Pinned Tweet
It was a pleasure meeting Maharashtra Minister Shri @NiteshNRane ji recently.
Glad to see him highlight Andhra Pradesh’s remarkable fisheries growth in his recent podcast, recognising our state as a leader in fish production.
With nearly 55 lakh tonnes of annual production, Andhra Pradesh continues to set benchmarks in the fisheries sector.
రాయలసీమ వాణిజ్య కేంద్రం ఆదోని అభివృద్ధిలో మరో చారిత్రాత్మక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకు అనుగుణంగా NH-167లో భాగంగా రూ.242 కోట్ల వ్యయంతో 7.30 కి.మీ. మేర ఆదోని బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయింది.
భారీ వాహనాలకు పట్టణ ట్రాఫిక్ నుంచి విముక్తి, ప్రయాణ సమయం, ఇంధన ఆదా, రహదారి భద్రతతో పాటు ప్రాంతీయ వాణిజ్యాభివృద్ధికి ఈ బైపాస్ రోడ్డు బాటలు వేయనుంది.
#AdoniBypass
#RayalaseemaDevelopment
#BCJR
#BCJanardhanReddy
#AndhraPradesh
నాడు వైసీపీ పాలనలో అధ్వానంగా మారిన రహదారులతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గుంతలమయమైన రోడ్లతో ప్రయాణాలు నరకప్రాయంగా మారాయి.
నేడు కూటమి ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ.. ప్రజలకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా రహదారులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది.
#AndhraPradesh
విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండటం మరింత బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.
#AndhraPradesh
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో తొలి విప్లవ జ్వాల.. రేనాటి వీరసింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1857కు ముందే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు. అణచివేతకు ఎదురొడ్డి, ఆత్మగౌరవం కోసం పోరాడి, బానిస సంకెళ్లను తెంచేందుకు ప్రాణాలనే పణంగా పెట్టిన పోరాట యోధుడు. కత్తి పట్టిన చేతిలో కేవలం ఆయుధమే కాదు.. వేలాది హృదయాల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన విప్లవాగ్ని.
ఆయన పోరాటం ఒక చరిత్ర.. ఆయన త్యాగం ఒక స్ఫూర్తి.. ఆయన పేరు తరతరాలకు ఒక రణనినాదం. వీరత్వానికి నిలువెత్తు నిదర్శనం, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. వీరుల చరిత్ర ఎన్నటికీ చెరిగిపోదు..
#UyyalawadaNarasimhaReddy
#VeeraNarasimhaReddy
#BCJR
#BCJanardhanReddy
#AndhraPradesh
కార్తీక దీపాల వెలుగుల్లో... శివకేశవుల అనుగ్రహంతో మీ జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ... కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!
#KarthikaPournami
#KarthikaMasam
#BCJR
#BCJanardhanReddy
#AndhraPradesh
అభివృద్ధికి బాటలు.. ప్రగతికి రహదారులు!
కూటమి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి @ncbn గారి నేతృత్వంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ప్రతి ప్రాంతానికి మెరుగైన రహదారులు అందించడమే మా సంకల్పం.
#AndhraPradesh
BC Janardhan Reddy Official retweeted
It was a pleasure meeting Maharashtra Minister Shri @NiteshNRane ji recently.
Glad to see him highlight Andhra Pradesh’s remarkable fisheries growth in his recent podcast, recognising our state as a leader in fish production.
With nearly 55 lakh tonnes of annual production, Andhra Pradesh continues to set benchmarks in the fisheries sector.
ప్రజాస్వామ్యం గురించి నువ్వే మాట్లాడాలి కాటసాని రామిరెడ్డి...
గత ఐదేళ్లలో నువ్వు చేసిన అరాచకాలు మరచిపోయావా...??
#YCPMarkViolence
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#PsychoFekuJagan
#Banaganapalle
గత పాలకుల నిర్లక్ష్యంతో గుంతలమయంగా మారిన నిడుబ్రోలు ప్రధాన రహదారికి సీఎం @ncbn గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కొత్త రూపునిస్తోంది. నిడుబ్రోలు జడ్పీ హైస్కూల్ నుంచి పొన్నూరు వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు నూతన రహదారి నిర్మాణానికి రూ.3.50 కోట్లు, డివైడర్ల నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేసి ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పిస్తోంది.
విద్యార్థుల్లో స్వీయ అభ్యసన సామర్థ్యాలను పెంపొందించి, గణితం, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో బనగానపల్లి మండలంలోని ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ (PAL) ల్యాబ్‌లను ప్రారంభించాం. ఒక్కో పాఠశాలకు 30 ట్యాబ్‌లను కేటాయించి డిజిటల్ అభ్యసనానికి అవకాశం కల్పించాం. ఆధునిక సాంకేతికతతో విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరుస్తూ, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం.
#DigitalEducation
#PALLabs
#GovernmentSchools
#BCJR
#BCJanardhanReddy #BCJRForBanaganapalle
#Banaganapalli
ప్రకాశం జిల్లా పెళ్లూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరం. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకోవడం కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
సముద్ర అలలతో నిరంతరం పోరాడుతూ దేశ ఆహార భద్రతకు, ఆర్థికాభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్న మత్స్యకారుల సేవలు అభినందనీయం. వారి సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు!
#WorldFisheriesDay
#BCJR
#BCJanardhanReddy
#AndhraPradesh
నంద్యాల జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం..
#Nandyal
#BCJR
#BCJanardhanReddy
#TeluguDesamParty
ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన సామాన్య కార్యకర్తకు సైతం సముచిత గుర్తింపు కల్పించి, ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టడం టీడీపీతో, @ncbn గారితోనే సాధ్యం.
#APLocalBodyElections #CheppaamChestunnaam
తెలుగుదేశం పార్టీ మైనారిటీలు, బీసీలు, ఇతర వెనుకబడ్డ వర్గాలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో మరోసారి నిరూపితమైంది. టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ గా ఉన్న బుర్హానుద్దీన్ కు నంద్యాల జెడ్పీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. టీడీపీ క్లస్టర్ ఇన్ ఛార్జ్ నుంచి జెడ్పీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న బుర్హానుద్దీన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
#ChandrababuNaidu
#AndhraPradesh
BC Janardhan Reddy Official retweeted
#APLocalBodyElections #CheppaamChestunnaam
తెలుగుదేశం పార్టీ మైనారిటీలు, బీసీలు, ఇతర వెనుకబడ్డ వర్గాలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో మరోసారి నిరూపితమైంది. టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ గా ఉన్న బుర్హానుద్దీన్ కు నంద్యాల జెడ్పీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. టీడీపీ క్లస్టర్ ఇన్ ఛార్జ్ నుంచి జెడ్పీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న బుర్హానుద్దీన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
#ChandrababuNaidu
#AndhraPradesh
వెల్దుర్తి – కోడుమూరు రహదారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.21.09 కోట్లతో 11.5 కిలోమీటర్ల మేర సింగిల్ లేన్ రహదారిని డబుల్ లేన్‌గా అభివృద్ధి చేస్తుండగా, ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. హంద్రీ నదిపై భారీ వంతెన నిర్మాణంతో వర్షాకాలంలోనూ సురక్షిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ రహదారితో పత్తికొండ, కోడుమూరు ప్రాంతాలతో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
#VeldurthiKodumuruRoad
#RoadDevelopment
#BCJR
#BCJanardhanReddy
#AndhraPradesh
నంద్యాల జిల్లా పరిషత్ నూతన చైర్మన్‌గా షేక్ బుర్హానుద్దీన్ గారు, జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. నంద్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో సహచర మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ గారు, ఎమ్మెల్యేలు గౌరు చరిత రెడ్డి గారు, బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు, గిత్తా జయసూర్య గారితో కలిసి పాల్గొన్నాను.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గారు జడ్పీ చైర్మన్‌తో పాటు నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన షేక్ బుర్హానుద్దీన్ గారికి శుభాకాంక్షలు తెలిపాను. నూతన పాలకవర్గం ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ, తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించాను.
#Nandyal
#BCJR
#BCJanardhanReddy
#TeluguDesamParty
బనగానపల్లె నియోజకవర్గం నుంచి ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురు జడ్పీటీసీ సభ్యులు షేక్ బుర్హానుద్దీన్ గారు, గడ్డం నారాయణమ్మ గారు, బెలూ వరలక్ష్మి గారు, చల్లా విజయ భాస్కర రెడ్డి గారు, నంద్యాల రమాదేవి గారికి శుభాకాంక్షలు.
#ZPTC
#Banaganapalle
#BCJR
#BCJanardhanReddy
































