Pinned Tweet
With Ramanna in London ❤️ @KTRTRS – at London, England
Ravi Pulusu NRI BRS UK retweeted
యాదాద్రిలో కార్తీక శోభ...
కార్తీక పౌర్ణమి సందర్భంగా విద్యుత్ దీపాల వెలుగుల్లో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం.
#Yadadri #KarthikaPournami
గ్రీన్ వాటర్ ట్యాంకర్ల పేరుతో డ్రైనేజీ నీళ్లను సరఫరా చేస్తున్న కాంగ్రెస్ సర్కార్!
నగరంలో నీటి కొరత ఉందని, ప్రజలను పొదుపు పాటించాలంటూ, నిర్మాణ పనులకు కేవలం గ్రీన్ వాటర్ ట్యాంకర్లను మాత్రమే వినియోగించాలంటూ.. ఎంతో ఆర్భాటంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.
నదుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు నీళ్లను ఎత్తిపోయకుండా నిర్లక్ష్యం చేసి..
ఇప్పుడు నీటి పొదుపు పేరుతో, చివరకు ప్రజలకు డ్రైనేజీ నీటిని అంటగడుతున్న కాంగ్రెస్ సన్నాసులు.
కాంగ్రెస్ నాయకుల నోళ్లే కాదు.. వాళ్లు సప్లయ్ చేసే నీళ్లు కూడా మురికే!
వరంగల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ జన చైతన్య సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల్లో వణుకు మొదలైంది.
సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి తట్టుకోలేక అసత్య ప్రచారాలకు తెరలేపారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నం చేస్తోంది.
యువతకు ఉద్యోగాలు, అభివృద్ధి, ప్రజా సమస్యలపై ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు.
- మాజీ ఎమ్మెల్యే @dasyamofficial
దీక్షా దివస్ - తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపుతిప్పిన చారిత్రక ఘట్టం!🔥✊
గల్లీ గల్లీని కదిలించి.. ఢిల్లీని వణికించి..
అహింసా మార్గంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ ✊
కేసీఆర్ సంకల్ప బలానికి, దీక్షాదక్షతకు నిదర్శనం ✊
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభ.
🗓️ నవంబర్ 29 | ⏰ సాయంత్రం 3 గంటలకు
📍 అలుగునూరు, కరీంనగర్
#DeekshaDiwas
రాష్ట్రంలో ప్రజలకు తాగునీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్ నాయకులు, వందల కోట్లతో సమ్మిట్లు మాత్రం పెడుతున్నారు.
మెటా అనే సంస్థపై కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు దాడి చేస్తారు, మళ్లీ పెట్టుబడులు అంటూ గ్లోబల్ సమ్మిట్ల పేరుతో హడావిడి చేస్తారు.
కార్పొరేట్ సంస్థలపై ఇష్టం ఉన్నట్లు దాడులు చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుండి వస్తాయి?
గ్లోబల్ సమ్మిట్ అంటున్నారు కానీ అది గోబెల్స్ సమ్మిట్.
- బీఆర్ఎస్ నాయకులు @DrErrolla
రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తూ..
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూములను అమ్మేసే కుట్ర చేస్తున్నాడు.
ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి విలువైన స్థలాలను అమ్ముతూ..
అన్నీ ప్రజా వ్యతిరేక పనులే చేస్తున్నాడు.
భూములు అమ్మి పాలన చేస్తానని రేవంత్ అంటున్నాడు.
ట్రక్ పార్క్ భూముల నిరసన ఇంతటితో ఆగదు. న్యాయ పోరాటం చేసి ట్రక్ పార్క్ భూములను కాపాడుతాం.
- ఎమ్మెల్యే @kp_vivekanand
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ కోసం రైతులు, దళితులు పొలాలు ఇచ్చారు.
ఐదు వందలకు పైగా ట్రక్కులు పార్క్ చేసే ఆ భూములను అమ్మితే ట్రక్కులను పార్క్ చేసుకునేందుకు స్థలం కూడా ఉండదు.
ప్రజా ప్రయోజనాల కోసం ట్రక్ పార్క్ భూములను వినియోగించుకోవాలి.
ట్రక్ పార్క్ భూముల వేలం వెంటనే ఆపాలి, లేకపోతే ట్రక్ పార్క్ భూములు కొనుక్కున్న వారు భవిష్యత్తులో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ హైదరాబాద్‌ను అమ్మేసే కుట్ర చేస్తున్నారు.
ట్రక్ పార్క్ భూములను కాపాడుకునేంత వరకు పోరాడుతూనే ఉంటాం.
- ఎమ్మెల్యే @mkrkkpmla
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం
@DrErrolla teapaw.org/i/broadcasts/2gqMRZMYe…
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, హుడా ట్రక్ పార్క్, మియాపూర్ భూముల వేలాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో అమీర్‌పేటలోని HMDA ప్రధాన కార్యాలయం ముట్టడి.
ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన మూసాపేట ట్రక్ పార్క్, కేపీహెచ్‌బీ, మియాపూర్‌లోని విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు విక్రయించవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వామపక్ష నాయకుల డిమాండ్.
ఈ నెల 27న HMDA నిర్వహించనున్న ఈ-వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ నిరసనకు దిగిన ఎమ్మెల్యే @mkrkkpmla, ఎమ్మెల్సీ @RajuShambipur, సీపీఐ, సీపీఎం నాయకులు.
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయం వద్ద వేల సంఖ్యలో చేరి, అక్కడి నుంచి HMDA కార్యాలయానికి తరలివచ్చిన హుడా ట్రక్ పార్క్ బాధితులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు.
HMDA కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు, తీవ్ర ఉద్రిక్తత.. ముట్టడికి తరలివస్తున్న విపక్ష నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్న పోలీసులు.
LIVE: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని హుడా ట్రక్ పార్క్ భూముల వేలాన్ని నిరసిస్తూ మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు teapaw.org/i/broadcasts/2kEAjXZRe…
నవంబర్ 29
"దీక్షా దివస్"
"తెలంగాణ వచ్చుడో - కేసీఆర్ సచ్చుడో"
అంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు
ఉద్యమ జ్వాలను రగిలించి,
ప్రజలను ఏకం చేసిన ఉద్యమ నాయకుడు కేసీఆర్✊
ఆ చారిత్రాత్మక పోరాట స్ఫూర్తిని,
అమరుల త్యాగాలను స్మరించుకుందాం. ✊
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభ 🔥✊
📍 అలుగునూరు, కరీంనగర్
⏰ సాయంత్రం. 3:00 గం.లకు
#DeekshaDiwas
కాంగ్రెస్ పాలనలో కరెంటు లేదు.. కళ్యాణ లక్ష్మి లేదు..
గ్యాస్ రూ. 500 కే ఇస్తామన్నరు
రూ. 1100 పెట్టి కొనుక్కుంటున్నాం!
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు
కానీ పిల్లలకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు..
నమ్మించి మోసం చేసిండు రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని విధాలుగా మంచిగుండే
మల్లి కేసీఆర్ నే గెలిపించుకుంటాం!
- సామాన్య మహిళ
#CongressFailedTelangana
ఇది కాంగ్రెస్ సర్కార్ రాసిన మరణ శాసనం
వడ్ల కుప్ప వద్దే కుప్ప కూలిన రైతు💔😢
వడ్లు రాశిపోసుకొని కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నా కాంటాలేదు.
రోజులతరబడి పడిగాపులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.
ఫలితంగా ఆరబోసిన వడ్లకుప్ప వద్దే ఓ అన్నదాత గుండె ఆగింది.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూరుగుమడ్ల రైతు నాళ్లం వీరస్వామి మంగళవారం రాత్రి ఆరబోసిన వడ్లను కుప్పచేస్తూ అక్కడే గుండెపోటుతో కుప్పకూలాడు.
#CongressFailedTelangana
📢 బీజేపీ సర్కస్❗
🆘 రాజ్యాంగం, చట్టాలను తుంగలో తొక్కుతూ కమలనాథుల పరిహాసం 🚨
🗳️ సర్ వివాదం.. బీజేపీకి ఏం సంబంధం? ఎందుకీ ఉలికిపాటు ర్యాలీలు
📢 'సర్'పై సందేహాల వెల్లువ.. జవాబివ్వాల్సిన బాధ్యత ఈసీది
🤡 గుమ్మడికాయల దొంగలా బీజేపీ.. తిరంగా ముసుగులో హంగామా
🚨 రాజ్యాంగబద్ధ సంస్థకు, ఒక రాజకీయ పార్టీ వత్తాసు ఏమిటని సర్వత్రా చర్చ
🛑 పుష్కర పాలనలో బీజేపీ హయాంలో విమర్శలకు అడ్డాగా మారిన ఈసీ
‘సర్’పై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై, వ్యక్తమవుతున్న అనుమానాలపై దేశ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం. సర్ అనబడే ‘సవాలక్ష రంధ్రాల’ జల్లెడ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అదే కాబట్టి తన సచ్ఛీలతను, పారదర్శకతను నిరూపించుకోవాల్సింది ఈసీనే.
కానీ విచిత్రంగా బీజేపీ మాట్లాడుతున్నది. ఈసీ ఏదో తన జేబు సంస్థ అయినట్టు బీజేపీ తల్లడం మల్లడం అవుతున్నది. కందకు లేని దురద కత్తిపీటకెందుకు? ఈసీని అడిగితే బీజేపీ బదులిస్తున్నది. అది చాలక పాదయాత్రలు, ప్రచార యాత్రలు, పాకుడు యాత్రలు చేస్తున్నది. డెబ్భై, ఎనభై ఏండ్ల వయసులో బీజేపీ అగ్రనేతలు ఒగరుస్తూ, రొప్పుతూ కాళ్లీడ్చుకుంటూ దేశమంతా తిరుగుతున్నారు. సర్ అనబడే కార్యక్రమమేదో పవిత్ర కార్యమన్నట్టుగా, దాన్ని ప్రశ్నించడమే పాపమన్నట్టుగా చిత్రీకరిస్తూ తిరంగా ర్యాలీలతో తిప్పలు పడుతున్నది.
ఈ వ్యవహారంతో అసలేం సంబంధం లేని బీజేపీ.. అనూహ్యంగా సీన్‌లోకి రావడం, ఈసీకి, ‘సర్’కు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తుండటం ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో గెలుపు కోసం ఈసీని బీజేపీ వాడుకొంటున్నది, అందుకే, ‘సర్’ వ్యవహారంలో ఈసీకి మద్దతుగా భారీ ర్యాలీలు చేపట్టి.. రక్షణగా నిలుస్తున్నది.
📣 తెలంగాణ ద్రోహి రేవంత్ 🎯
🤮 సీఎం నోరు తెరిస్తే అబద్ధాల కంపు❗
🚨 పాలమూరు ఎత్తిపోతలను ఎండబెట్టి.. కుప్పానికి నీళ్లు పంపిన వంచకుడు
🌊 ఉన్న నీళ్లెత్త చేతగాక మా మీద నిందలా? అసంబద్ధ లెక్కలతో జ్యాదా హుషారీ
♦️ కేసీఆర్ బయల్దేరితేనే సాగర్ ఎడమ కాలువ నిర్వహణ బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది
💥 రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ట్రిబ్యునల్ వేయాలని కోరిండ్రు. గులాబీ జెండా ఎగిరిన తర్వాతే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడదాకా నీళ్లు వచ్చినయ్
📢 నాడు ఎంగిలి మెతుకులకు ఆశపడి నోర్లు మూసుకున్నది మీ కాంగ్రెస్ మంత్రులే
💥 నిప్పులు చెరిగిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
కృష్ణాలో 299 టీఎంసీల వాటా తెచ్చింది రేవంత్ పక్కన కూర్చున్న కాంగ్రెస్ పాపాత్ములే. 299:512 టీఎంసీలకు కర్త, కర్మ, క్రియ కాంగ్రెస్ పార్టీయే. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పాలకులు కృష్ణా జలాల్లో తెలంగాణను 299కి పరిమితం చేసిండ్రు. విభజన బిల్లులో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాలు వర్కింగ్ అరేంజ్‌మెంట్ కోసం 2015లో చేసుకున్న ఒప్పందానికి మూలం కాంగ్రెస్ పెట్టిన డాక్యుమెంటే. ఆ ఒప్పందం కూడా శాశ్వతం కాదు. ఏడాదికే పరిమితం. ట్రిబ్యునల్ ముందుగానీ, కోర్టు ఆర్డర్ల ముందుగానీ చెల్లదని, తాత్కాలికమని అందులోనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం 42 రోజుల్లో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ వేయాలని కంప్లయింట్ ఇచ్చిండ్రు.
పల్నాడు వాటర్ గ్రిడ్ పనులకు ఏపీ ప్రభుత్వం జనవరిలోనే టెండర్లు పిలిచింది. సాగర్ నుంచి 1.86 టీఎంసీలు కేటాయిస్తూ 453 జీవోను ఆగస్టులో విడుదల చేసింది. అయినా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సోయిలేదు. అదే జిల్లాకు చెందిన నీళ్ల మంత్రికి సోయిలేదు. పత్రికల్లో వార్తలు వచ్చాక, మా నాయకుడు కేటీఆర్ బయటపెట్టిన తర్వాత బ్యాక్‌డేట్‌తో లెటర్ రాసి తప్పించుకున్నవు.
సాగర్‌కు పొక్క కొడుతున్నా, కుప్పం వరకు ఏపీ నీళ్లను తరలించుకుపోతున్నా, ట్రిబ్యునల్ వాదనల్లో కాలయాపన జరుగుతున్నా కుంభకర్ణ నిద్రపోతున్న రేవంత్‌రెడ్డిని, ఉత్తమ్ కుమార్‌రెడ్డిని ఉరి వేయాలి.
Ravi Pulusu NRI BRS UK retweeted
54 workers lost their lives in the Sigachi blast. Nearly 17 months their grieving families have received a mere ₹1 lakh from the State Government, against the Chief Minister’s solemn promise of ₹1 crore.
@revanth_anumula announcements made from the Chief Minister’s chair are not political soundbites to be forgotten once the cameras are gone. They are commitments to grieving families who deserve justice, dignity and support.
Breaking promises to bereaved families is not just a failure of governance; it is a betrayal of public trust and a disgrace to the dignity of the @TelanganaCMO
If you are genuinely concerned about these families, honour your words, at least now. Fulfil your promise and pay the ₹1 crore compensation.
Ravi Pulusu NRI BRS UK retweeted
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం రద్దు చేయాలని కోరుతూ హెచ్‌ఎండీఏ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన అఖిలపక్ష నాయకులపై పోలీసులను ప్రయోగించి, అరెస్టులు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అరెస్టు చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహా ఇతర అఖిలపక్ష నేతలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజాప్రతినిధులు, నాయకులపై నిర్బంధాలు ప్రయోగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం.
ప్రజా పాలన అంటూ, ఇందిరమ్మ రాజ్యం అంటూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్న @revanth_anumula తీరును యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నది.
ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ భూములను విక్రయించవద్దని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నీతులు చెబుతుంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు పూర్తి విరుద్ధంగా భూముల వేలం నిర్వహించడం సిగ్గుచేటు.
ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఇష్టం ఉన్నట్లు ప్రభుత్వ భూములను అమ్ముతున్న రేవంత్ రెడ్డికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం.
ట్రక్ పార్క్ వేలాది మంది ప్రజల జీవితాలు, జీవనోపాధితో ముడిపడి ఉన్న అంశం. ప్రజల జీవితాలతో చెలగాటమాడవద్దని ప్రభుత్వానికి హితవు చెబుతున్నాం.
అరెస్టు చేసిన అఖిల పక్షం నాయకులను వెంటనే విడుదల చేయాలని, ఈ నెల 27న జరగనున్న ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని @BRSparty పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.
@mkrkkpmla
@RajuShambipur
@TelanganaCMO


















