
FC of @PawanKalyan & @JanaSenaParty. Active in #Political issues and #Movie Updates of #PawanKalyan!!
India
Joined September 2019
- Tweets31.8K
- Following49
- Followers13.2K
- Likes47.2K
Happy Birthday @Sujeethsign ❤️. Love you Forever. Can't Wait for #OGUniverse FireStorm to Recreate the History 💥
#HappyBirthdaySujeeth
SoldierPSPK retweeted
మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు పలువురు నాయకులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం, అభ్యర్థులు, కార్యకర్తల సమన్వయం, కూటమి భాగస్వాములతో కలిసి ఎన్నికల కార్యాచరణ, పోలింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, పార్టీ అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
#VoteForGlass
#APLocalBodyElections
Happiest Birthday to our Rebal Star #Prabhas Garu. Wishing a Blockbuster year ahead and sending best wishes from @PawanKalyan Followers 🤗❤️
#HappyBirthdayPrabhas
SoldierPSPK retweeted
తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై వైసీపీ దాడి అత్యంత హేయం
* వైసీపీ గూండా చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి
* ఎన్నికల్లో గెలవలేమని అర్థమై వైసీపీ అరాచకానికి పాల్పడుతోంది
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లెలో ప్రజాస్వామ్య పద్ధతిలో, నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళుతున్న జనసేన పార్టీ నాయకులు, శ్రేణులను కవ్వించి వైసీపీ గూండాలు దాడులకు తెగబడటం అత్యంత హేయం. తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయాన్ని వైసీపీ వాళ్లు ధ్వంసం చేశారు. అక్కడే కొన్ని వాహనాలను నాశనం చేసి, అడ్డు వచ్చిన వారిపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని, దౌర్జన్యాలు, గొడవలు చేయాలనే దురుద్దేశంతో వైసీపీ ఈ దుశ్చర్యలకి పాల్పడుతోంది. రాష్ట్రంలో అశాంతి, అరాచకం, అలజడులు సృష్టించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలనే వైసీపీ పన్నాగం దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవలేం అని తెలిసే వైసీపీ హింసకు దిగింది.
*ఎస్.ఈ.సి. కఠిన చర్యలు తీసుకోవాలి
జనసేన పార్టీ ఇలాంటి గూండా చర్యలను చూస్తూ ఊరుకోదు. జనసేన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారి మీద, జనసేన శ్రేణులపై దాడులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసు యంత్రాగం కూడా ఈ దాడులకి పాల్పడ్డవారిని, వెనుక ఉన్నవారిని గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలి.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా గౌరవించే నాయకులు. రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్రను పెంచాలనే బృహత్ ఆశయంతో ఆయన పనిచేస్తున్నారు. దీనిని కాలరాసేలా వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు వైసీపీ చేస్తున్న ఈ అరాచక చర్యలను ఖండించాలి.
(నాదెండ్ల మనోహర్)
చైర్మన్, రాజకీయ వ్యవహారాల కమిటీ, జనసేన
SoldierPSPK retweeted
Warm birthday greetings to Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat.
- @PawanKalyan
@HMOIndia @PIB_India @IPR_AP @pibvijayawada
SoldierPSPK retweeted
2. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా SEC కీలక ఆదేశాలు.. నామినేషన్లకు 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC), నో డ్యూ సర్టిఫికెట్లు(NDC)' అవసరం లేదని SEC ప్రకటన.
3. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. హింసాత్మక ఘటనలు జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణతో పాటు, అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను తాత్కాలికంగా నిలుపుదల చేసిన SEC.
4. గుర్తుల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ SEC కీలక నిర్ణయం.. 'జనసేన' అభ్యర్థుల గుర్తులను పోలి ఉండటంతో 'బకెట్, పెన్ స్టాండ్' గుర్తుల కేటాయింపుపై నిషేధం విధించిన SEC.
#APLocalBodyElections
SoldierPSPK retweeted
అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ విజయదశమి పర్వదినాన, ఆ జగన్మాత శక్తి స్వరూపిణి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
#Vijayadashami2026
#HappyDussehra
#HappyDussehra2026
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.
#HappyDussehra #Vijayadashami
@PawanKalyan @JanaSenaParty
SoldierPSPK retweeted
విశాఖ పశ్చిమ నియోజకవర్గం
ఇంఛార్జిగా శ్రీ బెహర భాస్కరరావు
జనసేన నాయకుడు, సీనియర్ రాజకీయవేత్త శ్రీ బెహర భాస్కరరావు గారిని విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్చార్జిగా పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు నియమించారు. విశాఖపట్నంలో రెండుసార్లు కార్పొరేటరుగా ఎన్నికయిన శ్రీ భాస్కరరావు గారికి నగర రాజకీయాలలో అపార అనుభవం ఉంది. ఈ సందర్భంగా శ్రీ భాస్కరరావు గారికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుభాభినందనలు తెలిపారు.
SoldierPSPK retweeted
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు
• రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలకు ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశం
• ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్న శ్రీ @PawanKalyan గారు
తిరుపతి జిల్లా, పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రోడ్డు ధ్వంసం, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వారం రోజుల క్రితం పల్లెపండుగ 3.0 ద్వారా రూ. 4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును సుబ్బారెడ్డి అనే వ్యక్తి,
వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి సాయంతో 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నేశారని, గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. సాయంత్రంలోపు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సౌకర్యం కలిగించే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, పల్లెపండుగ రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించారు. ప్రజా ధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం అనేది దుర్మార్గపు చర్య అనీ, ఆ చర్యలకి పాల్పడ్డ నాయకులు, వారి వెనుక ఉన్నవారినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఇచ్చే మౌలిక సదుపాయాలుకి ఎవరు నష్టం చేశారో వారి నిజ స్వరూపం అందరికీ తెలియచేయాలి అన్నారు.
అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ని వర్తింపజేసి జరిగిన నష్టాన్ని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
@AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
SoldierPSPK retweeted
విజయదశమి శుభాకాంక్షలు
చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయ దశమి పర్వదినాన యావత్ భారతావని ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా శక్తి స్వరూపిణిని ఆరాధిస్తూ దసరా ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకుంటున్నారు. దేశ ప్రజలందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాలు గౌరవ భారత రాష్ట్రపతితోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాకతో మరింత శోభాయమానంగా జరిగాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ వేదికగా నిర్వహించిన జాతీయ స్థాయి సరస్ మేళా రాష్ట్ర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసింది. శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోందని తెలియజేస్తూ.. ఈ విజయదశమి ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షిస్తున్నాను.
- @PawanKalyan
@PIB_India @IPR_AP @pibvijayawada
SoldierPSPK retweeted
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచక వైసీపీకి పూర్తిగా సమాధి కట్టనున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు.
#VoteForGlass
#APLocalBodyElections
SoldierPSPK retweeted
శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబులకు నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు
•శ్రీ రాజాన సూర్యచంద్రను బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం
నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్యేలు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబులకు అప్పగించారు. స్థానికల సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమన్వయ విధులను జనసేన తరఫున వీరిద్దరూ నిర్వర్తించాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆదేశించారు. ప్రస్తుతం నర్సీపట్నం పి.ఓ.సి.గా ఉన్న శ్రీ రాజాన సూర్యచంద్రను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. జనసేన పక్షాన సమన్వయం చేయడంలో శ్రీ సూర్యచంద్ర చర్యలపై పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబు నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు తక్షణమే అమలులోకి వస్తాయి.
-జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
Wishing all the best for every contestant who stand from @JanaSenaParty ✊🏼
#APLocalBodyElections
SoldierPSPK retweeted
ఎన్నికల కోడ్ కారణంగా ‘జనవాణి’ తాత్కాలికంగా నిలిపివేత
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించే ‘జనవాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపి వేయడమైనది. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం జనవాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. కార్యక్రమాన్ని ఎప్పుడు పునఃప్రారంభిచబోయేది ముందుగా తెలియజేస్తాము.
#janavaani
SoldierPSPK retweeted
జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్ధుల తుది జాబితా
మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల తుది జాబితాకు పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆమోదం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
1. తుని: శ్రీమతి సరకణం శ్రీలత
2. ముమ్మిడివరం : శ్రీమతి గుబ్బల రత్న భవాని
#VoteForGlass
#APLocalBodyElections



















