మన ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తిశ్రద్ధలతో నాగదేవతను పూజించే ఈ పవిత్రమైన నాగుల చవితి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సమాజమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
ప్రజలందరికి నాగుల చవితి శుభాకాంక్షలు.
అక్షరమే ఆయుధంగా ప్రజా చైతన్యమే లక్ష్యంగా
అన్యాయంపై అలుపెరుగని అక్షర పోరాటం చేసిన తెలంగాణ వైతాళికుడు
శ్రీ కాళోజీ నారాయణ రావు గారి వర్ధంతి సందర్భంగా వినమ్ర నివాళులు.
వరంగల్ గడ్డ మీద రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించిండు. ఎకరానికి 15 వేల రైతు భరోసా, కూలీలకు 12 వేలు, అన్ని పంటలకు బోనస్, రెండు లక్షల రుణమాఫీ అని మాట ఇచ్చిండు.
మూడేళ్లయింది. 15 వేల భరోసా రాలేదు, కూలీకి పైసా రాలేదు, బోనస్ అరకొర, రుణమాఫీ అసంపూర్ణం. ఇప్పుడు కరువుతో పంట ఎండిన రైతు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో తన గోడు వెళ్లబోసుకున్న కాంగ్రెస్ పార్టీ కి చెందిన కార్యకర్త.
మహబూబాబాద్ జిల్లా :
తొర్రురు మండలం :
ఖానాపురంలో ఎండిన పంటలను పరిశీలించి రైతుల గోడు విన్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
హైదరాబాద్ లోని BRS భవన్ లో కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ సందర్బంగా కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి శాలువా కప్పి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో కరువు తెచ్చింది రేవంత్
మేడిగడ్డ కూలలేదు.. బాంబులు పెట్టి కూల్చారని,
ఆరోజు రాత్రి బాంబ్ పేలింది, ఎవరో కుట్ర పన్నారని అక్కడి రైతులు చెప్పారు.
మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నా.. రేవంత్ రెడ్డి ఎత్తిపోయలేదు.
ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండి, ప్రతి ఇంటా దీపకాంతులతో సుఖ సంతోషాలు వెల్లివిరవాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.
పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా రాయపర్తి మండల కేంద్రంలో ఇంటింటికీ వెళ్లి స్వయంగా ఓటు నమోదు చేయిస్తున్న మాజీ మంత్రి @EDRBRS కు తన ఆవేదన తెలియజేసిన రైతు.
కరెంటు, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.. మళ్లీ కేసీఆర్ సార్ వస్తే తప్ప మా రైతుల కష్టాలు తీరవు అంటూ గోడు వెళ్ళబోసుకున్నాడు.
తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో పట్టభద్రుల ఇళ్లకు వెళ్లిన రాష్ట్ర మాజీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు స్వయంగా దగ్గరుండి ఆన్‌లైన్ ద్వారా ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేపించి పట్టభద్రులకు ఓటు యొక్క ప్రాముఖ్యత తెలియజేశారు.
7
390
తేది: 02-11-2026
వరంగల్ జిల్లా
రాయపర్తి:
రైతు ఆవేదన
రాయపర్తి మండల కేంద్రంలో
పట్టభద్రుల ఇంటికి వెళ్లి స్వయంగా ఓటు నమోదు చేపిస్తున్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గారికి తన ఆవేదన తెలియజేసిన రైతు #BRSParty
రాయపర్తి మండల కేంద్రంలో పలువురు పట్టభద్రుల ఇళ్లకు వెళ్లిన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ సందర్బంగా వారు పట్టభద్రుల ఓటరు నమోదు స్వయంగా దగ్గరుండి ఆన్‌లైన్ ద్వారా ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేపించి పట్టభద్రులకు ఓటు యొక్క ప్రాముఖ్యత తెలియజేశారు.
శ్రీశైలం నుంచి ఆంధ్రా 72 TMCలు తోడుకుంటుంటే, మనం 15 TMCలు కూడా వాడుకోలేక పొలాలు ఎండబెట్టుకుంటున్నం. కరువుతో నష్టపోయిన రైతుకు ఇవ్వాల్సింది ఇవ్వమంటే "ఖజానా ఖాళీ" అంటున్నరు.
రైతుబంధు బాకీ ₹30 వేల కోట్లు. మొత్తం కలిపి రైతులకు కాంగ్రెస్ పడ్డ బాకీ ₹1.20 లక్షల కోట్లు.
1
7
477
ఇతరుల ఓట్లపై అనుమానాలు వ్యక్తం చేసే ముందు.. మీ పార్టీ నాయకుల చరిత్రను ఒకసారి పరిశీలించుకోండి.
2015లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పేరు ఉంది.
అలాంటి నాయకుడితో కలిసి ఓట్ల చోరీపై ధర్నా చేయడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది!
తేది 29-10-2026
(రాయపర్తి మండలం)
వరంగల్ జిల్లా రాయపర్తి బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియ పై సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి
ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమంపై మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారి అధ్యక్షతన మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో గీసుకొండ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
తొమ్మిది నెలల వరకు నేనేం చేయలేను అని రేవంత్ రెడ్డి చేతులెత్తేశాడు.
కాళేశ్వరం మీద కుట్ర పన్నిందే రేవంత్.
పక్క రాష్ట్రంలో లేని కరువు ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇది రేవంత్ చేతకానితనం వల్లనే కదా.
ఇప్పటికైనా కళ్లు తెరిచి, కాళేశ్వరం, దేవాదుల నుంచి రైతులకు నీళ్లు ఇవ్వు రేవంత్!
- మాజీ మంత్రి @EDRBRS
కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు వెళ్తున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరకాల నియోజకవర్గంలోని ఆరేపల్లి వద్ద సాగు నీరు లేక ఎండిపోయిన దేవాదుల కాలువను పరిశీలించడం జరిగింది.
అసత్యంపై సత్యం, అజ్ఞానం పై జ్ఞానం, అ ధర్మం పై ధర్మం, అహంకారం పై వినయం గెలిచిన పవిత్ర దినం విజయ దశమి. ఈ దసరా పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖ శాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని మనస్పూర్తిగా కొరుకుంటూ.. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.






























