Dr.Errolla Srinivas (@DrErrolla) header
Dr.Errolla Srinivas (@DrErrolla) profile picture

Former Chairman | TSMSIDC | SC ST COMMISSION

Telangana, India
Joined July 2018
Photo by Dr.Errolla Srinivas (@DrErrolla)Photo by Dr.Errolla Srinivas (@DrErrolla)Photo by Dr.Errolla Srinivas (@DrErrolla)Photo by Dr.Errolla Srinivas (@DrErrolla)Photo by Dr.Errolla Srinivas (@DrErrolla)Photo by Dr.Errolla Srinivas (@DrErrolla)Photo by Dr.Errolla Srinivas (@DrErrolla)Photo by Dr.Errolla Srinivas (@DrErrolla)Photo by Dr.Errolla Srinivas (@DrErrolla)Photo by Dr.Errolla Srinivas (@DrErrolla)
Dr.Errolla Srinivas retweeted
Wishing you all a Happy Diwali 🪔
129
272
9
3,620
99,470
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు! 🪔✨ @BRSparty
2
1
22
262
బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈరోజు కొన్నే గ్రామానికి వెళ్లి లక్ష్మణ్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశాను. ఈ కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని, పార్టీ నాయకత్వం, స్థానిక ఎమ్మెల్యే తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చాను. లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు తోడుగా ఉంటుంది.. @BRSparty
2
11
184
Dr.Errolla Srinivas retweeted
Heads they win, tails also they will only win Wah!!! What a set-up! 👌🏼 Revanth’s Government calls tenders for Kodangal-Narayanpet-Makthal Lift Irrigation Minister Ponguleti's own company applies. Rest are dummy, mere on paper companies Basically! Sole runner wins the race! Cost escalation - Almost FIVE times the original budget!! From ₹1,450 Cr to ₹6,825 Cr Water drawn - NOT A DROP!! While people of Telangana are standing in tanker queues for water, these shameless Congressies are looting Telangana’s resources in the name of irrigation projects @RahulGandhi Ji, help me find a new word please! Crony Capitalism-Daylight Robbery-Kleptocracy! All too small for this loot #CongressLootsTelangana
29
231
15
788
62,207
Dr.Errolla Srinivas retweeted
నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచెడ్, హత్నూర మండలాల్లో కరెంటు కోతలు, సాగునీటి కొరతతో ఎండిపోయిన వరి పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులను పరామర్శించి, వారి కష్టాలను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
16
49
787
మా పార్టీ నాయకుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. @balarajuyadav ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు సరైంది కాదు, వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ @BRSparty
5
1
45
529
Dr.Errolla Srinivas retweeted
Live: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు teapaw.org/i/broadcasts/2KoXLLVBV…
13
28
975
Dr.Errolla Srinivas retweeted
Heartening to see Nenavath Aravind Babu dedicate his M.Sc. Audiology research to @KCRBRSPresident Garu. A young man from Gudi Thanda in Nalgonda, studying at the Ali Yavar Jung National Institute, has chosen to research how smartphone controlled hearing aids can help older adults hear better and live better. Congratulations, Aravind. Wishing you a bright future.
3
43
3
236
7,047
కంటోన్మెంట్ పరిధిలోని బలంరై, అంబేద్కర్ నగర్ మహిళలు వాటర్ బిల్లుల సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. ఒకరికి రూ.55,597, మరొకరికి రూ.24,885, ఇంకొకరికి రూ.48,100 బిల్లులు రావడం దారుణం. వెంటనే వాటర్ బోర్డు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ భారీ బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరాను. పేద ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. @BRSparty
5
23
381
Dr.Errolla Srinivas retweeted
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంగళ్‌పల్లి వద్ద కనీస వసతులు లేవంటూ గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల ధర్నా శిబిరాన్ని సందర్శించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డీఎంఈ వాణీదేవి గార్లతో ఫోన్‌లో మాట్లాడి విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
20
1
83
1,887
అడవులు నరికే వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది. @KTRBRS
1
3
13
175
Dr.Errolla Srinivas retweeted
మూడు రోజులుగా రోడ్డుపై ధర్నా చేస్తున్న విద్యార్థులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. రెండు నెలల గడువులోగా కాలేజీని అన్ని వసతులున్న ప్రభుత్వ లేదా అద్దె భవనంలోకి మార్చాలి. ఈ మేరకు విద్యార్థులకు తక్షణమే రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. - మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు 🔥
1
16
36
1,353
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంగళ్‌పల్లి వద్ద కనీస వసతులు లేవంటూ గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల ధర్నా శిబిరాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు సందర్శించారు. @BRSparty
2
13
215
Dr.Errolla Srinivas retweeted
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంగళ్‌పల్లి వద్ద కనీస వసతులు లేవంటూ గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల ధర్నా శిబిరాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు సందర్శించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి క్యామ మల్లేశ్ గారితో కలిసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డీఎంఈ వాణీదేవి గార్లతో ఫోన్‌లో మాట్లాడి విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 🔹 కాబోయే డాక్టర్లు చదువుకునే మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇంత అధ్వాన్నంగా ఉండవు. 🔹 నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి గారు మన ఊరు - మన బడి కింద డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, డ్యూయల్ డెస్క్‌లు, ల్యాబ్స్, డైనింగ్ హాల్స్, హైజీనిక్ వాష్‌రూమ్‌లతో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్దారు. కానీ ఈరోజు హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పశువుల కొట్టం కంటే అధ్వాన్నంగా తయారైంది. 🔹 హైదరాబాద్‌కు దగ్గరగా ఉందనే ఉద్దేశంతో తెలంగాణ విద్యార్థులతో పాటు బీహార్, యూపీ, రాజస్థాన్, కేరళ వంటి ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ఈ కాలేజీని ఎంచుకున్నారు. కానీ ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటాయని తెలిస్తే అసలు ఈ కాలేజీని ఎంచుకునేవారే కాదు. 🔹 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే విజన్ 2047, ఫ్యూచర్ సిటీ అని, తాను పక్క రాష్ట్రాలతో కాకుండా అమెరికా, చైనా, సింగపూర్‌లతో పోటీ పడుతున్నానని భారీ డైలాగులు కొడతాడు. 🔹 కానీ ఇక్కడ కాబోయే డాక్టర్ల దుస్థితి చూస్తుంటే ఆయన చైనా, అమెరికాలతో కాదు.. శ్రీలంక, నేపాల్‌తో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. బహుశా శ్రీలంక, నేపాల్‌లో కూడా ఇంత అధ్వానమైన పరిస్థితులు ఉండకపోవచ్చు. 🔹 నేను రాజకీయం కోసం ఈ మాటలు చెప్పడం లేదు. సాక్షాత్తూ ఈ కాలేజీ బిల్డింగ్ ఓనర్ ప్రభుత్వానికి రాసిన లేఖే ప్రభుత్వ దివాళాకోరుతనానికి సాక్ష్యం. 2024 ఆగస్టు 1న భవనాన్ని తీసుకున్నప్పటి నుంచి, అంటే 26 నెలలుగా వాటర్ బిల్లు కట్టలేదు, కరెంటు బిల్లు కట్టలేదు, భవనం రెంట్ కట్టలేదని ఓనర్ లేఖ రాశారు. 🔹 లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తా, లక్ష కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా, కొడంగల్‌కు 5 వేల కోట్లతో రేడియల్ రోడ్లు వేస్తా అంటున్న రేవంత్ రెడ్డికి.. మెడికల్ కాలేజీ పిల్లల వాటర్ బిల్లు, కరెంటు బిల్లు, రెంట్ కట్టడానికి పైసలు లేవా? 🔹 ప్రభుత్వం బిల్లులు కట్టకపోవడంతో ఓనర్ భవనాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఫలితంగా పిల్లలకు నీళ్లు లేవు, వాష్‌రూమ్‌లు లేవు, కరెంటు వైర్లు వేలాడుతున్నాయి. ల్యాబ్స్, లైబ్రరీ, హాస్టల్ వసతి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 🔹 సామాన్యులు చిన్న ఇల్లు కట్టుకుంటే సెట్‌బ్యాక్ లేదనో, ఫైర్ పర్మిషన్ లేదనో, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదనో రాత్రికి రాత్రే పోయి కూలగొట్టే రేవంత్ రెడ్డికి.. ఈ మెడికల్ కాలేజీ భవనం కనిపించడం లేదా? 🔹 థర్డ్ ఇయర్ పిల్లలు చదువుతున్న ఈ బిల్డింగ్‌కు ఇంతవరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లియరెన్స్ లేదు, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ మీటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ లేదు. కాలేజీ చుట్టూ చెత్తాచెదారం, స్క్రాప్, పాములు, కుక్కలు, పందులు, కోతులు ఉన్నాయని సాక్షాత్తూ కాలేజీ ప్రిన్సిపాలే ప్రభుత్వానికి లేఖ రాశారు. 🔹 ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ పెట్టాలంటేనే ఫైర్ సేఫ్టీ, ఎన్ఓసీ, ఓసీ ఉన్నాయా అని చూస్తారు కదా.. మరి ఏ అనుమతులూ లేకుండా, పాములు, పందుల మధ్య మూడేళ్ల నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఎలా నడుపుతున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమాధానం చెప్పాలి. 🔹 పిల్లల భవిష్యత్తు కోసమే విద్యాశాఖను తన వద్ద పెట్టుకున్నానని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ కంటే తానే బెస్ట్ సీఎం అని తనకు తానే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. 🔹 సర్టిఫికెట్ ఇవ్వాల్సింది నువ్వు కాదు, ప్రజలు. ఈ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఇవ్వాలి. రాష్ట్ర చరిత్రలో వచ్చిన ముఖ్యమంత్రులందరిలోకెల్లా రేవంత్ రెడ్డి అత్యంత చెత్త ముఖ్యమంత్రి. 🔹 సబితమ్మ మూసీ పర్యటనకు వెళ్తుందంటే, నేను టిమ్స్ ఆసుపత్రి పరిశీలనకు వెళ్తానంటే రాత్రే పసిగట్టి, ఉదయం 6 గంటలకే మా ఇళ్ల ముందు వాలిపోయి హౌస్ అరెస్టులు చేసే ఇంటెలిజెన్స్.. హైదరాబాద్ పక్కనే మెడికల్ విద్యార్థులు మూడు రోజులుగా రోడ్డుపై ధర్నా చేస్తుంటే ఏం చేస్తోంది? విద్యార్థులు ఇప్పటికే జనవరిలో, ఆ తర్వాత మరో రెండుసార్లు ధర్నా చేశారు. 🔹 కలెక్టర్‌కు, ప్రిన్సిపాల్‌కు, డీఎంఈకి వినతిపత్రాలు ఇచ్చారు. తల్లిదండ్రులు స్వయంగా మంత్రి దామోదర్ రాజనరసింహను కలిశారు. అయినా ఏసీ గదుల్లో కూర్చున్న మంత్రులకు, అధికారులకు ఈ పిల్లల గోడు పట్టదా? 🔹 మెయిన్ రోడ్డు నుంచి కాలేజీ లోపలికి 2 కిలోమీటర్ల దూరం ఉంది. కనీసం రోడ్డు వసతి లేదు, లోపలికి బస్సు రానివ్వరు, సొంత వాహనాలను అనుమతించరు. ఆడపిల్లలు, మెడికల్ స్టూడెంట్స్ ప్రతిరోజూ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాల్సిన దుస్థితి నెలకొంది. 🔹 బీఆర్ఎస్ హయాంలో ప్రతి మెడికల్, నర్సింగ్ కాలేజీకి ఉదయం ప్రాక్టికల్స్, మధ్యాహ్నం క్లాసుల కోసం సొంత బస్సు గానీ, అద్దె ఆర్టీసీ బస్సు గానీ తప్పనిసరిగా ఉండాలని నిబంధన పెట్టి అమలు చేశాం. గతంలో విద్యార్థులు నన్ను కలిసినప్పుడు నేను ప్రిన్సిపాల్, డీఎంఈ, హెల్త్ సెక్రటరీకి ఫోన్ చేసి చెబితే కొన్ని రోజులు బస్సు నడిపి మళ్లీ ఆపేశారు. 🔹 కరోనా సమయంలో డాక్టర్ల ఆవశ్యకతను గుర్తించిన కేసీఆర్ గారు.. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలని సంకల్పించి 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి తెలంగాణ ఏర్పడే వరకు మన రాష్ట్రంలో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 2,850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండేవి. మన పిల్లలు మెడిసిన్ కోసం రష్యా, ఉక్రెయిన్, చైనా, నేపాల్ వెళ్లాల్సి వచ్చేది. 🔹 కానీ కేసీఆర్ గారు తొమ్మిదేళ్లలో ఎంబీబీఎస్ సీట్లను 10,000కు పెంచారు, పీజీ సీట్లను రెట్టింపు చేశారు, సూపర్ స్పెషాలిటీ సీట్లను మూడు రెట్లు పెంచారు. 🔹 ప్రతి జిల్లాలో నర్సింగ్, పారామెడికల్, ఫార్మసీ కాలేజీలు పెట్టి హైదరాబాద్‌ను మెడికల్ హబ్‌గా మార్చారు. ఇవాళ దేశంలో అత్యధికంగా వరి ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ అయితే, ఏటా 11 వేల మంది డాక్టర్లను తయారు చేస్తూ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న రాష్ట్రం కూడా తెలంగాణే. 🔹 మహేశ్వరం మెడికల్ కాలేజీని 2022-23లో మంజూరు చేసినప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు హైవే పక్కన 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పించారు. 🔹 కేసీఆర్ గారు కాలేజీ, హాస్టల్ భవనాల కోసం రూ. 182 కోట్లు మంజూరు చేసి, 400 పడకల ఆసుపత్రిని సాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేశారు. సూర్యాపేట, నల్లగొండ, సిద్దిపేట, జగిత్యాల, వనపర్తి, వికారాబాద్, మహబూబ్‌నగర్ కాలేజీలను మేము రెండేళ్లలోనే అద్భుతంగా పూర్తి చేశాం. 🔹 కానీ సబితా ఇంద్రారెడ్డి గారికి పేరు వస్తుందనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం మహేశ్వరంలో కాలేజీ కట్టకుండా మార్చేసింది. ఈ మూడేళ్లలో మూడు ఇటుకలు కూడా పెట్టలేదు. ఇప్పుడే నేను డీఎంఈ వాణీదేవి గారితో ఫోన్‌లో మాట్లాడితే.. కాలేజీ భవనం ఎక్కడ కట్టాలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. 🔹 మూడేళ్లయినా స్థలం నిర్ణయించకపోవడం, టెండర్లు పిలవకపోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వం గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యవహరిస్తోందని స్పష్టమవుతోంది. 🔹 హైదరాబాద్ నలువైపులా కేసీఆర్ గారు 4 టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ హెల్త్ సిటీ మొదలుపెడితే.. మూడేళ్లయినా వాటిని పూర్తి చేయలేదు. మేము అసెంబ్లీలో, బయట నిలదీస్తే జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు హడావుడిగా సనత్‌నగర్ టిమ్స్ ఓపెన్ చేశారు. 🔹 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఉండాల్సిన సనత్‌నగర్ టిమ్స్‌లో ఇంతవరకు ఆపరేషన్ థియేటర్ కూడా తెరవకుండా, కేవలం ఓపీ చూస్తూ ఒక పీహెచ్‌సీ, పల్లె దవాఖానా లాగా నడుపుతున్నారు. 🔹 ఇక ఈ విద్యార్థులను అటాచ్ చేయాల్సిన ఎల్బీ నగర్ టిమ్స్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వరంగల్ హెల్త్ సిటీకి మూడు డెడ్‌లైన్లు పెట్టినా నేటికీ పూర్తి చేయలేదు. 🔹 మూడు రోజులుగా విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేస్తుంటే బాధ్యత తీసుకోని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డీఎంఈ వాణీదేవి వెంటనే ఇక్కడికి వచ్చి విద్యార్థులతో మాట్లాడాలి. 🔹 గరిష్టంగా రెండు నెలల గడువులోగా ఈ కాలేజీని వనస్థలిపురం, ఎల్బీ నగర్ టిమ్స్‌కు దగ్గరగా అన్ని వసతులున్న ప్రభుత్వ లేదా అద్దె భవనంలోకి మార్చాలి. ఈ మేరకు విద్యార్థులకు తక్షణమే రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 🔹 కొత్త భవనంలోకి మార్చేంత వరకు తక్షణమే విద్యార్థులకు బస్సు సౌకర్యం, తాగునీరు, వాష్‌రూమ్‌ల వసతి కల్పించాలి. కాలేజీ ప్రాంగణం వరకు బస్సులను, విద్యార్థుల సొంత వాహనాలను వెంటనే అనుమతించాలి. 🔹 గతంలో 20 మంది విద్యార్థులు నన్ను, సబితక్కను కలిసినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీ దగ్గరికి వచ్చాం. మీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు, అన్ని వసతులున్న కొత్త భవనం, ల్యాబ్స్, లైబ్రరీ, హాస్టల్, బస్సు సౌకర్యం ఏర్పాటు చేసే వరకు నేనూ, సబితక్క, కిషన్ రెడ్డి అన్న, క్యామ మల్లేశ్ అన్న, యావత్ బీఆర్ఎస్ పార్టీ మీకు కొండంత అండగా ఉంటాం. 🔹 విద్యార్థులెవరూ డిప్రెషన్‌కు లోనుకావద్దు. ధైర్యంగా ఉండి బాగా చదువుకోవాలి. నాడు కేసీఆర్ గారు పోరాటం చేయకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇవాళ మీరు చేస్తున్న పోరాటంతోనే మీకు కొత్త భవనం వస్తుంది. 🔹 ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అవసరమైతే అసెంబ్లీలో మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థుల పక్షాన గట్టిగా కొట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తాం. మీరు ఎంబీబీఎస్ పూర్తి చేసే నాటికి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లను ఇంకా పెంచి వైద్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం.
19
49
1,951
Dr.Errolla Srinivas retweeted
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిస్థితి పశువుల కొట్టం కన్నా అధ్వాన్నంగా తయారైంది. రేవంత్ రెడ్డి మాట్లాడితే నేను చైనా, సింగపూర్, జపాన్‌లతో పోటీ పడుతున్నానని భారీ డైలాగ్స్ కొడుతున్నాడు. కానీ.. మెడికల్ కాలేజీల దుస్థితి చూస్తే నేపాల్, శ్రీలంకలతో పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. - మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు🔥
19
2
51
1,400
కాంగ్రెస్ తెచ్చిన కరువులో, రైతులను కూలీలుగా చేసిన సర్కార్... @revanth_anumula గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో రైతులకు రైతుబంధు సాగుకు నీళ్లు ఫ్రీ కరెంట్, ఇచ్చి రైతులను రాజును చేసిండు,కెసిఆర్ గారు. కానీ, కాంగ్రెస్ తెచ్చిన కరువులో కన్నీళ్లు తప్ప నీళ్లు ఎక్కడ ఇస్తలేవు ముఖ్యమంత్రి అంటూ రైతులు గోసపడుతున్నారు... @BRSparty
3
5
154
Dr.Errolla Srinivas retweeted
LIVE: తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ప్రముఖ కవి, గీత రచయిత, గోదావరి గొంతుక "మల్లావఝుల సదాశివుడు" స్మారక పురస్కార ప్రదానోత్సవం. 📍మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్ @KTRBRS teapaw.org/i/broadcasts/2ybVKvMZv…
22
59
2,522
Dr.Errolla Srinivas retweeted
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో సాగునీరు అందక ఎండిపోయిన వందలాది ఎకరాల వరి పంట పొలాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చేతికొచ్చే దశలో ఎండిపోయిన వరి పైరును చూపిస్తూ కన్నీటిపర్యంతమైన రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం అల్వాల గ్రామంలో నిర్వహించిన రైతు బహిరంగ సభలో హరీశ్ రావు గారు ప్రసంగించారు. 🔹ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి చేతగానితనం తెచ్చిన కరువు...అల్వాల రైతు సభలో మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం 🔹నీళ్లకు, కరెంటుకు, పంటలకు సెలవు అంటున్న రేవంత్ రెడ్డికే ప్రజలంతా ‘టాటా.. బాయ్ బాయ్’ చెప్పాలి... 🔹శ్రీశైలంలో 221 టీఎంసీలు, జూరాలలో 252 టీఎంసీల నీళ్లు వచ్చినా.. మోటార్లు వత్తక పంటలు ఎండబెట్టారు... 🔹700 కి.మీ దూరంలోని చంద్రబాబు కుప్పంలో కృష్ణా నీళ్లు పారుతుంటే.. 70 కి.మీ వనపర్తిలో ఎందుకు పారవు?... 🔹కల్వకుర్తి కింద 50 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉన్నా.. 18 టీఎంసీలే ఎత్తి గురువు చంద్రబాబుకు నీళ్లు వదిలేశారు... 🔹కృష్ణా జలాల్లో కేసీఆర్ హయాంలో 41 శాతం నీళ్లు వాడుకుంటే.. రేవంత్ పాలనలో 25 శాతానికే పడిపోయింది... 🔹కళ్లముందు పారుతున్న కృష్ణా నీళ్లను కూడా ఎత్తలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 🔹పాలమూరు-రంగారెడ్డిలో వారం రోజుల్లో తీసే మట్టి తండు కూడా తీయలేని చేతగాని ప్రభుత్వం... 🔹నాడు జూరాలకు వరద తాకకముందే మంత్రులకు ఫోన్లు చేసి మోటార్లు నడిపించి చెరువులు నింపిన ఘనత కేసీఆర్‌ది... 🔹ఒక్క అల్వాల గ్రామంలోనే 250 ఎకరాలు, రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. 🔹రైతులను ఆదుకునే సోయి లేదు.. ఢిల్లీలో కూర్చొని మియాపూర్‌లో 500 ఎకరాలు అమ్మి కమిషన్లు కొట్టే ఆరాటం.. 🔹కల్వకుర్తిలో 5 మోటార్లు 24 గంటలు నడపాలి.. జూరాల నుంచి మరో 15 రోజులు నీళ్లిచ్చి పంటలను కాపాడాలి.. 🔹ఆంధ్రాకు వరదలొస్తే పరిగెత్తుకొచ్చిన కేంద్ర బృందాలు.. తెలంగాణలో కరువు వస్తే ఎందుకు రావు?.. 🔹రైతన్నలూ ధైర్యం కోల్పోకండి.. అసెంబ్లీలో ప్రభుత్వ గల్లా పట్టి మీ పక్షాన నిలదీస్తాం.
1
8
1
31
709
Dr.Errolla Srinivas retweeted
కల్వకుర్తి ఎత్తిపోతల కింద కేసీఆర్ గారి హయాంలో ఎనిమిదేళ్ల పాటు రెండు పంటలు పుష్కలంగా పండిన పాలమూరు ప్రాంతంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్ల వానకాలం పంటలే ఎండిపోతున్నాయి. రైతు మూడు ఎకరాల్లో వరి నాటేస్తే.. కలుపు తీసి, ఎరువులు వేసి, పెట్టుబడి అంతా పెట్టాక పొట్ట దశకు వచ్చిన పంట నీళ్లు రాక కళ్లముందే ఎండిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నడు. ఒక్క అల్వాలలోనే 250 ఎకరాలు, ఈ ప్రాంతంలో వేల ఎకరాలు, రాష్ట్రవ్యాప్తంగా 24 నుంచి 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. రేవంత్ రెడ్డి కరువు వచ్చిందని అబద్ధాలు చెప్తున్నాడు.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, నీళ్లు లేక వచ్చిన కరువు అంతకన్నా కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు.. #CongressFailedTelangana
10
31
667