Mission Telangana (@MissionTG) header
Mission Telangana (@MissionTG) profile picture

Digital news handle of Telangana's first and leading news portal - https://teapaw.org/t.co/RF0bqgHv8c

Joined November 2013
Photo by Mission Telangana (@MissionTG)Photo by Mission Telangana (@MissionTG)Photo by Mission Telangana (@MissionTG)Photo by Mission Telangana (@MissionTG)Photo by Mission Telangana (@MissionTG)Photo by Mission Telangana (@MissionTG)Photo by Mission Telangana (@MissionTG)Photo by Mission Telangana (@MissionTG)Photo by Mission Telangana (@MissionTG)Photo by Mission Telangana (@MissionTG)
మూడేళ్లలో ఒక్కరోజూ సెలవు తీసుకోకుండా కష్టపడ్డానంటున్న రేవంత్ రెడ్డి.. నీ కష్టం ప్రజల కోసమా లేక కమీషన్లు కొట్టడం కోసమా? నువ్వు అంతలా కష్టపడితే కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటు 7 గంటలకు ఎందుకు పడిపోయింది? మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఎందుకు కాలిపోతున్నాయి కేసీఆర్ హయాంలో ఆటో డ్రైవర్‌కు చెప్తే బాయికాడికి యూరియా బస్తాలు వచ్చేవి.. నేడు రేవంత్ పాలనలో చెప్పులు లైన్లో పెట్టి, యాప్‌లో లాటరీ కోసం చూసినట్టు ఎదురుచూసే దుస్థితి కరోనా కష్టకాలంలోనూ కేసీఆర్ రైతుబంధు వేస్తే.. రేవంత్ రెడ్డి మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టాడు కొడంగల్ వెళ్లి కేసీఆర్, హరీశ్ రావు ఏం చేశారని అడుగుతున్న రేవంత్ రెడ్డి.. నాడు కొడంగల్‌లో రెండు 50 పడకల ఆసుపత్రులు, ఫైర్ స్టేషన్, గోదాములు, తండాలకు బీటీ రోడ్లు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే సిద్దిపేటకు మంజూరైన వెటర్నరీ కాలేజీని కొడంగల్‌కు ఎత్తుకెళ్లారు.. వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ పనులను మధ్యలోనే ఆపేశారు రంగనాయక సాగర్ కాలువలు మేము 90 శాతం పూర్తి చేస్తే.. మిగిలిన 10 శాతం పనుల్లో మూడేళ్లయినా తట్టెడు మట్టి కూడా తీయని అసమర్థ ప్రభుత్వం ఇది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం 👇 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌కు పోయి నన్ను తిడుతూ.. కొడంగల్‌కు కేసీఆర్ ఏం చేశాడు, హరీశ్ రావు ఏం చేశాడు అని అడుగుతున్నాడు. రేవంత్ రెడ్డీ.. కళ్లు తెరిచి చూడు. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాక కొడంగల్‌లో రెండు 50 పడకల ఆసుపత్రులు కట్టించాం, ఫైర్ స్టేషన్ లేకపోతే కొత్తగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేశాం, ప్రతి తండాకు అద్భుతమైన బీటీ రోడ్లు వేశాం, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చాం, మిషన్ కాకతీయ కింద కొడంగల్ చెరువులన్నీ బాగుచేశాం, మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రతి మండలానికి గోదాములు కట్టించాం. మరి ఈ మూడేళ్లలో నువ్వు సిద్దిపేటకు ఏం చేశావు? ఒక్క ఇటుక పెట్టకపోగా, సిద్దిపేటలో మన పిల్లలు చదువుకునేందుకు మంజూరైన వెటర్నరీ కాలేజీని కొడంగల్‌కు ఎత్తుకుపోయావు! సిద్దిపేటలో వెయ్యి పడకల ఆసుపత్రి పనులను, నర్సింగ్ కాలేజీ పనులను మధ్యలోనే ఆపించావు. రంగనాయక సాగర్ కాలువలను మా ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పూర్తి చేశాం. నరసింహగుంట నింపే కాలువ లాంటివి అక్కడక్కడా కేవలం 10 శాతం పనులు మాత్రమే మిగిలి ఉండేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లయినా ఆ మిగిలిన కాలువల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు, ఏ ఊరిలోనూ గజం తారు రోడ్డు వేసిన పాపాన పోలేదు. కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ మూడేళ్లలో నేను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు, చంకలు కాలిపోయేలా కష్టపడ్డా, బక్కచిక్కిపోయా, నా అంత కష్టపడేవాడు ఎవడూ లేడు’ అని సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డీ.. నువ్వు పడ్డ కష్టం ప్రజలకు సేవ చేయడానికా లేక కమిషన్లు, పైసలు కొట్టడానికా? నువ్వు నిజంగానే ఒక్కరోజు సెలవు తీసుకోకుండా అంతగా కష్టపడితే.. కేసీఆర్ ఉన్నప్పుడు బాయిలకాడ 24 గంటలు వచ్చిన కరెంటు, ఇప్పుడు 7-8 గంటలకే ఎందుకు పడిపోయిందో చెప్పాలి.. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక రైతుల మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఎందుకు కాలిపోతున్నాయి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుకు నాలుగు యూరియా బస్తాలు కావాలంటే.. ఆటో డ్రైవర్‌కు చెప్తే సొసైటీకి పోయి నేరుగా బాయికాడికి తెచ్చి వేసేవాడు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో యూరియా బస్తాల కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టాల్సిన దుస్థితి వచ్చింది.. ఫోన్ పట్టుకుని యాప్‌లో యూరియా బుకింగ్ కోసం గంటల తరబడి ఒత్తుకుంటూ కూర్చోవాలి.. అది దొరికితే లాటరీ తగిలినట్టు, లేకపోతే లేదు ఇదేనా నువ్వు పడ్డ 24 గంటల కష్టం. నాడు కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచమంతా ఆగిపోయిన కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు రైతుబంధు ఆపకుండా వేశారు. మరి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా కష్టపడ్డానని చెప్పుకునే రేవంత్ రెడ్డి. రైతులకు ఇంకో రూపాయి ఎక్కువ ఇవ్వాలి గానీ, మూడు పంటలకు రైతుబంధు ఎందుకు ఎగ్గొట్టాడు? ఒకసారి ఎకరానికే వేసిండు, ఇంకోసారి రెండెకరాలకే వేసిండు, మరోసారి మొత్తానికే ఎగ్గొట్టిండు. బీఆర్ఎస్ హయాంలో ఆడబిడ్డ కానుపుకు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే.. పైసా ఖర్చు లేకుండా కానుపు చేసి, కేసీఆర్ కిట్ ఇచ్చి, లోపల బాలింతకు, బయట సహాయకులకు కడుపునిండా అన్నం పెట్టి ఆదుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక కేసీఆర్ కిట్ బంద్ పెట్టి, ప్రభుత్వ ఆసుపత్రులను ఆగం చేశాడు. మాటలు చెప్పడం కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టాలి.
5
21
574
ఆదాయపు పన్ను ఎగవేత కేసు నుంచి తప్పించుకునేందుకు సీఎం రేవంత్‌ సోదరుడు ఎనుముల కొండల్‌ రెడ్డి మెమరీ లాస్ జబ్బు అని నాటకం మెడికవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని ట్రిబ్యునల్‌కు అబద్ధం చెప్పారు సీఎం రేవంత్‌ సోదరుల వ్యాపారాలపై పారదర్శక విచారణ జరపాలి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ డిమాండ్‌ 👇 ఎనుముల కుటుంబ సభ్యుల వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు లేవనెత్తిన బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌, ఈ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం పారదర్శక విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి సోదరులు బ్యాంకు రుణాలు ఎగవేసినట్లు నోటీసులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో, కార్పొరేట్‌ పాఠశాలలు, ఆసుపత్రులు, కార్‌ షోరూమ్‌లు, ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ రంగాల్లో భారీ వ్యాపారాలు ఎలా నిర్వహిస్తున్నారని క్రిశాంక్‌ ప్రశ్నించారు. ఎనుముల కొండల్‌ రెడ్డి రూ. 2.89 కోట్ల రుణం చెల్లించలేదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పలు నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. 2025 నవంబరులో ఆదాయపు పన్ను అసిస్టెంట్‌ కమిషనర్‌ దాఖలు చేసిన కేసుకు సంబంధించిన ఆదాయపు పన్ను అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వును క్రిశాంక్‌ ప్రస్తావించారు. పలు సంవత్సరాల ఆదాయపు పన్ను చెల్లింపులపై దాఖలైన అప్పీళ్లలో, సీఎం రేవంత్‌ సోదరుడు కొండల్‌ రెడ్డి మెమరీ లాస్ మానసిక సమస్యతో బాధపడుతున్నారని, మెడికవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కారణంగా పేర్కొన్నారు. ట్రిబ్యునల్‌ను తప్పుదారి పట్టించారని కొండల్‌ రెడ్డిపై ఆరోపణలు చేసిన క్రిశాంక్‌, ఆయనకు చెందిన టెస్సరాక్ట్‌ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ కంపెనీకి సుమారు రూ.200 కోట్ల విలువైన భూమిని కేటాయించడంపై సీఎం రేవంత్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పన్ను చెల్లింపులపై వివాదం ఉన్న వ్యక్తికి, ట్రిబ్యునల్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ప్రభుత్వ భూమి ఎలా కేటాయించారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంలోని సంక్షేమ కార్పొరేషన్లను పట్టించుకోకుండా, సీఎం రేవంత్‌ సోదరులు ప్రారంభించిన “ఆర్‌ఆర్‌ కార్పొరేషన్‌” షాపింగ్‌ మాళ్లు, ఆకాశహర్మ్యాల నిర్మాణంతో విస్తరిస్తోందని క్రిశాంక్‌ విమర్శించారు. “ఆర్‌ఆర్‌ కార్పొరేషన్‌” మరియు దానికి సంబంధించిన వ్యాపారాలపై బీఆర్‌ఎస్‌ ఇప్పటికే ప్రశ్నలు లేవనెత్తిందని ఆయన తెలిపారు. కోకాపేటలోని సెవెన్‌ హిల్స్‌ సమీపంలో నివాసులతో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఆర్‌ఆర్‌ కార్ప్‌ షాపింగ్‌ మాల్‌కు, సీఎం రేవంత్‌ కుమార్తె నిర్మిస్తున్న అంతర్జాతీయ పాఠశాలకు ప్రయోజనం చేకూర్చేలా 100 అడుగుల రహదారిని ప్రతిపాదించారని ప్రశ్నించారని క్రిశాంక్‌ చెప్పారు. ఆ ప్రాంతంలోని నివాసాలు, ప్లే స్కూళ్లు, చిన్న పాఠశాలలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ, భూ వినియోగ అనుమతులు, రోడ్డు ఆమోదాలు, ప్రాజెక్టుల వివరాలను అధికారులు వెల్లడించాలని కోరారు. రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుకు సంబంధించి నార్సింగి మార్గంలో రహదారి మూసివేతపై 2024లో డెక్కన్‌ క్రానికల్‌ ప్రచురించిన కథనాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ కంపెనీకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మద్దతు ఉందా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఆర్‌ఆర్‌ కార్ప్‌, ఆర్‌9 వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన బ్రోషర్‌ను క్రిశాంక్‌ ప్రస్తావిస్తూ, కోకాపేటలో నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాలు, మాల్‌ ప్రాజెక్టుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. పలు సంస్థల రికార్డుల్లో ఒకే తరహా ఈమెయిల్‌ చిరునామాలు ఉన్నట్లు తాను గుర్తించానని చెప్పారు. ఆర్‌ఆర్‌ కార్ప్‌ 2024లో రూ.30 కోట్లు, 2026లో రూ.25 కోట్లు వెంకటేశ్వర ఫైనాన్షియర్స్‌ నుంచి రుణంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక సంస్థలో ఏవీ రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారని చెబుతూ, ఈ లావాదేవీల్లో సంబంధిత సంస్థల మధ్య రుణాలివ్వడం లేదా నిధుల చుట్టుముట్టింపు జరిగిందా అనే అంశంపై విచారణ జరపాలని కోరారు. ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించిన మైండ్‌వాల్ట్‌ వెంచర్స్‌ కార్పొరేట్‌ పాఠశాలలు, స్వచ్ఛ్‌ బయో, టెస్సరాక్ట్‌ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, మెడికవర్‌, గీతా హ్యుందాయ్‌ షోరూమ్‌లు, మ్యాక్స్‌బీఎన్‌ ఫార్మా తదితర వ్యాపారాల విలువ సుమారు రూ. 50,000 కోట్లకు చేరిందని వచ్చిన వాదనలపై కూడా క్రిశాంక్‌ ప్రశ్నలు లేవనెత్తారు. స్వచ్ఛ్‌ బయోతో కుదిరినట్లు చెబుతున్న రూ. 1,000 కోట్ల ఒప్పందం, టెస్సరాక్ట్‌కు కేటాయించినట్లు చెబుతున్న సుమారు రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి, ఈ సంస్థల మధ్య ఉన్న వ్యాపార సంబంధాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. ఎనుముల కృష్ణారెడ్డి పేరుతో అసైన్డ్‌ భూములు, 22ఏ నిషేధిత భూములుగా పేర్కొన్న భూములు రిజిస్టర్‌ అయిన విషయంపైనా స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
1
8
16
548
టెస్సరాక్ట్‌ ఛైర్మన్‌ ఎనుముల కొండల్‌ రెడ్డి విషయమై, 2025 నవంబర్‌ 26 నాటి ఆదాయపు పన్ను అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వును క్రిశాంక్‌ ప్రస్తావించారు. కొండల్‌ రెడ్డి జ్ఞాపకశక్తి కోల్పోయే డిసోసియేటివ్‌ అమ్నీషియా సమస్యతో (memory loss) బాధపడుతున్నారని, నిరంతర వైద్య చికిత్స పొందుతున్నారని, ఇందుకు మెడికవర్‌ ధ్రువపత్రాన్ని సమర్పించినట్లు న్యాయవాది ట్రిబ్యునల్‌కు తెలిపారని ఆయన అన్నారు. భూమి కేటాయించే ముందు కంపెనీ అర్హత, ఆర్థిక సామర్థ్యాన్ని ఎలా పరిశీలించారో ప్రభుత్వం వివరించాలని కోరారు. 2023లో రూ. 2.89 కోట్ల రుణ బకాయిలపై జారీ అయిన రికవరీ నోటీసును కూడా ప్రస్తావిస్తూ, కొండల్‌ రెడ్డి తన ఆర్థిక, రుణ వివరాలను బహిరంగపరచాలని డిమాండ్‌ చేశారు. కుటుంబానికి సంబంధించిన ఆస్తుల విలువ పెరుగుదల, భారీ నిర్మాణాలు, షాపింగ్‌ మాళ్లకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని క్రిశాంక్‌ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా “ఆర్‌ఆర్‌ టాక్స్‌” గురించి చేసిన వ్యాఖ్యల తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అధికారిక విచారణ ఎందుకు ప్రారంభించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సంబంధిత సంస్థల ఆర్థిక రికార్డులు, పన్ను రిటర్నులు, భూ లావాదేవీలు, రుణాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని కోరారు. 2023లో ఎనుముల కొండల్‌ రెడ్డికి చెందిన రూ.2.89 కోట్ల రుణ బకాయిలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇచ్చిన రికవరీ నోటీసు బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రికలో ప్రచురితమైందని క్రిశాంక్‌ తెలిపారు. బ్యాంకు రుణం చెల్లించలేని పరిస్థితి ఉందని నోటీసులు వచ్చిన వ్యక్తి, రెండేళ్లలో ఇంతటి ఆస్తులు ఎలా సమకూర్చుకున్నారని ప్రశ్నిస్తూ, కుటుంబ సంపదకు సంబంధించిన వనరులు, నిధుల వివరాలను బహిరంగపరచాలని డిమాండ్‌ చేశారు. సంస్థలు, రుణాలు, భూ కేటాయింపులు, సంబంధిత వ్యక్తుల ఆస్తులపై దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి, ఫలితాలను ప్రజలకు వెల్లడించాలని క్రిశాంక్‌ డిమాండ్‌ చేశారు.
53
తెలంగాణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానపు చీకట్లను తొలగించుకుని జ్ఞానకాంతులను ఆహ్వానించాలనే సందేశాన్ని దీపావళి పండుగ మనకు అందిస్తున్నదని కేసీఆర్ తెలిపారు. దీపావళి ప్రత్యేక సాంప్రదాయం, బాణాసంచా కాల్చే సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబ సభ్యులందరూ పండుగ సంబురాలు నిర్వహించుకోవాలని కేసీఆర్ కోరారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరేలా, రాష్ట్రం తిరిగి ప్రగతి పథంలో పయనించేలా.. లక్ష్మీదేవి అమ్మవారు కరుణాకటాక్షాలు అందించాలని కేసీఆర్ ప్రార్థించారు.
3
29
482
సంక్షేమ గురుకుల పాఠశాలల్లో నాసిరకం దుప్పట్లు, బెడ్‌షీట్ల పంపిణీ గురించి తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్ 👇 రాష్ట్రంలో పోలీస్ రాజ్యమనే రీతిలో పాలన కొనసాగుతుంది. పేదింటి బిడ్డ అయిన దూదిమెట్ల బాలరాజు యాదవ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. బీఆర్ఎస్ లీగల్ టీం దీనిపై వాదనలు వినిపించి బెయిల్ తెప్పించారు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే పోలీసులు అక్రమ కేసులు మానుకోవాలి ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు బయటపెడుతూనే ఉంటాం ప్రభుత్వం నిర్లక్ష్యంగా, నిస్సిగ్గుగా దోపిడి వ్యవస్థను నడుపుతుంది పాత గుడ్డలను రీసైక్లింగ్ చేసే మఫత్‌లాల్ కంపెనీకి గురుకుల టెండర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి అనేక రకాలుగా దోపిడి చేస్తున్నాడు ఆఖరికి విద్యా వ్యస్థను సైతం దోపిడి చేస్తున్నాడు గురుకుల కుంభకోణాన్ని బీఆర్ఎస్ నేతలు బయటపెట్టారు సెంట్రలైజ్డ్ టెండర్‌తో గురుకుల కుంభకోణం చేశారు పేద బిడ్డలకు ఇచ్చే బెడ్‌షీట్స్‌లో రూ. 100 కోట్ల కుంభకోణం గుజరాత్ కంపెనీకి గురుకుల టెండర్ ఇచ్చి కుంభకోణానికి పాల్పడ్డారు ఇదే విషయాన్ని దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి బయటపెట్టారు ఐఏఎస్ అధికారి సవ్యసాచి ఘోష్ రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారు టేస్కో ద్వారా చేనేత కార్మికులకు మూడున్నర లక్షల టెండర్ ఇంకో మూడున్నర లక్షల టెండర్‌ను గుజరాత్ కంపెనీకి కేటాయించారు గుజరాత్ కంపెనీ పాత గుడ్డలతో కుక్క పేగులా బెడ్‌షీట్స్ తయారు చేశారు చేనేత కార్మికులు పిల్లలకు హెచ్చగా ఉండే బెడ్‌షీట్స్ తయారు చేశారు పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్ రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా? రేవంత్ రెడ్డికేమో ఇంద్ర భవనాలు.. పేదింటి పిల్లలకు కనీసం కాటన్ బెడ్‌షీట్స్ లేవు పిల్లలకు ఇచ్చే బెడ్‌షీట్స్ కుంభకోణాన్ని దేవుడు కూడా క్షమించడు గురుకుల టెండర్స్‌ను టెస్కో ద్వారానే ఇవ్వాలి స్పీకర్ వేసుకునే కోట్‌లా గురుకుల బెడ్‌షీట్స్ ఉంటాయిని రేవంత్ రెడ్డి అన్నాడు టైలర్ ఖర్చు నేను పెట్టుకుంటాను.. బెడ్‌షీట్స్‌ను రేవంత్ రెడ్డి కోట్ కుట్టించుకుంటాడా? లిడ్‌క్యాప్ 6 ఎకరాల భూమిని అపర్ణ కన్స్‌ట్రక్షన్స్‌కు కేటాయించారు రూ. 200 కోట్ల విలువైన ఏక్తా మాల్‌ను అపర్ణకే కేటాయించారు గుజరాత్ కంపెనీ బెడ్‌షీట్స్‌తో పిల్లలకు చలి పెడుతుందా లేదా ఫీడ్ బ్యాక్ అవసరమా? పేద వర్గాల పిల్లల పట్ల రేవంత్ రెడ్డికి చులకన భావం
2
9
361
రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి మెమరీ లాస్ ఉందని వాళ్ల మెడికవర్ హాస్పిటల్ సర్టిఫికెట్ ఇచ్చింది. అది కోర్టులో చూపెట్టి, ఇన్‌కం ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నం చేసిండు. ఇలాంటి మెమరీ లాస్ ఉన్నవాడికి టెసెరాక్ట్ కంపెనీ పేరిట రేవంత్ ప్రభుత్వం రూ. 200 కోట్ల భూమి కట్టబెట్టింది. - బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్.
6
7
395
ఆర్ఆర్ కార్పోరేషన్ పేరిట రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అన్యాయంగా దందాలు చేస్తున్నారంటూ ఆరోపించిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్. రేవంత్ రెడ్డి కూతురు స్కూల్ కోసం, ఆర్ఆర్ మాల్ కోసం నార్సింగిలో 100 ఫీట్ రోడ్ అలైన్మెంట్ మార్చి స్కూళ్లు, ఇండ్లు కూలగొడుతున్నారన్న క్రిషాంక్.
5
10
392
🔶 కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి అనుచిత లబ్ధి 🔶 మిగతా కంపెనీలన్నీ నామమాత్రపు పోటీదారులే 🔶 రూ. 1,450 కోట్ల నుంచి రూ. 6,825 కోట్లకు పెరిగిన ప్రాజెక్టు వ్యయం 🔶 చుక్క నీరు అందకముందే ఐదు రెట్లకు చేరిన అంచనా వ్యయం 🔶 ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురుచూస్తుంటే ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ సంపద దోపిడీ 🔶 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం 👇 కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తలకిందులుగా పడినా గెలుపు తమదే అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే, మంత్రి పొంగులేటికి చెందిన సొంత కంపెనీ కూడా టెండర్లలో పాల్గొన్నదని ఆరోపించారు. మిగతా కంపెనీలన్నీ కేవలం కాగితాలపైనే ఉన్న నామమాత్రపు సంస్థలని, చివరకు ఒక్క కంపెనీ మాత్రమే పోటీలో మిగిలి విజయం సాధించేలా వ్యవహారం నడిచిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగిపోవడంపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014లో సుమారు రూ. 1,450 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం రూ. 6,825 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. అంటే దాదాపు ఐదు రెట్లు వ్యయం పెరిగిందని, ప్రజాధనాన్ని ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క నీరు కూడా అందలేదని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం పేరుతో అంచనా వ్యయాన్ని భారీగా పెంచుతూ, టెండర్ల ప్రక్రియను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. టెండర్లలో పారదర్శకతకు తావులేకుండా, తమకు అనుకూలమైన కంపెనీలకే పనులు దక్కేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు. ఒకవైపు తెలంగాణలో ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంటే, మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రాజెక్టుల అంచనా వ్యయాలను పెంచి కాంట్రాక్టుల ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించి, ఇలాంటి దోపిడీకి సరిపోయే కొత్త పదాన్ని సూచించాలని కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. క్రోనీ క్యాపిటలిజం, బహిరంగ దోపిడీ, క్లెప్టోక్రసీ వంటి పదాలు కూడా తెలంగాణలో జరుగుతున్న ఈ దోపిడీని వివరించడానికి సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ, టెండర్ల ప్రక్రియలోనూ తమకు అనుకూలమైన కంపెనీలకే ప్రయోజనం చేకూర్చే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
5
11
395
తెలంగాణలో ఉన్నది అతివృష్టి, అనావృష్టి కాదు.. ముమ్మాటికీ ‘రేవంత్ వృష్టి’ నదుల్లో పుష్కలంగా నీళ్లున్నా మోటార్లు ఆన్ చేయక పంటలు ఎండబెట్టిన అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదులలో 60 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉన్నా 18 టీఎంసీలే ఎత్తి.. మిగతా గోదావరి నీళ్లను చంద్రబాబు పట్టిసీమకు వదిలేశారు రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు ఎండిపోతే క్యాబినెట్‌లో ఒక్క ముక్క మాట్లాడరా? గ్లోబల్ సమ్మిట్‌పై ఉన్న ప్రేమ రైతులపై లేదా? కొడంగల్‌కు రూ. 9 వేల కోట్ల రోడ్లు, లక్ష కోట్ల ఫ్యూచర్ సిటీకి పైసలుంటాయి గానీ.. ఎండిన పంటలకు సాయం చేయడానికి డబ్బులు లేవా? మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో పంట నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరానికి రూ. 5,000 కరువు సాయం అందించాలి బడ్జెట్‌లో రూ. 1600 కోట్లు పెట్టి బల్లలు చరిచిన పంటల బీమా ఏమైంది? మూడేళ్లయినా అమలు చేయకుండా రైతుల గుండెలపై తన్నారు కేసీఆర్ ఇచ్చిన రైతుబీమాను ఆపేసి.. ఇందిరమ్మ బీమా పేరుతో నవంబర్ 19 నుంచి మళ్లీ దరఖాస్తులు తీసుకుంటామంటూ చావు కబురు చల్లగా చెప్పారు అసెంబ్లీని అబద్ధాల అడ్డాగా మార్చిన రేవంత్.. బడ్జెట్‌లో పెట్టిన రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏమయ్యాయి? నిన్నటిదాకా ఫేక్ మాటలు.. నేడు రైతుబంధు పడ్డట్లు సీఎం పేరుతో ఫేక్ మెసేజ్‌లు! దమ్ముంటే ఆ మెసేజ్‌లు పంపిన వారిని అరెస్ట్ చేయాలి కళ్లాలలోకి 30 శాతం వడ్లు వచ్చినా కొనుగోలు కేంద్రాలు తెరవరా? సన్నాలకు బోనస్ ఎగ్గొట్టేందుకే ఈ కుట్ర రుణమాఫీ చేయకపోగా.. రైతుల వృద్ధాప్య పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, వడ్ల డబ్బులను క్రాప్ లోన్ కింద జమ చేసుకుంటున్న బ్యాంకులు సింగూరులో 20 టీఎంసీల నీళ్లను రిపేర్ల పేరుతో ఖాళీ చేసి 4 జిల్లాల గొంతు ఎండబెట్టారు.. ప్రజలకు తాగునీరు ఆపి బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తారా? - నర్సాపూర్‌ నియోజకవర్గంలో ఎండిన పంటలను పరిశీలించి, ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు
3
10
421
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచెడ్, హత్నూర మండలాల్లో కరెంటు కోతలు, సాగునీటి కొరతతో ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు.
2
3
292
కరువు కోరల్లో చిక్కుకున్న రైతుల గురించి నిన్న క్యాబినెట్ మీటింగ్‌లో ఎందుకు చర్చించలేదు? 25 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతే కేబినెట్ సమావేశంలో గ్లోబల్ సమ్మిట్ గురించి మాట్లాడతారా? మహారాష్ట్ర, కర్ణాటక తక్షణ సహాయం కింద రైతులకు ఎకరానికి రూ. 5,000 ఇస్తున్నాయి.. నువ్వేం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? నీ ఫ్యూచర్ సిటీకి రూ. 9 వేల కోట్లతో రోడ్లు వేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి, మూసీ సుందరీకరణకు డబ్బులు ఉన్నాయి కానీ రైతులకు ఇచ్చేందుకు లేవా? - నర్సాపూర్‌లో మాజీ మంత్రి హరీష్ రావు
2
11
428
అతివృష్టి, అనావృష్టి కాదు తెలంగాణలో ఉన్నది రేవంత్ వృష్టి. వర్షాలు పడ్డా, నదుల్లో నీళ్ళున్నా.. నీళ్ళు ఎత్తకపోవడం వల్ల వచ్చిన కరువు ఇది. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. - నర్సాపూర్‌లో మాజీ మంత్రి హరీష్ రావు
3
23
518
రేవంత్ రెడ్డి అంటే ఇంతకుముందు ఫేక్ మాటలు, ఇప్పుడు ఫేక్ మెసేజీలు. రైతుబంధు పైసలు పడ్డాయని మెసేజ్‌లు వస్తే ఫేక్ మెసేజ్‌లు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు మరి ఫేక్ మెసేజ్‌లు పంపినోడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఒక రీట్వీట్ చేస్తే ఈ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు కదా లక్షల మంది రైతులను ఆగం పట్టించి రేవంత్ రెడ్డి డ్రామా ఆడుతున్నాడా? - నర్సాపూర్‌లో మాజీ మంత్రి హరీష్ రావు
8
10
411
మెదక్, సంగారెడ్డి జిల్లాలు అంటే కాంగ్రెస్ వాళ్ళకి ప్రేమ లేదు. బీర్ కంపెనీలకు మాత్రం ఫుల్లుగా నీళ్లు ఇస్తున్నారు కానీ ఫ్యాక్టరీలకు, ఐఐటీ హైదరాబాద్‌కు మాత్రం నీళ్ళు బంద్. ఒక బోర్ వేయిద్దామంటే ఎమ్మెల్యే దగ్గర, కలెక్టర్ దగ్గర రూపాయి నిధి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సింగూరును ఎండబెట్టారు. - నర్సాపూర్‌లో మాజీ మంత్రి హరీష్ రావు
4
9
427
రెండో పంట వేయిద్దని చెప్పిన రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయొద్దని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. గత అక్టోబర్ నెలలో హైదరాబాద్‌లో 80,000 వేల ట్యాంకర్లు వాడితే, ఈ అక్టోబర్ నెలలో 2.35 లక్షల ట్యాంకర్లు వాడారు. జల మండలి దీన్ని గొప్పగా చెప్పుకుంటుంది.. అంటే ప్రభుత్వం తమ వైఫల్యాన్ని తామే ఒప్పుకున్నట్లు. మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండా నీళ్ళు ఎత్తొచ్చు. కేసీఆర్‌కు పేరు రావొద్దనే రేవంత్ రెడ్డి ప్రాజెక్టులు వాడుకోకుండా ప్రజలను ఎండబెడుతున్నాడు. - ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
4
15
503
నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు ఎదుట కన్నీరు పెట్టిన అన్నదాతలు👇 కాంగ్రెస్ పాలనలో కరెంటు రాక, సాగునీరు అందక చేతికొచ్చిన వరి పంటలు కళ్లముందే ఎండిపోయాయని హరీశ్ రావు ఎదుట వాపోయిన రైతులు. సకాలంలో కరెంటు అందక తన 7 ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని కంటతడి పెట్టిన కుమార్ అనే రైతు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల నాణ్యమైన కరెంటుతో రెండు పంటలు పండించుకున్నాం.. ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందని రైతుల ఆవేదన. వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నా.. కనీసం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డ అన్నదాతలు. రైతుబంధు పూర్తిగా ఎగ్గొట్టారని కేవలం ఒక్క ఎకరానికే వేసి రేవంత్ సర్కార్ చేతులు దులుపుకుందని హరీశ్ రావుకు మొరపెట్టుకున్న రైతులు. రేవంత్ రెడ్డి చెప్పిన రైతు రుణమాఫీ అంతా బోగస్.. గ్రామంలో పది మందిలో కనీసం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయాం.. మళ్లీ 100 శాతం కేసీఆర్ సార్ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడే తమ కష్టాలు తీరుతాయని హరీష్ రావు ఎదుట ధీమా వ్యక్తం చేసిన రైతన్నలు. రైతన్నలూ అధైర్యపడకండి.. ఈ రెండేళ్లు సీఎం రేవంత్ రెడ్డి మెడలు వంచి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన హరీష్ రావు. మార్పు అంటే కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటును, రైతుబంధును బంద్ పెట్టి పచ్చని పొలాలను ఎండబెట్టడమేనా.. రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు ధ్వజం. ఎండిన ప్రతి ఎకరానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే వరకు పెండింగ్ రైతుబంధు, పూర్తిస్థాయి రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ సర్కార్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపిన హరీష్ రావు
2
8
435
ఘోరం.. రేవంత్ సభ కోసం చెరువు ఖాళీ! ఈ నెల 7, 8, 9 తేదీల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో చెరువు ఖాళీ. ఓ వైపు కరువుతో ప్రజలు అల్లాడుతుంటే.. సీఎం నియోజకవర్గం కొడంగల్‌లో చెరువునే ఖాళీ చేశారు.. భారీ మోటర్లు పెట్టి, ట్యాంకర్ల ద్వారా నీళ్లు తరలించారు.
8
14
469
🚱 Hyderabad faces a severe water crisis 🚫 Congress government’s restrictions on private tankers aggravate the situation 🚨 Hostels, hotels and commercial establishments worst hit Hyderabad is heading towards a severe water crisis, with gated communities, particularly in the western part of the city, bearing the brunt of the shortage. Falling groundwater levels, drying borewells and inadequate municipal supply have left residents struggling to meet their daily water requirements. The situation has worsened following government restrictions on private borewells and water tankers, which had been supplying hundreds of gated communities across the IT corridor. With no alternative arrangements in place, several housing societies have begun issuing warnings to residents about impending water shortages. WhatsApp messages and circulars displayed on notice boards inform residents that water supply may be restricted to just a few hours a day, urging them to conserve water. The crisis has also affected hostels and commercial establishments, with some IT corridor hostel operators reportedly asking residents to return to their hometowns as maintaining operations without adequate water has become increasingly difficult. Meanwhile, a theft at the Peerzadiguda water-filling station has further disrupted supplies. Of the 10 smart cards used by private tankers, nine were stolen on Tuesday, following which Water Board vigilance officials lodged a complaint with Medipally police. Only one tanker is currently operating from the facility, leaving hundreds of booking requests pending. The situation is particularly alarming in West City, where municipal supply reportedly meets less than half the actual demand. The Water Board has already restricted supply from the Singur and Manjeera reservoirs to two days a week, with a complete halt reportedly looming. With groundwater resources dwindling and private tanker operations disrupted, residents fear that the shortage could intensify in the coming days.
5
8
498
కొడంగల్‌లో నీళ్ల కోసం ట్యాంకర్ల వెనుక పరుగులు తీస్తున ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజులను తలపించేలా రేవంత్ పాలన కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో తాగునీటి కోసం ప్రజల ఇక్కట్లు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో మిగిలిన కొంచెం పనులు పూర్తి చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని వాపోతున్న ప్రజలు.
3
7
342
RERA accused of favouring a private infra company, leaving homebuyers in the lurch Telangana Real Estate Regulatory Authority (RERA) is facing allegations of turning a blind eye to violations by a private infrastructure company and failing to enforce its own orders. It allegedly benefited the developer at the expense of homebuyers who invested crores in a Khajaguda skyscraper project. The authority registered a suo motu case over allegations of fund diversion and, on August 23, 2023, directed the developer to complete the project and hand it over by December 2025. However, buyers remain without possession or compensation. RERA initially ordered the developer and landowners to pay compensation for the delay. Following the landowners' petition, the High Court directed RERA to proceed with enforcement while excluding them. Consequently, buyers became entitled to ₹25 per sq. ft. in compensation from October 2023. However, the developer has allegedly failed to honour the order and is instead demanding ₹500 per sq. ft. as additional screeding charges. Buyers contend that their original agreement already specifies VDF flooring, leaving no justification for separate charges. The project was originally scheduled for handover in 2021, with buyers subsequently accommodating COVID-related delays. Under RERA provisions, delayed possession also attracts interest-based compensation, reportedly calculated at 9.85% plus 3% linked to RBI's MCLR guidelines. With nearly 40 lakh sq. ft. sold, the liability could run into crores of rupees monthly. Buyers allege that even the agreed compensation remains unpaid, raising serious questions about RERA's enforcement and its commitment to protecting homebuyers.
Khajaguda land scam: Private company allegedly grabs Rs. 680 crore government land with Congress backing⁉️ Bengaluru-based infra company entered Hyderabad’s real estate market with a major project in Khajaguda. Initially, the company obtained permission to use 1.17 acres of adjoining government land for six months, paying ₹68.97 lakh. However, it allegedly encroached upon additional land, prompting the then BRS government to intervene in January 2020, impose a penalty of ₹1.93 crore and reclaim the entire 3.17 acres. Following the Congress government’s arrival, the said company allegedly revived its attempts to occupy the land. The project, originally approved for 36 floors and 33 lakh sq. ft., reportedly expanded to 60 lakh sq. ft. across 38 floors through revised permissions. Allegations of building violations, reduced undivided land shares promised to buyers and discrepancies in approved plans have also surfaced. The most serious allegations concern the 3.17 acres of government land in Survey No. 20/1, valued at approximately ₹680 crore. Despite being classified as government land and appearing on the Section 22A prohibited list, the land allegedly underwent irregular transactions in June 2026, involving the infra company’s directors and subsequent sale deeds and development agreements. Records also reveal discrepancies in declared property valuations. The controversy extends to Thautonikunta lake, where the company allegedly constructed an unauthorised road through the water body. HYDRAA’s handling of the issue, including alleged pressure on Green Grace apartment residents to permit access through an existing road, has triggered a legal battle. The High Court has ordered status quo. Meanwhile, RERA has registered complaints concerning the project's delay and alleged diversion of funds. Although interim directions were issued in August 2025 to safeguard buyers' interests and ensure project completion, allegations persist that these orders remain unimplemented, even after subsequent High Court directions. The central question remains: who enabled these alleged irregularities, and why have government agencies failed to act decisively? A joint project in Manikonda involving the company’s director and another company, whose director is allegedly linked to a key political figure, raises further questions. Notably, a sale deed covering over 14,000 sq. ft. in that project was executed in the latter company's name before the government land was handed over.
4
6
299