులు శ్రీ బి. గోపి గారు, IAS • ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి శ్రీ శ్రీధర్ గారు, IAS • నారాయణపేట, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు • ఇతర జిల్లా స్థాయి అధికారులు 🌱 వ్యవసాయ శాఖ, తెలంగాణ @GopiB_IAS #AgriIndustrialExpo #RythuMela #TelanganaAgriculture #FarmersWelfare
9
383
📅 తేదీ: 30.10.2026 📍 రాజేంద్రనగర్, హైదరాబాద్ 🌍🌱 *విషయం: వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో గేమ్ చేంజర్‌గా క్లైమేట్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ – తెలంగాణ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి. గోపి గారు, IAS* 🌿 గేమ్ చేంజర్‌గా క్లైమేట్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ 🌱 భారతదేశంలో వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో పర్యావరణ ఒడిదుడుకులను తట్టుకునేందుకు దీటైన మార్గంగా, గేమ్ చేంజర్‌గా క్లైమేట్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ ఉండనుందని పర్యావరణ నిపుణులు అన్నారు. గ్రామీణ యువతకు భవిష్యత్తులో ఈ రంగం ప్రధాన ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు అభిప్రాయపడ్డారు. వెదర్ ఫోర్‌కాస్టింగ్, క్లైమేట్ చేంజ్ వంటి పదాలు, వాటి ప్రాముఖ్యత ప్రస్తుతం రైతులు, ప్రజల జీవనంలో ఒక భాగమయ్యాయని అన్నారు. వెదర్ డేటాబేస్ సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని అన్నారు. 🌦️ వాతావరణ విపత్తులను ఎదుర్కోవడంలో కృత్రిమ మేధస్సు పాత్ర 🤖 పర్యావరణ మార్పుల వల్ల కలిగే ఎల్ నినో, తుఫానుల వంటి విపత్తులను దీటుగా ఎదుర్కొనేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని, రైతులకు ఆ ఫలితాలు చేరేలా చూడాలని తెలంగాణ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి. గోపి గారు, IAS అన్నారు. 🌾 వాతావరణ సమాచారం రైతు స్థాయిలో అందుబాటులో ఉంటే, రైతులు తమ స్థాయిలో నిర్ణయాలు తీసుకొని, ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు సాగులో ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు కూడా చెబుతున్నాయని గుర్తు చేశారు. 🏛️ జాతీయ స్థాయి బ్రెయిన్‌స్టార్మింగ్ వర్క్‌షాప్ 📍 కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘క్లైమేట్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్, అగ్రిబిజినెస్ మోడలింగ్’పై అక్టోబర్ 30, 31 తేదీల్లో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో జరుగుతున్న జాతీయ స్థాయి బ్రెయిన్‌స్టార్మింగ్ వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా హాజరై డా. బి. గోపి గారు, IAS మాట్లాడారు. 🌤️ వాతావరణ అంచనాలు మరింత వాస్తవికంగా ఉండాలి 🌦️ వెదర్ ఫోర్‌కాస్ట్‌లు మరింత వాస్తవికంగా ఉండాలని డా. బి. గోపి గారు కోరారు. స్థానిక రైతులు సాగు చేయాల్సిన పంటలను నిర్ణయించుకునేందుకు ఉపయోగపడేలా భవిష్యత్తులో వాతావరణ సమాచారం అందుబాటులో ఉంటే ఎంతో లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. 📊 డిజిటల్ క్రాప్ డేటాబేస్‌లో 55 లక్షల మందికి పైగా రైతుల సమాచారం 👨‍🌾 తెలంగాణ రాష్ట్ర డిజిటల్ క్రాప్ డేటాబేస్‌లో 55 లక్షల మందికి పైగా రైతుల సమాచారం ఉందని, కేంద్ర పథకాలు, పంట రుణాలు, వాతావరణ సమాచారాన్ని రైతులకు చేరవేయడం వంటి అంశాల్లో ఈ డేటాబేస్ భవిష్యత్తులో ఉపయోగపడుతుందని డా. బి. గోపి గారు, IAS తెలిపారు. 🛰️ వాతావరణ అంచనాల్లో సాంకేతిక పురోగతి 🌐 లాంగ్ రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్‌లో 150 కిలోమీటర్ల రిజల్యూషన్ స్థాయి నుంచి ఆరు కిలోమీటర్ల రిజల్యూషన్ స్థాయికి ఎదగగలిగామని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఔట్రీచ్ వింగ్ అడ్వైజర్, హెడ్ డాక్టర్ జె.వి. సింగ్ గారు అన్నారు. 💻 భారతదేశంలో హైపర్‌ఫార్మెన్స్ కంప్యూటర్ల అనుసంధానంతో ప్రపంచ వాతావరణ అంచనాల్లో నాలుగో స్థానంలో ఉన్నామని, 11,980 కిలోమీటర్ల తీరప్రాంత పరిధికి సంబంధించిన అంచనాలను సైతం ఇవ్వగలిగే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఈ వాతావరణ అంచనాలు పరిశోధన స్థాయి నుంచి పూర్తిగా క్షేత్రస్థాయికి చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 🎓 అగ్రిబిజినెస్ మోడలింగ్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానం 🌱 80వ దశకంలో మొదలైన వెదర్ ఫోర్‌కాస్టింగ్ నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి అత్యంత కచ్చితత్వంతో రైతులకు, ప్రజలకు వాతావరణ సలహాలు ఇవ్వగలిగే స్థాయికి చేరుకోవడం అభినందనీయమని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, బ్రెయిన్‌స్టార్మింగ్ వర్క్‌షాప్‌కు అధ్యక్షత వహించిన డాక్టర్ దండ రాజిరెడ్డి గారు అన్నారు. 🌾 ఇకపై ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అగ్రిబిజినెస్ మోడలింగ్‌కు అన్వయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 📚 క్లైమేట్ ఇంటెలిజెన్స్ పుస్తకాల ఆవిష్కరణ 📖 ఈ వర్క్‌షాప్‌కు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సహకారం అందిస్తోంది. ఈ సందర్భంగా ‘క్లైమేట్ అనలిటిక్స్’, ‘క్లైమేట్ ఇంటెలిజెన్స్’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. 👥 కార్యక్రమంలో పాల్గొన్నవారు 👨‍🌾 కార్యక్రమంలో క్లైమేట్ నిపుణులు, విశ్వవిద్యాలయ అధికారులు, ప్రొఫెసర్లు, రైతులు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ, తెలంగాణ @GopiB_IAS #ClimateIntelligence #ClimateSmartAgriculture #ArtificialIntelligence #TelanganaAgriculture
2
8
389
📅 తేది: 28-10-2026 📰 విషయం: శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, IAS, రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ, సహకార శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఆధ్వర్యంలో తాండూరు కందులకు అంతర్జాతీయ గుర్తింపు – ఆస్ట్రేలియాకు తొలి ఎగుమతి 🇮🇳🌏 🌾 తాండూరు కందులకు అంతర్జాతీయ గుర్తింపు: ఆస్ట్రేలియాకు తొలి ఎగుమతి 🇦🇺 📌 జీఐ ట్యాగ్ పొందిన తాండూరు కందుల ఎగుమతికి అపెడా ఊతం 🏙️ హైదరాబాద్, అక్టోబర్ 28: భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన తాండూరు కందులు తొలిసారిగా ఆస్ట్రేలియాకు ఎగుమతి అవుతున్నాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ (అపెడా) సహకారంతో ఈ ఎగుమతి సాధ్యమైంది. తొలి సరుకును బుధవారం హైదరాబాద్ నుంచి హైబ్రిడ్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు. 👥 ఎగుమతిని ప్రారంభించిన అధికారులు, పాల్గొన్న ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ, సహకార శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, IAS, హైదరాబాద్ అపెడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ ఆర్.పి. నాయుడు వర్చువల్ విధానంలో సరుకును ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ప్రాంతీయ అథారిటీ అదనపు విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంపత్ కుమార్ (ఐటీఎస్), హైదరాబాద్‌కు చెందిన ఎం/ఎస్ దుర్గా ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రతినిధి, ఎగుమతిదారు శ్రీ సుమంత్ ఆర్., ఇతర అపెడా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 📦 తొలి ఎగుమతి వివరాలు ఈ సరుకులో 2.5 మెట్రిక్ టన్నుల జీఐ ట్యాగ్ తాండూరు కందులు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఎం/ఎస్ దుర్గా ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంస్థ ‘అమ్మాస్’ (AMMAAS) బ్రాండ్ పేరుతో వీటిని ఎగుమతి చేస్తోంది. 🚢 సముద్ర మార్గంలో రవాణా అయ్యే ఈ సరుకును ఆస్ట్రేలియాలోని ఎం/ఎస్ భారతమ్మ పీటీవై లిమిటెడ్ సంస్థ దిగుమతి చేసుకుంటుంది. అపెడాలో నమోదైన ఈ సంస్థ తెలంగాణ నుంచి బియ్యం, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, కిరాణా సరుకులను ఎగుమతి చేస్తోంది. తెలంగాణకే ప్రత్యేకమైన వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రోత్సహించడంలో ఈ ఎగుమతి ఒక ముఖ్యమైన ముందడుగని అధికారులు పేర్కొన్నారు. 🌱 తెలంగాణ గర్వకారణం – తాండూరు కందులు తెలంగాణ నుంచి జీఐ గుర్తింపు పొందిన మొట్టమొదటి వ్యవసాయ ఉత్పత్తి తాండూరు కందులే. తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల మండలాల్లోని వర్షాధార భూముల్లో ప్రధానంగా ఈ పంటను సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని సారవంతమైన లోతైన నల్లరేగడి నేలలు, అటాపుల్గైట్ బంకమట్టి ఖనిజ నిక్షేపాలు, విస్తారమైన సున్నపురాయి నిక్షేపాల వల్లే తాండూరు కందులకు ప్రత్యేక లక్షణాలు వచ్చాయి. 💪 తాండూరు కందుల్లో 22 నుంచి 24 శాతం మాంసకృత్తులు (ప్రోటీన్) ఉంటాయి. ఇది ధాన్యాల్లోని ప్రోటీన్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. రుచి, వంటకు అనుకూలత, ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణం వీటి ప్రత్యేకత. జీఐ గుర్తింపు వల్ల ఈ ఉత్పత్తికి మరింత ప్రాచుర్యం, మార్కెట్‌లో గుర్తింపు లభించడంతో పాటు దేశ, విదేశీ మార్కెట్లలో అధిక విలువ పొందే అవకాశం ఉంటుంది. 🌍 ఆస్ట్రేలియాకు జరుగుతున్న ఈ ఎగుమతి, ఈ విశిష్ట వ్యవసాయ ఉత్పత్తికి కొత్త విదేశీ మార్కెట్లను అన్వేషించే దిశగా కీలక అడుగు. దీని ద్వారా రైతులకు, ఉత్పత్తిదారులకు, ఎగుమతిదారులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. 🤝 జీఐ ఉత్పత్తుల ప్రోత్సాహానికి అపెడా చేయూత దేశంలోని జీఐ గుర్తింపు పొందిన వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో ప్రోత్సహించేందుకు అపెడా నిరంతరం కృషి చేస్తోంది. ఎగుమతి అనుసంధానాలు కల్పించడం, వాణిజ్య ప్రదర్శనల్లో ఎగుమతిదారులు పాల్గొనేలా ప్రోత్సహించడం, ఎగుమతి అవకాశాలు, మార్కెట్ ప్రవేశంపై మార్గదర్శనం చేయడం ద్వారా ఈ ఉత్పత్తులకు చేయూతనిస్తోంది. దేశంలోని ప్రత్యేక ప్రాంతీయ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తేవడం, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు), రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (ఎఫ్‌పీసీలు), ఎగుమతిదారులకు స్థిరమైన మార్కెట్ అవకాశాలు కల్పించడం అపెడా లక్ష్యం. 📈 ఈ చర్యతో తెలంగాణకు చెందిన జీఐ ఉత్పత్తులు, ఇతర ప్రత్యేక వ్యవసాయ ఉత్పత్తుల కోసం అంతర్జాతీయ మార్కెట్లను అన్వేషించే ప్రయత్నాలు మరింత ముమ్మరం అవుతాయని భావిస్తున్నారు. వ్యవసాయ విలువ గొలుసులోని రైతులు, ఎగుమతిదారులు, ఇతర భాగస్వాములకు ఎగుమతి అవకాశాలు బలపడతాయని ఆశిస్తున్నారు. 🌐 ఎగుమతిదారులు, భాగస్వాములతో నిరంతర సంప్రదింపుల ద్వారా భారత వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో స్థానం పెంచడానికి, కొత్త ఎగుమతి అవకాశాలు సృష్టించడానికి, భారతదేశ సుసంపన్న వ్యవసాయ వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి అపెడా కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. @GopiB_IAS 🌾 వ్యవసాయ శాఖ, తెలంగాణ #TandurRedGram #GIProducts #TelanganaAgriculture #APEDA
1
5
330
📅 తేది: 27-10-2026 📰 విషయం: శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, IAS సమక్షంలో రైతు నేస్తం 112వ ఎపిసోడ్‌లో రైతు సంఘాల బలోపేతంపై ప్రత్యేక అవగాహన రైతులు సంఘటితమైతేనే పంటలకు మంచి ధర, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు, అధిక ఆదాయం సాధ్యమవుతాయని వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ & వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, IAS తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు FPOలు (రైతు ఉత్పత్తిదారుల సంఘాలు), SHGలు (మహిళా స్వయం సహాయక సంఘాలు), PACS (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు) సభ్యుల కోసం రైతు నేస్తం 112వ ఎపిసోడ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేకంగా నిర్వహించారు. 🌾 *రైతు సంఘాల బలోపేతం:* వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి. గోపి గారు, IAS మాట్లాడుతూ, రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి, చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఈ సంఘాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. 🚜 *కస్టమ్ హైరింగ్ సెంటర్లు:* FPOలు, SHGలు, PACS ఆధ్వర్యంలో వ్యవసాయ యంత్రాలను అద్దెకు అందించే కేంద్రాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఏడు విభాగాల్లో 37 రకాల యంత్రాల ద్వారా చిన్న రైతులకు ఖర్చు, సమయం ఆదా కావడంతో పాటు సంఘాలకు ఆదాయం లభిస్తుంది. పథకం నిబంధనలు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని వ్యవసాయ కమిషనరేట్ అధికారులు వివరించారు. 🌱 *ఎల్‌నినో – నేల సంరక్షణ:* ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనే ప్రత్యామ్నాయ ప్రణాళిక, క్షేత్రస్థాయి చర్యలు, ‘ఖేత్ బచావో అభియాన్’ ద్వారా నేల సంరక్షణ లక్ష్యాలపై చర్చించారు. 🌍 *ఎగుమతులతో అధిక ఆదాయం:* సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో సాగవుతున్న గెర్కిన్స్ పంట ఎగుమతులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మునగ ఆకుల పొడి తయారీ, విదేశీ ఎగుమతుల ద్వారా ఆదాయం పొందే అవకాశాలను సంబంధిత కంపెనీల ప్రతినిధులు వివరించారు. 🌾 *రబీ సాగుకు సూచనలు:* నవంబర్ మొదటి పక్షం వరకు పప్పుధాన్యాలు, నూనెగింజలు విత్తుకోవచ్చని, నవంబర్ 16 తర్వాత అనుకూలమైన పంటలను నీటి లభ్యత ఆధారంగా ఎంచుకోవాలని సూచించారు. కీలక దశల్లో నీరు అందించాలని, సిఫారసు చేసిన విత్తన రకాలను అధికారిక డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని తెలిపారు. *కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:* శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, IAS – వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ & వ్యవసాయ శాఖ కార్యదర్శి • డాక్టర్ బి. గోపి గారు, IAS – వ్యవసాయ శాఖ సంచాలకులు • వ్యవసాయ కమిషనరేట్ అధికారులు • వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుదారులు, అగ్రిగేటర్లు, విలువ జోడించిన ఉత్పత్తుల తయారీ సంస్థలు, దేశీయ మరియు విదేశీ ఎగుమతి సంస్థల ప్రతినిధులు రైతులు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరింది. @GopiB_IAS వ్యవసాయ శాఖ, తెలంగాణ #RythuNestham #FarmerProducerOrganizations #AgricultureTelangana #KhetBachaoAbhiyan
2
1
4
366
📅 తేది: 26-10-2026 📰 *విషయం: ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో పాల్గొని, రైతులతో మాట్లాడి, క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించిన డా. బి. గోపి గారు, ఐఏఎస్, వ్యవసాయ సంచాలకులు* 🌾 ఖేత్ బచావో అభియాన్ – సాగు భూమి సంరక్షణ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, దుబ్బచెర్ల గ్రామంలో డా. బి. గోపి గారు, ఐఏఎస్, వ్యవసాయ సంచాలకులు పాల్గొని, రైతులతో మాట్లాడి, క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. అలాగే, భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంబంధిత వ్యవసాయ అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. @GopiB_IAS వ్యవసాయ శాఖ, తెలంగాణ #KhetBachaoAbhiyan #TelanganaAgriculture #FarmerWelfare #VigilanceAwarenessWeek
2
1
6
333
📅 తేది: 25-10-2026 📰 విషయం: శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, IAS, APC & ప్రభుత్వ కార్యదర్శి, వ్యవసాయ & సహకార శాఖ, - నల్గొండ జిల్లా, కట్టంగూర్ FPCL సందర్శన గౌరవనీయులు శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, IAS, APC & ప్రభుత్వ కార్యదర్శి, వ్యవసాయ & సహకార శాఖ మరియు PJTAU పరిశోధన సంచాలకులు డా. బలరాం గారు కట్టంగూర్ FPCLను సందర్శించారు. ఈ సందర్భంగా కస్టమ్ హైరింగ్ సెంటర్‌లోని వ్యవసాయ పరికరాలు, కోల్డ్ స్టోరేజీలు, శిక్షణ కేంద్రం మరియు FPCL ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇతర కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం FPCL సభ్యులతో సమావేశమయ్యారు. అలాగే గ్రీన్ ఎనర్జీ, NeGPA పథకం కింద కార్బన్ క్రెడిట్స్ కార్యక్రమం, బయోచార్ ప్లాంట్, మరమరాల తయారీ పరిశ్రమను సందర్శించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకొచ్చిన విత్తనాలతో మరమరాల తయారీకి అనువైన వరి రకాన్ని సాగు చేస్తున్న క్షేత్రాన్ని కూడా సందర్శించారు. @GopiB_IAS వ్యవసాయ శాఖ, తెలంగాణ
2
6
493
📅 తేది: 22-10-2026 📰 *వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఖేత్ బచావో అభియాన్ ప్రారంభం, పత్తి MSP కొనుగోళ్లు ప్రారంభం* 🌾 రైతు నేస్తం 111వ ఎపిసోడ్‌లో భాగంగా మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఖేత్ బచావో అభియాన్ (సాగు భూమి సంరక్షణ కార్యక్రమం), 2026–27 ఖరీఫ్ పత్తి MSP కొనుగోళ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో APC & వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, IAS; వ్యవసాయ శాఖ సంచాలకులు డా. బి. గోపి గారు, IAS; CCI సీఎండీ శ్రీ లలిత్ కుమార్ గుప్తా గారు పాల్గొన్నారు. 🌱 అక్టోబర్ 22–నవంబర్ 30 వరకు భూసార పరీక్షలు, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం, పంట అవశేషాల నిర్వహణ, పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ప్రతి బ్లాక్‌లో కనీసం 30 కార్యక్రమాలు నిర్వహించి, 2,000 మందికి పైగా రైతులకు చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 🌦️ ఎల్‌నినో, నీటి లభ్యత దృష్ట్యా యాసంగిలో వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు సాగు చేయాలని, ఆయిల్‌పామ్‌లో అంతర పంటలు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. 🧶 పత్తి MSP క్వింటాలుకు ₹8,667. CCI కొనుగోలు కేంద్రాలను 122 నుంచి 133కు పెంచగా, 30 జిల్లాల్లో 335 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేశారు. పత్తిలో తేమ 8% ఉండేలా ఆరబెట్టాలి. కౌలు రైతులు AEO ద్వారా కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. 📞 *రైతుల సహాయం:* 1800 599 5779 | WhatsApp: 88972 81111 👨‍🌾 జగిత్యాల రైతు బండారి విజయ బహుళ పంటల సాగు, స్వయంగా మార్కెటింగ్‌తో గుర్తింపు పొందగా, మహబూబాబాద్ రైతులు సేంద్రియ పత్తి, ఆయిల్‌పామ్ సాగు అనుభవాలను పంచుకున్నారు. నిజామాబాద్‌లో యాసంగి వరికి బదులుగా ఉల్లి, మొక్కజొన్న సాగుపై వివరించారు. మహబూబ్‌నగర్ రైతు వీరాస్వామి కందకాల ద్వారా నీటి సంరక్షణ, మిశ్రమ పంటల సాగు అనుభవాలను పంచుకున్నారు. 🚜 FPOల ద్వారా కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి చిన్న, సన్నకారు రైతులకు తక్కువ అద్దెకు యంత్రాలు అందించడం, పశుగ్రాస పంటలను ప్రోత్సహించడం, వ్యవసాయ కుంటల ఏర్పాటుకు గ్రామీణాభివృద్ధి శాఖ సహకారం తీసుకోవడంపై మంత్రి సూచనలు చేశారు. @GopiB_IAS వ్యవసాయ శాఖ, తెలంగాణ
2
2
5
467
📅 తేది: 17-10-2026 | క్షేత్ర పర్యటన వివరాలు 📰 విషయం: సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కాలీఫ్లవర్, షేడ్ నెట్ హౌస్, పత్తి పంటలను పరిశీలించిన వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, IAS హైదరాబాద్, అక్టోబర్ 17: వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ మరియు వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, IAS శనివారం సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. 🌱 *కోదాడ మండలంలో కాలీఫ్లవర్ పంట పరిశీలన* సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో రైతు ఖాజామియా 6 ఎకరాల్లో సాగు చేస్తున్న కాలీఫ్లవర్ పంటను పరిశీలించారు. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉద్యాన శాఖ ద్వారా రైతులకు డ్రిప్ పరికరాలు, సబ్సిడీ విత్తనాలు అందించాలని అధికారులను ఆదేశించారు. యాసంగి సీజన్‌లో వరికి బదులుగా ఆరుతడి పంటలను స్ప్రింక్లర్ సేద్య పద్ధతిలో సాగు చేయాలని, ఎల్‌నినో పరిస్థితులపై రైతు వేదికల ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు సబ్సిడీపై విత్తనాలు అందించాలని కోరారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి స్వయంగా పొలాలను సందర్శించి సూచనలు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. 🌿 *కొర్లపహాడ్‌లో షేడ్ నెట్ హౌస్ పరిశీలన* నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో సమీకృత ఉద్యానాభివృద్ధి మిషన్ (MIDH) పథకం కింద ఏర్పాటు చేసిన షేడ్ నెట్ హౌస్‌ను పరిశీలించారు. రైతు ఆలం మౌనిక ఈ షేడ్ నెట్ హౌస్‌లో ఆకుకూరలు, ఉల్లిని సాగు చేస్తున్నారు. అలాగే గ్రోబ్యాగుల్లో అల్లం, పసుపు పంటలను ఒక్కో పంటకు 13,500 మొక్కల చొప్పున పెంచుతున్నారు. పసుపులో మేఘాలయ రకం, అల్లంలో రియో డి జెనీరో రకం సాగు చేస్తున్నారు. RO ప్లాంట్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో పోషకాలను అందిస్తున్నారు. రైతులు మౌనిక, హారిక ఇద్దరూ ఏడాది కాలంగా ఈ సాగు చేస్తున్నారు. ఈ యూనిట్‌కు సంబంధించిన ప్రతిపాదనలను MIDH పథకానికి పంపినట్లు అధికారులు తెలిపారు. కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి అధికారులకు సూచించారు. 🌾 **ఆరెగూడెంలో పత్తి పంటల పరిశీలన** యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో పత్తి పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట పరిస్థితి, సాగులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనల్లో ఆయా జిల్లాల జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు. @GopiB_IAS వ్యవసాయ శాఖ, తెలంగాణ #TelanganaAgriculture #ElNinoAwareness #FarmerWelfare #FieldVisit
1
2
409
📅 తేది: 17-10-2026 📰 విషయం: ఖేత్ బచావో అభియాన్ – అక్టోబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు అవగాహన కార్యక్రమాలు హైదరాబాద్, అక్టోబర్ 17: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ స్థాయి **“ఖేత్ బచావో అభియాన్” (KBA)**ను తెలంగాణలో 22.10.2026 నుంచి 30.11.2026 వరకు అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. నేల ఆరోగ్యం, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి సంరక్షణ, పంటల వైవిధ్యీకరణ, ప్రకృతి సేద్యం, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలు. 🎯 **ప్రధాన లక్ష్యాలు** 🌱 భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు, వ్యవసాయ ఉత్పాదకాల సమతుల్య వినియోగం, Soil Health Cardsపై అవగాహన. 🌾 నూనెగింజలు, పప్పుధాన్యాలు, ఉద్యాన పంటల సాగు ద్వారా పంటల వైవిధ్యీకరణ; వరి కోత అనంతరం ఖాళీ భూముల వినియోగం, పంట అవశేషాల నిర్వహణ, వ్యర్థాల దహన నివారణ. ♻️ సేంద్రియ, జీవ ఉత్పత్తులు, ప్రకృతి సేద్యంపై శిక్షణ, క్షేత్ర ప్రదర్శనలు; సమగ్ర పోషక యాజమాన్యం (INM), సమగ్ర సస్యరక్షణ (IPM), వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహం. 💧 నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, వర్షపు నీటి సేకరణ, “పర్ డ్రాప్ మోర్ క్రాప్” (PDMC)పై అవగాహనతో పాటు ఎరువుల విక్రయ నిబంధనలపై రైతులకు సమాచారం. 🏢 **అమలు, పర్యవేక్షణ** వ్యవసాయ శాఖ సంచాలకుల నేతృత్వంలో KVKలు, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, ఉద్యాన శాఖ, ATMA, ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సహకారంతో సూక్ష్మ ప్రణాళికలు, IEC సామగ్రిని సిద్ధం చేస్తారు. ప్రతి బ్లాక్‌లో కనీసం 30 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఒక్కో కార్యక్రమంలో 50–100 మంది రైతులను భాగస్వాములను చేస్తారు. రోజువారీ నివేదికలు, ఛాయాచిత్రాల ద్వారా పురోగతిని పర్యవేక్షిస్తారు. 🎥 **కేంద్ర మంత్రితో రాష్ట్ర వ్యవసాయ మంత్రి వీడియో కాన్ఫరెన్స్** ఈ రోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ గారితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సంభాషించారు. #ఖేత్_బచావో_అభియాన్‌ను స్వాగతిస్తూ, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ శాఖలు, జిల్లా యంత్రాంగాల భాగస్వామ్యంతో తెలంగాణలో కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. 🌦️ **315 మండలాల్లో కరవు లాంటి పరిస్థితులు** తగినంత వర్షపాతం లేకపోవడం, ఎల్ నినో ప్రభావంతో 315 మండలాల్లో కరవు లాంటి పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి పేర్కొన్నారు. పంటల పరిస్థితిని అంచనా వేయాలని, అందుబాటులోని నీటిని పరిరక్షించాలని, పంటలు చేతికొచ్చే వరకు సాగునీరు, విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 💧 **సూక్ష్మ సేద్యానికి ప్రత్యేక సహాయం** సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్), ఆరుతడి పంటల విత్తనాల కోసం తక్షణ సహాయంతో పాటు ప్రత్యేక అదనపు బడ్జెట్‌ను కేంద్రం కేటాయించాలని కోరారు. 🧪 **సమతుల్య ఎరువుల వినియోగం** యూరియాపై అధిక సబ్సిడీ కారణంగా అది ఇతర ఎరువుల కంటే చౌకగా లభించి, మితిమీరిన వినియోగానికి దారితీస్తోందని మంత్రి పేర్కొన్నారు. నేల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎరువుల ధరలు, సబ్సిడీలను హేతుబద్ధీకరించి, రైతులపై అదనపు భారం పడకుండా సమతుల్య ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్రాన్ని కోరారు. 🌾 **పంటల వైవిధ్యీకరణ, MSP హామీ** మొక్కజొన్న, జొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించేందుకు ప్రధాన పంటలన్నింటికీ, ముఖ్యంగా మొక్కజొన్న, జొన్నలకు కనీస మద్దతు ధర (MSP)పై కొనుగోలు హామీ ఇవ్వాలని కోరారు. ధరల మద్దతు పథకం (PSS) కింద ఉన్న 25% కొనుగోలు పరిమితిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. 👨‍🌾 **ఉపాధి హామీ, వ్యవసాయ పనులకు ప్రాధాన్యం** కరవు పరిస్థితుల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేందుకు #ఉపాధి_హామీ VB-G RAM G కింద కేటాయింపులు పెంచాలని, పంట కుంటలు, జల సంరక్షణ, భూమి అభివృద్ధి వంటి వ్యవసాయ సంబంధిత పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోరారు. 📢 **రైతులకు అవగాహనతో పాటు సకాలంలో ఆర్థిక సహాయం, పంట ఉత్పత్తులకు మార్కెట్ మద్దతు కూడా హామీగా అందాలని మంత్రి స్పష్టం చేశారు.** వ్యవసాయ శాఖ, తెలంగాణ @GopiB_IAS
1
7
622
RT @TummalaOfficial: Today Minister @Tummala_INC in AV meet with @ChouhanShivraj welcomed the Centre’s #KhetiBachaoAbhiyaan and stated that…
1
41