V retweeted
కాకినాడ గెలుపు కూటమి పాలనకు ప్రభజనం కావాలి
* స్థానిక ఎన్నికల్లో కూటమి ఐకమత్యమే మహా బలం
* కూటమి నేతలు, శ్రేణులు సమష్టిగా వెళ్లి పని చేయాలి
* నాయకులే కాదు కార్యకర్తలను నిరంతరం సమన్వయం చేయాలి
* క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఓటరునీ కలవాలి… ఓటు అడగాలి
* జనసేన పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు
* కాకినాడలో స్థానిక ఎన్నికల సమన్వయ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారు
‘కాకినాడ నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో కూటమి శ్రేణులన్నీ కలసికట్టుగా పని చేసి, శ్రీమతి ఆకుల భవాని గారిని, కూటమి పక్షం కార్పొరేటర్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాల’ని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. శనివారం కాకినాడ విచ్చేసిన శ్రీ మనోహర్ గారు స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించిన సమన్వయ కమిటీతో ప్రత్యేకంగా చర్చించారు. అలాగే కూటమి పక్షాల నేతలతోనూ సమావేశం అయ్యారు. ప్రస్తుతం ఎన్నికల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ, ఎలాంటి సమస్యలున్నా కలిసి పరిష్కరించుకోవాలని, కూటమి నాయకులు సమష్టిగా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయి పరిస్థితిని ఈ సందర్భంగా నాయకులు శ్రీ మనోహర్ గారికి వివరించారు. ఈ సందర్భంగా సమావేశంలో శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ.. "స్థానిక సంస్థల మొదటి దశ ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించింది. ఈ స్ఫూర్తిని కొనసాగించేలా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో జనసేన జెండాను అఖండ మెజారిటీతో ఎగిరేలా చేయాలి. కాకినాడ ప్రాంతం అంటే అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అమితమైన అభిమానం. ఆయన ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కాకినాడ ఆయన సొంత జిల్లా లాంటిది. కాకినాడ నగరపాలక సంస్థలో జనసేన విజయం ఒక ప్రభంజనంలా నిలిచేలా ప్రతి ఒక్కరూ చొరవ తీసుకొని పనిచేయాలి. కూటమిలోని మూడు పార్టీలు నిత్యం చర్చించుకుని సమన్వయంతో ముందుకు సాగితే విజయం చాలా సులభం. ఇటీవల జరిగిన మొదటి దశ ఎన్నికల్లోను ఇది పూర్తిగా కనిపించింది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకుంటే, చాలా వరకు సమస్యలు తొలగిపోతాయి. నాయకుల సఖ్యతతో పాటు కార్యకర్తల మధ్య కూడా సమన్వయం చాలా అవసరం.
*అందరికీ గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు*
పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరినీ గుర్తించేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. కొందరికి ముందు అవకాశాలు రావచ్చు.. మరికొందరికి తర్వాత రావచ్చు. కానీ ప్రతి ఒక్కరికి తగిన బాధ్యత అప్పగించేలా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. పార్టీ ఇచ్చే ప్రతి బాధ్యతను మనస్ఫూర్తిగా స్వీకరించాలి. ఆ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించేలా కృషి చేయాలి. క్షేత్రస్థాయిలో
ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఓటు అభ్యర్థించండి. స్థానిక సమస్యలను ప్రస్తావించడంతోపాటు రెండున్నర ఏళ్ల కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు తెలియజెప్పండి.
*కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు వివరించండి
కూటమి ప్రభుత్వంలో జరిగిన మేలు ప్రజలకు వివరించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన వేదికగా ఉపయోగపడతాయి. ప్రజలను ప్రత్యక్షంగా కలిసేటప్పుడు వారికి ప్రభుత్వం వల్ల కలిగిన మేలు ప్రయోజనాలను అర్థమయ్యేలా చెప్పండి. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తీరు వల్ల రాష్ట్రం అభివృద్ధిపరంగా ముందుకు వెళుతున్న తీరును ఓటర్లకు తెలియజెప్పండి. సంక్షేమం ఏ మాత్రం తగ్గకుండా మరిన్ని కొత్త పథకాలతో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న సరికొత్త పంథాను వివరించండి. నగర సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోండి. ఓటరు అడిగిన ప్రతి ప్రశ్నకు తప్పనిసరిగా వివరణాత్మక సమాధానం ఉండాలి. వారిని పాలనలో భాగస్వామ్యం చేసేలా మాట్లాడాలి. చిన్నచిన్న సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించేలా చొరవ తీసుకోండి. మూడు పార్టీల కార్యకర్తలతో నిరంతర సమావేశాలు నిర్వహిస్తూ, కాకినాడ లో మరోసారి కూటమి ఐక్యతను పెంపొందించేలా విజయం సాధించాలి" అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, ఎంపీ శ్రీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శ్రీ పంతం నానాజీ, శ్రీ వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సుజయ కృష్ణ రంగారావు, కాకినాడ జెడ్పీ చైర్మన్ డా.బుర్రా దివ్య సునీత రాజ్, కూటమి పార్టీ నేతలు శ్రీ చిక్కాల రామచంద్ర రావు, శ్రీ తోట సుధీర్, శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, శ్రీ తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు.
V retweeted
కూటమిదే భీమవరం మున్సిపాలిటీ
•డా.మల్లేశ్వరి గారిని అఖండ మెజారిటీతో గెలిపిద్దాం
•నేను, నువ్వు అనే ఆలోచనలకు స్వస్తి చెప్పి మనం అనే నినాదంతో ముందుకు వెళ్దాం
•భీమవరం మీడియా సమావేశంలో ఏపీ గ్రీన్ ఛైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ @NagaBabuOffl గారు
నేను.. నువ్వు అనే ఆలోచనలకు స్వస్తి పలికి, మనం అనే స్ఫూర్తితో కూటమి పార్టీలు ముందుకు సాగాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు అన్నారు. భీమవరం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరడం ఖాయమని, కూటమి అభ్యర్థులతో పాటు చైర్మన్ అభ్యర్థి డాక్టర్ మల్లేశ్వరి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భీమవరాన్ని అభివృద్ధికి కేరాఫ్ గా మార్చుదామని, పట్టణంలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి, ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ భీమవరం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. శనివారం భీమవరంలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి, కౌన్సిలర్ అభ్యర్థులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కార్యాచరణ, ప్రచార ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి అభ్యర్థుల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, జిల్లా అధ్యక్షుడు శ్రీ కొటికలపూడి గోవిందరావు గారు పాల్గొన్నారు. అనంతరం శ్రీ నాగబాబు గారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... “భీమవరం పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించే దిశగా సమష్టిగా పనిచేస్తాం. ముఖ్యంగా భీమవరం పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈ సమస్యను ప్రాధాన్యతగా తీసుకుని సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కార మార్గాలను అన్వేషిస్తాం. మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. కూటమి పార్టీల మధ్య ఎటువంటి విభేదాలకు తావులేకుండా ఐక్యంగా పనిచేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామ”న్నారు.
V retweeted
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు విజయమే లక్ష్యంగా చేపట్టిన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ప్రచార వాహనం సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో విస్తృతంగా పర్యటించింది.
ఈ సందర్భంగా పలువురు పట్టభద్రులను ప్రత్యక్షంగా కలిసి, జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం సత్తుపల్లి పట్టణంలోని శ్రీ చైతన్య విద్యాలయ ప్రైవేట్ ఉపాధ్యాయులను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ, వేంసూరు మండల నాయకులు శ్రీమతి వాడపల్లి హుషా రాణి, అనిల్ సూరిశెట్టి, జబీర్ సయ్యద్, సింగపోగు అప్పారావు, దార్ల రవి వర్మ, వలపుల నాగబాబు, మహ్మద్ సైఫ్ అలీ ఖాన్, నారా శ్రీనివాస్, నాగప్రసాద్ భూక్యా, నవీన్ కుమార్ పుల్లెల తదితరులు పాల్గొన్నారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
V retweeted
Mr. Nagarjuna Yadav @ImYanamala,
I, Rukmini Kota, serving as Chief Secretary to the President's Secretariat, @JanaSenaParty, and as the Founder, CEO and Managing Director of Kyren Consultancy Services Private Limited, hereby place on record my strong objection to the personal, derogatory and highly offensive remarks made by you against me during a television debate broadcasted on @SakshiNews TV Channel and subsequently circulated on @YSRCParty and your personal social media platforms.
During the said debate, you repeatedly used expressions such as "Personal, Personal", "అంతరంగికురాలు" and "రుక్మిణీ కోట రహస్యం" while referring to me. These were not casual or incidental remarks, but deliberate personal insinuations made on a public platform, casting aspersions on my integrity and causing serious harm to my personal dignity and professional standing.
I demand to know on what basis you considered yourself entitled to make such insinuations about me in a public forum.
Your remarks have crossed every boundary of responsible public discourse. Political disagreements or professional differences cannot be used as a pretext to make derogatory references to a woman's personal life or subject her to public humiliation.
Over the years, I have built my professional identity and credibility through industry, perseverance and a steadfast commitment to integrity. Your reckless and derogatory statements have sought to undermine this hard-earned reputation, subjecting me to unwarranted public scrutiny and reputational harm.
Furthermore, these remarks have caused considerable mental agony, emotional distress and social embarrassment to my family, whose dignity and reputation have been adversely affected by your public statements.
I therefore formally call upon you to:
1. Provide a clear and unequivocal written explanation for the personal remarks and insinuations made against me.
2. Issue an unconditional public apology, both orally and in writing, on Sakshi TV and every other public platform where these remarks were made or circulated.
3. Withdraw the said remarks and refrain from making, repeating or circulating any further defamatory statements or personal insinuations concerning me.
4. Take appropriate steps to prevent further circulation or republication of the defamatory content.
5. Pay damages amounting to ₹3,00,00,000 (Rupees Three Crore) for the reputational injury, mental agony and distress caused to me and my family.
Your statements have violated my fundamental rights guaranteed by the Constitution of India, including my right to life with dignity, personal liberty and the freedom to practise my profession and carry on business.
I expect your response and appropriate corrective action within seven days of receipt of this communication, failing which I reserve my right to initiate appropriate civil and criminal proceedings, as advised by my legal counsel, without further notice.
My dignity and professional reputation are not matters open to public speculation. I remain resolute in protecting my rights and seeking justice through all lawful means.
Jai Hind.
@NCWIndia @VijayaRahatkar @Anitha_TDP @India_NHRC @SailajaRayapati @Annapurna4BJP @APPOLICE100 @dgpapofficial @MinistryWCD @WCDAndhra
#SatyamevJayate
V retweeted
కాకినాడలో కూటమి మహా ర్యాలీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి నేతలంతా కాకినాడ నగరంలో శనివారం సాయంత్రం మహార్యాలీ నిర్వహించారు. కాకినాడ మెయిన్ రోడ్డు మీద మొదలైన ర్యాలీ నగరంలోని పలు ప్రధాన కూడళ్ల మీదుగా సాగింది. "మా ఐక్యత రాష్ట్రం కోసం.. ప్రగతి పరుగుల కోసం" అంటూ నినదించారు. కాకినాడ నగరపాలక సంస్థ స్థానిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన మహా ర్యాలీలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖామాత్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ ఎంపీ శ్రీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, పి గన్నవరం ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ, కాకినాడ జెడ్పీ ఛైర్మన్ శ్రీమతి బుర్రా దివ్య సునీత రాజ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
V retweeted
సాక్ష్యాధారాలన్ని పోలీసు వారికి ఇచ్చాం, పత్రికా ముఖంగా ప్రజల ముందు కూడా ఉంచాం..
మానసిక సమస్యలతోనో, ఉన్మాదంతోనో సాక్షి టీవీ, వైసీపీ వారు ఇప్పటికీ మాపై దుష్ప్రచారాలు చెయ్యడం మానుకోవాలి.
గతంలో మీరు ఇలాంటి అర్థరహిత విమర్శలకు దిగినందుకే అధికారం నుండి ప్రతిపక్ష స్థానం కూడా లేని స్థితికి వచ్చారని గుర్తుంచుకుని వ్యవహరించాలి.
V retweeted
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొరవి జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ విషయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో, ఆయన వెంటనే స్పందించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఘటనకు గల కారణాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయడంతో పాటు, బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, AP పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (KK) గారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు శ్రీ KK గారు ఈరోజు ఉదయం హుటాహుటిన పులివెందులకు బయలుదేరి వెళ్లారు.
V retweeted
గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాము.
V retweeted
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం, మోకిల గ్రామంలో స్థానికులతో సమావేశం నిర్వహించిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర చేరికల కమిటీ సభ్యురాలు శ్రీమతి తనుజా రెడ్డి.
స్థానిక సమస్యలు, ప్రజల ఆకాంక్షలు, పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ప్రజలకు మరింత చేరువగా ఉంటూ జనసేన సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
#JanaSenaTelangana #JSPForTelangana
V retweeted
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి, సమస్యలను పరిష్కరించేలా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ సభ్యులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా పనిచేస్తారు. ఏవైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని అధ్యక్షులు ఆదేశించారు.
ఈ ప్రత్యేక హెల్ప్ డెస్క్ కార్యకలాపాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారు పర్యవేక్షించనున్నారు.
V retweeted
నాగులగుట్టపల్లి ఘటనపై నిష్పక్షపాత విచారణకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు దిశా నిర్దేశం
• నామినేషన్ల పరిశీలన సందర్భంలో జనసైనికుడు శ్రీ ముంతల రామాంజులు మృతి ఘటనపై ఆరా
• శ్రీ రామాంజులు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా
పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం, సురభి గ్రామ పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లి వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న వివాదంలో జనసేన మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి బంధువు, జనసేన కార్యకర్త శ్రీ ముంతల రామాంజులు గుండెపోటుతో మరణించిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించారు. ఘటనపై జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల పరిశీలన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆ సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమగ్ర వివరాలు సేకరించాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరపాలన్నారు. మృతుడు శ్రీ ముంతల రామాంజులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసి, ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు. విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే, వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
•విచారణ ప్రక్రియపై మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ప్రత్యేక పర్యవేక్షణ
పులివెందుల జనసైనికుడి మృతి, క్షేత్ర స్థాయిలో చోటు చేసుకున్న పరిస్థితులపై విచారించాలని పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి సూచించారు. విచారణ ప్రక్రియను సమన్వయం చేస్తూ, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. శ్రీ రామాంజులు కుటుంబానికి పార్టీ తరఫన భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్ ను పులివెందులకు పంపారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ శ్రీ ముంతల రామాంజులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉప ముఖ్యమంత్రివర్యులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని పార్టీ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.
V retweeted
నాగులగుట్టపల్లి ఘటనపై నిష్పక్షపాత విచారణకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం
• నామినేషన్ల పరిశీలన సందర్భంలో జనసైనికుడు శ్రీ ముంతల రామాంజులు మృతి ఘటనపై ఆరా
• శ్రీ రామాంజులు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా
పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం, సురభి గ్రామ పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లి వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న వివాదంలో జనసేన మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి బంధువు, జనసేన కార్యకర్త శ్రీ ముంతల రామాంజులు గుండెపోటుతో మరణించిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు తీవ్రంగా స్పందించారు. ఘటనపై జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల పరిశీలన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆ సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమగ్ర వివరాలు సేకరించాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరపాలన్నారు. మృతుడు శ్రీ ముంతల రామాంజులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసి, ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు. విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే, వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
•విచారణ ప్రక్రియపై మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ప్రత్యేక పర్యవేక్షణ
పులివెందుల జనసైనికుడి మృతి, క్షేత్ర స్థాయిలో చోటు చేసుకున్న పరిస్థితులపై విచారించాలని పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి సూచించారు. విచారణ ప్రక్రియను సమన్వయం చేస్తూ, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. శ్రీ రామాంజులు కుటుంబానికి పార్టీ తరఫన భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్ ను పులివెందులకు పంపారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ శ్రీ ముంతల రామాంజులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉప ముఖ్యమంత్రివర్యులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని పార్టీ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.
@PIB_India @IPR_AP @pibvijayawada
V retweeted
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు శ్రీ రాము యాదవ్, శ్రీ గంగిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఖమ్మంకు చెందిన శ్రీ కలసాని రఘువీర్ యాదవ్, శ్రీ పేరాం మల్లయ్య, శ్రీ మాలేటి రవి జనసేన పార్టీలో చేరారు.
శుక్రవారం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు, చేరికల కమిటీ కన్వీనర్ శ్రీ మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, చేరికల కమిటీ సభ్యురాలు శ్రీమతి తనూజ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎం. దామోదర్ రెడ్డి, మచ్చ సుధాకర్, మండపాక కావ్య, శ్రీధర్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
#JSPForNewAgePolitics #JanaSenaTelangana #JSPForTelangana
V retweeted
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు విజయమే లక్ష్యంగా చేపట్టిన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ప్రచార వాహనం సత్తుపల్లి పట్టణంలో విస్తృతంగా పర్యటించింది. సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ మంథని సంపత్ కుమార్, నియోజకవర్గ నాయకులు వడ్లకొండ జీవన్ సూచనల మేరకు నిర్వహించిన ఈ ప్రచారంలో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ పట్టభద్రులను కలిసి జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ, మండల నాయకులు సూరిశెట్టి అనిల్ కుమార్, బత్తుల పవన్ కుమార్, జబీర్ సయ్యద్, సింగపోగు అప్పారావు, మిట్టపల్లి సత్యనారాయణ, నారా శ్రీనివాస్, దండు కరుణ తదితరులు పాల్గొన్నారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
V retweeted
కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పని చేయాలి
•తొలి విడత విజయాల స్ఫూర్తితో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోనూ ముందుకు సాగాలి
•సమష్టి కృషితో ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి
•స్థానిక ఎన్నికల్లో సాధించిన 100 శాతం విజయాల స్ఫూర్తితో ముందుకు సాగాలి
•తాడేపల్లిగూడెంలో కూటమి మున్సిపల్ అభ్యర్థులతో ఎమ్మెల్సీ శ్రీ @NagaBabuOffl ప్రత్యేక భేటీ
•మున్సిపల్ ఎన్నికల కార్యాచరణపై కూటమి అభ్యర్థులకు దిశానిర్దేశం
తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెంలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి, కౌన్సిలర్ అభ్యర్థులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కార్యాచరణ, ప్రచార ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి అభ్యర్థుల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడతలో ఎలాగైతే 100 శాతం విజయాలను సాధించామో, అదే స్ఫూర్తి, ఐక్యత, సమన్వయంతో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ముందుకు సాగాలి. నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు సమష్టిగా, సమన్వయంతో పని చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. పరస్పర సహకారం, సమన్వయంతో ఎన్నికల కార్యాచరణను పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లాలి” అన్నారు.
*ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందనలు
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో శ్రీ నాగబాబు గారు ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామాల సమగ్ర అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాసేవలో బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
V retweeted
వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్
జగన్ తన పిఏ 1000 కోట్ల అక్రమ సంపాదన విషయాన్ని.., వైసీపీ వారు తరచూ చేసే ట్విట్టర్ స్పేస్ దూషణలు అంటూ డైవర్ట్.
స్వయంగా జగన్ తన పాత కేసులో, మరో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడి దాఖలు చేసిన తాజా ఛార్జ్ షీట్ లో A1 గా స్థానం.
దాన్ని డైవర్ట్ చెయ్యడానికి జనసేన పార్టీకి సంబంధం లేని విషయాన్ని, జనసేన సిబ్బంది తప్పు లేని వ్యవహారాన్ని వైసీపీ తమ ప్రచార సాధనాల ద్వారా, కింది స్థాయి ఉద్యోగుల ద్వారా దుష్ప్రచారం.
అది కూడా తరచూ జనసేనపై నీలిగే వైసీపీ బడా నాయకులతో కాక, ఈసారి ఒక బీసీ వైసీపీ ఉద్యోగి నాగార్జున యాదవ్ చేత..
ఎందుకంటే వారు డైవర్ట్ చేసే విషయంలో తప్పు జనసేన వైపు లేదు, బలైతే బీసీ కులానికి చెందిన వ్యక్తి, అది కూడా సాధారణ వైసీపీ ఉద్యోగి అని రంగంలోకి దింపారు.
పైపైన మీ తప్పులు బయట పడకుండా ఎంత అద్దినా,
మీ ప్రచార సాధనాలతో ఎంత ముక్కినా రాజ్యాంగ వ్యవస్థల ముందు మీ తప్పులకు, (ఆర్థిక) నేరాలకు సమాధానంగా ప్రజల ముందు తప్పనిసరిగా దోషులుగా నిలబడతారు, నిలబెడతాం..


















































