Marx2.O (@Marx2PointO) header
Marx2.O (@Marx2PointO) profile picture

Indian 🇮🇳 | Ambivert🌗 | Telugu❤️| Coffee ☕| Solo Player😎| Politics✊|Cricket😄 |Movies⭐ |Peace✌️ | Pawan Kalyan ❤️🙏| Ram Charan❤️| Jai Hind ❤️🇮🇳🫡

Somewhere
Joined January 2015
Photo by Marx2.O (@Marx2PointO)Photo by Marx2.O (@Marx2PointO)Photo by Marx2.O (@Marx2PointO)Photo by Marx2.O (@Marx2PointO)Photo by Marx2.O (@Marx2PointO)Photo by Marx2.O (@Marx2PointO)Photo by Marx2.O (@Marx2PointO)Photo by Marx2.O (@Marx2PointO)Photo by Marx2.O (@Marx2PointO)Photo by Marx2.O (@Marx2PointO)
If trolling were a sport, Palki Sharma would be playing in the finals every time 😄🔥 #PalkiSharma
1
2
2
16
13,111
ఉప్పాడ తీర రహదారికి రెండో రోజే మరమ్మతులు అర్నబ్ తుఫానుతో తీవ్రంగా దెబ్బతిన్న ఉప్పాడ తీర రహదారి మరమ్మతులు రెండో రోజే ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. #Uppada #PawanKalyan
1
27
1
82
1,937
Marx2.O retweeted
Sky turns blood red in parts of chhattisgarh amid cyclone arnab 😨 #CycloneArnab #ArnabCyclone
1
2
166
Sky turns blood red in parts of chhattisgarh amid cyclone arnab 😨 #CycloneArnab #ArnabCyclone
1
2
166
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. - అర్నబ్ తుపాను నష్టం, సహాయక చర్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలను ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. - ⁠ఉప్పాడ తీరంపైనా అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపిందని, అలల ఉద్ధృతికి యు.కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారుల బోట్లకు నష్టం వాటిల్లినట్టు వివరించారు. వీటిలో ఉప్పాడ తీరంలో 40 బోట్లు దెబ్బతినగా, ఉప్పాడ మత్స్యకారులకు చెందిన మరో 117 బోట్లు కోనసీమ జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో దెబ్బతిన్నాయని, వీటికి తగిన నష్టపరిహారం వీలైనంత త్వరగా చెల్లించే ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు కోరారు. - ⁠అర్నబ్ తుపాను కారణంగా రాష్ట్రం మొత్తం తీర ప్రాంతం వెంబడి బోట్లు, వలలు తదితర వేట సామగ్రి నష్టపోయిన మత్స్యకారులందరికీ సాధ్యమైనంత త్వరగా పరిహారం అందజేసేలా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. - ⁠అర్నబ్ తుపాను కారణంగా ఉప్పాడ ప్రాంతంలోని చేనేతలకు జరిగిన నష్టాన్ని కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గం ముందు ఉంచారు. భారీ వర్షాల కారణంగా మగ్గాల్లోకి నీరు వచ్చేయడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం కారణంగా వారి జీవనోపాధికి విఘాతం కలుగుతుందని తెలిపారు. - ⁠నష్టాన్ని అంచనా వేసి చేనేతలకు తుపాను పరిహారం అందించే ఏర్పాటు చేయాలని కోరారు. - ⁠విపత్తు నిర్వహణలో గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరు ప్రశంసనీయంగా ఉందని మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. - ⁠విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు. తుపాను హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి అన్ని శాఖలను సమన్వయం చేస్తూ నిరంతరం పర్యవేక్షించిన తీరును అభినందించారు. - ⁠పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడం, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడం వంటి చర్యలను పకడ్బందీగా సమన్వయం చేశారన్నారు. అలాగే తుపాను సహాయక చర్యలను సమన్వయం చేసిన మంత్రివర్గ సహచరులను, సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు.
25
398
7
1,939
41,717
రైలు ఢీకొని ఎలుగుబంట్లు మృతి చెందిన ఘటనపై అటవీ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రివర్యుల చర్చ •రైల్వే, అటవీ ఉన్నతాధికారుల మధ్య సమన్వయ సమావేశానికి ఆదేశం •అటవీ మార్గ ప్రయాణాల్లో లోకో పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచన రైలు ఢీకొన్న ప్రమాదంలో రెండు ఎలుగుబంటి పిల్లలు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు విచారం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా డి. హీరేహాళ్ మండలం కళ్యం గ్రామ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులతో చర్చించారు. కళ్యాణదుర్గం అటవీ రేంజ్‌లోని, రాయదుర్గం బీట్, సెక్షన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంపై అటవీ శాఖ అధికారుల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాల మధ్య వెళ్లే రైల్వే మార్గాల్లో వన్యప్రాణులు ప్రమాదాల బారినపడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అటవీ, రైల్వే శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. గతంలో అదే మార్గంలో రైలు ప్రమాదంలో చిరుత మృతి చెందిన ఘటనను గుర్తు చేస్తూ, అటవీ మార్గాల్లో రైళ్లు నడిపే లోకో పైలెట్లు వన్యప్రాణి సంరక్షణ చర్యల్లో భాగంగా రూపొందించిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాజా ఘటనపై స్థానిక రైల్వే శాఖ ఉన్నతాధికారులతో అటవీ శాఖ అధికారులు ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో రైళ్ల రాకపోకల సమయంలో వన్యప్రాణుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని నిర్దేశం చేశారు. అటవీ ప్రాంతాల గుండా రైళ్లు ప్రయాణించే సమయంలో లోకో పైలెట్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ముఖ్యంగా వన్యప్రాణుల సంచారం ఉండే ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లను నిశితంగా గమనిస్తూ రైళ్లను నడపాలని, అటవీ మార్గాల్లో రైళ్ల వేగాన్ని నియంత్రించడం, అవసరమైన ప్రాంతాల్లో క్రమం తప్పకుండా హారన్ మోగించడం వంటి చర్యల ద్వారా వన్యప్రాణులకు ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. అలాగే ఈ మార్గాల్లో రైళ్లను నడిపే లోకో పైలెట్లకు రైల్వే శాఖ వన్యప్రాణుల సంచారం, వాటి సంరక్షణ, ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. అటవీ శాఖ అధికారులు స్థానిక రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ వన్యప్రాణులు రైల్వే ట్రాక్‌లను దాటే ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై దృష్టి సారించాలన్నారు. రైల్వే మార్గాల్లో వన్యప్రాణులకు జరుగుతున్న ప్రమాదాలను నివారించే అంశాన్ని సంబంధిత రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి కూడా తీసుకువెళ్లాలని పీసీసీఎఫ్ ని ఆదేశించారు. • విద్యుద్ఘాతంతో ఏనుగుల వరుస మరణాలపై… విద్యుద్ఘాతం కారణంగా వరుసగా సంభవిస్తున్న ఏనుగుల మరణాలపై ఉప ముఖ్యమంత్రివర్యులు సమీక్షించారు. ఈ తరహా ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న జిల్లాల్లో సంబంధిత కలెక్టర్లతోపాటు వ్యవసాయ, ఉద్యాన, విద్యుత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర అనుబంధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి, నివారణ చర్యలపై చర్చించాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్ షాక్ కారణంగా సంభవిస్తున్న ఏనుగుల మరణాల సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషించాలని స్పష్టం చేశారు. ప్రతి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి భవిష్యత్తులో పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అటవీ ఉన్నతాధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల సంచారం ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తగినంత ఎత్తులో ఉండేలా విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలని, వన్యప్రాణుల సంచారం ఉన్న ప్రాంతాల్లో పంటల చుట్టూ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. @HANUMAN_APGOV @APFDOfficial @PIB_India @IPR_AP @pibvijayawada
4
147
2
465
10,933
Mass ki grammar, style ki definition. Megastar is here. 👑❤️ Watch Chiranjeevi’s Megaverse, coming soon, Only on Netflix. #MegaverseOnNetflix
101
1,896
58
7,901
148,096
శ్రీ నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చిన్నన్నయ్య శ్రీ @NagaBabuOffl గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శాసన మండలి సభ్యుడిగా, ఏపీ గ్రీన్ ఛైర్మన్ గా ఆయన మరింతగా సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను. స్వతహాగా పర్యావరణ పరిరక్షణపై అభిలాష కలిగిన శ్రీ నాగబాబు గారు ఏపీ గ్రీన్ ఛైర్మన్ బాధ్యతలకు వన్నె తీసుకొస్తారనే విశ్వాసం ఉంది. చిన్నన్నయ్యకి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. - @PawanKalyan @PIB_India @IPR_AP @pibvijayawada
28
503
6
3,558
82,917
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ •డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు 100 ప్రత్యేక బృందాలు •తొమ్మిది జిల్లాల నుంచి 475 మంది సిబ్బందితో టాస్క్ ఫోర్స్ •తాగు నీటి నాణ్యత పరీక్షలకు ప్రత్యేకంగా వాటర్ టెస్టింగ్ బృందాలు •రెండు జిల్లాలకు 48 మంది సాంకేతిక సిబ్బంది నియామకం •ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో ఏర్పాటు అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచేందుకు, అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటయ్యాయి. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు 475 మందితో కూడిన ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఈ రెండు జిల్లాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం మొత్తం 100 ప్రత్యేక బృందాలను కేటాయించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు 55 బృందాలు, పశ్చిమ గోదావరి జిల్లాకు 45 బృందాలను పంపనున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల నుంచి మొత్తం 475 మంది సిబ్బందిని ఈ పనుల కోసం కేటాయించారు. క్షేత్రస్థాయిలో నాలుగేసి మంది సభ్యులతో బృందాలను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులను ముందుకు తీసుకువెళ్లనున్నారు. తుపాను కారణంగా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడిన నీటి నిల్వలను తొలగించడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం, బ్లీచింగ్, క్లోరినేషన్ చేపట్టడం వంటి పనులకు ఈ ప్రత్యేక బృందాలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, జనావాసాల మధ్య నీరు నిలిచిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టనున్నాయి. భారీ వర్షాలు, వరద నీటి కారణంగా గ్రామాల్లో అపరిశుభ్ర పరిస్థితులు ఏర్పడి అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ముందస్తు నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. • తాగు నీటి నాణ్యత పరీక్షలకు ప్రత్యేక బృందాలు తుపాను ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక వాటర్ టెస్టింగ్ బృందాలను కూడా ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. అందుకోసం కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు కలిపి 48 మంది సాంకేతిక సిబ్బందిని కేటాయించారు. ఈ బృందాల్లో డీఈ, ఏఈలు, కెమిస్టులు, మైక్రోబయాలజిస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తాగునీటి వనరులు, సరఫరా అవుతున్న నీటి నాణ్యతను అక్కడికక్కడే ఈ బృందాలు పరీక్షిస్తాయి. నీటి పరీక్షల్లో నాణ్యతకు సంబంధించిన ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించనున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తారు. నీటి సరఫరాలో గుర్తించిన లోపాలను తక్షణమే సరిదిద్దేలా చర్యలు చేపట్టనున్నారు. కలుషిత నీటి కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ బృందాలు ఏర్పాటయ్యాయి. తుపాను ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ముఖ్యంగా తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న రెండు జిల్లాల్లో స్థానిక సిబ్బందికి అదనంగా ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక బృందాలను పంపడం ద్వారా సహాయక, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. గ్రామాల్లో నీటి నిల్వలు తొలగించడం, మురుగు శుభ్రం చేయడం, తాగునీటి నాణ్యతను నిరంతరం పరిశీలించడం ద్వారా ప్రజారోగ్యానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. @PIB_India @IPR_AP @pibvijayawada
7
185
2
586
12,750
Marx2.O retweeted
Arnab cyclone effect in Berhampur, Odisha 😨 #ArnabCyclone #CycloneArnab #Odisha
4
1
9
640
Arnab cyclone effect in Berhampur, Odisha 😨 #ArnabCyclone #CycloneArnab #Odisha
4
1
9
640
🙏❤️ నా Twitter కుటుంబానికి ఒక చిన్న విజ్ఞప్తి. మా అమ్మ మరీదు వెంకటేశ్వరమ్మ గారు, ఈస్ట్ యడవల్లి గ్రామ MPTC అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు, సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. K.Kota(M), Eluru Dt. #PawanKalyan #JanaSenaParty #NDA
40
300
25
750
27,065
MLC elections in 28 seats across 4 big states - Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka. Elections held using ballot papers. Guess how many seats Congress won? 🧐
16,163
40,612
7,211
178,746
14,349,477
తుపాను ప్రభావం తగ్గే వరకు యంత్రాంగమంతా క్షేత్ర స్థాయి విధుల్లోనే ఉండాలి •అర్నబ్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయండి •పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి •తుపాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి •దెబ్బ తిన్న రహదారులు, విద్యుత్, తాగునీటి సరఫరా పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలి •చెరువుల గట్లు, వాగులు, వంకల్లో వరద ప్రవాహంపై నిరంతర నిఘా ఉంచాలి •పంటలు, ఇళ్లు, ప్రభుత్వ ఆస్తుల నష్టాన్ని త్వరితగతిన అంచనా వేయాలి •అర్నబ్ తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సహాయక చర్యలపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు •కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గాలపై ప్రత్యేక సమీక్ష అర్నబ్ తీవ్ర తుపాను తీరం దాటిన నేపథ్యంలో యంత్రాంగం మరింత అప్రమత్తతో వ్యవహరించాలని, తుపాను ప్రభావం పూర్తిగా తగ్గేంత వరకు అధికారులంతా క్షేత్ర స్థాయి విధుల్లోనే నిమఘ్నం కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాపట్ల నుంచి శ్రీకాకుళం వరకు తుపాను ప్రభావం ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ ఆయా జిల్లాలలో తాజా పరిస్థితిపై బుధవారం మధ్యాహ్నం సమీక్షించారు. ముఖ్యంగా తుపాను తీరం దాటిన డా. బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది పరిసర ప్రాంతాలు, కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతంలో పరిస్థితులు, తుపాను తాకిడికి సంభవించిన నష్టం తదితర అంశాలపై ఆరా తీశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, సహాయక చర్యలను మరింత పకడ్బందీగా చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు అధికారులకు ఆదేశించారు. తుపాను ప్రభావం తగ్గు ముఖం పట్టాక పంట నష్టం వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఉప్పాడ తీర ప్రాంతంలో నిర్మించిన రోడ్డు పూర్తిగా దెబ్బతిన్న అంశాన్ని ప్రస్తావించి వివరాలు తెలుసుకున్నారు. ఉప్పాడ తీరం వెంబడి ఇళ్లు ఏమైనా దెబ్బతిన్నాయా అన్న అంశాలు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఆస్తి నష్టం, పంట నష్టం, పునరావాస కేంద్రాల నిర్వహణ, దెబ్బతిన్న సౌకర్యాల పునరుద్ధరణ తదితర అంశాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అధికారులు తుపాను పరిస్థితిని వివరిస్తూ... అర్థరాత్రి 1.20 నుంచి యానాంకు దక్షిణంగా అర్నబ్ తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమై, ఉదయం వరకు కొనసాగింది. ఈ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగాన్ని చేరుకున్నాయని వివరించారు. బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లోనూ పెనుగాలులు విధ్వంసం సృష్టించాయని, గాలులు తాకిడికి భారీ వృక్షాలు రోడ్లపై కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. విద్యుత్ స్థంభాలు కూలడం, వైర్లు తెగిపోవడం కారణంగా ఆయా జిల్లాల పరిధిలో విద్యుత్ సరఫరా దాదాపు నిలిపివేసినట్టు చెప్పారు. గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, పోలవరంతో పాటు ఏజెన్సీ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నట్టు వివరించారు. గాలుల తీవ్రత తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో తక్షణం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రోడ్లపై పడిన చెట్ల తొలగింపు తదితర కార్యక్రమాలు చేపడుతున్నామనీ, తీర ప్రాంత గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల్లో సురక్షితంగా ఉన్నట్టు కలెక్టర్లు తెలిపారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంల ద్వారా సహాయక చర్యల పర్యవేక్షణ, పునరుద్ధరణ కొనసాగుతున్నట్టు తెలిపారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లా పరిధిలోనే 93 రోడ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 736 చెట్లు నేలకొరిగినట్టు సమాచారం ఉంది. యుద్ధప్రాతిపదికన వాటిని తొలగించే ప్రయత్నం చేయాలని సూచనలు చేశారు. వాగులు, వంకల్లో ప్రవాహాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. మధ్యాహ్నానికి కాకినాడ పరిసరాల్లో ఉన్న తుపాను ఉత్తరాంధ్ర మీదుగా కదలాడుతూ క్రమంగా బలపడుతున్నట్టు వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. తుపాను ప్రభావం తగ్గినా భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రివర్యులు సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణలో లోపాలు లేకుండా చేసుకోవాలని ఆదేశించారు. గాలులు తీవ్రత పూర్తిగా తగ్గి, వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పునరావాస కేంద్రాల నుంచి ప్రజలను ఇళ్లకు పంపాలని స్పష్టం చేశారు. నీటి నిల్వలను తక్షణం తొలగించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు ఆదేశించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో క్లోరినేషన్, బ్లీచింగ్ చల్లడం ద్వారా అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తక్షణం పంట నష్టంపై సమగ్ర అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి పంపాలని, రైతులకు సకాలంలో పరిహారం అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతంలో దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభించాలని, ముఖ్యంగా ఆసుపత్రులు, పునరావాస కేంద్రాలకు వెళ్లే మార్గాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను పునరుద్దరించి, విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. మొత్తం నష్టం తాలూకు నివేదికను సిద్దం చేయాలని ఆదేశించారు. •కాకినాడ జిల్లాలో పరిస్థితులపై... కాకినాడ జిల్లా పరిధిలో 92 ఆవాసాలు తుపానుకు ప్రభావితం కాగా, అందులో 9,870 మందికి పునరావాస శిబిరాల్లో ఆశ్రయం కల్పించినట్టు అధికారులు వివరించారు. పిఠాపురం నియోజకవర్గంలోని మండలాల్లో పరిస్థితులను ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. బీచ్ రోడ్డు ఎంత మేర దెబ్బతింది. అలల తీవ్రత ఏ మేరకు ఉంది లాంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఏలేరు ముంపు పరిస్థితిపై వివరాలు అడిగారు. ఏలేరు దిగువ ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గాల పరిధిలో శాఖల వారీగా చేపట్టిన సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. • అధికారుల సూచనలు పాటించండి ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. వాతావరణ శాఖ అనుమతులు వచ్చే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు సూచించారు. • ముందస్తు ప్రణాళికతో ప్రాణ నష్టం నివారించగలిగాము రాష్ట్రవ్యాప్తంగా అందిన సమాచారం మేరకు 14 జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని, ఆయా జిల్లాల పరిధిలో దాదాపు 28,000 మందికి పైగా బాధితులను పునరావాస శిబిరాలకు తరలించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 70,000 హెక్టార్లలో పంటలు నీట మునిగినట్టు సమాచారం ఉందనీ.. మరో 10,500 హెక్టార్లలో ఉద్యాన పంటలు, పెద్ద ఎత్తున ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని చెప్పారు. 16 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి అన్నారు. వీరితో పాటు దాదాపు 32,000 మంది వివిధ శాఖలకు చెందిన సిబ్బంది క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ముందస్తు సహాయక చర్యలు చేపట్టి, ప్రాణనష్టాన్ని నివారించగలిగాము అన్నారు. @PIB_India @IPR_AP @pibvijayawada
4
208
684
12,696
Marx2.O retweeted
Two high speed trains crash in Toledo, Spain, leaving 46 people dead and many injured. Deepest condolences to the families who lost their loved ones 💔🙏 #Spain #Toledo #TrainAccident
2
1
290
Two high speed trains crash in Toledo, Spain, leaving 46 people dead and many injured. Deepest condolences to the families who lost their loved ones 💔🙏 #Spain #Toledo #TrainAccident
2
1
290
Marx2.O retweeted
Men are ready to face anything for their families ❤️🥺 #ArnabCyclone #CycloneArnab
1
2
17
3,031
Men are ready to face anything for their families ❤️🥺 #ArnabCyclone #CycloneArnab
1
2
17
3,031
తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని సహాయ చర్యల్లో పాలుపంచుకోండి అర్నబ్ తుపాను రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తుపాను తీరం దాటినా వర్షాలు భారీగా కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ క్రమంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయ చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఈ సహాయ చర్యల్లో నాయకులు, ప్రజా ప్రతినిధులు పాలు పంచుకోవాలి. లోతట్టు ప్రాంతాలవారినీ, తీర ప్రాంతాల్లోని వారినీ సహాయక శిబిరాలకి తరలించారు. వారికి అవసరమైన సహాయం, ఆహారం, పాలు అందించాలని, అత్యవసర వైద్యం అవసరమైన వారికి తగిన విధంగా అండనివ్వాలని సూచిస్తున్నాను. అదే విధంగా రహదారులపై కూలిన చెట్లను, స్తంబాలను తొలగించడంలో నిమగ్నమైన సిబ్బందికి సహాయం చేయాలని కోరుతున్నాను. - @PawanKalyan @PIB_India @IPR_AP @pibvijayawada
7
295
2
1,040
25,238
సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి నిలుస్తున్న మన డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారు, ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి అండగా నిలవడం మనందరి బాధ్యత. 🚩 మన ధర్మం, మన సంస్కృతి, మన సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందిద్దాం. ధర్మో రక్షతి రక్షితః! 🚩
125
1
374
3,304
Marx2.O retweeted
Arnab cyclone effect in Amalapuram 💔 #ArnabCyclone #CycloneArnab #AndhraPradesh
2
6
596