తుఫాన్ జాగ్రత్తలపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నాం.. భారీ వర్షాలు పడుతున్నాయి.. ప్రజలు బయటికి రావద్దు.. ప్రయాణాలు రద్దు చేసుకోండి.. పునరావాస శిబిరాలు, ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్స్ ఏర్పాటు చేశాం.. తుఫాన్ వేగం, దిశ మారుతున్నందున ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం.. ప్రాణనష్టం జరగకుండా ఉండాలనేదే ప్రధాన ఉద్దేశం- సీఎంచంద్రబాబు
#CMChandrababu #APGovtAlert #CycloneAlert
#APCycloneUpdate #HeavyRainAlert #CycloneRelief
#APDisasterManagement
HYD: కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో పేలుడు. ఇద్దరికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
#BreakingNews #TeluguNews #HyderabadNews
అర్నబ్ తుఫాన్ గంటకు 18 కి.మీ. వేగంతో కదలిక. విశాఖకు 170 కి.మీ., కాకినాడకు 140 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతం. మచిలీపట్నానికి 230 కి.మీ., బాపట్లకు 300 కి.మీ. దూరంలో తుఫాన్. రేపు యానాం సమీపంలో తీరం దాటే అవకాశం. తీరం దాటే సమయంలో గంటకు 125-135 కి.మీ. వేగంతో ఈదురుగాలులు.
#BreakingNews #ArnabCyclone #APNews #WeatherUpdates
కోనసీమకు ఇవాళ కాళరాత్రి. తీర ప్రాంతాల్లో హైఅలర్ట్. తీర ప్రాంతాల్లో 2.5 మీటర్ల ఎత్తు వరకు అలలు. యానాం నుంచి కాకినాడ వరకు ఉప్పెన హెచ్చరికలు. ఉప్పాడ తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు. ఉప్పాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేత.
#BreakingNews #TeluguNews #CycloneArnabUpdate #APNews
సుప్రీంకోర్టులో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణ.. ఆల్ ద బెస్ట్ ఎన్నికలకు వెళ్లండి.. స్థానిక ఎన్నికల ప్రక్రియను సీసీ కెమెరాలతో పర్యవేక్షించాలి-సుప్రీంకోర్టు
#APLocalBodyElections #SupremeCourt #APElections
#APLocalPolls #AndhraPradesh
IND vs NZ: మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం.. న్యూజిలాండ్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపు.. కేవలం 13.2 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసిన టీమిండియా.. అభిషేక్ శర్మ 113, వైభవ్ సూర్య వంశీ 45, సంజూ శాంసన్ 18.. న్యూజిలాండ్ స్కోర్-198/3.. భారత్ స్కోర్-199/4.. ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకున్న భారత్
#INDvsNZ #INDvNZ #TeamIndia #AbhishekSharma #vaibhavsooryavanshi #T20Cricket
IND vs NZ: అభిషేక్ శర్మ సెంచరీ.. 35 బంతుల్లో సెంచరీ చేసిన అభిషేక్.. 10 సిక్స్‌లు, 8 ఫోర్లతో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ.. ఆఫ్ఘనిస్థాన్‌పై ఇదే ఏడాది కేవలం 30 బంతుల్లో సెంచరీ చేసిన అభిషేక్.. టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన జాబితాలో మూడో స్థానంలో అభిషేక్ శర్మ..
#AbhishekSharma #INDvsNZ #INDvNZ #FastestCentury #RecordBreaker #TeamIndia #T20Cricket
IND vs NZ: 178 పరుగుల దగ్గర రెండో వికెట్ కోల్పోయిన భారత్.. అభిషేక్ శర్మ (113) ఔట్.. 38 బంతుల్లో 11 సిక్స్‌లు, 9 ఫోర్లతో విరుచుకుపడ్డ అభిషేక్
#AbhishekSharma #INDvsNZ #INDvNZ #TeamIndia
#BCCI
IND vs NZ: వైభవ్ సూర్యవంశీ 45 ఔట్.. 19 బంతుల్లో 4 సిక్స్‌లు, 4 ఫోర్లతో విధ్వంసం..
#VaibhavSooryavanshi #INDvsNZ #INDvNZ
భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసిన కివీస్.. హాఫ్ సెంచరీ బాదిన డారిల్ మిచెల్ (89 నాటౌట్).. కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన ఫిన్ అలెన్ (40), బెవాన్ జాకబ్స్ (39 నాటౌట్).. భారత బౌలర్లలో ఒక్కో వికెట్ పడగొట్టిన అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, నితీశ్ రెడ్డి
#INDvsNZ #DarylMitchell #BevonJacobs
నామినేషన్ వేసేందుకు వెళ్తున్న మహిళలను అడ్డుకుంటున్నారు.. ఆర్వో ఆఫీసుకు వెళ్లేలోపే దాడులు చేస్తున్నారు.. 40 వార్డులు ఉన్న పులివెందులలో 20 వార్డులకు మాత్రమే నామినేషన్లు వేయించారు.. మిగిలిన 20 వార్డులకు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.. పోలీసులే నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.. నామినేషన్లు వేయించాలని కోరితే పోలీసులు లాఠీఛార్జ్ చేశారు, AK47తో కాల్పులు జరిపారు.. పోలీసులు ఇంతటి బలప్రయోగం ఎందుకు చేశారు?.. ఇంత భయపడేవాళ్లు ఎన్నికలను ఎందుకు పెట్టారు?: వైఎస్ జగన్
#AP #LocalBodyElections2026 #YCP #YSJagan
శకునిలా చంద్రబాబు మాయపాచికలు వేస్తున్నారు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. చంద్రబాబు పాపంలో భాగమైన పోలీసులు, అధికారులు ఆలోచన చేయాలి.. పోటీలో అందరూ పాల్గొనే అవకాశం కల్పించాలి.. ఇద్దరం నిలబడితే ప్రజలు ఎవరికో ఒకరికి ఓటు వేస్తారు.. పోటీలో ఒకరు లేకుండా చేసి గెలిస్తే అది గెలుపా?.. వైసీపీ అభ్యర్థులు పోటీలో ఉంటే ఎందుకు భయపడుతున్నారు?.. సూపర్-6, సూపర్-7 లేదు అందుకే భయపడుతున్నారు: వైఎస్ జగన్
#AP #LocalBodyElections2026 #YCP #YSJagan
సుప్రీంకోర్టులో ఈసీ, సీఈసీలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ.. విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం.. సప్లిమెంటరీ అఫిడవిట్ వేయడానికి ఈసీకి గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు.. నవంబర్ రెండో వారంలో విచారణ
#SupremeCourt #EC #CEC
స్థానిక ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇవ్వాలి.. అర్బన్ ఏరియాలో ప్రత్యక్ష ఎన్నికలు తీసుకొచ్చాం.. యువతకు, చదువుకున్న వారికి పెద్దపీఠ వేశాం.. చెప్పాం, చేశాం కాబట్టే ధైర్యంగా ఓటు అడుగుతున్నాం.. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది.. కరెంట్ ఛార్జీలు పెంచలేదు, పైగా ట్రూఆప్ ఛార్జీలు తగ్గించాం.. రాయలసీమ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తయారవుతోంది.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు వెళ్లాం.. పెట్టుబడిదారులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
#AP #TDP #CMChandrababu #LocalBodyElections2026
నిన్నటి వరకు ఎల్‌నినో, ఇప్పుడు అర్నబ్ తుఫాన్.. రేపు మధ్యాహ్నం తుఫాన్ తీరం దాటుతుంది.. ఇవాళ ఉదయం నుంచే వర్షాలు పడుతున్నాయి.. ఇవాళ, రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి.. 135 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం.. ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించేలా మానిటరింగ్ చేస్తున్నాం.. ప్రతి గంటకోసారి వెదర్ బులిటెన్ విడుదల చేస్తాం.. తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కుంటాం: సీఎం చంద్రబాబు
#AP #CMChandrababu #ArnabCyclone
ప్రజావేదిక ధ్వంసం నుంచి విధ్వంసం ప్రారంభమైంది.. ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు.. పవన్ కల్యాణ్ విశాఖ వెళ్తే నగర బహిష్కరణ చేశారు.. నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు.. ప్రత్యేక పరిస్థితుల్లో కూటమి ఏర్పడింది, కూటమికి ప్రజలు మద్దతుగా నిలిచారు: సీఎం చంద్రబాబు
#AP #TDP #CMChandrababu #LocalBodyElections2026
వెలింగ్టన్ వేదికగా న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో మూడో టీ20 ఆరంభం.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. తుది జట్టులో ఎలాంటి మార్పు చేయని భారత్.. మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేయనున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ
#INDvsNZ #TeamIndia #ShreyasIyer #VaibhavSooryavanshi
అసెంబ్లీ ఎన్నికల్లో 93శాతం గెలుపు సాధించాం.. ఇప్పుడు అదే గెలుపును సాధించేందుకు కృషి చేస్తున్నాం.. చాలా చోట్ల ఔత్సాహికులు నామినేషన్లు వేశారు.. బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. మా కూటమికి ప్రజల మద్దతు అవసరం: పవన్ కల్యాణ్
#AP #LocalBodyElections2026 #JanaSena #PawanKalyan
దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయి..ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం.. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సవాళ్లు ఉన్నాయి.. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాం.. రూ.లక్షన్నర కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం.. గత ప్రభుత్వంలో ఉద్యోగుల జీతాలను కూడా మళ్లించారు.. పోలవరం, హంద్రీనీవా, భోగాపురం ముందుకు తీసుకెళ్లాం.. కూటమి అభ్యర్థులకు కొన్ని ఛాలెంజ్‌లు ఉన్నాయి.. అభివృద్ధి పనులు కిందిస్థాయికి వెళ్లాలంటే మీరు కలిసికట్టుగా ఉండాలి: పవన్ కల్యాణ్
#AP #LocalBodyElections2026 #JanaSena #PawanKalyan
