JSP Dhalam జనసేన దళం (@JSPDhalam) header
JSP Dhalam జనసేన దళం (@JSPDhalam) profile picture

🇮🇳 Social Justice 🇮🇳 @Pawankalyan 🇮🇳 @Janasenaparty TeamDhalam 🚩Grass Roots Level Democracy ✊ Jai JanaSena 🇮🇳 Jai Hind 🇮🇳 BackUp :@JSPSatishKumar

Bharath 🇮🇳
Joined December 2016
Photo by JSP Dhalam జనసేన దళం (@JSPDhalam)Photo by JSP Dhalam జనసేన దళం (@JSPDhalam)Photo by JSP Dhalam జనసేన దళం (@JSPDhalam)Photo by JSP Dhalam జనసేన దళం (@JSPDhalam)Photo by JSP Dhalam జనసేన దళం (@JSPDhalam)Photo by JSP Dhalam జనసేన దళం (@JSPDhalam)Photo by JSP Dhalam జనసేన దళం (@JSPDhalam)Photo by JSP Dhalam జనసేన దళం (@JSPDhalam)Photo by JSP Dhalam జనసేన దళం (@JSPDhalam)Photo by JSP Dhalam జనసేన దళం (@JSPDhalam)
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపెల్లి పంచాయితీ గూడెం గ్రామంలో నాడు 23.07.2025 నేను స్వయంగా ఆ గ్రామానికి వెళ్లి గిరిజనుల బాధలు చూసి చలించిపోయి శ్రీ @PawanKalyan గారికి స్వయంగా ఆధారాలతో సహా ప్రభుత్వ సహాయం అందించాలని విజ్ఞప్తి చేసాము నేడు వెలుగులు నింపారు 🙏
3
17
40
3,532
JSP Dhalam జనసేన దళం retweeted
పంచాయతీ ఎన్నికలు సామరస్యపూర్వకంగా జరగాలి
33
255
13
808
19,343
కదిలేది కదిలించేది మారేది మార్పించేది పాడేది పాడించేది మును ముందుకు సాగించేది పెను నిద్దర వదిలించేది పరిపూర్ణపు బ్రతుకిచ్చేది కావాలోయ్ నవకవనానికి దేశ యువత అభివృద్ధి పథంలో అభ్యుదయ మార్గంలో కొనసాగించాలన్న ధ్యేయం జనసేనాని లక్ష్యం @PawanKalyan @JanaSenaParty
2
7
193
పెందుర్తి శాఖ గ్రంధాలయం విశాఖపట్నం *పెందుర్తి గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు – డిజిటలైజేషన్, పుస్తక పఠనం మరియు ప్రచురణ వ్యాసరచన పోటీలు సమీక్లలో పాల్గొన్న చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్* పెందుర్తి: పెందుర్తి శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. యువతకు దిశానిర్దేశం: ఈ వేడుకల్లో భాగంగా గ్రంథాలయానికి వచ్చిన యువతీ యువకులతో చైర్మన్ ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — "నేటి పోటీ ప్రపంచంలో పుస్తకపఠనం ఎంతో అవసరం. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత చదువులు అభ్యసించాలి. కేవలం స్థానిక లేదా జాతీయ స్థాయి (National Level) లతో ఆగిపోకుండా, ప్రపంచస్థాయిలో (International Level) తమ ప్రతిభను చాటేలా ఎదగాలి" అని పిలుపునిచ్చారు. అభివృద్ధి పనులపై హామీ: అనంతరం గ్రంథాలయానికి అవసరమైన మౌలిక వసతులపై ఆయన స్పందిస్తూ — గ్రంథాలయాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో త్వరలోనే డిజిటల్ గ్రంథాలయంగా (Digital Library) తీర్చిదిద్దుతామని, అలాగే భద్రత దృష్ట్యా ప్రాహరీ గోడ (Compound Wall) నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు (Rtd. Headmaster) శ్రీ జానకి రామ్ గారు, యోగా ఉపాధ్యాయులు మరియు గ్రంథాలయ కార్యదర్శి శ్రీ బి. కుమార్ రాజు గారు పాల్గొని పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ వేడుకల్లో గ్రంథాలయ సిబ్బంది, స్థానిక విద్యార్థులు, పాఠకులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. @PawanKalyan @JanaSenaParty @ncbn @AndhraPradeshCM @APDeputyCMO @naralokesh
7
24
255
పద్మనాభం భీమినిపట్నం నియోజకవర్గం *పద్మనాభంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు: పాల్గొన్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వమ్మిరెడ్డి సతీష్ కుమార్* పద్మనాభం: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పద్మనాభం శాఖా గ్రంథాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ *శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్* ముఖ్య అతిథిగా హాజరై, గ్రంథాలయాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ మాట్లాడుతూ: • మన ఊరు - మన గ్రంథాలయం: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా "మన ఊరు - మన గ్రంథాలయం" అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రతీ గ్రామంలోని గ్రంథాలయం ఆ ఊరి విజ్ఞాన కేంద్రంగా వెలసిల్లాలని ఆకాంక్షించారు. • నూతన BDC హామీ: పద్మనాభం ప్రాంతంలో విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు మరియు పాఠకులకు మౌలిక వసతులు మరింత మెరుగుపరిచేందుకు భవిష్యత్తులో పద్మనాభం శాఖా గ్రంథాలయానికి నూతన భవన BDC మంజూరు చేస్తామని ఈ వేదికగా హామీ ఇచ్చారు. • పుస్తక పఠనం - విజ్ఞాన వికాసం: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు, యువత మొబైల్ ఫోన్లకే పరిమితం కాకుండా గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ G. నారాయణ గారు మరియు శ్రీ అవనాపు దేముడు గారు హాజరై ప్రసంగించారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను, విద్యా వికాసంలో అవి వహిస్తున్న పాత్రను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి, స్థానిక గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. @PawanKalyan @APDeputyCMO @ncbn @naralokesh @JanaSenaParty @JSPShatagniTeam @itsRamTalluri @NagaBabuOffl @TSivasankararao @zgsvsp @TrendPSPK
3
1
14
423
విశాఖపట్నం మిసెస్ ఏవీఎన్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ పి. కృష్ణకుమారి అధ్యక్షతన, కళాశాల సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో 59వ గ్రంథాలయ వారోత్సవాలను ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ పుస్తక పఠనం గ్రంధాలయాల ప్రాముఖ్యత దండాలయాల మహోత్సవంలో పాల్గొన్న ప్రముఖుల జీవితాల గురించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ పాల్గొని, విద్యార్థులకు వివరించారు. భారతదేశంలో మాదకద్రవ్యం రహిత సమాజంగా తీర్చిదిద్దే పౌరస సమాజంలో భాగమవ్వాలని విద్యార్థిని విద్యార్థులు పిలుపునిచ్చారు.రాబోయే 60వ జాతీయ గ్రంథాలయ వారోత్సవానికి ఒక రచయితగా విద్యార్థులు తయారవ్వాలని కోరారు ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పి. కృష్ణకుమారి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి జీవితంలో పుస్తక పఠనం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుందని, విద్యార్థులందరూ కళాశాల గ్రంథాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగత కుమార్ రాజా మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కళాశాల లైబ్రేరియన్ ప్రియాంక సమన్వయంలో నిర్వహించబడింది. కార్యక్రమంలో కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎ. అర్చన, తెలుగు అధ్యాపకురాలు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డి. గాయత్రి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. @PawanKalyan @APDeputyCMO @AndhraPradeshCM @ncbn @naralokesh @JSPTelangana @JSPShatagniTeam @JanaSenaParty @TSivasankararao @itsRamTalluri @NagaBabuOffl @iTDP_Official @zgsvsp
4
18
275
సబ్బవరం శాఖా గ్రంధాలయం అనకాపల్లి జిల్లా *సబ్బవరంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు: మహిళా సాధికారిక స్త్రీ శక్తి అంశం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సబ్బవరం గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ *వన్నెంరెడ్డి సతీష్ కుమార్* సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ మాట్లాడుతూ: • *స్త్రీశక్తి – జైలులో ఉత్తరాలు* : 'స్త్రీశక్తి' నినాదంతో జైలులోని ఖైదీలు ఉత్తరాల ద్వారా భావ స్వేచ్ఛను పొందేలా, పుస్తకాలతో బయటి ప్రపంచాన్ని పరిచయం చేసేన విధానాన్ని వివరించారు. • *పుస్తకాలు & డిజిటల్ పరిజ్ఞానం:* సాధారణ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, వాటితో పాటు డిజిటల్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉండాలని సూచించారు. కేవలం డిజిటల్ సాధనాలకే పరిమితం కాకుండా పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలన్నారు. • "డిజిటల్ పరికరాల నల్లని తెరల మధ్యే మన జీవితం ఉండిపోకూడదు. ఒక మంచి పుస్తకం వంద మంది మంచి మిత్రులతో సమానం" అని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ గ్రంథాలయంలో పుస్తకాలు చదివి ఉన్నతమైన స్ఫూర్తిని పొందాలని పిలుపునిచ్చారు. • వచ్చే ఏడాది జరగబోయే 60వ గ్రంథాలయ వారోత్సవాల నాటికి మీ నుండి కనీసం ఒక్కరైనా మంచి రచయితగా తయారుకావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శితో పాటు విశిష్ట అతిథులు డాక్టర్ విద్యాధరి మేడమ్, సి.హెచ్.ఓ. స్వర్ణలత , గ్రంధాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మామిడి శంకరరావు గారు, కనకరాజు మరియు వీర మహిళలు కూటమి నాయకులు గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, స్థానికులు పాల్గొన్నారు. @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam @naralokesh @ncbn @APDeputyCMO @AndhraPradeshCM @TSivasankararao @itsRamTalluri @NagaBabuOffl @TrendPSPK @PSPK_FC
1
10
26
372
JSP Dhalam జనసేన దళం retweeted
సమాజం బాగుండాలని కోరుకున్న దివంగత శ్రీ రామోజీ రావు గారు •⁠ ⁠ ఆయనలో సమాజకాంక్ష బలంగా ఉండేది •⁠ ⁠ దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువల కోసం తపించారు •⁠ ⁠ తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు అపారం •⁠ ⁠ సమాజాన్ని చైతన్యవంతం చేయాలని భావించేవారు •⁠ ⁠ శ్రీ రామోజీ రావు గారి పేరు మీద- భావితరాలకు స్ఫూర్తినిచ్చే వారికి అవార్డులు ఇవ్వడం గొప్ప సంప్రదాయం •⁠ ⁠ రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘వ్యక్తి తన జీవితంలో సాధించే విజయం కంటే, సమాజ మార్పు కోసం సాగించే ప్రయాణం చాలా మరపురాని అనుభూతి ఇస్తుంది. చరిత్రలో నిలిచిపోతుంది’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సమాజం కోసం అహర్నిశలు శ్రమించిన ఓ వ్యక్తి గుర్తుగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వివిధ రంగాల వారిని సత్కరించుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. ఒకే వేదికపై విభిన్న ప్రతిభ కలిగిన, సమాజానికి దిక్సూచిగా మారిన వారిని సత్కరిస్తున్న రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం గొప్ప కార్యక్రమంగా నిలిచిపోతుందన్నారు. రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు శ్రీ రామోజీరావు గారి 90వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని రామోజీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డు ల కార్యక్రమానికి గౌరవ కేంద్ర హోం మంత్రివర్యులు శ్రీ @AmitShah గారు, గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు, కేంద్రమంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారితో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ "ఈ అవార్డుల వెనకున్న గొప్ప ఆలోచనకి స్ఫూర్తినిచ్చిన దివంగత పద్మభూషణ్ శ్రీ రామోజీరావు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినా ఆయన కృషి, పట్టుదలతో ఈనాడు, ఈటీవీ వంటి సంస్థలను నిర్మించారు. ఆసియాలోనే ప్రముఖమైన సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేశారు. తెలుగు పత్రికా రంగానికి, భాషకి ఆయన అందించిన సేవలు గుర్తుంచుకోదగినవి. పని పట్ల ఆయనకున్న అంకితభావం, క్రమశిక్షణ, నిరంతరం కొత్తగా ఆలోచించే తత్త్వం నేటి తరానికి కూడా స్ఫూర్తి దాయకం. •⁠ ⁠ పలు విషయాలపై చర్చించేవారు కొన్ని సందర్భాల్లో వారిని నేను ప్రత్యక్షంగా కలిశాను. ఫిల్మ్ సిటీలో షూటింగుల్లో ఉన్నప్పుడు కావచ్చు, కొన్ని సందర్భాల్లో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి గానీ వారితో కలిశాను. వారితోనూ కిరణ్ గారితోనూ, ఇతర కుటుంబ సభ్యులతోనూ కరోనా అనంతరం కలిసాను. ఆ సమయంలో రామోజీరావు గారి దగ్గర నుంచి దేశంలోని అన్ని విషయాల పట్ల చర్చ ఉండేది. ఆయన విషయ అవగాహన చూసి నాకు ఆశ్చర్యం వేసేది. శ్రీ రామోజీరావు గారి మనోభావాలు దేశ సమగ్రత, ప్రజాస్వామ్యం కోసం వారు పడ్డ తపన, ఆరోజు వారితో పంచుకున్న భావాలు నాకు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఆ సందర్భంలో ఆయన "ఈనాడు" గురించి చాలా విషయాలు చెప్పారు. వార్తలను ప్రజలకు చేరవేయడంతో పాటు సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. •⁠ ⁠ సమాజంపై ఎంతో బాధ్యత ఉంది శ్రీ రామోజీరావు గారు ఆలోచనలో సమాజం పై బాధ్యత కనిపిస్తుంది. సారా వ్యతిరేక ఉద్యమం, సమాచార హక్కుపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ వంటి అంశాలల్లో ప్రజలకు ఎలా చైతన్యం కల్పించారో ఆయన నాకు వివరించారు. వారి కృషి, కార్యదక్షత, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తి. ఆయన స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఈ రోజు పురస్కారాలు అందుకుంటున్న వారి జీవితాలు చాలా గొప్ప విలువైన విషయాలు నేర్పుతాయి. శారీరక వైకల్యాన్ని అధిగమించి సంగీతంలో గుర్తింపు సాధించిన వారు, పేదల పిల్ల విద్య కోసం పని చేస్తున్నవారు, గిరిజన హక్కులు, రైతు సమస్యలు, పర్యావరణ పరిరక్షణ కోసం కలంతో పోరాడుతున్న జర్నలిస్టులు, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, జల సంరక్షణ, వైద్య రంగం, గ్రామీణ మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్న వారు.. ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. వైద్య విద్యలో వివక్షతను ఎదుర్కొని న్యాయ పోరాటంతో విజయం సాధించిన వారి సంకల్పం చాలా అభినందనీయం. వైకల్యం మనిషి శరీరానికి ఉండవచ్చు.. కానీ సంకల్పానికి ఉండకూడదు. పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి. మన పట్టుదలే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి విజయం, అతని వ్యక్తిగత ఎదుగుదలతో ఆగిపోకూడదు. ఆ విజయం మరొకరి జీవితంలో వెలుగు నింపినప్పుడే దానికి సంపూర్ణమైన అర్థం వస్తుంది. ఈ రోజు అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారం మీ కృషికి లభించిన గుర్తింపు మాత్రమే కాదు.. మీ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రోత్సాహం కూడా మీ విజయాలు మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. మన కోసం...మనం సాధించేది విజయం. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందించే స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తిని అందించిన రామోజీ రావు గారిని మరోమారు తలుచుకుంటూ వారి అడుగుజాడలు, స్ఫూర్తి, మనందరికీ ఒక బలమైన దారి వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను" అన్నారు.
47
386
5
2,260
25,376
JSP Dhalam జనసేన దళం retweeted
True patriotism is not measured by words spoken, but by the courage to stand firm for one’s nation’s freedom, dignity and self-respect. On the death anniversary of Punjab Kesari Lala Lajpat Rai Ji, I pay my humble tributes to the fearless freedom fighter whose life was defined by courage, conviction and unwavering commitment to Bharat’s independence. His resistance against the Simon Commission and the injuries he sustained during the protest stand as a powerful reminder of the sacrifices made by our freedom fighters. His spirit could never be silenced, and his sacrifice strengthened the resolve of a nation determined to be free. Lala Lajpat Rai Ji’s life reminds us that a nation is built by those who place duty above comfort, courage above fear and the greater good above themselves. May his legacy continue to inspire generations to serve Bharat with integrity, conviction and an unshakeable sense of national responsibility. - @PawanKalyan #LalaLajpatRai #PunjabKesari
9
118
1
479
6,756
JSP Dhalam జనసేన దళం retweeted
అక్వాన్ తుపాన్ పట్ల అత్యంత అప్రమత్తత అవసరం •గత రెండు తుపాన్లతో పోలిస్తే అక్వాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం •రేపటి నుంచి తీర ప్రాంత జిల్లాలపై తుపాను ప్రభావం •నెల్లూరు - తుని మధ్య తీరం తాకనుందని వాతావరణ శాఖ చెబుతోంది •భారీ వర్షాలు, వరదలపై ముందస్తు హెచ్చరికలతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి •ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదు.. గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీరు, ఆహారం అందుబాటులో ఉంచాలి •అక్వాన్ తుపాను నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు సమీక్ష అక్వాన్ తుపాను రూపంలో రాష్ట్రంపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న మరో విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్.డబ్ల్యూ.ఎస్. సిబ్బంది సర్వ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గత రెండు తుపానులతో పోలిస్తే అక్వాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా గ్రామాల్లో, ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం క్యాంపు కార్యాలయంలో తన పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్నబ్, మురసు తుపానుల కారణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టం, ప్రస్తుత తుపాను తీవ్రత హెచ్చరికలు తదితర అంశాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అక్వాన్ తుపాను ఈ నెల 20వ తేదీన నెల్లూరు- తుని మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని, వాతావరణ శాఖ అంచనాల మేరకు తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలు తెలిపారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ నెల 19, 20 తేదీల్లో తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో అత్యంత అప్రమత్తత అవసరమని, అందుకు తగిన విధంగా పంచాయతీరాజ్ సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్టు స్పష్టం చేశారు. తీవ్ర తుపాను సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నష్ట నివారణ చర్యలపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తదితర విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “నెల రోజుల వ్యవధిలో అర్నబ్, మురసు రూపంలో రెండు తుపాన్లు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణనష్టం లేనప్పటికీ, పంట నష్టం, ఆస్తి నష్టం తప్పలేదు. తుపానుల కారణంగా దాదాపు 520 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు ధ్వంసమయ్యాయి. అందుకు సంబంధించిన నివేదిక తెప్పించుకుని, ధ్వంసమైన రోడ్లు వెంటనే పునరుద్ధరించేలా ఆదేశాలిచ్చాం. గత రెండు తుపానులకు స్పందించిన విధంగానే అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు పూర్తి యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటే, మొదట ఉపరితల భాగం దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. రోడ్లకు అడ్డంగా చెట్లు కూలితే తక్షణం వాటిని తొలగించే ఏర్పాట్లు చేయాలి. అక్వాన్ తుపాను గమనంపై స్పష్టత లోపించినందున, తీవ్ర తుపాను తీరం తాకే అవకాశాలున్న అన్ని జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం, వాతావరణ శాఖ నుంచి వచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలి. గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు తగ్గిన వెంటనే నీరు వెళ్లిపోయేలా ఏర్పాటు చేయాలి. పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. రైతుల్ని అప్రమత్తం చేయండి గ్రామీణ ప్రాంతాల్లో వరి పంట చేతికి వస్తుందనగా అక్వాన్ తుపాను రూపంలో విపత్తు సంభవించడం దురదృష్టకరం. రైతులకు పంట నష్టం తగ్గించేందుకు కూడా పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది తగిన సహకారం అందించాలి. కోతకు వచ్చిన పంటను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. దీంతో పాటు విద్యుత్ స్తంభాలు పెద్ద ఎత్తున నేలకొరిగే అవకాశాలు ఉన్నందున, వాటి తక్షణ పునరుద్ధరణకు విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలి. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల వివరాలు తక్షణం సేకరించి, పునరుద్ధరణ ప్రక్రియ త్వరగా ప్రారంభం కావాలి. ప్రజలు బీచ్‌ల వైపు వెళ్లకుండా, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవల తుపాను గాలుల్లో చిక్కుకున్న తమిళనాడు మత్స్యకారుల జీవితాలు విషాదాంతమైన విషయాన్ని ప్రస్తావించాలి. ప్రజలు ప్రభుత్వం నుంచి వచ్చే హెచ్చరికలను తూచా తప్పకుండా పాటిస్తూ, యంత్రాంగానికి సహకరించాలని, తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు క్షేత్రస్థాయి సిబ్బందితో సహా యంత్రాంగమంతా గ్రామాల్లోనే ఉండాలని అన్నారు. ప్రజల ప్రాణాల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల”ని ఆదేశించారు. @PIB_India @IPR_AP @pibvijayawada
17
220
3
788
20,464
JSP Dhalam జనసేన దళం retweeted
She wore the crown of a queen, but carried the courage of an entire nation. On the birth anniversary of Veerangana Rani Lakshmibai Ji, I offer my heartfelt tributes to the fearless Queen of Jhansi, whose extraordinary valour and unwavering resistance against British rule became an immortal chapter in India’s freedom struggle. At a time when standing up to an empire demanded extraordinary courage, she led from the front, inspiring countless others through her fearless spirit and determination. Rani Lakshmibai Ji’s life reminds us that courage knows no gender, patriotism knows no boundaries, and the determination to defend one’s dignity and freedom can never be defeated. Her legacy continues to inspire generations to stand with conviction, strength and self-respect. - @PawanKalyan #RaniLakshmibai #JhansiKiRani
7
141
1
659
9,107
విశాఖపట్నం మిసెస్ ఏవీఎన్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ పి. కృష్ణకుమారి అధ్యక్షతన, కళాశాల సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో 59వ గ్రంథాలయ వారోత్సవాలను ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ పుస్తక పఠనం గ్రంధాలయాల ప్రాముఖ్యత దండాలయాల మహోత్సవంలో పాల్గొన్న ప్రముఖుల జీవితాల గురించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ పాల్గొని, విద్యార్థులకు వివరించారు. భారతదేశంలో మాదకద్రవ్యం రహిత సమాజంగా తీర్చిదిద్దే పౌరస సమాజంలో భాగమవ్వాలని విద్యార్థిని విద్యార్థులు పిలుపునిచ్చారు.రాబోయే 60వ జాతీయ గ్రంథాలయ వారోత్సవానికి ఒక రచయితగా విద్యార్థులు తయారవ్వాలని కోరారు ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పి. కృష్ణకుమారి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి జీవితంలో పుస్తక పఠనం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుందని, విద్యార్థులందరూ కళాశాల గ్రంథాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగత కుమార్ రాజా మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కళాశాల లైబ్రేరియన్ ప్రియాంక సమన్వయంలో నిర్వహించబడింది. కార్యక్రమంలో కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎ. అర్చన, తెలుగు అధ్యాపకురాలు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డి. గాయత్రి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.Pawan KalyanJanaSena PartyDeputy CMO, Andhra PradeshNara LokeshSiva Sankara Rao TammireddyJanaSena ShatagniRam TalluriGonuguntla KoteswaraoNara Chandrababu NaiduAndhra Pradesh CMNaga BabuZilla Grandhalaya Samstha Visakhapatnam
4
12
272
JSP Dhalam జనసేన దళం retweeted
అగ్ని ప్రమాదంలో వలలు కోల్పోయిన మత్స్యకారులకు అండగా నిలవండి •పరిహారం చెల్లించే ఏర్పాటు చేయండి •ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె. పల్లెపాలెంలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులు షెడ్లలో ఉంచిన వలలు దగ్ధమైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులంతా వలలు షెడ్లలో ఉంచుకోగా , అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించినట్టు కలెక్టర్ వివరించారు. మొత్తం 250 నుంచి 300 వరకు వలలు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు. తుపాను కారణంగా వేట విరామం ఉండడం, వలలు కాలిపోవడంతో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా బాధిత కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందజేయాలని కలెక్టర్‌ ను ఆదేశించారు. నష్టపరిహారం అందించాలని, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2.O పథకం కింద నష్టపోయిన వలలను తిరిగి అందించే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వలలు నష్టపోయిన మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. @PIB_India @IPR_AP @pibvijayawada
6
177
2
771
22,512
JSP Dhalam జనసేన దళం retweeted
అక్వాన్ తుపాన్ పట్ల అత్యంత అప్రమత్తత అవసరం •గత రెండు తుపాన్లతో పోలిస్తే అక్వాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం •రేపటి నుంచి తీర ప్రాంత జిల్లాలపై తుపాను ప్రభావం •నెల్లూరు - తుని మధ్య తీరం తాకనుందని వాతావరణ శాఖ చెబుతోంది •భారీ వర్షాలు, వరదలపై ముందస్తు హెచ్చరికలతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి •ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదు.. గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీరు,ఆహారం అందుబాటులో ఉంచాలి •అక్వాన్ తుపాను నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు సమీక్ష అక్వాన్ తుపాను రూపంలో రాష్ట్రంపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న మరో విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్.డబ్ల్యూ.ఎస్. సిబ్బంది సర్వ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గత రెండు తుపానులతో పోలిస్తే అక్వాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా గ్రామాల్లో, ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం క్యాంపు కార్యాలయంలో తన పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్నబ్, మురసు తుపానుల కారణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టం, ప్రస్తుత తుపాను తీవ్రత హెచ్చరికలు తదితర అంశాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అక్వాన్ తుపాను ఈ నెల 20వ తేదీన నెల్లూరు- తుని మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని, వాతావరణ శాఖ అంచనాల మేరకు తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 120నుంచి145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలు తెలిపారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ నెల19,20 తేదీల్లో తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో అత్యంత అప్రమత్తత అవసరమని, అందుకు తగిన విధంగా పంచాయతీరాజ్ సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్టు స్పష్టం చేశారు. తీవ్ర తుపాను సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,నష్ట నివారణ చర్యలపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తదితర విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ“నెల రోజుల వ్యవధిలో అర్నబ్, మురసు రూపంలో రెండు తుపాన్లు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణనష్టం లేనప్పటికీ, పంట నష్టం,ఆస్తి నష్టం తప్పలేదు. తుపానుల కారణంగా దాదాపు 520 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు ధ్వంసమయ్యాయి. అందుకు సంబంధించిన నివేదిక తెప్పించుకుని, ధ్వంసమైన రోడ్లు వెంటనే పునరుద్ధరించేలా ఆదేశాలిచ్చాం. గత రెండు తుపానులకు స్పందించిన విధంగానే అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు పూర్తి యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటే, మొదట ఉపరితల భాగం దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. రోడ్లకు అడ్డంగా చెట్లు కూలితే తక్షణం వాటిని తొలగించే ఏర్పాట్లు చేయాలి. అక్వాన్ తుపాను గమనంపై స్పష్టత లోపించినందున,తీవ్ర తుపాను తీరం తాకే అవకాశాలున్న అన్ని జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం,వాతావరణ శాఖ నుంచి వచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలి. గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు తగ్గిన వెంటనే నీరు వెళ్లిపోయేలా ఏర్పాటు చేయాలి. పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. రైతుల్ని అప్రమత్తం చేయండి గ్రామీణ ప్రాంతాల్లో వరిపంట చేతికి వస్తుందనగా అక్వాన్ తుపాను రూపంలో విపత్తు సంభవించడం దురదృష్టకరం. రైతులకు పంట నష్టం తగ్గించేందుకు కూడా పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది తగిన సహకారం అందించాలి. కోతకు వచ్చిన పంటను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.దీంతో పాటు విద్యుత్ స్తంభాలు పెద్ద ఎత్తున నేలకొరిగే అవకాశాలు ఉన్నందున,వాటి తక్షణ పునరుద్ధరణకు విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలి.భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల వివరాలు తక్షణం సేకరించి, పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభం కావాలి
5
283
4
1,046
34,839
JSP Dhalam జనసేన దళం retweeted
సమాజం బాగుండాలని కోరుకున్న దివంగత శ్రీ రామోజీ రావు గారు * ఆయనలో సమాజకాంక్ష బలంగా ఉండేది * ⁠ దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువల కోసం తపించారు * తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు అపారం * సమాజాన్ని చైతన్యవంతం చేయాలని భావించేవారు * శ్రీ రామోజీ రావు గారి పేరు మీద- భావితరాలకు స్ఫూర్తినిచ్చే వారికి అవార్డులు ఇవ్వడం గొప్ప సంప్రదాయం * రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘వ్యక్తి తన జీవితంలో సాధించే విజయం కంటే, సమాజ మార్పు కోసం సాగించే ప్రయాణం చాలా మరపురాని అనుభూతి ఇస్తుంది. చరిత్రలో నిలిచిపోతుంది’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సమాజం కోసం అహర్నిశలు శ్రమించిన ఓ వ్యక్తి గుర్తుగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వివిధ రంగాల వారిని సత్కరించుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. ఒకే వేదికపై విభిన్న ప్రతిభ కలిగిన, సమాజానికి దిక్సూచిగా మారిన వారిని సత్కరిస్తున్న రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం గొప్ప కార్యక్రమంగా నిలిచిపోతుందన్నారు. రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు శ్రీ రామోజీరావు గారి 90వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని రామోజీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డు ల కార్యక్రమానికి గౌరవ కేంద్ర హోం మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు, గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్రమంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారితో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ "ఈ అవార్డుల వెనకున్న గొప్ప ఆలోచనకి స్ఫూర్తినిచ్చిన దివంగత పద్మభూషణ్ శ్రీ రామోజీరావు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినా ఆయన కృషి, పట్టుదలతో ఈనాడు, ఈటీవీ వంటి సంస్థలను నిర్మించారు. ఆసియాలోనే ప్రముఖమైన సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేశారు. తెలుగు పత్రికా రంగానికి, భాషకి ఆయన అందించిన సేవలు గుర్తుంచుకోదగినవి. పని పట్ల ఆయనకున్న అంకితభావం, క్రమశిక్షణ, నిరంతరం కొత్తగా ఆలోచించే తత్త్వం నేటి తరానికి కూడా స్ఫూర్తి దాయకం. #RamojiExcellenceAwards2026
66
674
14
3,774
131,089
JSP Dhalam జనసేన దళం retweeted
అగ్ని ప్రమాదంలో వలలు కోల్పోయిన మత్స్యకారులకు అండగా నిలవండి •పరిహారం చెల్లించే ఏర్పాటు చేయండి •ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె. పల్లెపాలెంలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారులు షెడ్లలో ఉంచిన వలలు దగ్ధమైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులంతా వలలు షెడ్లలో ఉంచుకోగా , అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించినట్టు కలెక్టర్ వివరించారు. మొత్తం 250 నుంచి 300 వరకు వలలు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు. తుపాను కారణంగా వేట విరామం ఉండడం, వలలు కాలిపోవడంతో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా బాధిత కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందజేయాలని కలెక్టర్‌ ను ఆదేశించారు. నష్టపరిహారం అందించాలని, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2.O పథకం కింద నష్టపోయిన వలలను తిరిగి అందించే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వలలు నష్టపోయిన మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.
6
329
1,180
34,524
JSP Dhalam జనసేన దళం retweeted
పలు విషయాలపై చర్చించేవారు కొన్ని సందర్భాల్లో వారిని నేను ప్రత్యక్షంగా కలిశాను. ఫిల్మ్ సిటీలో షూటింగుల్లో ఉన్నప్పుడు కావచ్చు, కొన్ని సందర్భాల్లో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి గానీ వారితో కలిశాను. వారితోనూ కిరణ్ గారితోనూ, ఇతర కుటుంబ సభ్యులతోనూ కరోనా అనంతరం కలిసాను. ఆ సమయంలో రామోజీరావు గారి దగ్గర నుంచి దేశంలోని అన్ని విషయాల పట్ల చర్చ ఉండేది. ఆయన విషయ అవగాహన చూసి నాకు ఆశ్చర్యం వేసేది. శ్రీ రామోజీరావు గారి మనోభావాలు దేశ సమగ్రత, ప్రజాస్వామ్యం కోసం వారు పడ్డ తపన, ఆరోజు వారితో పంచుకున్న భావాలు నాకు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఆ సందర్భంలో ఆయన "ఈనాడు" గురించి చాలా విషయాలు చెప్పారు. వార్తలను ప్రజలకు చేరవేయడంతో పాటు సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. *సమాజంపై ఎంతో బాధ్యత ఉంది శ్రీ రామోజీరావు గారు ఆలోచనలో సమాజం పై బాధ్యత కనిపిస్తుంది. సారా వ్యతిరేక ఉద్యమం, సమాచార హక్కుపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ వంటి అంశాలల్లో ప్రజలకు ఎలా చైతన్యం కల్పించారో ఆయన నాకు వివరించారు. వారి కృషి, కార్యదక్షత, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తి. ఆయన స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఈ రోజు పురస్కారాలు అందుకుంటున్న వారి జీవితాలు చాలా గొప్ప విలువైన విషయాలు నేర్పుతాయి. శారీరక వైకల్యాన్ని అధిగమించి సంగీతంలో గుర్తింపు సాధించిన వారు, పేదల పిల్ల విద్య కోసం పని చేస్తున్నవారు, గిరిజన హక్కులు, రైతు సమస్యలు, పర్యావరణ పరిరక్షణ కోసం కలంతో పోరాడుతున్న జర్నలిస్టులు, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, జల సంరక్షణ, వైద్య రంగం, గ్రామీణ మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్న వారు.. ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. వైద్య విద్యలో వివక్షతను ఎదుర్కొని న్యాయ పోరాటంతో విజయం సాధించిన వారి సంకల్పం చాలా అభినందనీయం. వైకల్యం మనిషి శరీరానికి ఉండవచ్చు.. కానీ సంకల్పానికి ఉండకూడదు. పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి. మన పట్టుదలే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది ఒక వ్యక్తి విజయం, అతని వ్యక్తిగత ఎదుగుదలతో ఆగిపోకూడదు. ఆ విజయం మరొకరి జీవితంలో వెలుగు నింపినప్పుడే దానికి సంపూర్ణమైన అర్థం వస్తుంది. ఈ రోజు అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారం మీ కృషికి లభించిన గుర్తింపు మాత్రమే కాదు.. మీ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రోత్సాహం కూడా మీ విజయాలు మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. మన కోసం...మనం సాధించేది విజయం. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందించే స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తిని అందించిన రామోజీ రావు గారిని మరోమారు తలుచుకుంటూ వారి అడుగుజాడలు, స్ఫూర్తి, మనందరికీ ఒక బలమైన దారి వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను" అన్నారు.
2
176
735
14,233
JSP Dhalam జనసేన దళం retweeted
రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #RamojiExcellenceAwards2026
27
1,087
16
5,844
113,741
భీమునిపట్నం *59వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు మరియు పత్రికా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ* డిజిటల్ యుగంలో విద్యార్థులు దూరం అయిపోతున్న పుస్తక పటనాన్ని గ్రంథాలయాల్లో జీవితాన్ని నేర్పించే జ్ఞాన బండాగారాన్ని అవగాహన చేసుకోవాలి గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ @PawanKalyan @APDeputyCMO @ncbn @AndhraPradeshCM @TrendPSPK @JanaSenaParty @naralokesh @NagaBabuOffl @JSPShatagniTeam @TSivasankararao @itsRamTalluri @mnadendla @sribharatm @Ganta_Srinivasa @iTDP_Official @zgsvsp @GVMC_VISAKHA
1
7
186
యువత, విద్యార్ధులలో ఆసక్తి పెంచిన సాహిత్య సదస్సు -------- *59వ గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా ఎమ్.వి.పి. కాలని, సెక్టార్-7లో ఉన్న శాఖా గ్రంధాలయంలో "సాహిత్య సదస్సు" నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన విశాఖ ఉమ్మడి జిల్లా గ్రంధాలయ అధ్యక్షులు శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ గారు* పుస్తక పఠన ఆవశ్యకత వివరిస్తూ దాని వల్లనే సాహిత్యంలో పట్టు దొరుకుతుందని, విద్యార్ధులు తమ వారాంతపు శెలవుల్లో దగ్గరగా ఉన్న గ్రంధాలయాలను దర్శించి పుస్తకాలు చదవాలని చెప్పి, గ్రంధాలయాలను ఆధునీకరించడం, రీడింగ్ రూముల సదుపాయాన్ని పెంచడానికి కృషిచేస్తున్నట్లు తెలియచేసారు. విద్యార్ధులు వ్యాసరచన పోటీలలో విరివిగా పాల్గొనాలని త్వరలోనే తాము జిల్లా స్ధాయిలో నిర్వహించే వ్యాస రచన పోటీలలో పాల్గొని బహుమతులు పొందాలని ఆకాంక్షించారు. సభకు అధ్యక్షత వహించిన రచయిత, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విశ్రాంత అధికారి సుసర్ల సర్వేశ్వర శాస్త్రి మాతృభాషను నేర్చుకుంటే సాహిత్యంలో ఉన్న కథ, కవిత, పద్యం ఏ ప్రక్రియ అయినా సులభంగా పట్టుపడుతుందని, పుస్తక పఠనంవల్ల భాషపై పట్టు, ఆలోచనా శక్తి పెరుగుతాయని చెప్పారు. మరో అతిధి రచయిత, విశాఖ రచయితల సంఘం కార్యదర్శి శ్రీ అడపా రామకృష్ణ సాహిత్యంలో ఉన్న మెళకువలు, సులభతరమైన కొన్ని కవితలు రాసే విధానాలు వివరించారు. మరో ఆత్మీయ అతిధి రచయిత, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విశ్రాంత హిందీ అధికారి తెలుగు భాష గొప్పదనం, సాహిత్యంలోని చమక్కులు సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సాయికుమార్, శ్రీమతి సత్యశ్రీ గారు, యువతీ, యువకులు, జె.కె.స్కూల్ విద్యార్ధిని, విద్యార్ధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందు విద్యార్ధులతో తెలుగు బాలల కథల పుస్తకాలు చదివించారు. యువత, విద్యార్ధులు ఆసక్తికరంగా సదస్సులో పాల్గొని శెలవుల్లో గ్రంధాలయానికి వస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు గ్రంధాలయ అధికారి కె.వి.ఎ. ఉమామహేశ్వరరావు చిరు సత్కారం చేసి సాహిత్య సదస్సులో పాల్గొన్నవారికి ధన్యవాదాలు తెలియచేసారు. @APDeputyCMO @PawanKalyan @naralokesh @AndhraPradeshCM @JanaSenaParty @JSPShatagniTeam @itsRamTalluri @TSivasankararao @NagaBabuOffl @JSPTelangana @JSPVeeraMahila
4
12
189
నేడు మాకవారపాలెం శాఖ గ్రంథాలయం నర్సీపట్నం శాఖ గ్రంధాలయం రోలుగుంట శాఖ గ్రంధాలయంల్లో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నేడు పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు గ్రంథాలయాలను ఒక దేవాలయం గా భావించి భావితరాలకు జ్ఞాన సమూపార్జన అందజేసే విధంగా పుస్తకభాండాగరాలని కాపాడుకోవాలని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ఆయా శాఖ గ్రంధాలయ పాలకులను అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి కుమార్ రాజా మరియు బాల బాలికలు పాల్గొన్నారు @APDeputyCMO @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam @AndhraPradeshCM @naralokesh @TSivasankararao @JSPVeeraMahila @NagaBabuOffl @itsRamTalluri @JanaswaramNews @TrendPSPK
1
5
37
400