
Combined VISAKHA District Library Authority Chairman MA Public Admin, MA Human Rights @JSPDhalam Grass Roots Level Democracy @Pawankalyan @JanasenaParty
Joined September 2019
- Tweets14.3K
- Following130
- Followers1.6K
- Likes11.7K
Vannemreddy Satish Kumar retweeted
గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాము.
Vannemreddy Satish Kumar retweeted
She wore the crown of a queen, but carried the courage of an entire nation.
On the birth anniversary of Veerangana Rani Lakshmibai Ji, I offer my heartfelt tributes to the fearless Queen of Jhansi, whose extraordinary valour and unwavering resistance against British rule became an immortal chapter in India’s freedom struggle. At a time when standing up to an empire demanded extraordinary courage, she led from the front, inspiring countless others through her fearless spirit and determination.
Rani Lakshmibai Ji’s life reminds us that courage knows no gender, patriotism knows no boundaries, and the determination to defend one’s dignity and freedom can never be defeated. Her legacy continues to inspire generations to stand with conviction, strength and self-respect.
- @PawanKalyan
#RaniLakshmibai #JhansiKiRani
Vannemreddy Satish Kumar retweeted
Great to see Andhra Pradesh Deputy Chief Minister @APDeputyCMO again for a productive discussion on strengthening 🇦🇺🇮🇳 collaboration in environmental and sustainable development.
@PawanKalyan
Vannemreddy Satish Kumar retweeted
అక్వాన్ తుపాన్ పట్ల అత్యంత అప్రమత్తత అవసరం
•గత రెండు తుపాన్లతో పోలిస్తే అక్వాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం
•రేపటి నుంచి తీర ప్రాంత జిల్లాలపై తుపాను ప్రభావం
•నెల్లూరు - తుని మధ్య తీరం తాకనుందని వాతావరణ శాఖ చెబుతోంది
•భారీ వర్షాలు, వరదలపై ముందస్తు హెచ్చరికలతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి
•ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదు.. గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీరు,ఆహారం అందుబాటులో ఉంచాలి
•అక్వాన్ తుపాను నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు సమీక్ష
అక్వాన్ తుపాను రూపంలో రాష్ట్రంపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న మరో విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్.డబ్ల్యూ.ఎస్. సిబ్బంది సర్వ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గత రెండు తుపానులతో పోలిస్తే అక్వాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా గ్రామాల్లో, ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం క్యాంపు కార్యాలయంలో తన పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్నబ్, మురసు తుపానుల కారణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టం, ప్రస్తుత తుపాను తీవ్రత హెచ్చరికలు తదితర అంశాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు.
అక్వాన్ తుపాను ఈ నెల 20వ తేదీన నెల్లూరు- తుని మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని, వాతావరణ శాఖ అంచనాల మేరకు తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 120నుంచి145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలు తెలిపారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ నెల19,20 తేదీల్లో తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో అత్యంత అప్రమత్తత అవసరమని, అందుకు తగిన విధంగా పంచాయతీరాజ్ సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
తీవ్ర తుపాను సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,నష్ట నివారణ చర్యలపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తదితర విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ“నెల రోజుల వ్యవధిలో అర్నబ్, మురసు రూపంలో రెండు తుపాన్లు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణనష్టం లేనప్పటికీ, పంట నష్టం,ఆస్తి నష్టం తప్పలేదు. తుపానుల కారణంగా దాదాపు 520 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు ధ్వంసమయ్యాయి. అందుకు సంబంధించిన నివేదిక తెప్పించుకుని, ధ్వంసమైన రోడ్లు వెంటనే పునరుద్ధరించేలా ఆదేశాలిచ్చాం. గత రెండు తుపానులకు స్పందించిన విధంగానే అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు పూర్తి యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటే, మొదట ఉపరితల భాగం దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. రోడ్లకు అడ్డంగా చెట్లు కూలితే తక్షణం వాటిని తొలగించే ఏర్పాట్లు చేయాలి.
అక్వాన్ తుపాను గమనంపై స్పష్టత లోపించినందున,తీవ్ర తుపాను తీరం తాకే అవకాశాలున్న అన్ని జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం,వాతావరణ శాఖ నుంచి వచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలి. గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు తగ్గిన వెంటనే నీరు వెళ్లిపోయేలా ఏర్పాటు చేయాలి. పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
రైతుల్ని అప్రమత్తం చేయండి
గ్రామీణ ప్రాంతాల్లో వరిపంట చేతికి వస్తుందనగా అక్వాన్ తుపాను రూపంలో విపత్తు సంభవించడం దురదృష్టకరం. రైతులకు పంట నష్టం తగ్గించేందుకు కూడా పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది తగిన సహకారం అందించాలి. కోతకు వచ్చిన పంటను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.దీంతో పాటు విద్యుత్ స్తంభాలు పెద్ద ఎత్తున నేలకొరిగే అవకాశాలు ఉన్నందున,వాటి తక్షణ పునరుద్ధరణకు విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలి.భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల వివరాలు తక్షణం సేకరించి, పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభం కావాలి
Vannemreddy Satish Kumar retweeted
సమాజం బాగుండాలని కోరుకున్న దివంగత శ్రీ రామోజీ రావు గారు
• ఆయనలో సమాజకాంక్ష బలంగా ఉండేది
• దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువల కోసం తపించారు
• తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు అపారం
• సమాజాన్ని చైతన్యవంతం చేయాలని భావించేవారు
• శ్రీ రామోజీ రావు గారి పేరు మీద- భావితరాలకు స్ఫూర్తినిచ్చే వారికి అవార్డులు ఇవ్వడం గొప్ప సంప్రదాయం
• రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
‘వ్యక్తి తన జీవితంలో సాధించే విజయం కంటే, సమాజ మార్పు కోసం సాగించే ప్రయాణం చాలా మరపురాని అనుభూతి ఇస్తుంది. చరిత్రలో నిలిచిపోతుంది’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సమాజం కోసం అహర్నిశలు శ్రమించిన ఓ వ్యక్తి గుర్తుగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వివిధ రంగాల వారిని సత్కరించుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. ఒకే వేదికపై విభిన్న ప్రతిభ కలిగిన, సమాజానికి దిక్సూచిగా మారిన వారిని సత్కరిస్తున్న రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం గొప్ప కార్యక్రమంగా నిలిచిపోతుందన్నారు.
రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు శ్రీ రామోజీరావు గారి 90వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని రామోజీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డు ల కార్యక్రమానికి గౌరవ కేంద్ర హోం మంత్రివర్యులు శ్రీ @AmitShah గారు, గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు, కేంద్రమంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారితో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ "ఈ అవార్డుల వెనకున్న గొప్ప ఆలోచనకి స్ఫూర్తినిచ్చిన దివంగత పద్మభూషణ్ శ్రీ రామోజీరావు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినా ఆయన కృషి, పట్టుదలతో ఈనాడు, ఈటీవీ వంటి సంస్థలను నిర్మించారు. ఆసియాలోనే ప్రముఖమైన సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేశారు. తెలుగు పత్రికా రంగానికి, భాషకి ఆయన అందించిన సేవలు గుర్తుంచుకోదగినవి. పని పట్ల ఆయనకున్న అంకితభావం, క్రమశిక్షణ, నిరంతరం కొత్తగా ఆలోచించే తత్త్వం నేటి తరానికి కూడా స్ఫూర్తి దాయకం.
• పలు విషయాలపై చర్చించేవారు
కొన్ని సందర్భాల్లో వారిని నేను ప్రత్యక్షంగా కలిశాను. ఫిల్మ్ సిటీలో షూటింగుల్లో ఉన్నప్పుడు కావచ్చు, కొన్ని సందర్భాల్లో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి గానీ వారితో కలిశాను.
వారితోనూ కిరణ్ గారితోనూ, ఇతర కుటుంబ సభ్యులతోనూ కరోనా అనంతరం కలిసాను. ఆ సమయంలో రామోజీరావు గారి దగ్గర నుంచి దేశంలోని అన్ని విషయాల పట్ల చర్చ ఉండేది. ఆయన విషయ అవగాహన చూసి నాకు ఆశ్చర్యం వేసేది.
శ్రీ రామోజీరావు గారి మనోభావాలు దేశ సమగ్రత, ప్రజాస్వామ్యం కోసం వారు పడ్డ తపన, ఆరోజు వారితో పంచుకున్న భావాలు నాకు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఆ సందర్భంలో ఆయన "ఈనాడు" గురించి చాలా విషయాలు చెప్పారు. వార్తలను ప్రజలకు చేరవేయడంతో పాటు సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు.
• సమాజంపై ఎంతో బాధ్యత ఉంది
శ్రీ రామోజీరావు గారు ఆలోచనలో సమాజం పై బాధ్యత కనిపిస్తుంది. సారా వ్యతిరేక ఉద్యమం, సమాచార హక్కుపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ వంటి అంశాలల్లో ప్రజలకు ఎలా చైతన్యం కల్పించారో ఆయన నాకు వివరించారు.
వారి కృషి, కార్యదక్షత, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తి.
ఆయన స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడం చాలా గౌరవంగా భావిస్తున్నాను.
ఈ రోజు పురస్కారాలు అందుకుంటున్న వారి జీవితాలు చాలా గొప్ప విలువైన విషయాలు నేర్పుతాయి. శారీరక వైకల్యాన్ని అధిగమించి సంగీతంలో గుర్తింపు సాధించిన వారు,
పేదల పిల్ల విద్య కోసం పని చేస్తున్నవారు, గిరిజన హక్కులు, రైతు సమస్యలు, పర్యావరణ పరిరక్షణ కోసం కలంతో పోరాడుతున్న జర్నలిస్టులు, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, జల సంరక్షణ, వైద్య రంగం, గ్రామీణ మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్న వారు.. ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. వైద్య విద్యలో వివక్షతను ఎదుర్కొని న్యాయ పోరాటంతో విజయం సాధించిన వారి సంకల్పం చాలా అభినందనీయం. వైకల్యం మనిషి శరీరానికి ఉండవచ్చు.. కానీ సంకల్పానికి ఉండకూడదు. పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి. మన పట్టుదలే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది.
ఒక వ్యక్తి విజయం, అతని వ్యక్తిగత ఎదుగుదలతో ఆగిపోకూడదు. ఆ విజయం మరొకరి జీవితంలో వెలుగు నింపినప్పుడే దానికి సంపూర్ణమైన అర్థం వస్తుంది. ఈ రోజు అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారం మీ కృషికి లభించిన గుర్తింపు మాత్రమే కాదు.. మీ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రోత్సాహం కూడా మీ విజయాలు మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. మన కోసం...మనం సాధించేది విజయం. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందించే స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తిని అందించిన రామోజీ రావు గారిని మరోమారు తలుచుకుంటూ వారి అడుగుజాడలు, స్ఫూర్తి, మనందరికీ ఒక బలమైన దారి వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను" అన్నారు.
Vannemreddy Satish Kumar retweeted
సమాజం బాగుండాలని కోరుకున్న దివంగత శ్రీ రామోజీ రావు గారు
* ఆయనలో సమాజకాంక్ష బలంగా ఉండేది
* దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువల కోసం తపించారు
* తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు అపారం
* సమాజాన్ని చైతన్యవంతం చేయాలని భావించేవారు
* శ్రీ రామోజీ రావు గారి పేరు మీద- భావితరాలకు స్ఫూర్తినిచ్చే వారికి అవార్డులు ఇవ్వడం గొప్ప సంప్రదాయం
* రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
‘వ్యక్తి తన జీవితంలో సాధించే విజయం కంటే, సమాజ మార్పు కోసం సాగించే ప్రయాణం చాలా మరపురాని అనుభూతి ఇస్తుంది. చరిత్రలో నిలిచిపోతుంది’ అని
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సమాజం కోసం అహర్నిశలు శ్రమించిన ఓ వ్యక్తి గుర్తుగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వివిధ రంగాల వారిని సత్కరించుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. ఒకే వేదికపై విభిన్న ప్రతిభ కలిగిన, సమాజానికి దిక్సూచిగా మారిన వారిని సత్కరిస్తున్న రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం గొప్ప కార్యక్రమంగా నిలిచిపోతుందన్నారు. రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు శ్రీ రామోజీరావు గారి 90వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని రామోజీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డు ల కార్యక్రమానికి గౌరవ కేంద్ర హోం మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు, గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్రమంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారితో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ "ఈ అవార్డుల వెనకున్న గొప్ప ఆలోచనకి స్ఫూర్తినిచ్చిన దివంగత పద్మభూషణ్ శ్రీ రామోజీరావు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి.
సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినా ఆయన కృషి, పట్టుదలతో ఈనాడు, ఈటీవీ వంటి సంస్థలను నిర్మించారు.
ఆసియాలోనే ప్రముఖమైన సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేశారు. తెలుగు పత్రికా రంగానికి, భాషకి ఆయన అందించిన సేవలు గుర్తుంచుకోదగినవి.
పని పట్ల ఆయనకున్న అంకితభావం, క్రమశిక్షణ, నిరంతరం కొత్తగా ఆలోచించే తత్త్వం నేటి తరానికి కూడా స్ఫూర్తి దాయకం.
#RamojiExcellenceAwards2026
Vannemreddy Satish Kumar retweeted
పల్లె పండుగ ద్వారా మెరుగైన రోడ్లు
గ్రామీణ ప్రగతికి మెట్లు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరచిన అభ్యర్థులను ఎన్నుకుందాం, అభివృద్ధిని కొనసాగిద్దాం.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
#CheppaamChestunnaam
Vannemreddy Satish Kumar retweeted
విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ సదస్సులో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
#CIIPartnershipSummit2026
Vannemreddy Satish Kumar retweeted
31st CII Partnership Summit 2026
Live Link: youtube.com/live/sTxvQ-axJO8…
Vannemreddy Satish Kumar retweeted
మీ కలతోపాటు.. ఆంధ్రప్రదేశ్ కలను నిజం చేయడంలో భాగస్వాములు కండి
•భవిష్యత్తు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ గొప్ప వేదిక
•గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ పెట్టుబడులు పెట్టాలి
•చిన్నస్థాయి పారిశ్రామికవేత్తలను కలుపుకొని వెళ్లండి
•శాంతిభద్రతల పరిరక్షణ, వేగంగా అనుమతులు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం
•క్షేత్రస్థాయిలో పెట్టుబడుల ప్రతిఫలాలు కనిపించాలి
•విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొని, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
‘ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని. పెట్టుబడిదారులు ఉన్నతమైన ఆలోచనలతో రాష్ట్రానికి రండి.. మీరు అత్యంత ఉన్నంతగా ఎదుగుతారు. మీరు ఓ స్పష్టమైన విజన్ తో పెట్టుబడులు పెట్టండి... రాష్ట్రం మీకు సొంతిల్లులా పని చేస్తుంది. మీరు భవిష్యత్తు మీద భరోసాతో ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి.. తక్కువ సమయంలో రాష్ట్ర కలను, మీ కలను నిజం చేసుకోండి’ అని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయి భద్రత, భరోసా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం వేదికగా రెండ్రోజుల పాటు జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 58 దేశాల నుంచి 3,800 మంది ప్రతినిధులు రావడంతో పాటు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా భేటీ అయి, రాష్ట్రానికి సీఐఐ సదస్సు వేదికగా రాబోతున్న పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను వివరించారు. అనంతరం సదస్సుకు హాజరైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించి, కేంద్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులతో కలిసి అరకు కాఫీను తాగారు. అనంతరం సదస్సులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ... “ఆంధ్రప్రదేశ్ 1053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు ముఖ ద్వారంగా రాష్ట్రం పనిచేస్తోంది. ఇక్కడ మానవవనరులు, ఇన్నోవేషన్ ఆలోచనలు, ప్రతిభ కలిగిన యువతరానికి కొదవ లేదు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తే, వారికి పూర్తిగా సహకరించేందుకు, వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది.
*పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే ముందున్నాం
1995లో సీఐఐ సదస్సులు ప్రారంభం అయిన దగ్గర నుంచి ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి ముందుకు సాగుతున్నాం. 2024లో జరిగిన సీఐఐ సదస్సులో 714 సంస్థలతో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాం. దాని ద్వారా 19.3 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా చేసుకున్నాం. ఇటీవల కాకినాడలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో 15 ఎంఓయూల ద్వారా రూ.4,256 కోట్ల పెట్టుబడులు పెట్టేలా, 14 వేల ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న 31వ సీఐఐ సదస్సులో సైతం 150 ఎంఓయూలు, రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నాం. ఇది రాష్ట్రానికి ప్రగతి బాట. భవిష్యత్తు తరాలకు పూలబాట. దేశంలోనే రాష్ట్రం పెట్టుబడుల సాధనలో ముందు ఉండటానికి స్థిరమైన ప్రభుత్వం, భవిష్యత్తుపై ఆశలు, ఆలోచనలే ప్రధానం. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేం తగిన విధంగా ముందుకు వెళ్తాం.
రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు క్షేత్రస్థాయిలో వెనువెంటనే తమ కార్యకలాపాలు మొదలుపెట్టేలా చొరవ తీసుకోవాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తగిన విధంగా సహకరిస్తుంది. రాష్ట్ర గతిని మారేలా మీ ఆలోచనలు, భవిష్యత్తు పునాదులు ఉండాలి. కేవలం భారీ పెట్టుబడిదారులకే కాకుండా, చిన్నస్థాయి ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు దీనిలో భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారికి మేం అన్ని విధాలుగా తగిన సహకారం అందిస్తాం. అక్కడున్న వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. నేను పారిశ్రామికవేత్తలకు చెప్పేది ఒక్కటే...
మా మానవవనరులను నమ్మి పెట్టుబడి పెట్టండి. ఉత్పత్తి కోసమే కాదు... వినూత్న ఆలోచనలనీ నమ్మి పెట్టుబడి పెట్టండి...
మీరు బాధ్యతను తీసుకోండి.. పర్యావరణాన్ని, ప్రకృతికి నాశనం చేయకుండా ముందుకు సాగుతామని ప్రతినబూనండి” అన్నారు. సదస్సులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు శ్రీ టీజీ భరత్, శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీలు శ్రీ భరత్, సీఐఐ అధ్యక్షులు శ్రీ ముకుందన్, సీఐఐ డిసిగ్నేట్ ప్రెసిడెంట్ శ్రీమతి సుచిత్రా ఎల్లా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
#CIIPartnershipSummit2026
Vannemreddy Satish Kumar retweeted
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
#AndhraPradesh
Vannemreddy Satish Kumar retweeted
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ @VangaveetiOffl మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Vannemreddy Satish Kumar retweeted
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ @VangaveetiOffl గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ గారు, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. (1/2)
Vannemreddy Satish Kumar retweeted
Palle Panduga 3.0 marks another significant step towards transforming rural Andhra Pradesh through development that reaches the grassroots.
True development is meaningful only when it reaches the last village, strengthens rural communities and improves the lives of ordinary people.
I sincerely thank Hon’ble Prime Minister Sri @narendramodi Ji for his continued support and guidance towards the development of rural Andhra Pradesh. I also express my gratitude to Hon’ble Union Minister Sri @ChouhanShivraj Ji and Hon’ble Union Minister Sri @LalanSingh_1 Ji for their continued support in advancing rural development and strengthening Panchayati Raj institutions.
With ₹11,085 crore worth of development works, Palle Panduga 3.0 is focused on better roads, stronger village infrastructure, support for farmers and dairy families, horticulture development and essential civic amenities.
Under the leadership of Hon’ble Chief Minister Sri @ncbn Garu, this initiative reflects the NDA Government’s commitment to building stronger, self-reliant and sustainable rural communities.
From the most remote hamlet to the modern village, from every road to every household, Palle Panduga 3.0 is driving the transformation towards a stronger and more inclusive Andhra Pradesh.
From every road to every village.
From every village to a stronger Andhra Pradesh - @PawanKalyan
@PMOIndia @MoRD_GoI @mopr_goi
#PallePanduga #APTowardsGramaSwaraj #APRuralDevelopment
Vannemreddy Satish Kumar retweeted
The forests we protect today are the legacy we leave for generations tomorrow. Those who gave their lives defending them have secured a legacy that time can never erase.
On State Forest Martyrs Day, I pay my deepest tributes to the brave forest personnel of Andhra Pradesh who made the supreme sacrifice in the line of duty while safeguarding our forests, wildlife and natural heritage.
Their courage in the face of danger, dedication to duty and selfless commitment to protecting nature remind us that conservation is not just a responsibility, but a service to humanity and future generations.
I also salute every forest officer and frontline personnel who continue to serve in challenging and vulnerable conditions. Their safety, welfare and dignity must remain our collective priority.
Their lives were dedicated to protecting nature. Their sacrifice will forever inspire our commitment to preserve it.
- @PawanKalyan
#StateForestMartyrsDay #ForestConservation #AndhraPradesh
Vannemreddy Satish Kumar retweeted
దీప కాంతుల వెలుగుల్లో మనందరి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలని, మన దేశ భవితవ్యం దేదీప్యమానంగా విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరికీ జనసేన పార్టీ తరపున హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.
#HappyDiwali
Vannemreddy Satish Kumar retweeted
మున్సిపల్ ఎన్నికల్లోనూ నూటికి నూరు శాతం గెలిచి జనసేన ప్రభంజనం, ఇది జనసైనికుల విజయం..
#JanaSenaStrikesAgain #JSPStrikes100Again
Vannemreddy Satish Kumar retweeted
100% Strike rate Again !
3/3 Nagar Panchayat chairmans ✅
2/2 Mayors ✅
15/15 Municipal Chairmans ✅
#JanaSenaStrikesAgain



















































