YSRCPమాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హెలికాప్టర్ నడిపారు.
వెంకట్రామిరెడ్డి హెలికాప్టర్ నడుపుతోన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#YSRCP #KethiReddyVenkatRamiReddy #Chapper #Dharmavaram
5
375
YS జగన్ వ్యూహంలో చిక్కుకున్న చంద్రబాబు..!
రాజకీయాల్లో పావులు కదపడం.. ఎత్తుకు పైఎత్తు వేయడం చాలా ముఖ్యం.చంద్రబాబు లాంటి నాయకుడ్ని ఢీకొనేటప్పుడు పక్కాగా వ్యూహం రచించాలి. పద్మవ్యూహం కంటే పదునైన, పకడ్బంది వ్యూహాన్ని రచించాలి. YS జగన్ అదే చేశారు. YS జగన్ పన్నిన వ్యూహం ఎలా ఉందంటే.. చంద్రబాబు తనకు తానే ఉచ్చులో చిక్కుకునేలా ఉంది. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారనే వార్తలు వచ్చినప్పటి నుంచి YS జగన్ పక్కా వ్యూహంతో అడుగులేశారు. YSRCP నేతలను, శ్రేణులను అలర్ట్ చేస్తూ వచ్చారు. రాష్ట్రంలో కూటమి పాలన ఎలా ఉందో మాజీ ముఖ్యమంత్రి YS జగన్‌కు స్పష్టమైన అంచనాలు ఉన్నాయి. కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బలమైన అంచనాకు వచ్చాక YS జగన్ తన వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారు. తాడేపల్లి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లు, సమావేశాలతో నేతలకు దిశానిర్దేశం చేశారు. లీగల్ టీమ్‌ను యాక్టివ్ చేశారు.అంటే..చంద్రబాబు అండ్ కో దాడులకు, దౌర్జన్యాలకు తెగబడుతుందని YS జగన్ టీమ్ ముందుగానే అంచనా వేసిందని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. YSRCP రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ.. జిల్లా నేతలను ముందుకు కదిలించారు. ఎక్కడా కూడా ఏకగ్రీవం కావడానికి వీళ్లేదని YSRCP అధ్యక్షుడు YS జగన్ పదేపదే చెబుతూ నేతల్లో పట్టుదలను పెంచారు.
ఒక్కసారి, రెండుసార్లు కాదు పదిసార్లకు పైగా నేతలకు తన మనసులో ఏముందో అర్థం చేసుకునేలా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. YS జగన్‌మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతో అడుగులేస్తుంటే.. ఇంటెలిజెన్స్ ఇచ్చే రిపోర్టులతో చంద్రబాబులో కలవరం మొదలైంది. ఏ రిపోర్ట్ కూడా ఫేవర్‌గా లేదు. రాయలసీమలోని జిల్లాలు, నెల్లూరులో మెజార్టీ, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ప్రభుత్వానికి ఏమాత్రం అనుకూలంగాలేదని రిపోర్ట్ లు చంద్రబాబు చేతికి అందాయి. మరోపక్క వ్యూహాత్మకంగా YS జగన్ దూసుకెళ్తున్నారు. ఇక్కడే తన రాక్షస రాజకీయాన్ని మేల్కోలిపారు చంద్రబాబు. ఇక్కడ... YS జగన్ ప్రణాళికలు ఒక వైపు, ప్రభుత్వ వ్యతిరేకత మరో వైపు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేశాయి.
రాయలసీమ నేతలతో చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. నెల్లూరు, ప్రకాశం, పల్నాడు టీడీపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానాలు గెలవాలని.. అంతే అధినేత మనసులో ఏముందో అర్ధం చేసుకున్న టీడీపీ నేతలు రెచ్చిపోయారు. నామినేషన్ల మొదటి రోజే హింసకు తెరలేపారు. YSRCP లోక్ సభ నాయకుడు మిథున రెడ్డి మీద దాడి చేశారు..హత్యాయత్నం చేశారు. రాయచోటిలో YSRCP ఆఫీస్‌కు నిప్పుపెట్టారు. కార్లను తగలబెట్టారు. ఇక్కడే చంద్రబాబు బ్లండర్ మిస్టేక్ చేశారు. ఎప్పుడైతే టీడీపీ నేతలు, కార్యకర్తలు హింసకుపాల్పడ్డారో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత మరింత ఎక్కువైంది. రాయలసీమలో హింస తరువాత, పల్నాడులో టీడీపీ నేతల బీభత్సం తరువాత చాలా మంది ఓటర్లు ఒక్కటే అనుకున్నారు. "ఈ ఒక్కసారి ఓటు వేయకపోతే పోయేదేమీ లేదు..2029 ఎన్నికల్లో సత్తా చూపాలని". 50శాతం మంది ఓటర్లు అనుకున్నది ఇక్కడ చెబుతున్నాను. కార్పొరేషన్ , మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ పాల్పడిన గూండాగిరి ఇంకా ప్రజల కళ్లల్లో మెదులుతూనే ఉంది.
ఈ ఎఫెక్ట్ రాష్ట్రంలోని మిగతా జిల్లాల మీద పడింది. నామినేషన్లు చించేయడం, బీ ఫాంలు చించేయడం, పోలీసులను పాలేర్లు వాడుకున్నట్లు వాడేయడం, అధికారులు చట్టాన్ని మర్చిపోవడం ఇవన్నీ ప్రజలు గమనిస్తూ వచ్చారు. అందుకే... కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల చివరి రోజుల్లో మహిళలు తొడగొట్టి నిలబడ్డారు.రండి దమ్ముంటే అంటూ YSRCP మహిళలు నిలబడ్డారు. కార్పొరేషన్ , మున్సిపల్ ఎన్నికల్లో రిగ్గింగ్, సైక్లింగ్, దొంగ ఓట్లు టీడీపీ నేతలు వేసుకోవడాన్ని ప్రజలు గమనించారు. చంద్రబాబు క్షేత్రస్థాయిలో పథకాలు అమలు చేయకపోవడం.. అభివృద్ధి కనిపించకపోవడం, తెల్లారితే అమరావతి జపం, ఎన్నికల్లో హింస ప్రజలను దీర్ఘాలోచనలోకి నెట్టేశాయి.
ఈ ఫలితాలే.. ZPTC, MPTC ఎన్నికల్లో ప్రతిబింబించాయి.
టీడీపీ , కూటమి పార్టీలు పక్కాగా గెలుస్తాయని అనుకున్న చోటనే YSRCP అభ్యర్థులను నామినేషన్లు వేసుకోనిచ్చారు. టీడీపీ పక్కాగా గెలుస్తుంది అనుకున్న చోట కూడా YSRCP జెండా రెపరెపలాడటంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ, ZPTC, MPTC ఫలితాలు వచ్చాక ఎక్కడైనా టీడీపీ, కూటమి పార్టీలు సంబరాలు చేసుకోవడం చూశారా..? కారణం కూటమి పార్టీలకు కూడా తెలుసు హింసతో కూడిన గెలుపు గెలుపేకాదని. కానీ.. YSRCP నేతలు మాత్రం సంబరాలు చేసుకున్నారు. దాదాపు 80 ZPTCలు, 1200 MPTCలు YSRCPకి రావడం మాములు విషయం కాదు. YSRCP హయాంలో ఓటమి భయంతో టీడీపీ నేతలు పోటీ కూడా చేయలేదు. కానీ.. ఇప్పుడు YSRCP శ్రేణులు కూటమి కుట్రలు, దాడులు, గూండాగిరిని తట్టుకోని నిలబడి యుద్ధమే చేశాయి. 2029 ఎన్నికలకు తాము ఎలా ఉండబోతున్నామో YSRCP నేతలు, కార్యకర్తలు కూటమి పార్టీలకు బలమైన మెస్సేజ్ పంపారు.
ఇక్కడ YS జగన్ రాజకీయ చదరంగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్థానిక ఎన్నికలపై YS జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడంతో చంద్రబాబులో భయం మొదలైంది. ఈ భయంతో దాడులకు దిగారు. ఈ దాడులు చంద్రబాబుకు మరింత మైనస్ అయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ చంద్రబాబు ఎన్నికలు నిర్వహిస్తే ఆయన ఇమేజ్ పెరిగేది.కానీ.. ఇప్పుడు చంద్రబాబు ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతోన్న కూడా YS జగన్ ఎక్కడా అప్రజాస్వామికంగా వ్యవహరించలేదు. ఎదురొడ్డి ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని తమ కార్యకర్తలకు, నేతలకు చెప్పారు. క్యాడర్‌లో ఎప్పటకప్పుడు ధైర్యాన్ని నింపుతూ వచ్చారు. స్పూర్తిని నింపారు. ఈ వ్యూహంలో చిక్కుకున్న టీడీపీ నేతలు మరింత హింసను రాజేశారు.
దీంతో.. ప్రజల్లో YSRCP పట్ల మరింత సానుభూతి పెరిగింది.మరోవైపు.. 2029లో కూటమిని ఎదుర్కోవడానికి YSRCP శ్రేణులకు ఈ ఎన్నికలు నెట్ ప్రాక్టీస్‌లా ఉపయోగపడ్డాయి.
బీజేపీ కలిసి ఉంది కాబట్టి చంద్రబాబు ఆటలు సాగుతోన్నాయి. వచ్చే రోజుల్లో చంద్రబాబుతో బీజేపీ కలిసి ఉంటుందని చెప్పలేం. రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ఏమైనా జరగొచ్చు. చంద్రబాబుతో బీజేపీ కటీఫ్ చెబితే.. చెబితే కాదు చెప్పాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. చంద్రబాబుతో కలిసి ఉంటే కమలనాథుల పుట్టి కూడా మునిగిపోతుంది. ఒకవేళ.. కూటమి నుంచి బీజేపీ బయటకు వెళ్తే..CEC చంద్రబాబుకు సహకరిస్తుందా..? పోలీసులు సహకరిస్తారా..? అధికారులు సహకరిస్తారా..? సో.. YS జగన్ వ్యూహం కంటిన్యూ కాబట్టి ఏమైనా జరగొచ్చు. AK 47లకు ఎదురొడ్డి నిలిచిన YSRCP గుండెలు ఇప్పుడు 2029 కోసం ఎదురు చూస్తున్నాయి.
#YSRCP #YSJagan #TDP #CBN #LocalBodyElections2026 #AndhraPradeshNews #AP #AndhraPradesh @ysjagan @YSRCParty @YSRCPUSA @YSRCPAmerica @ysrcpaus @YSRCPEurope @YsrcpKuwait @GunturYSRCP @VizagYSRCP @YSRCPWomenVoice @YSRCPCommanders @YSRCPGUDUR @gudurysrcp @GunturYSRCP @KadapaYSRCP
🤖 Made with AI
ఆశయం ఉండటం నేరం ఎలా అవుతుంది సోనియాజీ..?!
సోనియా గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రణబ్ ముఖర్జి కుమార్తె శర్మిష్ట ముఖర్జి. ప్రణబ్ ముఖర్జి ఓ సారి ప్రధాని కావాలని ఆశ పడినట్లు కాంగ్రెస్ అగ్రనేత సోనియా తన ఆత్మకథ ' బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్ 'లో తెలిపారు. ఈ విషయంపై ప్రణబ్ ముఖర్జి కుమార్తె శర్మిష్ట ముఖర్జి స్పందించారు. సోనియాపై తీవ్రంగా మండిపడ్డారు. దేశ ప్రధాని కావాలనే ఆశయం ఉండటం నేరమా అని ప్రశ్నించారు. తన తండ్రి వంశపారం పర్యంగా రాజకీయాల్లోకి రాలేదని కష్టపడి, శ్రమించి పదవులు పొందారని ..అందుకు గర్విస్తున్నామని శర్మిష్ట అన్నారు.
తాను రాసిన పుస్తకంలో సోనియా ఏమన్నారంటే... UPA పాలనలో ఆర్ధిక మంత్రిగా ఉన్న చిదంబరంతో ప్రణబ్‌కు ఓసారి విభేదాలు తలెత్తాయి. 2010లో దాని గురించి నా దగ్గర అసహనం వ్యక్తం చేశారు ప్రణబ్." ప్రభుత్వ నాయకత్వాన్ని మార్చే సమయం వచ్చిందేమోనని" ప్రణబ్ నాతో అన్నారు. "నేను ఆశ్చర్యపోయాను.. ప్రధాని కావాలన్న తన కలను ఆయన అలా బయట పెట్టారేమో అని అర్థమైంది. కానీ.. నేను ఆ సంభాషణను పొడిగించలేదు."అని సోనియా తన ఆత్మకథలో రాసుకొచ్చారు.
#Pranabmukherjee #SharmisthaMukherjee #SoniaGandhi #BelongingAjourneyOfLove
🤖 Made with AI
మోగనున్న ఎన్నికల నగారా..!
దేశంలో మరోసారి ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలకు జనవరి తొలి వారంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి, మార్చిలో పోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయి. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు త్వరలోనే ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా.. ఉత్తరప్రదేశ్‌లో విడతల వారిగా ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా.. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి నెలకొంది.
#5StatesElections #NirvachanSadan #CEC #UP #UttarPradesh #Punjab #manipur #Goa #UttaraKhand
2
570
YSRCP గుడ్ డెసిషన్
పవన్ కల్యాణ్ విడాకుల విషయంలో YSRCP చాలా మంచి నిర్ణయం తీసుకుంది.
పవన్ కల్యాణ్ వారి వ్యక్తిగత విషయమని.. పవన్ కల్యాణ్ విడాకుల విషయంలో ఎలాంటి దురుద్దేశపూరిత కామెంట్లు పెట్టొద్దని, చేయొద్దని YSRCP తమ నేతలను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను ఆదేశించింది. ఇది చాలా కరక్ట్ డెసిషన్. రాజకీయాల్లో ఇది చాలా మంచి పరిణామం. ఎదుటివారి ఎలా ఉన్నా, ఎన్ని కామెంట్లు చేసినా, మనం విలువలు పాటించాలి, విలువలకు కట్టుబడి ఉండాలి, రాజకీయాల్లో మంచి సాంప్రదాయం నెలకొల్పాలి అనే మెస్సేజ్ YSRCP అధిష్టానం తమ శ్రేణులకు పంపింది. YSRCP అధిష్టానం నిర్ణయాన్ని ఆ పార్టీ నేతలే కాకుండా, ఇతర పార్టీ నేతలు కూడా స్వాగతిస్తున్నారు.
#pawanKalyanDivorce #YSRCP @ysjagan @YSRCParty @YSRCPAmerica
Exclusive Vis From #NallamalaForest
నల్లమల అటవీలో సఫారీకి వెళ్లిన పర్యాటకులకు కొత్త అనుభూతి
ఎలుగుబంటిని వెంటాడుతూ కనిపించిన పులి
ఎలుగుబంటి అరుపులు, పులి గాండ్రిపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
నల్లమలలో పులులు కనిపించడం సహజమే కానీ..
ఎలుగును వేటాడుతూ పులి మొదట కనిపించింది.
దీంతో పర్యాటకులు కెమెరాల్లో బంధించి కొత్త అనుభూతికి లోనయ్యారు.
ఈ అద్భుత దృశ్యం నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగింది.
#NallamalaForest #NagarKurnoolDts #Tiger #Bear #TigerHuntBear
ఇందిరా గాంధీ బతికున్న రోజుల్లో వీడియో ఇప్పుడు నెట్టింట్ వైరల్ అవుతోంది.
రాహుల్, ప్రియాంకతో సరదా ముచ్చట్లు.. సోనియా, మేనకా గాంధీలతో మాటలు.. డైనింగ్ టేబుల్ చర్చలు... డైనింగ్ టేబుల్ మీద కూడా ఇందిరా గాంధీ.. బుక్స్ పట్టుకోవడం మంచిగా అనిపించింది. ఇందిరాగాంధీ చిన్నారి రాహుల్‌కు చేసే సూచనలు మొత్తంగా వీడియో నేటి తరానికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పరిచయం చేసింది. సోనియా గాంధీ రాసిన Belonging: A Journey Of Love బుక్ రిలీజ్ సందర్బంగా ఈ వీడియో రిలీజ్ చేసినట్లు అనిపిస్తుంది.
#IndiraGandhi #SoniaGandhi #BelongingAjourneyOfLove #RahulGandhi #PriyankaGandhi
YV REDDY, Sr. Journalist retweeted
🚨 OFFICIAL NOTE
Party Leaders, Cadre & Social Media Activists are requested to refrain from commenting on or sharing content concerning the personal matters of political leaders.
All concerned are urged to respect privacy and exercise discretion in public communications.
- YSRCP Central Office
#YSRCP #JaganannaConnects
ట్రంప్‌కు పాఠాలు చెబుతున్న చంద్రబాబు..!
ట్రంప్‌కు పాఠాలు చెప్పేస్థాయికి చంద్రబాబు వెళ్లారు.! స్థానిక ఎన్నికల్లో కూటమి గెలపుపై సోషల్ మీడియాలో పంచ్‌లు పడుతుండటంతో ఎదురుదాడికి దిగారు చంద్రబాబు. ట్రంప్ గురించి చంద్రబాబు ఏమన్నారో చదవండి.."ఈ రోజు అమెరికాలో ఏమి జరిగిందో చూశారు కదా.. ఎక్కడైనా భరించి, భరించి విసుగు వచ్చాక వదలించుకోవాలని ప్రజలు ప్రయత్నిస్తారు. ఇక్కడ కూడా అంతే.. ఆంధ్రలో జరిగిన ఎక్స్‌పెరిమెంట్ అమెరికాలో కూడా జరిగింది." అని ఆయన అన్నారు. ఇక్కడ చిత్రమేమిటంటే స్థానిక ఎన్నికలలో ఎంత హింస జరిగింది, కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు గూండాలు, రౌడీల అవతారం ఎత్తి ఎంత అరాచకం సృష్టించింది ప్రజలంతా చూశారు. అయినా ఆయన ధైర్యంగా అదేదో ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికలన్నట్లుగా పిక్చర్ ఇస్తారన్నమాట.
మరో సంగతి చెప్పాలి... చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ 2004, 2009, 2019లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందింది. అలాగే స్థానిక ఎన్నికలలో కూడా విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పరాజయం పాలైంది. అయినా అవేవి జరగనట్లుగా చంద్రబాబు కామెంట్లు చేస్తుంటారు. చంద్రబాబు థీరి ప్రకారం టీడీపీ ఓడిపోయినప్పుడల్లా... ప్రజలు విసిగి వదలించుకున్నట్లు ఆయన ఒప్పుకోవాలి కదా! కాని అప్పుడు మాత్రం ఎన్నికలలో అక్రమాలు జరిగాయనో, ఈవీఎమ్‌ల మోసం అనో ఆరోపణలు చేస్తుంటారు. లేదా ప్రజలే తప్పు చేశారని చెబుతారు.
2024 అసెంబ్లీ ఎన్నికలలో 50 లక్షల ఓట్లు అదనంగా ఎలా పోల్ అయ్యాయన్న మిస్టరీ ఇంతవరకు వీడలేదు. బహుశా దానిని ప్రామాణికంగా తీసుకున్నారేమో తెలియదు కాని, స్థానిక ఎన్నికలలో గెలవడానికి అదే మార్గాన్ని ఎంపిక చేసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అక్రమాలు చేయడంలో కొత్త, కొత్త పద్దతులను తీసుకువచ్చిన ఘనత కూడా చంద్రబాబు అండ్ కో కే దక్కుతుందేమో!
ఇందులో బీహారు వంటి రాష్ట్రాల చెత్త రికార్డును సైతం దాటేయడం కూడా విశేషం. నామినేషన్లను అడ్డుకోవడం నుంచి కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీకి వచ్చిన ఫలితాలను సైతం రిగ్ చేసి టీడీపీకి అనుకూలంగా ప్రకటించే దశ వరకు ఏపీ వెళ్లింది. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఈసారి జరిగిన స్థానిక ఎన్నికలు తీరని అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. అమెరికా అధ్యక్షుడు... వెనుజులా, ఇరాన్‌లపై దాడులు చేసి, చేసి... విధ్వంసాలకు పాల్పడితే, ఏపీలో మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన రాష్ట్ర ప్రజలపైనే హింసాకాండకు పాల్పడింది. పోలీసులను పలు చోట్ల టీడీపీ కార్యకర్తలుగా మార్చివేశారు. డీజీపీ ఏపీకి ఉన్నారా? లేదా? అన్న అనుమానం వచ్చేలా పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే టీడీపీకి బ్రాంచ్ ఆఫీస్‌గా మారిందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. దానికి తగినట్లే రిగ్గింగ్ చేసినవారిపై కేసులు పెట్టలేదు. అక్రమాలకు పాల్పడ్డ పోలీసు అధికారులపైకాని, ఎన్నికల అధికారులపైకాని ఒక్కరిమీద కూడా కేసులు పెట్టలేదు. మరి అమెరికాలో స్వేచ్చగా ఎన్నికలు జరిగాయి కనుక తమ అభిప్రాయాన్ని ప్రజలు నిర్భయంగా వ్యక్తం చేశారు. ఏపీలో మాత్రం నియంతృత్వ పోకడలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అయినా చంద్రబాబు రిపబ్లికన్ పార్టీ, ట్రంప్ ఓటమిని వైఎస్సార్‌సీపీకి ఆపాదించి వ్యాఖ్యలు చేసి, తనపై వచ్చిన విమర్శలను డైవర్ట్ చేయడానికి యత్నించారు. అదే ఆయన విశిష్టత.
నామినేషన్ మొదలు, కౌంటింగ్ వరకు ప్రతి ప్రక్రియలోను రిగ్గింగ్ చేసే సంస్కృతిని ప్రవేశపెట్టిన ఘనత మాత్రం చంద్రబాబుదే. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పాలి. ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని పేరొందిన చంద్రబాబు రిగ్గింగ్, తదితర అక్రమాలు ఎలా చేయాలన్నదానిపై ట్రంప్‌కు, రిపబ్లికన్ పార్టీకి పాఠాలు నేర్పుతారేమో అని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అది కూడా గొప్పదనంగానే తెలుగుదేశం భావిస్తుందా!
#YSRCP #APNews #AndhraPradeshNews #YSJagan #CBN #RiggingMasterCBN #TrumpOut @YSRCParty @ysjagan @ysrcp_usa @YSRCPAmerica @ysrcpaus @YsrcpKuwait @VizagYSRCP @ysrcp_guntur_
స్థానిక ఎన్నికల్లో గొడవలు జరగలేదట..!
స్ఖానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయట..!
ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసుకున్నారట..!
చంద్రబాబు గారు మీ నాలుక కూడా సిగ్గు పడుతుంది సార్..!
నామినేషన్ల మొదటి రోజు YSRCP ఎంపీ మిథున్ రెడ్డి మీద దాడి చేశారు..
రాయచోటి YSRCP ఆఫీస్‌కు నిప్పు పెట్టారు..
AK47లు గురి పెట్టారు..
నామినేషన్ పేపర్లు, బీఫామ్‌లు చించేశారు..
ఆడవాళ్లు అని కూడా చూడకుండా రౌడీషీట్లు ఓపెన్ చేశారు..
రిగ్గింగ్, సైక్లింగ్, దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు..
చంద్రబాబు గారు.. మీ పక్కన విజువల్స్ చూడండి..
ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయో అర్థమవుతుంది..
#RiggingMasterCBN #TDP #CBN #YSRCP #YSJagan #VoilenceInAP
#LocalBodyElectionsInAP
చంద్రబాబుపై #YSJagan సంచలన ట్వీట్. #RiggingMasterCBN హ్యాష్ ట్యాగ్ తో సంచలన ట్వీట్
#RiggingMasterCBN #CBN #TDP #YSRCP #ANdhraPradeshNews #LocalBodyElections2026
నవంబర్ 15-20 మధ్య తమిళనాడు, ఏపీ, కేరళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
#WeatherUpdate #AP #Kerala #TamilNadu #AndhraPradesh
136
మీకు గుర్తుందా..?
గుర్తులేకపోతే మీ బుర్రకు పదునుపెట్టి గుర్తుకు తెచ్చుకోండి..
ఈ వీడియో నేషనల్ లెవ్వల్లో ట్రోల్ అయింది..
ZPTC ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వాకర్ సాయంతో వెళ్తుంది టీడీపీ అభ్యర్ధి.. ఒకతను వచ్చి వాకర్ లాగగానే డ్రామా గుట్టు రట్టయింది..
ఇంత నాటకం ఆడి.. నామినేషన్ వేసినా ఓటర్లు కరుణించలేదు...
పెనమూరు ZPTC YSRCP కైవసం చేసుకుంది.
#TDP #Penamur #AP #AndhraPradeshNews #LocalBodyElections2026
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నికలు వస్తే.. నా మొదటి ప్రాధాన్యత ఎన్నికలకే..
40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నోటి నుంచి వచ్చే మాటలు.
చంద్రబాబు ఫక్తు రాజకీయ నాయకుడు, పాలకుడు కాదని ఆయనే ఒప్పుకున్నారు.
పాలకుడు ప్రజల గురించి ఆలోచిస్తాడు..
రాజకీయ నాయకుడు అధికారం గురించి మాత్రమే ఆలోచిస్తాడు.
#CBN #TDP #AP #AndhraPradeshNews #LocalBodyElections2026 @ysjagan @YSRCParty @YSRCPAmerica
అమరావతితో ఆంధ్రప్రదేశ్‌కు భద్రత ఉందా..?
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి నీట మునిగే ప్రమాదం ఉందని ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమరావతి ముంపుకు ప్రధాన కారణం.. దాని భౌగోళిక స్వరూపం, కృష్ణా నది వరద ముప్పు, నేల స్వభావం, వాగులు, భారీ వర్షాలు.
అమరావతికి వరద ముప్పు ఎందుకు?
1. కృష్ణా నదికి సమీపంలో ఉండటం: కృష్ణా నదిలో భారీ వరదలు వచ్చినప్పుడు నదీ జలాల మట్టం పెరుగుతుంది. దీనివల్ల అమరావతి ప్రాంతంలోని వాగుల నుంచి నీరు నదిలోకి వెళ్లడం కష్టమవుతుంది.
2. కొండవీటి వాగు సమస్య: అమరావతి ప్రాంతంలోని ప్రధాన నీటి ప్రవాహ మార్గాల్లో కొండవీటి వాగు ఒకటి. కృష్ణా నదిలో నీటి మట్టం పెరిగితే ఈ వాగు నీరు వెనక్కి నిలిచే అవకాశం ఉంది.
3. లోతట్టు ప్రాంతాలు: APCRDA కోసం 2025లో రూపొందించిన హైడ్రోజియోమార్ఫాలజీ నివేదిక ప్రకారం, తాడేపల్లి సమీపంలోని కొండ ప్రాంతాల్లో ఎత్తు సుమారు 260 మీటర్లు ఉండగా, కృష్ణా వరద మైదాన ప్రాంతంలో 18 మీటర్ల వరకు ఉంది. తూర్పు, మధ్య ప్రాంతాల్లోని లోతట్టు భూములకు కాలానుగుణ వరద ముప్పు ఉంది.
4. భూగర్భ జలమట్టం, నేల స్వభావం: కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం ఎక్కువ లోతులో ఉండదు. దీనివల్ల భారీ వర్షాల సమయంలో నీరు త్వరగా ఇంకిపోకుండా నిలిచే అవకాశం ఉంటుంది.
5. సహజ నీటి మార్గాలకు అడ్డంకులు: నిర్మాణాలు, రోడ్లు, కాలువల ఆక్రమణలు, పూడిక, నీటి ప్రవాహ మార్గాల్లో మార్పులు జరిగితే వరద నీరు బయటకు వెళ్లడానికి సమయం పడుతుంది.
2024 వరదలు ఏం చెబుతున్నాయి..?:
2024 ఆగస్టు 31న అమరావతి వాతావరణ కేంద్రంలో ఒక్కరోజే 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ వరదల సమయంలో అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 25 గ్రామాల భూములు నీట మునిగాయని APCRDA 2025 క్లైమేట్ యాక్షన్ ప్లాన్ పేర్కొంది. నీరు తగ్గడానికి వారం రోజులకు పైగా పట్టింది.అమరావతిలో నీటిని మోటర్లతో తోడాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ నివేదికలు ఏం చెబుతున్నాయి?
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇవి కేవలం ప్రతిపక్ష రాజకీయ ఆరోపణలు కావు. ప్రభుత్వ సంస్థల నివేదికల్లోనూ వరద ముప్పు ప్రస్తావన ఉంది.
- APCRDA – 2025: కొండవీటి వాగు సహజ ప్రవాహ మార్గాల్లో మార్పులు, కలుపు మొక్కలు, నీటి ప్రవాహానికి అడ్డంకులు నీరు నిలిచిపోయే పరిస్థితిని పెంచుతున్నాయని పేర్కొంది.
- వరల్డ్ బ్యాంక్ – 2024: అమరావతికి 100 సంవత్సరాలకు ఒకసారి సంభవించే స్థాయి వర్షపాతం, అంటే 24 గంటల్లో 222 మి.మీ. వర్షాన్ని తట్టుకునే వరద నియంత్రణ వ్యవస్థను ప్రణాళికలో పేర్కొంది.
అమరావతిని వరదల నుంచి కాపాడటం కష్టమే. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి గంగపాలైనట్లే.
కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి అభివృద్ది కోసమంటూ.. రూ.50వేల కోట్లు అప్పు చేశారు.ఇష్టమొచ్చినట్లు మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇస్తున్నారు. ఇవన్నీ.. ఏపీ ప్రజల నెత్తిన భారం వేయడమే.
నా విశ్లేషణ
అమరావతి విషయంలో అసలు ప్రశ్న నగరం నీట మునుగుతుందా లేదా అనేది మాత్రమే కాదు.
కృష్ణా నది, కొండవీటి వాగు, లోతట్టు భూములు, భారీ వర్షాలు — ఈ నాలుగు అంశాలను సమర్థంగా ఎదుర్కొనే ప్రణాళిక ఉందా?
రాజధాని నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు, వరదల నుంచి రక్షణకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలి.
ఒక నగరానికి గొప్ప భవనాలు మాత్రమే రాజధాని హోదా తీసుకురావు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం కూడా ఉండాలి. ఆ సామర్ధ్యం అమరావతికి లేదని పలువురే మేధావులు, నిపుణులు చెబుతున్నారు.
అమరావతి వరదల గురించి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక (2014)ఏం చెప్పింది..?
కె.సి. శివరామకృష్ణన్.. కేంద్ర హోంశాఖ నియమించిన నిపుణుల కమిటీకి అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటుపై ప్రత్యామ్నాయాలను పరిశీలించింది.ఈ కమిటీ 2014లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నివేదికలోని 25–26 పేజీల్లో వరదల ప్రమాదంపై ముఖ్యమైన హెచ్చరికలు ఉన్నాయి.
కమిటీ పేర్కొన్న అంశాలు:
- కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నదీ వరదలు, స్థానిక వరదల ముప్పు ఉంది.
- 2009 అక్టోబర్–నవంబర్ వరదలు అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంది.
- కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సుమారు 20 లక్షల మంది ప్రభావితమైనట్లు తెలిపింది.
- విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాలు వరదలకు ప్రత్యేకంగా గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలుగా గుర్తించింది.
- ఈ ప్రాంతాల్లో రాజధాని జోన్ ఎంపిక చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరమని సూచించింది.
ముఖ్యమైన విషయం: శివరామకృష్ణన్ కమిటీ అమరావతిని ప్రత్యేకంగా వరదల కారణంగా నిషేధించలేదు. అలాగే అమరావతిని రాజధానిగా ఎంపిక చేయాలని కూడా సిఫారసు చేయలేదు. విజయవాడ–గుంటూరు పట్టణ ప్రాంతంలో ప్రభుత్వ కార్యకలాపాలను కేంద్రీకరించడం, వ్యవసాయ భూములపై ప్రభావం, ప్రాంతీయ అసమానతలు వంటి అంశాలపై తన ఆందోళనలను వ్యక్తం చేసింది.
కృష్ణా నది వరదలు - అమరావతికి ఉన్న సంబంధం:
- కృష్ణా నదిలో భారీగా వరద ప్రవాహం నమోదైంది.
- విజయవాడ పరిసర ప్రాంతాలు, కృష్ణా–గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాలు ప్రభావితమయ్యాయి.
- ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేయాల్సి వచ్చింది.
- నదికి సంబంధించిన వరద నియంత్రణ వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది.
2016లో ఏర్పాటైన నిపుణుల కమిటీ 2009 వరదల ఆధారంగా చేసిన విశ్లేషణలో ఆ వరదకు 1901–2012 గణాంకాల ప్రకారం సుమారు 104 సంవత్సరాల రిటర్న్ పీరియడ్, 1965–2012 గణాంకాల ప్రకారం 124 సంవత్సరాల రిటర్న్ పీరియడ్ ఉందని అంచనా వేసింది.
దీని అర్థం ఏమిటి?
కృష్ణా నది నుంచి నేరుగా వచ్చే వరదల విషయంలో కరకట్ట రక్షణ కల్పించినట్లు అప్పటి అధ్యయనం చెబుతోంది. కానీ దీనివల్ల అమరావతికి అన్ని రకాల వరదల నుంచి సంపూర్ణ రక్షణ ఉందని నిర్ధారించలేం.
3. 2024 వరదలు – అమరావతి ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితి:
2024 ఆగస్టు 31న అమరావతి వాతావరణ కేంద్రంలో నమోదైన వర్షపాతం 24 గంటల్లో 280 మి.మీ.
మూడు గంటల్లో నమోదైన వర్షపాతం 150 మి.మీ. ఇది అత్యంత తీవ్రమైనదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
APCRDA రూపొందించిన 2025 క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్‌లో ఈ వివరాలు పొందుపరిచారు.
ఆ నివేదిక ప్రకారం:
- అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 25 గ్రామాల భూములు వరద నీటితో ప్రభావితమయ్యాయి.
- నీరు తగ్గడానికి వారం రోజులకు పైగా పట్టింది.
- భారీ వర్షాలతో పాటు కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతంలో వచ్చిన వరద ప్రవాహం కూడా పరిస్థితిని తీవ్రతరం చేసింది.
AP CRDA+1
అసలు సమస్య ఎక్కడ ఉంది?
క్లైమేట్ యాక్షన్ ప్లాన్‌లో మూడు ప్రధాన సమస్యలను గుర్తించారు:
1. కొండవీటి వాగు, పాలవాగు సహజ నీటి ప్రవాహ మార్గాల్లో అడ్డంకులు.
2. నిర్మాణ పనుల కారణంగా కొన్ని చోట్ల సహజ డ్రైనేజీ మార్గాల మళ్లింపు, తాత్కాలిక నిరోధాలు.
3. ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసివేసిన సమయంలో కృష్ణా నది బ్యాక్‌వాటర్ వాగుల్లోకి రావడం వల్ల నీటి ప్రవాహం మందగించడం.
కృష్ణా నది కరకట్ట సురక్షితంగా ఉన్నప్పటికీ, నగరంలో కురిసిన వర్షం, చుట్టుపక్కల నుంచి వచ్చే నీరు బయటకు వెళ్లలేకపోతే లోతట్టు ప్రాంతాలు మునిగే ప్రమాదం ఉంటుంది.
4. అమరావతి భౌగోళిక స్వరూపం – ఎత్తుపల్లాలు ఏం చెబుతున్నాయి?
2025 ఆగస్టు 30న APCRDA కోసం సమర్పించిన Hydrogeomorphological Studies నివేదికలో అమరావతి భౌగోళిక వివరాలు ఉన్నాయి.
ప్రాంత భౌగోళిక లక్షణంనివేదికలోని వివరాలు
రాజధాని నగర విస్తీర్ణం217.23 చ.కి.మీ.
గ్రామాల సంఖ్య25
భూభాగం కనిష్ఠ ఎత్తు18 మీటర్లు
కొండ ప్రాంతాల గరిష్ఠ ఎత్తు260 మీటర్లు
ఇందులో సమస్య ఏమిటంటే:
- ఎత్తైన కొండ ప్రాంతాల నుంచి వర్షపు నీరు దిగువ ప్రాంతాలకు చేరుతుంది.
- మధ్యలో ఉన్న లోతట్టు భూముల్లో నీరు నిలిచే అవకాశం ఉంటుంది.
- నీటి ప్రవాహానికి సహజ వాగులు ప్రధాన మార్గాలు.
- నిర్మాణాల కారణంగా వాగుల వెడల్పు, లోతు, ప్రవాహ మార్గాలు మారితే నీటి నిల్వ సమస్య పెరుగుతుంది.
నీరుకొండ, కురగల్లు, యర్రబాలెం, నౌలూరు వంటి ప్రాంతాల చుట్టుపక్కల నీటి నిల్వ సమస్యను నివేదిక ప్రత్యేకంగా గుర్తించింది.అలాగే కొండవీటి వాగు, పాలవాగుల్లో కలుపు మొక్కలు నీటి ప్రవాహానికి అడ్డంకులుగా ఉన్నాయని 2025 జూన్ నాటి చిత్రాలతో నివేదిక వివరించింది.
5. అమరావతి భవిష్యత్తు – 2040, 2050లో వరద ముప్పు ఎంత?
ఇక్కడ చాలా ముఖ్యమైన సమాచారం ఉంది.
పరిస్థితిఅంచనా గరిష్ఠ ప్రవాహం
2024 ప్రస్తుత స్థితి22,315 క్యూసెక్కులు
2040 పూర్తిస్థాయి నగర అభివృద్ధి31,249 క్యూసెక్కులు
2050 వాతావరణ మార్పు పరిస్థితి40,310 క్యూసెక్కులు
ఈ అంచనాల్లో ప్రధాన హెచ్చరిక:
2040 నాటికి నగరంలో 60 శాతం ఉపరితలం కాంక్రీట్, రోడ్లు, భవనాలు వంటి నీరు ఇంకిపోని నిర్మాణాలతో నిండితే వర్షపు నీరు వేగంగా వాగుల్లోకి చేరుతుంది.
6. వరద నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సరిపోతాయా?
అమరావతి వరద నియంత్రణలో ఉండవల్లి పంపింగ్ స్టేషన్ కీలకమైనది.
APCRDA 2025 క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ప్రకారం అక్కడ 15 పంపులు కలిపి సెకనుకు 150 క్యూబిక్ మీటర్ల నీటిని బయటకు పంపగల సామర్థ్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు.
అయితే పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం ఒక్కటే పరిష్కారం కాదు.
పరిశీలించాల్సిన అంశాలు:
1. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా పంపులు పనిచేసే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉందా?
2. కృష్ణా నదిలో వరద నీరు ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు పంపే నీటికి తగిన ప్రవాహ మార్గం ఉందా?
3. కొండవీటి వాగు, పాలవాగుల సామర్థ్యం పెంచారా?
4. రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయిందా?
5. 2040, 2050 నాటి వరద అంచనాలకు అనుగుణంగా అన్ని నిర్మాణాలు సిద్ధంగా ఉన్నాయా?
ఇవన్నీ నిరంతరం పర్యవేక్షించాలి.
7. ప్రపంచ బ్యాంకు నివేదిక – అమరావతి నిర్మాణంలో వరద రక్షణ
ప్రపంచ బ్యాంకు 2024 డిసెంబర్ 20న అమరావతి అభివృద్ధికి సంబంధించిన వివరాలు ప్రకటించింది.
దాని ప్రకారం నగరాన్ని వాతావరణ మార్పులను తట్టుకునేలా అభివృద్ధి చేయడానికి:
- 30 శాతం భూమిని బహిరంగ ప్రదేశాలుగా ఉంచడం.
- నీటి నిల్వ రిజర్వాయర్ల నిర్మాణం.
- వరద రక్షణ మౌలిక సదుపాయాలు.
- వర్షపు నీటి డ్రైనేజీ వ్యవస్థ.
- ముందస్తు వరద హెచ్చరిక వ్యవస్థ.
వంటి చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని
వరల్డ్ బ్యాంక్ నివేదిక పేర్కొంది.
అమరావతి భవిష్యత్తులో ప్రమాదమని తెలిసి కూడా సీఎం చంద్రబాబు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. అమరావతిని ATMల వాడుకుంటున్నారు.చైనాలాంటి దేశాల్లో కొత్త నగరాలు దెయ్యాలు నగరాలుగా పిలుస్తున్నారు. అమరావతి పేరుతో మూడు పంటలు పండే భూములను నాశనం చేశారు. ఇవన్నీ ఏపీలో ఆహారభద్రతపై ప్రభావం చూపుతాయి. ఇప్పటికైనా చంద్రబాబు అమరావతి జపం ఆపి.. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, రాజమండ్రి నగరాలపై దృష్టి పెడితే మంచిది.
#Amaravathi #AndhraPradesh #CBN @ysjagan @YSRCParty @NandigamSuresh7 @YSRCPAmerica @YSRCPEurope
చంద్రబాబూ.. చాగంటి సూక్తులు ఆపండి..!
అధికారంలో లేకపోతే ప్రజాస్వామ్యం గురించి సూక్తులు..
అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యం ఖూనీ..!
ప్రజాస్వామ్యం అంటే ఏమాత్రం గౌరవం, లెక్కలేని వ్యక్తి చంద్రబాబు..!
ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా అపహాస్యం చేయాలి అనుకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. రౌడీయిజం చేయాలి అనుకుంటే ఆటలు సాగవు..!. వంతపాడితే పోలీసులు కూడా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు.. ప్రజాస్వామ్యం శాశ్వతం. చట్టం శాశ్వతం, చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కరూ శిక్షార్హులే..!- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు (2019-24)
ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించారు. రెండున్నరేళ్లలో కూటమి పాలకులు చేసిందేమీ లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. సూపర్ సిక్స్‌లు , సూపర్ సవెన్‌లకు సమాధి కట్టారు.
ఇదేంటీ సార్ అని ప్రశ్నిస్తే అక్రమ కేసులు. దీనిని ప్రజాస్వమ్యం అంటారా..? ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సమాధానం చెప్పాలి..?.
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే హింస మొదలు పెట్టారు. ఓటర్లను, YSRCP అభ్యర్దులను భయభ్రాంతులకు గురి చేశారు. దీనిని ప్రజాస్వామ్యం అంటారా..? సీఎం సీట్లో ఉన్న చంద్రబాబు సమాధానం చెప్పాలి..?
గమ్మత్తుగా చంద్రబాబు పోలీస్ వ్యవస్థ గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో పోలీసులు పచ్చ చొక్కాలు మాత్రమే వేసుకోలేదు. నాలుగో సింహం సిగ్గుపడేలా, ఖాకీ చొక్కా సిగ్గుపడేలా టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు పని చేశారు. కొన్ని చోట్ల పోలీసులే టీడీపీ నేతల అవతారమెత్తి YSRCP అభ్యర్థులను బెదిరించారు. దీనిని ప్రజాస్వామ్యం అంటారా..?. ఎంతో అనుభవజ్ఞుడినని చెప్పుకునే చంద్రబాబు సమాధానం చెప్పాలి..?
IASలు, SPలు ఉన్నత చదువులు చదువుకున్నవారే కదా..? భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల వీరికి అవగాహన ఉంది కదా..? దారి తప్పిన పాలకులను దారిలో పెట్టాల్సిన బాధ్యత వీరి మీద ఉందా..? లేదా..? కానీ..IAS, IPSలు ఏం చేశారు..? చంద్రబాబు అప్రజాస్వామ్యక విధానాలకు సహకరించారు. ఉగ్రవాదుల మీద ఎక్కుపెట్టాల్సిన AK47లను YSRCP నేతలు, కార్యకర్తల మీద గురి పెట్టారు. దీనిని ప్రజాస్వామ్యం అంటారా చంద్రబాబూ..?.
ఇక చట్టం, అధికారుల గురించి కూడా చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపన్యాసాలు దంచారు. చాగంటి సూక్తులు చెప్పినట్లు చెప్పారు. ROలు, MROలు టీడీపీ ఆఫీస్‌లు ఉన్నట్లు పని చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను టీడీపీ కార్యాలయాలుగా మార్చేశారు. YSRCP అభ్యర్ధుల బీ ఫామ్‌లను అధికారులే చించేశారు. దీనిని చట్టబద్దపాలన అంటారా చంద్రబాబూ..?
చంద్రబాబూ.. మీరు దేశంలోనే అనుభం ఉన్న నాయకులు. మీ పొలిటికల్ ప్రొఫైల్ చూస్తే ఇది నిజమే. కానీ.. మీ అనుభవాన్ని దేనికి వాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి వాడుతున్నారు. మీ అనుభవంతో వ్యవస్థలను చెరబడుతున్నారు. మీ అనుభవంతో పోలీసులకు పచ్చ నోట్ల ఎర వేస్తున్నారు.అధికారులను ప్రలోభాలకు గురి చేసి లొంగ తీసుకుంటున్నారు. మీ అవినీతి, దోపిడీ సొమ్ములో వాటా ఇస్తూ.. ప్రజాస్వామ్య మూలస్తంభాలను కూల్చేస్తున్నారు.
కూటమి పాలకులు ఇప్పటికైనా ప్రజాస్వామ్య విధానాలు పాటించాలి. రాష్ట్రాన్ని దోపిడీ, దాడుల నుంచి కాపాడాల్సిన బాధ్యత పాలకుల మీదనే ఉంటుంది. ఇదే తరహా పాలన కొనసాగితే.. లక్షలాది మంది యువత రోడ్డెక్కాల్సి వస్తుంది.కూటమి ప్రభుత్వాన్ని ఆ యువతే కూకటి వేళ్లతో సహా పెకిలించే సమయం ఆసన్నమవుతుంది.
#YSRCP #TDP #AP #AndhraPradeshNews #YSJagan #CBN #AndhraPradesh #LocalBodyElections2026
@ysjagan @YSRCParty @NandigamSuresh7 @YSRCPAmerica @YSRCPEurope @we_ysrcp @ysrcp_usa @YsrcpKuwait @VizagYSRCP @YsrcpTuni @YSRCPGUDUR
టీడీపీకి భారీ షాక్...
అధికార టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు ప్రాంతానికి చెందిన సుమారు 300 కుటుంబాలు ఆ పార్టీని వీడి YSRCPలో చేరాయి. YSRCP సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావు సమక్షంలో వీరంతా YSRCP కండువాలు వేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో YSRCPకి తిరుగులేదన్నారు ధర్మాన ప్రసాద రావు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై తీవ్రంగా మండిపడ్డారు ధర్మాన. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే సొంత గ్రామంలో జరిగిన ఎన్నికల్లో YSRCP అభ్యర్థే స్పష్టమైన మెజారిటీతో గెలిచినా.. అధికార బలంతో ఫలితాలను పూర్తిగా తారుమారు చేశారని ధ్వజమెత్తారు.ఎన్నికల్లో ప్రజలు YSRCP వైపు నిలిచినా, అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అక్రమ పద్ధతులను ఆశ్రయించి, ఓడిపోయిన టీడీపీ అభ్యర్థే గెలిచినట్లు బలవంతంగా ధ్రువీకరణ పత్రాలు ఇప్పించుకున్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు ఐక్య పోరాటం చేయాలని ధర్మాన పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం వైఎస్సార్సీపీ శ్రేణులంతా భయపడకుండా, మరింత ధైర్యంగా, కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.
#YSRCP #Dharmana #Srikakulam #AP #AndhraPradeshnews #LocalBodyElections2026
చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం..!
అధికార పార్టీ కుట్రలు గెలిచారు..
అధికార పార్టీ దౌర్జన్యాలు గెలిచారు..
అధికార పార్టీ దొంగ ఓట్లూ ఓడిపోయాయి..
అధికార పార్టీ అదిరింపులు, బెదిరింపులను ప్రజలు లెక్క చేయలేదు..
తమ అడుగులు, ఓట్లు ధర్మం, న్యాయంవైపే అని నినదించారు.
పచ్చ ప్రజాస్వామ్యం ఓడిపోయి.. భారత ప్రజాస్వామ్యం గెలిచింది.
చంద్రగిరి నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో YSRCP హవా కొనసాగించింది. తిరుపతి రూరల్ మండలం జడ్పీటీసీ YSRCP అభ్యర్ధి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి 602 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన కౌంటింగ్‌లో 14వ రౌండ్‌లో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి విజయం దక్కింది. కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినా విజయం మాత్రం YSRCP వైపే నిలిచింది.
#YSRCP #Chevireddy #Tirupathi #LocalBodyElections2026 #ChevireddyHarshithReddy #AP #AndhraPradeshNews
3
345





