కరోనా కంటే డేంజర్‌గా మారిన కాంగ్రెస్ పాలన!
ఒకప్పుడు పెట్టుబడులకు స్వర్గధామంగా వెలుగొందిన తెలంగాణ,
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగం తీవ్ర వెనుకబాటుకు గురవుతోంది.
దావోస్ టూర్ల పేరిట ఫేక్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూ..
వందల కోట్లతో అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ దొంగలు!
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరై, కాబోయే వధూవరులను ఆశీర్వదించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కేటీఆర్ గారితో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్, రాకేశ్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో.. తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.
స్వయంగా కాంగ్రెస్ మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని నందిని నగర్‌లో రోజుల తరబడి తాగునీళ్లు రాకపోవడంతో ఆగ్రహించిన మహిళలు, కాలనీ వాసులు ఖాళీ బిందెలతో మక్తల్-కర్ణి రహదారిపై బైఠాయించిన కాలనీ వాసులు.
తమ నిర్లక్ష్యంతో ప్రాజెక్టుల నుంచి నీళ్లను ఎత్తిపోయకపోయకుండా..
ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితి తీసుకొచ్చిన కాంగ్రెస్ దద్దమ్మలు!
రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల దాదాపు 6 లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆకలి చావుల అంచులో ఉన్నారు.
తమ జేబులు నింపుకోవడానికే కాంగ్రెస్ నాయకులు పని చేస్తున్నారు.
గ్రీన్ ఎస్ఎం అనే వియత్నాం క్యాబ్ కంపెనీని తెచ్చి, తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొడుతున్నారు.
ధనార్జనే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన నడుస్తోంది.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
BRS Party retweeted
KTR does not have to become Revanth Reddy. He is already a proven leader. He has his own political identity and ability. He has proved his mettle.
Revanth Reddy should stop worrying about KTR’s beard and start worrying about his governance.
#KTR #Telangana #Leader
#BRS
#RavulaSridhatReddy #RSR
పేద ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా రేవంత్? 😡
🏥 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక.. వైద్యం అందక పేదలు విలవిలలాడుతుంటే..
💰 సొంతంగా కార్పొరేట్ ఆసుపత్రులు తెరుస్తూ.. వేల కోట్ల దోపిడీకి పాల్పడుతున్న రేవంత్!
#CongressLootingTelangana
గ్రీన్ SM కంపెనీకి తెలంగాణలో పర్మిషన్ ఇచ్చింది ఎవరు?
ఢిల్లీ AICC కార్యాలయంలో మూటలు అప్పజెప్పి గ్రీన్ SM కంపెనీ తెలంగాణకు వచ్చింది.
గ్రీన్ SM కంపెనీ తెలంగాణకు రావడంతో లక్షలాది మంది క్యాబ్ డ్రైవర్లు రోడ్డున పడ్డారు.
ఇందిరమ్మ పాలనలో తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల నోట్లో మట్టి కొడుతున్నారు.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero మీడియా సమావేశం teapaw.org/i/broadcasts/2kElmWeqv…
తుగ్లక్ రేవంత్ పాలనలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం! 📉
హైడ్రా కూల్చివేతలు, మూసీ విధ్వంసం, 22-A ఆంక్షలతో గతేదాడితో పోలిస్తే ఏకంగా 15% పతనమైన రిజిస్ట్రేషన్లు.
అనాలోచిత నిర్ణయాలతో విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మంటగలుపుతున్న కాంగ్రెస్!
#CongressFailedTelangana
🌊 ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు 😭
📢 కలుపుమొక్క కాంగ్రెస్‌ను నమ్మితే సంక్షేమం సర్వనాశనమైంది ⚠️
📣 కృష్ణా, గోదావరిలో బంగారంగా పారిన నీళ్లు.. కండ్ల ముందే వదిలేసి, కరువును తెచ్చి పెట్టిన కాంగ్రెస్
🆘 రెండు నదుల్లో కలిపి వెయ్యి టీఎంసీలు దిగువకు!.. కుప్పం వరకు కృష్ణా నీటిని తరలించుకున్న ఏపీ
🚨 అష్టగ్రహాల దుష్ట కూటమి కాంగ్రెస్- బీజేపీ.. ఒకటి సంచులు మోసే పార్టీ, మరొకటి చెప్పులు మోసే పార్టీ
💰 మూడేండ్లలో నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసిండు రేవంత్
🎯 ఎగ్గొట్టిన రైతుబంధు వేయాలి, రుణాలు రీషెడ్యూల్ చేయాలి
🤡 ఓట్లు, సీట్లు తప్ప నిధులు తెచ్చే సోయి బీజేపీ ఎంపీలకు లేదా? దమ్ముంటే మోదీ ఇంటిముందు వాళ్లు ధర్నా చేయాలి
💥 నిర్మల్ నగారా.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గర్జన
రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు అష్ట గ్రహాలు. రైతులు అష్ట కష్టాల్లో ఉంటే వీళ్లంతా ఏం చేస్తున్నారు? బీజేపీకి రాష్ట్రంలో ఓట్లు, సీట్లు కావాలి. మరి తెలంగాణకు పైసలిచ్చే సోయి లేదా? మోదీ హృదయంలో తెలంగాణకు స్థానం లేదా? నిధుల కోసం మోదీ ఇంటి ముందు ధర్నా చేసే ధైర్యం బీజేపీ నాయకులకు లేదా?
గోదావరి, కృష్ణా నదుల్లోని నీళ్లు ఏపీకి వదిలి పెట్టిన్రు. తెలంగాణ రైతాంగానికి కన్నీళ్లు మిగిల్చిన్రు. ఆనాడు మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిన్రు. ఆరు గ్యారెంటీల పేరిట భ్రమలు కల్పించిన్రు. ఇప్పుడు గద్దెనెక్కి నిండా ముంచుతున్రు. మాయమాటలు నమ్మి కలుపు మొక్కలాంటి కాంగ్రెస్‌ను నెత్తిమీద పెట్టుకుంటే దరిద్రం మన గడప తొక్కింది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సుమారు 90 శాతం పూర్తయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కనబెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఎన్నికలకు ఇంకా రెండేండ్లకు పైగా సమయం ఉన్నది. అయినా ఎన్నికలు లేని సమయంలో కూడా రాజకీయ కారణాలతో కేసీఆర్‌కు పేరు రావొద్దనే ఉద్దేశంతో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది దేవుడిచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు.. పాలకుల వికృతితో వచ్చిన కరువు.
✳️ రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో కరువు కనిపించడం లేదు
✳️ రైతు సంక్షేమాన్ని పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి
✳️ రైతుల కష్టాలపై స్పందించని సీఎం.. కేటీఆర్ గడ్డం మీదే రేవంత్‌కు ఫికర్ పట్టుకుంది
✳️ కరువుతో ఉపాధి కోల్పోయిన ప్రతి వ్యవసాయ కూలీకి నెలకు రూ.1,000 చొప్పున 36 నెలలకు రూ.36 వేలు ఇవ్వాలి
✳️ తెలంగాణలో ఓట్లు కావాలి.. తెలంగాణలో సీట్లు కావాలి.. కానీ తెలంగాణకు నిధులు ఇచ్చే సోయి లేదా? ప్రధాని మోదీ మనసులో తెలంగాణకు చోటు లేదా?
✳️ బీజేపీ నాయకులకు దమ్ముంటే ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలి
✳️ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొంద పెట్టి.. కేసీఆర్‌ను మళ్లీ గెలిపించుకోవాలి
- నిర్మల్ రైతు గర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈ సభలో నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రామ్ కిషన్ రెడ్డి, మాజీ మంత్రులు జోగు రామన్న, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్ రావు, కోనేరు కొనప్ప, దుర్గం చెన్నయ్య, బాజిరెడ్డి గోవర్థన్, జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, గంప గోవర్ధన్, జాజల సురేందర్, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నల్లా వినయ్ రెడ్డి మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొంద పెట్టి, అభివృద్ధి, సంక్షేమ సారథి కేసీఆర్‌ను మళ్లీ గెలిపించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో నెలకొన్న కరువు కనిపించడం లేదని విమర్శించారు. రైతులు కష్టాల్లో ఉంటే గ్రామాల్లో నాటకాలు వేయాలని ముఖ్యమంత్రి చెబుతున్నారని మండిపడ్డారు. రైతు జీవితం కంటే రాజకీయ ప్రయోజనమే రేవంత్ రెడ్డికి ముఖ్యమా? రైతులకు ధైర్యం చెప్పడం చేతకాదు కానీ, కేటీఆర్ గడ్డం మీద మాత్రం రేవంత్ రెడ్డికి ఫికర్ పట్టుకుంది. రేవంత్ లెక్క తిట్లు తినాలని ఎవరైనా అనుకుంటారా? రేవంత్‌ను తిడుతున్న తిట్లకు ఇంకెవరైనా ఉంటే బకెట్ నీళ్లలో దూకి చచ్చిపోయేవారు. తెలుగు భాషలో ఉన్న తిట్లన్నీ రేవంత్ రెడ్డికి పడుతున్నాయి.
గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరువు పరిస్థితుల కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి వ్యవసాయ కూలీకి నెలకు వెయ్యి రూపాయల చొప్పున 36 నెలలకు గాను మొత్తం రూ.36 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని అన్నదాతలకు వెంటనే నాలుగు విడతల రైతుబంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరువు నేపథ్యంలో రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలను వెంటనే రీషెడ్యూల్ చేయాలని, ఇంకా మిగిలిపోయిన రైతు రుణమాఫీని కూడా తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు ఇస్తానని చెప్పడం లేదని, కరెంట్ ఇస్తానని భరోసా ఇవ్వడం లేదని, కనీసం ధైర్యం కూడా చెప్పడం లేదని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి నుంచి ధైర్యం చెబుతారేమో, ఆర్థిక సహాయం అందిస్తారేమోనని రైతులు ఎదురుచూస్తుంటే, ఆయనకు అవేవీ పట్టడం లేదని, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు కూడా కనిపించడం లేదని మండిపడ్డారు.
తెలంగాణలో ఓట్లు కావాలి, తెలంగాణలో సీట్లు కావాలి.. కానీ తెలంగాణకు నిధులు ఇచ్చే సోయి లేదని కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మనసులో తెలంగాణకు చోటు లేదా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్ విసిరారు. మూడేళ్లలో బీజేపీ వల్ల తెలంగాణకు ఒక్క పనైనా జరిగిందా? బీజేపీ ఎంపీని, బీజేపీ ఎమ్మెల్యేను గెలిపిస్తే నిర్మల్ జిల్లాకు ఏమైనా మంచి జరిగిందా?
ఆదిలాబాద్‌లో సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేస్తుంటే ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడటం లేదు. నిర్మల్ జిల్లాకు రావాల్సిన నవోదయ విద్యాలయం కూడా రాలేదు. ఓట్లు తొలగిస్తున్నారని దేశమంతా గగ్గోలు పెడుతుంటే, నిర్మల్‌లో మాత్రం ఎన్నికల సంఘానికి మద్దతుగా బీజేపీ ర్యాలీ తీస్తోంది.
పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు కరువు బృందాలు వెళ్తున్నాయని, కానీ తెలంగాణలో నెలకొన్న కరువు బీజేపీకి కనిపించడం లేదని విమర్శించారు. ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు ఎందుకని ప్రశ్నించారు.
✳️ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు – ప్రజలకు మోసం
మీ నాటకాలు, మీ ఉద్దెర మాటలతో ప్రజల కడుపు నిండదు. రైతులకు మోసం, యువతకు మోసం, మహిళలకు మోసం, దళితులకు మోసం.. మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లకు కూడా మోసం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో సంక్షేమం మొత్తం సర్వనాశనం అయింది.
మూడేళ్లలో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన రేవంత్ రెడ్డి.. ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈ డబ్బులన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కలుపు మొక్కలాంటి కాంగ్రెస్‌ను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నాం. ఇవాళ దరిద్రం మళ్లీ మన గడప తొక్కింది. బోగస్ మాటలతో, అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
రైతుబంధు, రైతుబీమా పథకాలను ఎగ్గొట్టారు. యూరియా దొరకడం లేదు, ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు రైతులను మోసం చేస్తున్నారు. రైతు ఇంటి ముందు మళ్లీ చావు డప్పు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కరెంట్ కోతలతో మళ్లీ రైతుల మోటార్లు కాలిపోతున్నాయి.
✳️ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం
90 శాతం పూర్తయిన పాలమూరు ప్రాజెక్టును పడకబెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టారు. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు దక్కాల్సిన 1000 టీఎంసీల నీటిని కిందకు విడిచిపెట్టారు. ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు ఎందుకు?
రాజకీయమే అజెండాగా పెట్టుకుని, కేసీఆర్‌కు పేరు రావొద్దనే ఉద్దేశంతో ఇవాళ ప్రాజెక్టులను ఎండబెడుతున్నారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. పాలకులు తెచ్చిన వికృతి కరువు.
పట్టిసీమ దగ్గర చంద్రబాబు నీళ్లు ఎత్తుతుంటే, నువ్వు కన్నెపల్లి దగ్గర ఎందుకు పంపులు ఆన్ చేయలేదు? కేసీఆర్ కట్టిన సదర్‌మాట్ బ్యారేజీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఉపయోగించుకోవడం చేతకావడం లేదు. శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌లోకి నీళ్లను లిఫ్ట్ చేసి ఉంటే ఇవాళ నీళ్ల జాతర సాగుతుండేది.
మన ఎస్సారెస్పీ ఎందుకు ఎండిపోయింది? ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు ఎందుకు నిండాయి? కుప్పానికి చంద్రబాబు నీళ్లు తీసుకుపోతుంటే, పక్కనే ఉన్న పాలమూరు ఎందుకు ఎండిపోయింది? గోదావరి పక్కనే ఉన్న నిర్మల్ జిల్లాలో ఎందుకు కరువు వచ్చింది?
✳️ కేసీఆర్ ఉద్యమ ప్రస్థానంతో నిర్మల్‌కు ఉన్న అనుబంధం
నిర్మల్ ప్రాంతానికి, కేసీఆర్ ఉద్యమానికి ముఖ్యమైన అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమానికి తానే సారథ్యం వహిస్తానని కేసీఆర్ మొట్టమొదటిసారిగా ప్రకటించిన గడ్డ ఇది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఈ గడ్డ మీద ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్.
తుమ్మలు మొలిచిన ప్రాజెక్టుల్లో నీళ్లు పారించిన నాయకుడు కేసీఆర్. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతులు ఆత్మహత్యలు, వలసలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయాన్ని ఎలా నిలబెట్టాలి, రైతులను ఎలా రాజులుగా చేయాలనే అంశంపై నిపుణులతో చర్చించి సుదీర్ఘంగా ఆలోచించారు. 60 ఏళ్ల దుఃఖం చాలు, రైతుల ఆత్మహత్యలు చాలని ఆలోచించి తెలంగాణ వ్యవసాయ రంగానికి కొత్త దిశ చూపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చి 46 వేల చెరువులకు మళ్లీ జీవం పోశారు కేసీఆర్. మండుటెండల్లో కూడా చెరువులు మత్తళ్లు దుంకేలా చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమైక్య రాష్ట్రంలో ఉన్న నీటితీరువాను శాశ్వతంగా రద్దు చేశారు.
60 ఏళ్ల కరెంట్ కష్టాలను తీర్చిన నాయకుడు కేసీఆర్. విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడిన రైతులకు నిరంతర విద్యుత్ అందించారు. అప్పుల మీద అప్పులు చేసి రైతులు ఆగమవుతున్న సమయంలో వారిని ఆదుకున్న నాయకుడు కేసీఆర్.
దేశంలోనే రైతులకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక నాయకుడిగా కేసీఆర్ నిలిచారు. 11 విడతలుగా రైతులకు రైతుబంధు అందించారు. కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి ధీమాగా ఉండాలనే ఉద్దేశంతో రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చారు. ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేశారు.
కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మించి ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టిన నాయకుడు కేసీఆర్. రాష్ట్రంలో సాగునీటి వసతులను పెంచి వ్యవసాయానికి పెద్దపీట వేశారు.
కరోనా సమయంలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసింది.
గిరిజన గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చిన నాయకుడు కేసీఆర్. నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. గిరిజనులకు రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచారు.
ఒకప్పుడు మంచం పట్టిన మన్యంలో విషజ్వరాలు ప్రబలేవి. కేసీఆర్ పాలనలో ఆ విషజ్వరాలను తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందించి, కలుషిత నీటి కారణంగా వచ్చే వ్యాధులను నివారించేలా చర్యలు చేపట్టారు. కేసీఆర్ పాలనలో ప్రతి గ్రామానికి నర్సరీ, డంపింగ్ యార్డు, ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. పల్లెలు, పట్టణాలకు నిధులు వరదలా వచ్చాయి.
కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లో అభివృద్ధి ఆగిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామాలు, పట్టణాలకు వచ్చిన నిధులు ఇప్పుడు ఎందుకు రావడం లేదో ప్రజలు ఆలోచించాలి. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదు. మరోవైపు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలి. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి. రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలను ఆలస్యం చేయకుండా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో అందినకాడికి భూములను అమ్ముకుంటూ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం, భూముల విక్రయాల ద్వారా ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 63 వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్. 2017లో బీడీ పరిశ్రమపై ప్రధాని మోదీ ప్రభుత్వం జీఎస్టీ విధిస్తే, దాన్ని అడ్డుకున్న నాయకుడు కేసీఆర్. బీడీ కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
✳️ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్‌ను గెలిపించాలి
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి కేసీఆర్ చేసిన సేవలను ప్రజలు గుర్తించాలి. రైతులను ఆదుకున్నది, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించింది, గ్రామాలను అభివృద్ధి చేసింది, గిరిజనులు, బీడీ కార్మికులు, పేదలకు సంక్షేమ పథకాలు అందించింది కేసీఆర్ ప్రభుత్వమే. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొంద పెట్టి, అభివృద్ధి, సంక్షేమ సారథి కేసీఆర్‌ను మళ్లీ గెలిపించుకోవాలి.
#WATCH | Nirmal, Telangana: BRS working president KT Rama Rao says, "In those days during the Corona period, KCR stopped the salaries of ministers, MLAs, and MLCs. He even made a 50 per cent cut in government employees' salaries. For whose sake? So that our poor people would be well. So that pensions, Rythu Bandhu, Kalyana Lakshmi and Shaadi Mubarak wouldn't stop. He gave courage, saying that no facility given to the poor should stop. He purchased every single grain. At that time, setting up 8,000 procurement centres everywhere, he purchased them splendidly. Today, we are questioning the government from the Nirmal stage and demanding on behalf of the BRS party to the government that along with the earlier Rythu Bandhu, this Yasangi Rythu Bandhu should also be given immediately. We are also demanding that whatever bank loans the farmers have taken, having fallen into debt, their rescheduling should be done immediately. We are also strongly demanding that the remaining farm loan waiver should be completed immediately..."
(Source: BRS)





















