Forest Department, Government of Andhra Pradesh retweeted
రైలు ఢీకొని ఎలుగుబంట్లు మృతి చెందిన ఘటనపై అటవీ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రివర్యుల చర్చ
•రైల్వే, అటవీ ఉన్నతాధికారుల మధ్య సమన్వయ సమావేశానికి ఆదేశం
•అటవీ మార్గ ప్రయాణాల్లో లోకో పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచన
రైలు ఢీకొన్న ప్రమాదంలో రెండు ఎలుగుబంటి పిల్లలు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు విచారం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా డి. హీరేహాళ్ మండలం కళ్యం గ్రామ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులతో చర్చించారు. కళ్యాణదుర్గం అటవీ రేంజ్‌లోని, రాయదుర్గం బీట్, సెక్షన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంపై అటవీ శాఖ అధికారుల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాల మధ్య వెళ్లే రైల్వే మార్గాల్లో వన్యప్రాణులు ప్రమాదాల బారినపడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అటవీ, రైల్వే శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని తెలిపారు.
గతంలో అదే మార్గంలో రైలు ప్రమాదంలో చిరుత మృతి చెందిన ఘటనను గుర్తు చేస్తూ, అటవీ మార్గాల్లో రైళ్లు నడిపే లోకో పైలెట్లు వన్యప్రాణి సంరక్షణ చర్యల్లో భాగంగా రూపొందించిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాజా ఘటనపై స్థానిక రైల్వే శాఖ ఉన్నతాధికారులతో అటవీ శాఖ అధికారులు ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో రైళ్ల రాకపోకల సమయంలో వన్యప్రాణుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని నిర్దేశం చేశారు.
అటవీ ప్రాంతాల గుండా రైళ్లు ప్రయాణించే సమయంలో లోకో పైలెట్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ముఖ్యంగా వన్యప్రాణుల సంచారం ఉండే ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లను నిశితంగా గమనిస్తూ రైళ్లను నడపాలని, అటవీ మార్గాల్లో రైళ్ల వేగాన్ని నియంత్రించడం, అవసరమైన ప్రాంతాల్లో క్రమం తప్పకుండా హారన్ మోగించడం వంటి చర్యల ద్వారా వన్యప్రాణులకు ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. అలాగే ఈ మార్గాల్లో రైళ్లను నడిపే లోకో పైలెట్లకు రైల్వే శాఖ వన్యప్రాణుల సంచారం, వాటి సంరక్షణ, ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. అటవీ శాఖ అధికారులు స్థానిక రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ వన్యప్రాణులు రైల్వే ట్రాక్‌లను దాటే ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై దృష్టి సారించాలన్నారు. రైల్వే మార్గాల్లో వన్యప్రాణులకు జరుగుతున్న ప్రమాదాలను నివారించే అంశాన్ని సంబంధిత రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి కూడా తీసుకువెళ్లాలని పీసీసీఎఫ్ ని ఆదేశించారు.
• విద్యుద్ఘాతంతో ఏనుగుల వరుస మరణాలపై…
విద్యుద్ఘాతం కారణంగా వరుసగా సంభవిస్తున్న ఏనుగుల మరణాలపై ఉప ముఖ్యమంత్రివర్యులు సమీక్షించారు. ఈ తరహా ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న జిల్లాల్లో సంబంధిత కలెక్టర్లతోపాటు వ్యవసాయ, ఉద్యాన, విద్యుత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర అనుబంధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి, నివారణ చర్యలపై చర్చించాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్ షాక్ కారణంగా సంభవిస్తున్న ఏనుగుల మరణాల సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషించాలని స్పష్టం చేశారు. ప్రతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి భవిష్యత్తులో పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అటవీ ఉన్నతాధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల సంచారం ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తగినంత ఎత్తులో ఉండేలా విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలని, వన్యప్రాణుల సంచారం ఉన్న ప్రాంతాల్లో పంటల చుట్టూ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
@HANUMAN_APGOV @APFDOfficial @PIB_India @IPR_AP @pibvijayawada
Forest Department, Government of Andhra Pradesh retweeted
HANUMAN Wildlife Rescue | Indian Rock Python Safely Rescued
Following heavy rains caused by Cyclone Arnab, an Indian Rock Python was safely rescued from a house in Uddapalem, Atchutapuram, Anakapalli district, by H.A.N.U.M.A.N. teams and the Eastern Ghats Wildlife Society, in coordination with the Andhra Pradesh Forest Department and Police. The Schedule I protected species was safely released into a suitable forest habitat away from human habitation.
#HANUMAN #WildlifeRescue #RescueProtectCoexist
Forest Department, Government of Andhra Pradesh retweeted
విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి పట్ల ఉప ముఖ్యమంత్రివర్యుల విచారం
•ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశం
చిత్తూరు జిల్లా గుబ్బలవారిపల్లి సమీపంలో విద్యుత్ షాక్‌తో మగ ఏనుగు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు విచారం వ్యక్తం చేశారు. వన్యప్రాణి సంచారం ఉన్న ప్రాంతాల్లో కరెంటు వైర్లు ఏర్పాటుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా వైర్లు వేసి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వన్యప్రాణుల సంచారం ఉన్న ప్రాంతాల్లో, పంటల సంరక్షణ ముసుగులో అటవీ సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా విద్యుత్ ఫెన్సింగ్‌లు లాంటివి ఏర్పాటు చేస్తే, అలాంటి వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టాలను అనుసరించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
@APFDOfficial @PIB_India @IPR_AP @pibvijayawada
Forest Department, Government of Andhra Pradesh retweeted
చాగల్లు పరిసరాల్లో పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించండి
• పులి కదలికలపై ప్రజలకు నిరంతరం సమాచారం అందించాలి
• హనుమాన్ బృందాలను మోహరించి, పులిని త్వరగా సురక్షితంగా బంధించండి
• అటవీ శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాలు
తూర్పు గోదావరి జిల్లా చాగల్లు గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. గ్రామ సమీపంలోని పంట పొలాల మధ్య పులి ఉన్నట్టు గుర్తించిన నేపథ్యంలో గ్రామస్తులు అటవీశాఖ అధికారుల సూచనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పులి కదలికలు, దానిని సురక్షితంగా బంధించేందుకు చేపడుతున్న చర్యలపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పులి సంచారానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు నిరంతరం చేరవేయాలని స్పష్టం చేశారు. ప్రజలు పొలాల వైపు ఒంటరిగా వెళ్లడం, పులిని నేరుగా చూడాలనే అత్యుత్సాహం ప్రదర్శించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని, అటవీశాఖ అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
పులి అటవీ ప్రాంతం వెలుపల సంచరిస్తున్నందున దానిని సురక్షితంగా బంధించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో హనుమాన్ బృందాలను మోహరించి, దాని కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ మొత్తం ఆపరేషన్‌ను అటవీశాఖ జోనల్ కన్జర్వేటర్ పర్యవేక్షణలో సమన్వయంతో నిర్వహించాలని స్పష్టం చేశారు.
@HANUMAN_APGOV @APFDOfficial @PIB_India @IPR_AP @pibvijayawada
Forest Department, Government of Andhra Pradesh retweeted
A tiger has been sighted near Chagallu, West Godavari district, Forest Department and #HANUMAN teams are continuously monitoring its movement and taking necessary measures to ensure public safety.
Public are requested to cooperate with Forest officials, stay indoors, and strictly avoid areas alerted or restricted by the Forest Department. Do not approach or provoke the tiger. Please follow official safety advisories until further instructions.
@APDeputyCMO @APFDOfficial @PIB_India @IPR_AP @pibvijayawada
#WildlifeConservation
Forest Department, Government of Andhra Pradesh retweeted
ప్రకృతితో అనుసంధానం ద్వారా ప్రజలకు అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి
• ఎకో టూరిజం ప్రాజెక్టులతో కొత్త అనుభూతి
• నగర వనాల్లో స్వచ్ఛమైన, ఆహ్లాదకర వాతావరణం
• అన్ని ప్రాంతాలను కలిపేలా పర్యాటక అభివృద్ధి
• నగర వన యోజన పథకంలో భాగంగా రాష్ట్రంలోని 6 నగరవనాలను వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ప్రజలను ప్రకృతిలో మమేకం చేసి, వారికి మరిచిపోని మధురానుభూతులను ఇవ్వడంతోపాటు, గిరిజనులకు ఎకో టూరిజం జీవనోపాధులు మెరుగుపర్చడం ప్రభుత్వం ముందున్న లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నల్లమల నుంచి మారేడుమిల్లి వరకు, బాపట్ల తీర ప్రాంత అందాల నుంచి కోటప్పకొండ ఆధ్యాత్మిక ప్రయాణం వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పర్యాటక కళను తీసుకొచ్చేలా పని చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మితమైన 6 నగరవనాలను ఉప ముఖ్యమంత్రివర్యులు మంగళవారం వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ సందర్బంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘నగర వన యోజన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 19 నగరవనాలుంటే, ఇప్పుడు ప్రారంభించిన ఆరు నగరవనాలతో కలిపి 25 నగరవనాలు రాష్ట్రంలో ఏర్పడతాయి. 305 హెక్టార్లలో, రూ.13 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ నగరవనాలు కేవలం మొక్కలు నాటే ప్రాంతాలుగా కాకుండా, ప్రజలను ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లే మార్గంగా ఉంటాయి. నగరవనాల్లో సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ లు, పిల్లలు ఆడుకునే ప్రాంతాలు, జిమ్ పరికరాలు వంటివి అందుబాటులో ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో, స్వచ్ఛమైన అందాలతో నగరవనాలు ఆరోగ్యం, ఆహ్లాదం, ప్రకృతి అవగాహన కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం. బాపట్ల, చీరాల తీర ప్రాంత పర్యాటక వనాలుగా ఉంటే, కోటప్పకొండ ఆధ్యాత్మిక సువాసనలతో విరాజిల్లుతుంది. వినుకొండ, దేవరంపాడు, మాచర్లలో ఏర్పాటు చేసే నగరవనాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రకృతికి దగ్గరయితే, ఆరోగ్యం దగ్గరవుతుంది. ప్రకృతి అర్ధమైతే, పరిరక్షణ బాధ్యత పెరుగుతుంది. ఇది ప్రకృతి నియమం.
సత్సంకల్పంతో ముందడుగు వేస్తున్నాం
రాష్ట్రంలో ఎకో టూరిజం పెరగడం వల్ల గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వెలిగోడు జంగిల్ సఫారీతో సరికొత్త అనుభూతులు లభిస్తాయి. మారేడుమిల్లి ట్రెక్కింగ్, ఆరోమా కనోపీ వాక్ ద్వారా తూర్పు కనుమల అటవీ అందాలను, ప్రకృతి పరిమళలను ప్రజలకు చేరువ చేస్తాం. గిరిజన సంస్కృతిని ప్రజలకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తాం. దీనివల్ల గిరిజనుల జీవన విధానంలో మంచి మార్పులు వస్తాయని సత్సంకల్పంతో పని చేస్తున్నాం. ప్రకృతిని ప్రేమించాలి.. భావితరాలకు బహుమతిగా ఇవ్వాలనేది మా సంకల్పం. దీనికి కట్టుబడి పనిచేస్తాం. దీనికి ప్రజలు తమవంతుగా సహకరించాలి’’ అన్నారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ రూపొందించిన వైల్డ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఆఫ్ ద నల్లమల ఫారెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ట్రీ టాన్స్ లోకేషన్ మాన్యూవల్ పుస్తకాలను ఉప ముఖ్యమంత్రివర్యులు ఆవిష్కరించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ దేశంతోనే మొదటిసారి ‘‘ఈకోలిప్టస్ పల్ప్ ఉడ్ ప్లాంటేషన్’’ విభాగంలో అనుసరిస్తున్న సుస్థిర నిర్వహణ పద్ధతులకు గుర్తింపుగా సాధించిన ప్రమాణ్ సర్టిఫికేట్ ను డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా అటవీశాఖ అధికారులు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ శ్రీ కొణిదల నాగేంద్రబాబు, వినుకొండ ఎమ్మెల్యే శ్రీ జీవీ ఆంజనేయులు, రంపచోడవరం ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శీరిష, చీరాల ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య, అటవీ, పర్యావరణ శాఖ చీఫ్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డాక్టర్ చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ శ్రీ రాహుల్ పాండే, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, సీఈవో ఏపీ గ్రీన్ శ్రీ బీఎన్ఎన్ మూర్తి, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, ఎకో టూరిజం ఈడీ శ్రీమతి నందిని సలారియా, అటవీశాఖ ఐటీ సలహాదారుల శ్రీ పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
(1/2)
Forest Department, Government of Andhra Pradesh retweeted
A significant milestone for Andhra Pradesh’s journey towards sustainable forestry and responsible natural resource management.
Heartiest congratulations to the Andhra Pradesh Forest Development Corporation (APFDC) on receiving the first-ever PRAMAAN certification in India under the Indian Forest and Wood Certification Scheme, recognising sustainable plantation management across 33,000 hectares.
This achievement reflects the vision of Hon’ble Prime Minister Shri @narendramodi Ji to promote sustainable growth and responsible forest management, alongside the commitment of the coalition government in Andhra Pradesh, under the leadership of Hon’ble Chief Minister Shri @ncbn Garu, to advance the State’s development while strengthening environmental responsibility.
My appreciation to the APFDC team, and my gratitude to Hon’ble Union Minister for @moefcc Shri @byadavbjp Ji for presenting this landmark certification.
Sustainable Forests. Responsible Growth. A Greener Andhra Pradesh.
- @PawanKalyan
@PMOIndia @AndhraPradeshCM @APFDOfficial @PIB_India @IPR_AP @pibvijayawada
#APFDC #PRAMAAN #SustainableForestry #AndhraPradesh
Forest Department, Government of Andhra Pradesh retweeted
ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలి
•మానవ–ఏనుగు ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
•అడవిలోకి మళ్లించేందుకు ఏర్పాట్లు చేయండి
• కుంకీ ఏనుగులని రంగంలోకి దించండి
•హనుమాన్ బృందాలు, పోలీసు, రెవెన్యూ సహకారంతో ఏనుగుల సంచారంపై నిరంతర నిఘా
•ఏనుగుల సంచారం ఆధారంగా పరిసర గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయాలి
•పంట నష్టం జరిగిన రైతులకు తక్షణం పరిహారం చెల్లించే ఏర్పాటు
•చిత్తూరు జిల్లా, పడిపుట్లబైలు సమీపంలో ఏనుగుల సంచారంపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
చిత్తూరు జిల్లా, పడిపుట్లబైలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. ముసలమడుగు శిబిరం నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చి ఆపరేషన్ చేపట్టాలని సూచించారు. హనుమాన్ బృందాలు, పోలీసు, రెవెన్యూ, విద్యుత్ శాఖల సమన్వయంతో ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సోమవారం పడిపుట్లబైలు ఏనుగుల సంచారంపై అటవీ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రివర్యులు సమీక్షించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వడంతోపాటు పరిసర గ్రామాల్లో మానవ–ఏనుగు ఘర్షణలు తలెత్తకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
గత 15 రోజులుగా 11 ఏనుగులతో కూడిన గుంపు, గుంపు నుంచి విడిపోయిన మరో రెండు ఏనుగులు పడిపుట్లబైలు పంచాయతీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ పుండ్లవల్లపల్లి, నడింపల్లి, కొండకిందపల్లి గ్రామాల్లో వ్యవసాయ పంటలకు నష్టం కలిగిస్తున్నట్టు రైతులు ఆవేదనలో ఉన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఒక ఏనుగుల గుంపు రహదారిని దాటి మంగళంపేట బీట్‌లోకి ప్రవేశించగా, మరో రెండు ఏనుగులు కూడా రహదారి దాటి చిత్తూరు వైపు కదులుతున్నట్టు వివరించారు. ఈ ఏనుగుల సంచారం పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల ప్రజలకు ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు.
“ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏనుగుల కదలికలను పోలీసు, రెవెన్యూ, విద్యుత్, తత్సంబంధిత తదితర శాఖలు, హనుమాన్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షించాలి. అలాగే, క్షేత్రస్థాయి బృందాలు నిరంతర నిఘా కొనసాగిస్తూ, ప్రమాదానికి అవకాశం ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి. సాధ్యమైన చోట ఏనుగుల కారణంగా ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలి. వాటిని సురక్షితంగా తిరిగి అటవీ ప్రాంతాల వైపు మళ్లించే చర్యలు చేపట్టాలి. ప్రజల భద్రత, వ్యవసాయ పంటల పరిరక్షణ, మానవ–ఏనుగు ఘర్షణల నివారణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల”ని స్పష్టం చేశారు.
@HANUMAN_APGOV @APFDOfficial @PIB_India @IPR_AP @pibvijayawada
Forest Department, Government of Andhra Pradesh retweeted
HANUMAN Wildlife Response | Tirumala
Following a leopard sighting near the 2,800th step on the Alipiri–Tirumala footpath, Hon’ble Deputy CM Sri @PawanKalyan Garu directed the Forest Department to ensure round-the-clock vigilance. Around 20-member HANUMAN teams, along with Forest officials, veterinarians and doctors, are continuously monitoring the area, with necessary measures taken to guide the leopard back towards the forest.
Pilgrims are advised to stay on the designated pathway, follow official instructions, avoid approaching or chasing the leopard, and immediately report any sighting to Forest or TTD personnel.
#HANUMAN #WildlifeProtection #Tirumala
Our planet depends on many natural systems that quietly protect life every day. The Ozone Layer is one of them.
Protecting it is not just about the environment- it is about protecting our health, nature and the future we leave behind.
#WorldOzoneDay
(1/2)
Forest Department, Government of Andhra Pradesh retweeted
The ozone layer is Earth’s protective shield, safeguarding life from harmful ultraviolet radiation.
On World Ozone Day 2026, let us reaffirm our collective commitment to protecting this vital layer and preserving the health of our planet. The 2026 United Nations Environment Programme theme, “Global action for a cooler planet,” highlights the importance of collective action, sustainable cooling and continued global cooperation through the Montreal Protocol and its Kigali Amendment.
Protect the Ozone. Protect Our Planet. Protect Our Future.
- @PawanKalyan
#WorldOzoneDay2026 #OzoneLayer #GlobalActionForACoolerPlanet
Forest Department, Government of Andhra Pradesh retweeted
ఆపరేషన్ అరణ్యలో ప్రాణాలకు తెగించి ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న సిబ్బందికి ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభినందనలు
•అటవీ సిబ్బందిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు
•పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం విస్తృతంగా గాలింపు
•ఎర్రచందనం అక్రమ రవాణాను ఏమాత్రం ఉపేక్షించం
•విధి నిర్వహణలో గాయపడిన సిబ్బందికి అండగా ఉంటామన్న శ్రీ @PawanKalyan గారు
ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో అటవీ సిబ్బంది గాయపడడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రొంపిచెర్ల మండలం బొమ్మాయిగారిపల్లి గ్రామ సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ అరణ్యలో భాగంగా విధులు నిర్వహిస్తున్న అటవీ సిబ్బంది వాహనాన్ని దుండగులు ఢీకొట్టిన ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఎర్రచందనం అక్రమ రవాణాదారులు తమ వాహనంతో వేగంగా ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన వివరాలను అటవీ శాఖ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ ఘటనలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీ కె. ప్రకాష్ కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు శ్రీ పి. రెడ్డి ప్రసాద్, శ్రీ కె. ప్రతాప్, అటవీ సిబ్బంది వాహనం డ్రైవర్ శ్రీ చరణ్ గాయపడినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం గాయపడిన సిబ్బంది ప్రమాదం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నారని అధికారులు ఆయనకు వివరించారు. గాయపడిన సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, చికిత్సకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, సిబ్బంది పూర్తి స్థాయిలో కోలుకునే వరకు అటవీ ముఖ్య సంరక్షణాధికారి(PCCF) పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకునే ఆపరేషన్ అరణ్యలో ప్రాణాలకు తెగించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఎర్రచందనం దుంగలు, తూకం యంత్రం, రంపం బ్లేడ్, గొడ్డళ్లు, అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అటవీ శాఖ సిబ్బందిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. అటవీ సంపదను దోచుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఎర్రచందనం అక్రమ రవాణా, అటవీ నేరాలు, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటవీ నేరాల నియంత్రణ విషయంలో కూటమి ప్రభుత్వం దృఢంగా వ్యవహరిస్తుందని తెలిపారు. అక్రమ రవాణా ముఠాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ, పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితులను త్వరగా పట్టుకోవాలని రెడ్ శాండర్స్ యాంటి స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అధికారులను ఆదేశించారు.
-ఉప ముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయం
#OperationAranya
Forest Department, Government of Andhra Pradesh retweeted
A one-month-old female Small Indian Civet, a Schedule-I protected species, was safely rescued from a mosambi orchard at Bukkayyasamudram, Anantapuramu district. The Forest Department team, with support from a VAJRA team, promptly rescued the healthy animal and shifted it to the Veterinary Hospital, Puttaparthi, for further care. A timely rescue that reflects our commitment to wildlife protection and human-wildlife coexistence.
#HANUMAN #WildlifeRescue #WildlifeConservation
Forest Department, Government of Andhra Pradesh retweeted
A female Indian Gaur (5–6 years old, Schedule-I species) trapped in an illegal wire snare in Indukuru Range was successfully rescued by the Rampachodavaram Forest team. The team promptly sedated the animal, removed the snare that had caused a deep injury to its right hind leg, and, with support from village volunteers, shifted it to the Animal Rescue Centre, IGZP, Visakhapatnam, for treatment. We appreciate the team for their swift and coordinated action.
#HANUMAN
Forest Department, Government of Andhra Pradesh retweeted
The tiger previously tracked in Kakinada is currently moving within the Reserve Forest area near Prathipadu. Hon’ble Deputy CM Sri @PawanKalyan Garu has directed the Forest Department and #HANUMAN teams to position sufficient teams, maintain 24×7 surveillance and take all necessary measures to ensure public safety. Forest-fringe villages and Revenue authorities have been alerted. The public is urged to stay alert, avoid entering forest areas, and immediately report any sightings to Forest officials.
#WildlifeConservation #HumanWildlifeCoexistence
@APDeputyCMO @APFDOfficial @PIB_India @IPR_AP @pibvijayawada
Forest Department, Government of Andhra Pradesh retweeted
కాకినాడ జిల్లాలో పులి సంచారంపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమీక్ష
•పులి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశం
•అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలి
•రాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలి
•అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి
•పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచన
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీ శాఖ చేపడుతున్న చర్యలు, అటవీ సరిహద్దు గ్రామాల భద్రతకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పులి కదలికలపై అటవీ శాఖ, ‘హనుమాన్’ బృందాలు నిరంతర నిఘా కొనసాగించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన అన్ని చర్యలను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, స్థానిక రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే, పులికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.
• శాఖల సమన్వయంతో నిరంతర నిఘా
పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా రాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరాన్ని బట్టి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
@APFDOfficial @HANUMAN_APGOV @PIB_India @IPR_AP @pibvijayawada
Forest Department, Government of Andhra Pradesh retweeted
Under the HANUMAN initiative, the AP Forest Department successfully carried out a Sloth Bear rescue operation at Parimithadaka, Yeleswaram Mandal, Kakinada District.
The timely intervention of the Forest Department team ensured the safe rescue and protection of the animal, reflecting our continued commitment to wildlife protection and human-wildlife coexistence.
#HANUMAN #APForestDepartment #WildlifeRescue #SlothBear #WildlifeConservation
Forest Department, Government of Andhra Pradesh retweeted
A Proud Addition to Andhra Pradesh’s Wildlife Conservation Efforts
The Indira Gandhi Zoological Park (IGZP), Visakhapatnam, has successfully completed an animal exchange programme with the Radhe Krishna Temple Elephant Welfare Trust, Jamnagar, Gujarat.
IGZP has welcomed 3 Zebras, 4 Cotton-top Tamarins, 3 Red-necked Wallabies and 2 Common Marmosets. Notably, the Critically Endangered Cotton-top Tamarin has been introduced at IGZP for the first time.
Heartfelt thanks to the Radhe Krishna Temple Elephant Welfare Trust, Gujarat, for this valuable collaboration. Appreciation to the AP Forest Department and IGZP team for strengthening conservation breeding, wildlife education and the visitor experience.
- @PawanKalyan
#APForestDepartment #IGZP #WildlifeConservation #Visakhapatnam
New Arrivals at IGZP, Visakhapatnam!
Indira Gandhi Zoological Park has successfully completed an animal exchange programme with Radhe Krishna Temple Elephant Welfare Trust, Jamnagar, Gujarat.
IGZP welcomed 3 Zebras, 4 Cotton-top Tamarins, 3 Red-necked Wallabies and 2 Common Marmosets. Notably, the Critically Endangered Cotton-top Tamarin has been introduced at IGZP for the very first time.
In exchange, IGZP transferred 3 Indian Gaur, 4 Stump-tailed Macaques and 2 Gharials to Jamnagar.
All the new arrivals are healthy and are currently under mandatory veterinary quarantine as per CZA protocols.
The exchange strengthens IGZP’s conservation breeding efforts while enriching wildlife education and visitor experience.
@APDeputyCMO @PawanKalyan
#APForestDepartment #IGZP #Visakhapatnam #WildlifeConservation #ConservationBreeding
Forest Department, Government of Andhra Pradesh retweeted
ఈ రోజు బాపట్ల జిల్లా సూర్యలంకలో విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, స్థానికులతో కలిసి సముద్ర తీరంలో తాటి మొక్కలు నాటాను.
పర్యావరణ పరిరక్షణ అనేది ఒక రోజు కార్యక్రమం కాదు… ఒక బాధ్యత. ఒక తరం కోసం కాదు… భావితరాల కోసం మనం చేసే కర్తవ్యం.
పర్యావరణాన్ని కాపాడేందుకు కనీసం 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలి. ముఖ్యంగా తీరప్రాంతాల్లో తాటి చెట్లు, మడ అడవులను విస్తరించడం ద్వారా సముద్ర కోతను అరికట్టడంతో పాటు తుపాన్లు, సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి సహజ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయవచ్చు.
సూర్యలంకలో 20 ఏళ్ల క్రితం నాటిన తాటి చెట్లు నేడు సహజ రక్షణ గోడగా మారి తీరాన్ని కాపాడుతున్న తీరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. మనం ఈ రోజు నాటే ప్రతి మొక్క రేపటి తరాలకు మనం ఇచ్చే అమూల్యమైన బహుమతి.
‘గ్రేట్ గ్రీన్ వాల్’ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలి. ముఖ్యంగా విద్యార్థులు, యువత ప్రకృతి సంరక్షణలో చురుకుగా భాగస్వాములు కావాలి.
మొక్క నాటడంతో మన బాధ్యత పూర్తికాదు… అది పెద్ద చెట్టుగా ఎదిగే వరకు సంరక్షించడమే నిజమైన బాధ్యత.
Forest Department, Government of Andhra Pradesh retweeted
వన్య ప్రాణుల మరణాలపై సమగ్ర అధ్యయనానికి ఉప ముఖ్యమంత్రివర్యులు ఆదేశం
• క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రణాళికలపై సమగ్ర అధ్యయనం
• అటవీ శాఖ సలహాదారు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి నేతృత్వంలోని కమిటీకి బాధ్యతలు
• జంతువుల ఆవాసాల నిర్వహణ, రక్షణ చర్యలపై నివేదిక కోరిన శ్రీ @PawanKalyan గారు
• రాష్ట్రంలో మరింత పటిష్టంగా వన్యప్రాణి సంరక్షణ చర్యలు
రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఇటీవల చోటు చేసుకున్న వన్యప్రాణుల మరణాల ఘటనలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. పులుల మరణాలపై అధ్యయనానికి అటవీశాఖ సలహాదారు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీకి ఆ బాధ్యతలను అప్పగించారు. వన్యప్రాణుల ఆవాసాల నిర్వహణ, రక్షణ చర్యలు, మానవ–వన్యప్రాణి ఘర్షణల నివారణ, క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంరక్షణ కార్యక్రమాల ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని సూచించారు.
వన్యప్రాణుల సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు అమలు అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత హనుమాన్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, ప్రత్యేక పరిస్థితుల్లోనూ జంతువుల సంరక్షణ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న కార్యక్రమాలు, వాటి ఫలితాలను శాస్త్రీయంగా విశ్లేషించి, అవసరం ఉన్న చోట మరింత పకడ్బందీగా చర్యలు అమలు చేయాలన్న ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు రాష్ట్ర అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లిఖార్జునరావు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి శ్రీ రాహుల్ పాండే నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ రాష్ట్రవ్యాప్తంగా వన్యప్రాణుల సంచారం ఉన్న ప్రాంతాలను సందర్శించి, వాటి మరణాలకు దారితీస్తున్న అంశాలు, ఆవాసాల్లో పరిస్థితులు, సంచార మార్గాల్లో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లు, వేట నిరోధక చర్యలు, పర్యవేక్షణ వ్యవస్థలు, అటవీ అగ్నిప్రమాదాల నియంత్రణ, నీటి వనరుల లభ్యత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. దీంతో పాటు పులులు, చిరుతలు, ఏనుగులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణకు అమలవుతున్న కార్యక్రమాలను సమీక్షించి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లను గుర్తించి, నివారణ చర్యలపై సూచనలు చేయనుంది. వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి, సహజ ఆహార వనరుల పెంపు, సంచార మార్గాల సంరక్షణ, స్థానిక ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రత్యేక నివేదిక రూపొందించి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తుంది.
దీంతో పాటు మానవ–వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలు, విద్యుత్ లైన్లు, రహదారులు, రైల్వే మార్గాలు, ఇతర మౌలిక సదుపాయాల వల్ల ఏర్పడే ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా కమిటీ కీలక సిఫార్సులు చేయనుంది. వన్యప్రాణుల భద్రతకు మొదటి నుంచే శ్రీ పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తిరుపతి సమీపంలో నీటి కోసం వచ్చిన కృష్ణజింక ఇనుప కంచెలో ఇరుక్కుని మృతి చెందిన ఘటనతో చలించిన ఆయన, వేసవిలో జంతువుల దాహార్తిని తీర్చేందుకు వాటి సంచార మార్గాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సహకారంతో నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు.
వన్యప్రాణుల సంరక్షణలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలన్న లక్ష్యంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో ప్రత్యేక కార్యాచరణను ముందుకు తీసుకువెళ్తున్నారు. వీటికి మరింత బలం చేకూర్చే విధంగా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో శాస్త్రీయ పరిశోధనలు, క్షేత్రస్థాయి చర్యలు అమలు చేస్తూ, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో మరింత సమర్థవంతమైన సంరక్షణ వ్యవస్థను రూపొందించేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడాలన్నది ఉప ముఖ్యమంత్రివర్యుల ఆకాంక్ష. రాష్ట్రంలోని వన్యప్రాణులు, వాటి ఆవాసాలు, సంచార మార్గాల పరిరక్షణ, మరణాల నివారణ, మానవ–వన్యప్రాణి ఘర్షణల నిరోధం ద్వారా ఆంధ్రప్రదేశ్ తాలూకు జీవవైవిధ్య వారసత్వాన్ని భావితరాలకు అందించే లక్ష్యంతో కార్యాచరణ ఉండాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.
@HANUMAN_APGOV @APFDOfficial @PIB_India @IPR_AP @pibvijayawada



























